వాదన/Claim: కుల గణనపై తన ప్రసంగంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 50+15ని 73గా తప్పుగా లెక్కించారని వీడియో లో పేర్కొన్న వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. రాహుల్ గాంధీ ఒరిజినల్ ప్రసంగం నుండి ఆదివాసీలకు సంబంధించిన 8% ప్రస్తావనను తొలగించి వీడియోను మార్చివేయబడింది/సవరించబడింది.
రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం —
Fact check వివరాలు
రాహుల్ గాంధీ కుల గణన మరియు రిజర్వేషన్ సమస్య గురించి మాట్లాడుతున్న వీడియో,ప్రాథమిక గణితం కూడా తెలియదన్నట్లు కాంగ్రెస్ నాయకుడిని ఎగతాళి చేసే ఉద్దేశ్యంతో అనేక శీర్షికలతో(క్యాప్షన్స్)వీడియో వైరల్ అవుతోంది.వీడియోలో,”రాహుల్ గాంధీ, “ఎన్ని?… చెప్పండి… 50.. 15.. ఎన్ని? 73…” అని అనటం చూడవచ్చు. ట్విట్టర్‌లో పోస్ట్‌కు ఇప్పటికే దాదాపు 2 లక్షల వీక్షణలు వచ్చాయి మరియు చాలా మంది దీనిని రీట్వీట్ కూడా చేశారు.
50+15=73 😎😎 pic.twitter.com/otSOte9PBS
— 🇮🇳 Rupen Chowdhury 🚩 (@rupen_chowdhury) February 9, 2024
FACT CHECK
రాహుల్ గాంధీ చాలా కాలంగా కుల గణనకు సంబంధించిన సంఖ్య గురించి మాట్లాడటం తెలిసిందే,మరియు ఎప్పుడూ అలాంటి తప్పు చేయలేదు.ఈ వీడియోలో ఆయన ప్రసంగం అనుమానాదాస్పదంగా అనిపించి, digiteye India టీమ్ ఒరిజినల్(అసలు) వీడియో కోసం చూడగా,ఛత్తీస్‌గఢ్‌లో రాహుల్ గాంధీ ప్రసంగాన్ని గమనించాము.కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతున్న వీడియో,భారత జాతీయ కాంగ్రెస్ అధికారిక X (గతంలో ట్విట్టర్) హ్యాండిల్‌లో అప్‌లోడ్ చేయబడింది.
देश में आदिवासी, पिछड़े, दलितों की आबादी करीब 73% है।
कार्पोरेट, मीडिया, प्राइवेट अस्पतालों, स्कूलों के मैनेजमेंट में इस वर्ग का एक आदमी नहीं है।
लेकिन देश को बनाने वाले आप जैसे लोग मनरेगा और कॉन्ट्रैक्ट लेबर की लिस्ट में मिलेंगे।
ये अन्याय है.. तभी हमने यात्रा में ‘न्याय’… pic.twitter.com/suGeT6boUC
— Congress (@INCIndia) February 13, 2024
Twitterలో షేర్ చేయబడిన క్రింది వీడియో, అసలైన(ఒరిజినల్)వీడియో మరియు మార్చబడిన వీడియో మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపిస్తుంది:
Fake Video Alert 📢
भाजपा के अनपढ़ अंधभक्तों ने एक क्लिप को Edit करके ये दिखाया गया है की राहुल जी ने 50+15 = 73 कहा है,
जबकि, राहुल जी ने 50+15+8 = 73 कहा है। pic.twitter.com/MFjuUsNPhF
— Nitin Agarwal (@nitinagarwalINC) February 11, 2024
నిర్దిష్ట క్లిప్‌లో రాహుల్ గాంధీ, రిజర్వేషన్‌లపై జర్నలిస్టు అడిగిన ప్రశ్నను గుర్తు చేసుకుంటూ, కుల గణన వల్ల సమాజంలో మరింత విభజన జరగదని వివరించడం జరిగింది.మన సమాజంలోని ఇతర వెనుకబడిన కులాలు (ఓబీసీ), ఆదివాసీలు (ఎస్టీ), దళితుల (ఎస్సీ) శాతాన్ని ప్రస్తావిస్తూ, ఈ మూడు గ్రూపులు దేశ జనాభాలో వరుసగా 50%, 8% మరియు 15% ఉన్నాయని రాహుల్ గాంధీ అన్నారు.
తరువాత, అతను హిందీలో ఇలా అన్నారు, “50+15+8 అంటే 73. 73% మందికి ఏమీ రాకపోతే; మీడియాలో ప్రాతినిధ్యం లేదు, అతిపెద్ద 200 కార్పొరేట్‌లలో పని చేయటం లేదు, PMOలో లేరు, బ్యూరోక్రసీలో లేరు, ప్రైవేట్ ఆసుపత్రులలో లేరు,ఏ పాఠశాలలు లేదా విశ్వవిద్యాలయాలు వారి పరిధిలో లేవు,మరి భారత్‌ను ఎలా ఏకం చేయవచ్చు?”
అయితే, ట్విటర్‌లో వైరల్ అయిన వీడియో ఆదివాసీల సంఖ్య 8%కి సంబంధించిన మాటను తొలగించి మార్చి, 50+15=73 లాగా కనిపించేలా చేయబడింది.
అందువలన, ప్రాథమిక గణనను(కుల సంఖ్య కూడికను) తప్పుగా చూపుతూ రాహుల్ గాంధీని చెడుగా చూపించడానికి మార్చబడిన వీడియో పోస్ట్ చేయబడింది.
మరి కొన్ని Fact Checks: