Tag Archives: chief electoral officer

ఎన్నికల సంఘం 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిందా? వైరల్ అవుతున్న నకిలీ సర్క్యులర్; వాస్తవ పరిశీలన

వాదన/Claim:ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిందని, మార్చి 12, 2024 నుంచి ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని సర్క్యులర్ పేర్కొంటున్నట్లు వాదన.

నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన.భారత ఎన్నికల సంఘం అటువంటి ప్రకటన ఏదీ చేయలేదు మరియు ఈ దావా నకిలీదని కొట్టిపారేసింది.

రేటింగ్: తప్పుదారి పట్టించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు

2024 సార్వత్రిక ఎన్నికల తేదీలపై భారత ఎన్నికల సంఘం (ECI) అధికారికంగా ఒక సర్క్యులర్ విడుదల చేసిందని పేర్కొంటూ వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక పోస్ట్  షేర్ చేయబడుతోంది.
Digiteye India Team తన టిప్‌లైన్‌లో వాస్తవాన్ని పరిశీలన చేయమంటూ మూడు అభ్యర్థనలను అందుకుంది.

నామినేషన్ల తేదీలు, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల యొక్క తేదీలు ప్రచురించిన ఫోటో మరియు ప్రవర్తనా నియమావళి మార్చి 12, 2024 నుండి అమలులోకి వస్తుందని పేర్కొంటున్న ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వంటి విభిన్న శీర్షికలతో వాట్సాప్‌లో ఫోటో షేర్ చేయబడుతోంది. మరియు EC చీఫ్ అనగా ప్రధాన ఎన్నికల అధికారి కాదు, ప్రధాన ఎన్నికల కమీషనర్ కాబట్టి, మేము వైరల్ పోస్ట్ వాస్తవ పరిశీలన చేయటానికి పూనుకున్నాము.

Fact Check

లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్-మే 2024లో జరిగే అవకాశం ఉంది, అయితే ఎన్నికల సంఘం షెడ్యూల్ గురించి ఇప్పటివరకు ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.ECI అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటించేవరకు, ప్రవర్తనా నియమావళి అమలులోకి రాదు,కానీ ఒక్కసారి షెడ్యూల్‌ ప్రకటిస్తే మాత్రం దేశంలోని అన్ని వార్తా సంస్థలు కవర్ చేయడానికి ఇది ఒక ప్రధాన వార్త అవుతుంది.

మేము భారత ఎన్నికల సంఘం యొక్క అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో సమాచారం కోసం చూడగా, సోషల్ మీడియాలో షేర్ చేయబడిన దావాను నిరాకరిస్తూ Xలో పోస్ట్ చేయబడిన క్రింది ప్రకటనను మేము గమనించాము.

క్యాప్షన్ ఇలా ఉంది, “#LokSabhaElections2024 #FactCheck షెడ్యూల్‌కు సంబంధించి వాట్సాప్ లో నకిలీ సందేశం షేర్ చేయబడుతోంది: సందేశం #నకిలీది.  #ECI ద్వారా ఇప్పటివరకు ఎటువంటి తేదీలు ప్రకటించబడలేదు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను మీడియా సమావేశం ద్వారా ప్రకటిస్తుంది. #VerifyBeforeYouAmplify”.(మీరు వ్యాపించే/విస్తరించే ముందు ధృవీకరించండి).కాబట్టి, సర్క్యులర్ మరియు దావా తప్పు.నిజం లేదు.

మరి కొన్ని ఫాక్ట్ చెక్స్

175 సీట్లున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీకి 142 సీట్లు వస్తాయని ఏబీపీ న్యూస్ సర్వేలో తేలిందా? వాస్తవ పరిశీలన

భారతదేశంలో పోస్ట్ మాస్టర్ ఎంపిక ఈ విధంగా జరుగుతుందనే వాదనతో ఒక వీడియో వైరల్ అవుతోంది ; వాస్తవ పరిశీలన