వాదన/Claim: డీ.ఎం.కే నాయకుడు యూనిఫాంలో ఉన్న పోలీసు అధికారిని కొటుతున్నటు చూపించే వీడియో, తమిళనాడులో అధ్వానమైన పరిస్థితిని సూచిస్తుందనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన.మీరట్ బిజెపి కౌన్సిలర్ మునీష్ కుమార్ యొక్క పాత 2018 వీడియో, తమిళనాడులోని డి.ఎం.కె నాయకుడి వీడియోగా చూపించబడింది.
రేటింగ్: పూర్తిగా తప్పు–
వాస్తవ పరిశీలన వివరాలు
యూనిఫాంలో ఉన్న పోలీసు అధికారిని ఒక వ్యక్తి కొడుతున్నట్టు మరియు ఆ వ్యక్తి డీ.ఎం.కే నాయకుడన్న వాదనతో ఉన్న ఒక వీడియో అన్ని వార్తల్లో మరియు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్యాప్షన్ ఇలా ఉంది: “DMK ఎమ్మెల్యే మన్సూర్ మహ్మద్ తమిళనాడులో డ్యూటీలో ఉన్న పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను కొట్టాడు.మీరు కులాలు,మతాలు మరియు భాషల ఆధారంగా ప్రభుత్వాన్ని ఎంచుకుంటే ఇలా జరుగుతుంది.తమిళనాడు పశ్చిమ బెంగాల్ బాటలో ఉంది.
DMK MLA Mansoor Mohammed beats up a police inspector on duty in Tamil Nadu. This is what happens when you choose a government based on castes, creed and language. Tamilnadu is on the path of West Bengal. pic.twitter.com/BCATgw8Y6w
— Rishav Singh (@aa_rishav) February 16, 2024
ఇది తెలుగుతో సహా అన్ని భాషలలోని ప్రధాన టీవీ వార్తల్లో ప్రసారం చేయబడింది.
Fact Check
మన్సూర్ మహమ్మద్ అనే తమిళనాడు ఎమ్మెల్యే (DMK) గురించి వివరాలు సేకరించడానికి ప్రయత్నించగా, మాకు ఆ పేరుతో ఉన్న వ్యక్తి సమాచారం లభించలేదు.మేము వీడియో నుండి కీలక ఫ్రేమ్‌లను తీసుకొని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో ఒరిజినల్(అసలు) వీడియో కోసం ప్రయత్నించగా, ట్విట్టర్‌లో ANI ద్వారా షేర్ చేయబడిన పాత వార్త వీడియోను గమనించాము:
#WATCH: BJP Councillor Manish thrashes a Sub-Inspector who came to his (Manish’s) hotel with a lady lawyer and got into an argument with a waiter. The councillor has been arrested. (19.10.18) (Note- Strong Language) pic.twitter.com/aouSxyztSa
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 20, 2018
తరువాత, నివేదికలో బిజెపి కౌన్సిలర్ పేరు మునీష్ కుమార్(మనీష్ కుమార్ అని కాకుండా) అని సరిచేయబడి, అతనిపై కేసు నమోదు చేయబడింది:
Case has been registered against Munish Kumar, BJP councillor from Meerut’s ward no. 40, under section 395 (punishment for dacoity) and 354 (assault or criminal force to woman with intent to outrage her modesty) of Indian Penal Code. https://t.co/5e4TzDczkH
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 20, 2018
ఈ సంఘటన విస్తృతంగా నివేదించబడిందని దిగువ Google సెర్చ్ ఫలితాల ద్వారా తెలుస్తుంది.
అక్టోబర్ 20, 2018 నాటి డెక్కన్ క్రానికల్‌లోని ఒక నివేదిక, “ఒక మహిళా న్యాయవాదైనా స్నేహితురాలితో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన సబ్-ఇన్‌స్పెక్టర్‌ను ఆహారం అందించడంలో జాప్యం గురించి జరిగిన వాగ్వాదంలో దాని యజమాని మరియు మీరట్ వార్డ్ నంబర్ 40 బిజెపి కౌన్సిలర్ మునీష్ కుమార్ కొట్టారని” పేర్కొంది.
అంతేకాకుండా, ఈ సంఘటన 2018 అక్టోబర్ 20న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా కంకర్‌ఖేడాలో జరిగింది మరియు తమిళనాడులో జరిగినది కాదు. ఈ సంఘటనకి డీ.ఎం.కే పార్టీ ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదు.
కాబట్టి, ఈ వాదనలో నిజం లేదు.
మరి కొన్ని Fact Checks:
అయోధ్యలో ఖాళీ మినరల్ వాటర్ ప్లాస్టిక్ బాటిల్ను తిరిగి ఇస్తే ₹5 మనకు అందుతుందా? వాస్తవ పరిశీలన