Tag Archives: telugu fact check

Did CJI leave courtroom when Solicitor General was presenting arguments? Fact Check

సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తున్నప్పుడు CJI కోర్టు గదిని విడిచిపెట్టి వెళ్లిపోయారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తుండగా, ప్రధాన న్యాయమూర్తి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: పూర్తిగా తప్పు.తప్పుడు వాదన చేయడం కోసం వీడియో ఆకస్మికంగా కత్తిరించబడింది. సెషన్ మొత్తం సీజేఐ అక్కడే ఉన్నట్లు ఒరిజినల్ వీడియోలో కనిపిస్తుంది.

రేటింగ్: పూర్తిగా తప్పు-- 

రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్లపై చారిత్రక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తుండగా చీఫ్ జస్టిస్ డీ.వై చంద్రచూడ్ బయటకు వెళ్లిపోతున్న వీడియో సోషల్ మీడియాలో విభిన్నమైన వాదనలతో వైరల్‌గా మారింది.

జయేష్ మెహతా అనే వినియోగదారు చేసిన ఒక పోస్ట్ ట్విట్టర్‌లో చర్చకు దారితీసింది.

క్యాప్షన్ ఇలా ఉంది: “#CJI ఈ విధంగా ఎలా ప్రవర్తిస్తారు? SG, CJI ముందు తన వాదనలను వినిపిస్తుండగా అతను మరియు ఇతర న్యాయమూర్తులు వాయిదా వేయకుండా లేచి వెళ్లిపోయారు.. ఇది భారత ప్రభుత్వానికి ఘోర అవమానం…CJI చంద్రచూడ్‌తో సహా న్యాయమూర్తులందరినీ తీసేసి, భారత రాష్ట్రపతి ద్వారా వారందరి చేత బలవంతంగా రాజీనామా చేయించాలి. అతను మరియు ఇతర న్యాయమూర్తులు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకుంటున్నారు.. న్యాయమూర్తుల ఈ వైఖరికి గల కారణాలను నేను త్వరలోనే ఒక థ్రెడ్ ను పోస్ట్ చేస్తాను”.

ప్రధాన న్యాయమూర్తి డీ.వై చంద్రచూడ్

FACT-CHECK

మొత్తం వీడియో చూసినప్పుడు, సొలిసిటర్ జనరల్ తన వాదనలు వినిపిస్తున్నప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి కోర్టు గదిని విడిచిపెట్టి వెళ్లకుండా ఉండడం గమనించవచ్చు. మేము అసలు వీడియో కోసం యు ట్యూబ్లో ప్రయత్నించగా, మార్చి 18, 2024న ఈ క్రింది వీడియో అప్‌లోడ్ చేయబడినట్లు గమనించాము.

ఆరోపించిన సంఘటన 24 నిమిషాల నుండి 27 నిమిషాల వ్యవధి మధ్యలో జరుగుతుంది మరియు ప్రధాన న్యాయమూర్తి తన సహోద్యోగులతో మాట్లాడటం మరియు తన సీటును సర్దుబాటు చేసుకుంటుడడం స్పష్టంగా చూడవచ్చు, కానీ సీటును వదిలి వెళ్ళలేదు. నిజానికి ఎలాంటి అంతరాయం లేకుండానే కోర్టు వ్యవహారాలు కొనసాగాయి.

24వ నిమిషం వద్ద వీడియోను హఠాత్తుగా ముగించడం ద్వారా, ప్రధాన న్యాయమూర్తి కోర్టు గది నుండి బయటకు వెళ్లినట్లు తప్పుడు వాదన చేయబడింది. కాబట్టి, దావా/వాదన పూర్తిగా తప్పు.

మరి కొన్ని Fact Checks:
భారతదేశ వ్యాప్తంగా అన్ని బాణసంచా అమ్మకాలు మరియు వాటి వాడకాన్ని సుప్రీంకోర్టు నిషేధించిందా? వాస్తవ పరిశీలన
బెంగళూరులో షాపుల సైన్ బోర్డులు కాషాయ రంగులో ఉంటె వాటిని బెంగళూరు పౌర సంస్థ(BBMP) తొలగిస్తోందా? వాస్తవ పరిశీలన

మార్చి 15న అమితాబ్ బచ్చన్ యాంజియోప్లాస్టీ చేయించుకున్నారా; వాస్తవ పరిశీలన

వాదన./Claim: మార్చి 15, 2024న అమితాబ్ బచ్చన్‌ను ఆసుపత్రికి తరలించి యాంజియోప్లాస్టీ నిర్వహించారనేది వాదన.

నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. అమితాబ్ బచ్చన్‌ తాను యాంజియోప్లాస్టీ చేయించుకున్న విషయాన్ని ఖండించారు.

రేటింగ్: తప్పు దోవ పట్టించే వార్త —

వాస్తవ పరిశీలన వివిరాలు:

ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మార్చి 15, 2024న శుక్రవారం ఉదయం యాంజియోప్లాస్టీ కోసం ఆసుపత్రిలో చేరినట్లు అనేక వార్తా సంస్థలు మరియు సోషల్ మీడియా బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేయడం ప్రారంభించాయి.
81 ఏళ్ల నటుడి ఆరోగ్య విషయమై, అతను యాంజియోప్లాస్టీ చేయించుకున్నట్లు అనేక టీవీ న్యూస్ ఛానెల్‌లలో ప్రసారం చేయబడింది. వార్తలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

“అమితాబ్ బచ్చన్ యాంజియోప్లాస్టీ చేయించుకున్నట్లు కోకిలాబెన్ ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారని” ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక స్పష్టంగా తెలిపింది. టైమ్స్ ఆఫ్ ఇండియా యొక్క మరొక నివేదిక ప్రకారం, నటుడు అతని గుండెపై కాకుండా రక్తం కాలులో గడ్డకట్టడం వలన”యాంజియోప్లాస్టీ” చేయించుకున్న తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని తెలుస్తోంది.

FACT  CHECK

కొందరు ఆసుపత్రిలో చేరడాన్ని తిరస్కరించగా మరియు మరికొందరు కరోనరీ యాంజియోప్లాస్టీని తిరస్కరిస్తు వస్తున్నా విరుద్ధమైన నివేదికలు ఉన్నందున Digiteye India బృందం వాస్తవ పరిశీలనకు పూనుకుంది. మొదటిది, నటుడిని శుక్రవారం తెల్లవారుజామున ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు అక్కడ అతను అనారోగ్యం కోసం చికిత్స పొందారనేది స్పష్టమైంది, కానీ అనారోగ్య విషయాలను ధ్రువీకరించలేదు.

రెండవది, కరోనరీ యాంజియోప్లాస్టీ చేయించుకున్నని వ్యక్తి మరుసటి రోజే నడవమని  వైద్యులు సలహా ఇవ్వరు.కానీ నటుడు మరుసటి రోజు ఆరోగ్యంగా తన సాధారణ రీతిలో నడుస్తూ కనిపించారు. మరుసటి రోజు అతని ఆరోగ్యం గురించి ప్రశ్నించినప్పుడు, నటుడు తాను యాంజియోప్లాస్టీ చేయించుకోలేదని ఖండించారు మరియు దానిని “ఫేక్ న్యూస్” అని కొట్టి పారేశారు. క్రింద Instagramలో వీడియో చూడండి:

అందువలన, నటుడిని మార్చి 15, 2024న ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తీసుకెళ్లింది వాస్తవమే అయిన అనారోగ్యం గురించి ఖచ్చితమైన వార్తా నివేదికలు లేవు. ఆయన యాంజియోప్లాస్టీ చేయించుకున్నారనేది అవాస్తవం.

మరి కొన్ని Fact Checks:

ఒడిశాలోని కోణార్క్ ఆలయం లోపల సూర్యుడు ఉదయిస్తాడా? వాస్తవ పరిశీలన

బెంగళూరులో షాపుల సైన్ బోర్డులు కాషాయ రంగులో ఉంటె వాటిని బెంగళూరు పౌర సంస్థ(BBMP) తొలగిస్తోందా? వాస్తవ పరిశీలన

 

 

ఒడిశాలోని కోణార్క్ ఆలయం లోపల సూర్యుడు ఉదయిస్తాడా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఒడిశాలోని కోణార్క్ ఆలయం లోపల సూర్యుడు ఉదయిస్తాడనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. చిత్రాలు ఒడిశాలోని కోణార్క్ దేవాలయం లోనివి కాదు, థాయ్‌లాండ్‌లోనివి.

రేటింగ్: పూర్తిగా తప్పు- 

వాస్తవ పరిశీలన వివరాలు

సోషల్ మీడియా వినియోగదారులు ఒడిశాలోని కోణార్క్ దేవాలయం ముఖ ద్వారం లోపలి నుండి ఉదయిస్తున్నసూర్యుడి చిత్రాన్ని షేర్ చేస్తున్నారు.ఆలయం లోపల నుండి సూర్యుడు ఉదయిస్తున్నట్లుగా ఆలయ నిర్మాణం జరిగింది. ఈ వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఉండటం షేర్ చేసిన చిత్రంలో చూడవచ్చు.

ఇది “200 సంవత్సరాలకు ఒకసారి ఎలా జరుగుతుందని” అని వినియోగదారులు షేర్ చేసుకుంటున్నారు.
Digiteye India బృందంకు వాస్తవ పరిశీలన చేయమని Whatsapp నంబర్‌లో అభ్యర్ధన అందుకుంది.
షేర్డ్ మెసేజ్ ఈ విధంగా ఉంది: “ఇది కోణార్క్ ఆలయం లోపలి సూర్యోదయం. ఈ సంఘటన 200 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని వారు చెప్పారు.”

Fact Check:

ఈ చిత్రం ఎంత పాతదో తెలుసుకోవడానికి మేము సోషల్ మీడియాను పరిశీలించినప్పుడు, ఇది 2015 నుండి ప్రచారంలో ఉందని మేము గమనించాము. YouTubeలో కూడా మేము ఇలాంటి వీడియోలు ఉన్నాయని తెలుకున్నాము.

క్షుణ్ణంగా పరిశీలిస్తే, వైరల్ చిత్రంలో ఉన్న ఆలయ నిర్మాణ శైలికి ఒడిశాలోని కోణార్క్ ఆలయ నిర్మాణ శైలికి పోలిక ఉన్నట్లు కనపడదు. ప్రధాన ఆలయం/ముఖ ద్వారం ఏకశిలా సారూప్యంగా(ఒకేలా) కనిపిస్తున్నప్పటికీ, పక్కన గోడలు మరియు ఇరువైపులా ఆలయ గోపురాలు కోణార్క్ ఆలయా ప్రధాన నిర్మాణానికి జోడించబడలేదు.

Sun Temple / Wikipedia CC

గూగుల్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా అది థాయ్‌లాండ్‌లోని ప్రసాత్ హిన్ ఫానోమ్ రంగ్ టెంపుల్ అని తేలింది. ఫానోమ్ రంగ్ అని కూడా పిలుస్తారు, ఈ హిందూ ఖైమర్ సామ్రాజ్య దేవాలయం థాయ్‌లాండ్‌లోని ఇసాన్‌లోని బురిరామ్ ప్రావిన్స్‌లో అంతరించిపోయిన అగ్నిపర్వతం అంచులపై నిర్మించబడి ఉంది. 10వ-13వ శతాబ్దాల మధ్య నిర్మించబడి, ఇది ప్రధానంగా హిందూ దేవుడు శివుని ఆలయం.


Phanom Rung Temple / Tourism Authority of Thailand (TAT)

ఈ ఆలయం అన్ని తోరణాల/ద్వారాల గుండా సూర్యుడు ప్రకాశిస్తూ, అపురూపమైన సూర్య కిరణాలు కూడా ప్రసిద్ధి చెందింది.
“ప్రసిద్ధమైన, చారిత్రాత్మక దేవాలయం యొక్క మొత్తం పదిహేను రాతి ద్వారాల గుండా సూర్యుడు సంవత్సరంలో నాలుగు సార్లు ప్రకాశిస్తాడని బురిరామ్ టైమ్స్ పేర్కొంది.
ఇది 3 నుండి 5 ఏప్రిల్ వరకు మరియు 8 నుండి 10 సెప్టెంబర్ వరకు సూర్యోదయం సమయంలో మరియు 5 నుండి 7 మార్చి వరకు మరియు 5 నుండి 7 అక్టోబర్ వరకు సూర్యాస్తమయం సమయంలో జరుగుతుంది (కొన్ని సంవత్సరాలలో ఒక రోజు ముందు జరుగుతుంది). సూర్యుడు శివలింగాన్ని తాకుతూ వెళుతుండగా, అది చూసేవాళ్లకు అదృష్టాన్ని కలిగిస్తుందని గాఢ నమ్మకం.

బ్యాంకాక్ పోస్ట్ “సూర్యునికి సంబంధించిన ఈ సంఘటనలు(solar events)మార్చి మరియు సెప్టెంబర్‌లలో విషువత్తులకి(equinoxes)ఇరువైపులా ఏటా సుమారు 14 రోజులు ఎలా జరుగుతాయనేది” నివేదిస్తుంది.

మరి కొన్ని fact Checks:

బెంగళూరులో షాపుల సైన్ బోర్డులు కాషాయ రంగులో ఉంటె వాటిని బెంగళూరు పౌర సంస్థ(BBMP) తొలగిస్తోందా? వాస్తవ పరిశీలన

నాగార్జున సిమెంట్స్ వారు 9/11లో జరిగిన దాడుల నేపథ్యంతో కూడిన ప్రకటనను తయారుచేసారా? వాస్తవ పరిశీలన

 

నాగార్జున సిమెంట్స్ వారు 9/11లో జరిగిన దాడుల నేపథ్యంతో కూడిన ప్రకటనను తయారుచేసారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:నాగార్జున సిమెంట్స్ తన ప్రకటనలో ‘కనికరం’ లేకుండా 9/11 థీమ్‌ను(9/11లో జరిగిన దాడుల నేపథ్యంతో కూడిన ప్రకటనను తయారుచేసింది) ఉపయోగించిందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. నాగార్జున సిమెంట్స్‌వారు అలాంటి ప్రకటన ఏదీ చూపలేదు.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు

ఇది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సిమెంట్ తయారీదారు నాగార్జున సిమెంట్ యొక్క ప్రకటన అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేయబడుతోంది. యానిమేషన్‌లో విమానం న్యూయార్క్ నగరంలోని టవర్ను డీ-కొంటున్నట్లు కానీ టవర్స్ లోకి చొచ్చుకుపోలేక, త్వరగా వెనక్కి వెళ్లి అవతలి వైపుకు వెళ్లి ఎగిరిపోతున్నట్లు చూడవచ్చును.ఇది 9/11 దాడిని గుర్తుచేస్తుంది.ఈ వీడియోలో తెలుగు నటుడు వరుణ్ తేజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కనిపిస్తారు. “భారతీయ ప్రకటనలు దయ(కనికరం) లేనివి” అనే శీర్షికతో దీనిని సెర్గీ కిరియానోవ్ అనే ట్విటర్ వినియోగదారు షేర్ చేసారు.

వీడియోను ఇక్కడ చూడండి:

FACT CHECK

Digiteye India బృందం వాట్సాప్ టిప్‌లైన్‌లో అభ్యర్థనను స్వీకరించి, ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రసిద్ధ సిమెంట్ అయిన నాగార్జున సిమెంట్స్‌ వారు అటువంటి ప్రకటనేమైనా తయారుచేశారని పరిశీలించింది.వరుణ్ తేజ్ దాని బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండగా, న్యూయార్క్‌లోని ట్విన్ టవర్స్‌పై 9/11 విమాన దాడుల నేపధ్యాన్ని ఉపయోగించి తీసిన వీడియో ఏదీ లేదు. వరుణ్ తేజ్ నటించిన నాగార్జున సిమెంట్స్ యొక్క తాజా ప్రకటనను ఇక్కడ చూడవచ్చు:

https://www.youtube.com/@nagarjunacement3145

9/11 దాడుల నేపథ్య ప్రకటనకు సంబంధించి నాగార్జున సిమెంట్స్‌ గురించి మరింత శోధన చేయగా ఎటువంటి సమాచారం మరియు వీడియో అందుబాటులో లేదు. Digiteye India బృందం నాగార్జున సిమెంట్స్‌కి ఈ ప్రకటనపై స్పష్టత ఇవ్వాలంటూ ఒక ఇమెయిల్ పంపింది.

మరిన్ని వివరాల కోసం ప్రయత్నించగా,అది నకిలీ వీడియో అని వినియోగదారు స్వయంగా అంగీకరించారని మరియు ట్విట్టర్‌లోని సంభాషణను ఇక్కడ చూడండి:

కాబట్టి,ఈ వీడియో ఫేక్ (నకిలీది).

మరి కొన్ని Fact Checks:

ఎన్నికల సంఘం 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిందా? వైరల్ అవుతున్న నకిలీ సర్క్యులర్; వాస్తవ పరిశీలన

కల్తీ పాల వల్ల 2025 నాటికి 87% భారతీయులు క్యాన్సర్ బారిన పడతారని WHO హెచ్చరిక జారీ చేసిందా? వాస్తవ పరిశీలన

 

ఎన్నికల సంఘం 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిందా? వైరల్ అవుతున్న నకిలీ సర్క్యులర్; వాస్తవ పరిశీలన

వాదన/Claim:ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిందని, మార్చి 12, 2024 నుంచి ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని సర్క్యులర్ పేర్కొంటున్నట్లు వాదన.

నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన.భారత ఎన్నికల సంఘం అటువంటి ప్రకటన ఏదీ చేయలేదు మరియు ఈ దావా నకిలీదని కొట్టిపారేసింది.

రేటింగ్: తప్పుదారి పట్టించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు

2024 సార్వత్రిక ఎన్నికల తేదీలపై భారత ఎన్నికల సంఘం (ECI) అధికారికంగా ఒక సర్క్యులర్ విడుదల చేసిందని పేర్కొంటూ వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక పోస్ట్  షేర్ చేయబడుతోంది.
Digiteye India Team తన టిప్‌లైన్‌లో వాస్తవాన్ని పరిశీలన చేయమంటూ మూడు అభ్యర్థనలను అందుకుంది.

నామినేషన్ల తేదీలు, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల యొక్క తేదీలు ప్రచురించిన ఫోటో మరియు ప్రవర్తనా నియమావళి మార్చి 12, 2024 నుండి అమలులోకి వస్తుందని పేర్కొంటున్న ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వంటి విభిన్న శీర్షికలతో వాట్సాప్‌లో ఫోటో షేర్ చేయబడుతోంది. మరియు EC చీఫ్ అనగా ప్రధాన ఎన్నికల అధికారి కాదు, ప్రధాన ఎన్నికల కమీషనర్ కాబట్టి, మేము వైరల్ పోస్ట్ వాస్తవ పరిశీలన చేయటానికి పూనుకున్నాము.

Fact Check

లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్-మే 2024లో జరిగే అవకాశం ఉంది, అయితే ఎన్నికల సంఘం షెడ్యూల్ గురించి ఇప్పటివరకు ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.ECI అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటించేవరకు, ప్రవర్తనా నియమావళి అమలులోకి రాదు,కానీ ఒక్కసారి షెడ్యూల్‌ ప్రకటిస్తే మాత్రం దేశంలోని అన్ని వార్తా సంస్థలు కవర్ చేయడానికి ఇది ఒక ప్రధాన వార్త అవుతుంది.

మేము భారత ఎన్నికల సంఘం యొక్క అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో సమాచారం కోసం చూడగా, సోషల్ మీడియాలో షేర్ చేయబడిన దావాను నిరాకరిస్తూ Xలో పోస్ట్ చేయబడిన క్రింది ప్రకటనను మేము గమనించాము.

క్యాప్షన్ ఇలా ఉంది, “#LokSabhaElections2024 #FactCheck షెడ్యూల్‌కు సంబంధించి వాట్సాప్ లో నకిలీ సందేశం షేర్ చేయబడుతోంది: సందేశం #నకిలీది.  #ECI ద్వారా ఇప్పటివరకు ఎటువంటి తేదీలు ప్రకటించబడలేదు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను మీడియా సమావేశం ద్వారా ప్రకటిస్తుంది. #VerifyBeforeYouAmplify”.(మీరు వ్యాపించే/విస్తరించే ముందు ధృవీకరించండి).కాబట్టి, సర్క్యులర్ మరియు దావా తప్పు.నిజం లేదు.

మరి కొన్ని ఫాక్ట్ చెక్స్

175 సీట్లున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీకి 142 సీట్లు వస్తాయని ఏబీపీ న్యూస్ సర్వేలో తేలిందా? వాస్తవ పరిశీలన

భారతదేశంలో పోస్ట్ మాస్టర్ ఎంపిక ఈ విధంగా జరుగుతుందనే వాదనతో ఒక వీడియో వైరల్ అవుతోంది ; వాస్తవ పరిశీలన

 

ప్రార్థనకు వెళ్లే ముస్లిం విద్యార్థులకు అనుగుణంగా కర్ణాటక SSLC పరీక్ష శుక్రవారం మధ్యాహ్నం నిర్ణయించబడిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:శుక్రవారం ప్రార్థనకు వెళ్లే ముస్లిం విద్యార్థులకు అనుగుణంగా మార్చి 1వ తేదీన కర్ణాటక SSLC ప్రిపరేటరీ పరీక్షల షెడ్యూల్ మధ్యాహ్నం నిర్ణయించబడిందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. పీ.యూ.సీ (ప్రీ-యూనివర్శిటీ) పరీక్షలు మార్చి 1వ తేదీన ప్రారంభం కానున్నందున , SSLC (సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్) పరీక్ష మధ్యాహ్నం మరియు పీ.యూ.సీ పరీక్ష ఉదయం నిర్వహించబడుతుందని ఐఎన్‌సి కర్ణాటక పేర్కొంది.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు

కర్ణాటక స్కూల్ ఎగ్జామినేషన్ అండ్ అసెస్‌మెంట్ బోర్డ్ (కెఎస్‌ఇఎబి) ఫిబ్రవరి 2న 10వ తరగతి ప్రిపరేటరీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన వెంటనే, శుక్రవారం మధ్యాహ్నం పరీక్షను నిర్వహించడంపై సోషల్ మీడియాలో అభ్యంతరాలు వెల్లువెత్తాయి. దీనిని మైనారిటీల మెప్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వ చర్యగా పేర్కొంది.

అందులో ఒక ట్వీట్ ఇలా ఉంది: “కర్ణాటక రాష్ట్ర 10వ తరగతి పరీక్షల టైమ్ టేబుల్ విడుదల చేయబడింది. అన్ని పరీక్షలు ఉదయం షెడ్యూల్ చేయబడగా, కానీ శుక్రవారం మాత్రం.ఎందుకు? ఓహ్.. నమాజ్‌ టైం ?” చక్రవర్తి సూలిబెలే ట్వీట్‌కి ఒక్కరోజులోనే 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఒకే ట్వీట్ ఇక్కడ మరియు ఇక్కడ విభిన్న శీర్షికలతో(క్యాప్షన్స్తో)షేర్ చేయబడింది.

FACT CHECK

Digiteye India బృందం వాస్తవ పరిశీలన చేయడం కోసం షెడ్యూల్ కొరకు వెతకగా,ఈ విషయంపై ఐఎన్‌సి కర్ణాటక ప్రతిస్పందన ఈ విధంగా ఉంది:  “మార్చి 1వ తేదీన, అదే రోజు పీయూసీ (ప్రీ-యూనివర్శిటీ) పరీక్షలు ప్రారంభం కానున్నందున , SSLC (సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్) పరీక్ష మధ్యాహ్నం నిర్వహించబడుతుంది.తర్వాతి రోజుల్లో పీయూసీ పరీక్షలు లేకపోవడంతో ఉదయం నుంచే ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు (SSLC exam) ప్రారంభం కానున్నాయి. పరీక్షా కేంద్రాల కొరత మరియు గందరగోళాన్ని నివారించడానికి, ఈ క్రింది విధానం అమలులో ఉంది…”


కర్ణాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప ఈ వాదనలపై స్పందిస్తూ విద్యార్థులందరికీ ప్రయోజనం చేకూర్చడం కోసం పరీక్ష సమయాలు సర్దుబాటు చేయబడిందని పేర్కొన్నారు. 12వ తరగతి (పి.యు.సి) పరీక్ష మార్చి 1, 2024న ఉదయం షెడ్యూల్ చేయగా, 10వ(SSLC) పరీక్ష మధ్యాహ్నంకి షెడ్యూల్ చేయబడింది.

10వ పరీక్షల షెడ్యూల్‌ను మరింతగా పరిశీలిస్తే, మహా శివరాత్రి (హిందూ పండుగ) పండుగ మార్చి 8వ తేదీన రావడంతో ఆ రోజు ఏ పరీక్షా షెడ్యూల్ చేయబడలేదని స్పష్టమవుతుంది.

మైనారిటీ విద్యార్థుల నమాజ్ కోసం పరీక్ష షెడ్యూల్‌ను మధ్యాహ్నం ఉంచారనే ఆరోపణలను తోసిపుచ్చుతూ పి.యు.సి పరీక్ష టైమ్‌టేబుల్ మార్చి 15 శుక్రవారం మరియు మార్చి 22 శుక్రవారం ఉదయం (మొదటి అర్ధభాగంలో) షెడ్యూల్ చేయబడింది.

కాబట్టి, శుక్రవారం ప్రార్థనకు వెళ్లే ముస్లిం విద్యార్థులకు అనుగుణంగా మార్చి 1వ తేదీన SSLC పరీక్ష సమయాన్ని సర్దుబాటు చేశారనే వాదన అబద్ధం.

మరి కొన్ని Fact Checks:

బీజేపీ గుర్తు(కమలం)తో కూడిన టీ-షర్ట్ ను రాహుల్ గాంధీ ధరించారని తప్పుడు చిత్రం షేర్ చేయబడుతోంది; వాస్తవ పరిశీలన

లేదు, “డీ.ఎం.కే ఓట్ల కోసం హిందువులను అడుక్కోదు” అని స్టాలిన్ ఎప్పుడూ చెప్పలేదు; వాస్తవ పరిశీలన

రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తకు కుక్క బిస్కెట్ ఇచ్చారా?; వాస్తవ పరిశీలన

వాదన/Claim: భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ కుక్క నిరాకరించిన బిస్కెట్ ను కాంగ్రెస్ కార్యకర్తకు ఇచ్చారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పు వాదన. కుక్కకు ఆహారం ఇవ్వడానికి రాహుల్ గాంధీ ఆ బిస్కెట్‌ను కుక్క యజమానికి ఇచ్చారు.
అంతేకాని, ఆ కుక్క యజమాని కాంగ్రెస్ కార్యకర్త లేదా ఏ రాజకీయ పార్టీకి మద్దతుదారుడు కాదు.

రేటింగ్ :పూర్తిగా తప్పు

వాస్తవ పరిశీలన వివరాలు:

కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర నేపథ్యంలో,కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మళ్లీ ప్రతికూల కథనంకు టార్గెట్ అయ్యారు,ఈసారి కుక్కల పట్ల ఆయనకున్న ప్రేమ వలన. యాత్రలో కుక్కతో ఆడుకుంటూ బిస్కెట్ తినిపించడానికి ప్రయత్నించగా, కుక్క బిస్కట్ తీసుకోకపోవడంతో పక్కనే ఉన్న వ్యక్తికి బిస్కెట్ అందిస్తూ కనిపించారు.

అయితే, వీడియోను ఉటంకిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన కొన్ని వాదనలతో సహా అనేక వాదనలు ఆన్‌లైన్‌లో కనిపించాయి, విమర్శలకు దారి తీశాయి.కుక్క నిరాకరించిన బిస్కెట్‌ను పక్కనే నిలబడి ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తకు రాహుల్‌ అందించారని వీడియోతో కూడిన వాదన/దావా పేర్కొంది. ఈ ట్వీట్లను క్రింద చూడవచ్చు:

వీడియోను క్యాప్షన్‌తో షేర్ చేశారు: “అందుకే ఆత్మగౌరవం ఉన్నవారు ఎవరూ కాంగ్రెస్‌లో ఉండలేరు.ఆ రోజు హిమంత శర్మ చెప్పింది ఈ రోజు నిరూపితమైంది.రాహుల్ ముందుగా కుక్కకు బిస్కెట్ అందించారు. కుక్క నిరాకరించినప్పుడు అదే బిస్కెట్‌ను కాంగ్రెస్ కార్యకర్త (కార్మికుడు)కి ఇచ్చాడు.”

 

ఇదే వ్యాఖ్యను బీజేపీ అధికార ప్రతినిధి షెజాద్ పూనావాలా మరో వ్యాఖ్యతో షేర్ చేసుకున్నారు:”కాంగ్రెస్ కార్యకర్తలకు “న్యాయం” జరగదా? కుక్క నిరాకరించిన బిస్కెట్లను రాహుల్ గాంధీ కార్యకర్తలకు తినిపించారు! ఉన్నత వర్గం యొక్క ఆలోచనా విధానం.”

FACT CHECK

మేము ఒరిజినల్ వీడియో మొత్తం పరిశీలించగా,క్లెయిమ్ చేసినట్లు రాహుల్ గాంధీ బిస్కెట్‌ను కాంగ్రెస్ కార్యకర్తకు కాకుండా కుక్క యజమానికి ఇవ్వడాన్ని గమనించాము, చివరికి కుక్క యజమాని తన చేతితో దానికి తినిపించాడు.ఇదే విషయాన్ని వివరిస్తూ, రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కుక్క బాధను గమనించి, కుక్కకి తినిపించడానికి, బిస్కెట్ను దాని యజమానికే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “నేను కుక్కను మరియు దాని యజమానిని పిలిచాను. కుక్క భయపడి, వణుకుతోంది,  నేను దానిని తినిపించడానికి ప్రయత్నించినప్పుడు, కుక్క భయపడింది. కాబట్టి నేను కుక్క యజమానికి బిస్కెట్లు ఇచ్చాను, కుక్క అతని చేతిలో నుండి వాటిని తినేసింది”.

రాహుల్ గాంధీ స్వయంగా కుక్కను పెంచుకుంటున్నారు మరియు కుక్కల మనస్తత్వం గురించి అవగాహన ఉంది.కుక్క యజమాని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పిన కథనానికి మద్దతునిచ్చాడు మరియు అతను కాంగ్రెస్ కార్యకర్త లేదా ఏ రాజకీయ పార్టీకి మద్దతుదారుని కాదని స్పష్టం చేశారు.

ధన్‌బాద్‌లో నివాసముంటున్న జితేంద్ర కుమార్ అనే కుక్క యజమాని తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ తన కుక్కను నిమురుతూ,దానికి బిస్కెట్ ఇచ్చారని తెలిపారు.”నా కుక్క, లూసీ, ఒక ఆడ పోమెరేనియన్, కారుపై ఉండడం వలన భయపడి తినడానికి నిరాకరించింది.” కుక్క భయాందోళనలను అర్థం చేసుకున్న రాహుల్ గాంధీ, దానికి ఆహారం ఇవ్వమని నన్ను కోరారని ఆయన తెలిపారు.

తాను కాంగ్రెస్ కార్యకర్తనన్న బీజేపీ నేతల వాదనను కుక్క యజమాని కూడా తోసిపుచ్చారు.

అందువలన, వైరల్ వీడియోతో పాటు వచ్చిన వాదన/దావా, రాహుల్ గాంధీపై ప్రతికూల కథనంతో తప్పుగా చూపించే ప్రయత్నం జరిగింది.

మరి కొన్ని Fact Checks:

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 25,000 హోమ గుండాలను ఏర్పాటు చేశారా? వాస్తవ పరిశీలన

రాహుల్ గాంధీ యొక్క ‘భారత్ మాత’ ప్రసంగాన్ని అసందర్భంగా ట్వీట్ చేశారు; వాస్తవ పరిశీలన

 

 

 

ఎలోన్ మస్క్ ‘నేను పెడోఫిల్‌ని’ అని తన ప్రత్యుత్తరాన్ని Xలో పోస్ట్ చేసారా ; వాస్తవ పరిశీలన

వాదన/Claim:ఎలోన్ మస్క్ ‘నేను పెడోఫిల్‌ని’అని తన ప్రత్యుత్తరాన్ని Xలో పోస్ట్ చేశారని ఒక వాదన.

నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. ఎలోన్ మస్క్ యొక్క ‘X’ లేదా Twitter ఖాతా నుండి అటువంటి ప్రత్యుత్తరం ఏదీ కూడా ఇవ్వబడలేదు.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం– 

వాస్తవ పరిశీలన వివరాలు

‘X’లో స్క్రీన్‌షాట్‌తో కూడిన ట్వీట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ యజమాని ఎలోన్ మస్క్ చేశారంటూ, ఒక వాదన షేర్ చేయబడుతోంది.

ఎవరో “నువ్వు పెడోఫిల్ అని బూటకపు ప్రచారం చేస్తున్నారని” ఒక వినియోగదారుని హెచ్చరికకు,వెంటనే “అది బూటకం కాదు. నేను పెడోఫిల్‌ని” అని మస్క్ చేసిన ప్రత్యుత్తరం కనిపించింది.

పోస్ట్‌కి ఒక్క రోజులో దాదాపు 28,000 లైక్‌లు వచ్చి వైరల్ అయ్యింది, మరియు ఎక్కువ మంది వినియోగదారులను చర్చలో పాల్గొనేలా చేసింది.

FACT CHECK

ట్విట్టర్ ఎకౌంటు చూడగానే అనుమానాస్పదంగా కనిపించడంతో Digiteye India టీమ్ వాస్తవ పరిశీలనకు పూనుకుంది.సాధారణంగా, మస్క్ అధికారిక Twitter ఖాతాలో వైలెట్ రంగులో సబ్‌స్క్రయిబ్ చేయడానికి ఒక బటన్ ఉంటుంది, కానీ “నేను పెడోఫైల్” అని పేర్కొన్న ఖాతాలో “ఫాలో” బటన్ ఉంది.

మరియు,మేము మస్క్ ఫీడ్‌ యొక్క పరిశీలన ప్రకారం, మరియు సోషల్ బ్లేడ్ యొక్క గణాంకాల ప్రకారం కూడా అటువంటి ట్వీట్ అతని ఖాతాలో లేదని,లేదా తొలగించబడిన పోస్ట్‌లలో కూడా లేదని తెలుసుకున్నాము.

కావున ఈ వాదన తప్పు.

మరి కొన్ని Fact Checks:

జో బిడెన్, రిషి సునక్, జస్టిన్ ట్రూడో రామమందిర కార్యక్రమానికి హాజరయ్యారని ఒక వీడియో ద్వార దావా చేయబడింది; వాస్తవ పరిశీలన

అంబేద్కర్ పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని అమెరికా ప్రారంభించిందా? వాస్తవ పరిశీలన

 

 

భారతదేశంలో ఇప్పుడు కొత్త రైలు ట్రాక్ యంత్రాలు ఉపయోగించబడుతున్నాయని వైరల్ వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

వాదన/Claim:రైల్వే ట్రాక్ లేయింగ్ మెషీన్ వీడియోని పోస్ట్ చేస్తూ గత అరవై ఏళ్లతో పోల్చితే ఇప్పుడు భారతదేశ సాంకేతికత చాలా మెరుగ్గా ఉందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పు.
భారతదేశం అధునాతన సాంకేతికతతో కొత్త రైల్వేలను ఎలా నిర్మిస్తుందో చూపించే వైరల్ వీడియో మలేషియాలో ‘చైనా కమ్యూనికేషన్స్ కన్స్ట్రక్షన్’ వాళ్ళు రైల్వే లైన్‌ను నిర్మిస్తున్న వీడియో.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీల వివరాలు

ట్యాంపింగ్ మెషిన్ కదులుతూ రైల్వే స్లీపర్‌లను నేలపై ఉంచుతున్న వీడియో ఒకటి ఈ విధమైన వాదన/ దావాతో సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది,, “ये हैं आज के भारत की टेक्नोलॉजी। जिसे विगत 60 वर्षों में सरकार लांच नहीं कर सकी क्योंकि भारत की जनता के टैक्स का पैसा स्विस बैंक में जमा किया जा रहा था। जय श्रीराम”  [తెలుగు అనువాదం ఇలా ఉంది: ఇది ఇప్పటి భారతదేశ సాంకేతిక నైపుణ్యం. ఇది గత 60 సంవత్సరాలుగా ప్రభుత్వం చేత ప్రారంభించబడలేదు ఎందుకంటే ఆ సమయంలో పన్ను చెల్లింపుదారుల డబ్బు మొత్తం మళ్లించి స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేయబడింది]

ఇది Twitter (X)లో ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడుతోంది. ‘చైనా కమ్యూనికేషన్స్ కన్‌స్ట్రక్షన్’యొక్క యంత్రాలు రైలు మార్గాన్ని వేస్తున్న దృశ్యాలు వీడియో లో చూడవచ్చు.

 

FACT CHECK

ఇలాంటి యంత్రాలు గురించి ఎవరు కూడా కవర్ చేయనందున Digiteye India  బృందం వారు దీని వాస్తవ పరిశీలనకు పూనుకుంది.
వీడియోలోని కీఫ్రేమ్‌లను ఉపయోగించి, బృందం Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో పరిశీలన చేయగా, మలేషియాకు సంబంధించిన వీడియో గత సంవత్సరం డిసెంబర్ 12, 2023న పోస్ట్ చేసిన కథనానికి దారితీశాయి.

మలేషియాలోని క్వాంటన్ నగరంలో జరుగుతున్న ఈస్ట్ కోస్ట్ రైల్ లింక్ రోడ్డు పనుల గురించి ‘న్యూస్.సీఎన్’ వెబ్‌సైట్‌లో ప్రచురించారు. దీనిని ‘చైనా కమ్యూనికేషన్స్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ’ నిర్మిస్తోంది.గూగుల్ న్యూస్‌లో క్షుణ్ణంగా పరిశీలించగా అసలు వీడియో చైనా ప్రెస్ తన ఫేస్‌బుక్ పేజీలో అప్‌లోడ్ చేసిందని తేలింది.క్వాంటన్‌లోని రైల్వే లైన్ ను చైనా-మలేషియా జాయింట్ ప్రాజెక్ట్‌లో భాగమని వివరాలు తెలియజేస్తున్నాయి. కావున ఈ వాదన తప్పు.

మరి కొన్ని Fact checks:

జో బిడెన్, రిషి సునక్, జస్టిన్ ట్రూడో రామమందిర కార్యక్రమానికి హాజరయ్యారని ఒక వీడియో ద్వార దావా చేయబడింది; వాస్తవ పరిశీల

ఎత్తైన రైల్వే వంతెనపై వెలుతున్న రైలు వీడియో భారతదేశంలోనిది కాదు, చైనా దేశంలోని వీడియో: Fact Check

 

 

 

జో బిడెన్, రిషి సునక్, జస్టిన్ ట్రూడో రామమందిర కార్యక్రమానికి హాజరయ్యారని ఒక వీడియో ద్వార దావా చేయబడింది; వాస్తవ పరిశీలన

వాదన/Claim:  అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి పలువురు ప్రపంచ నేతలు హాజరయ్యారనేది వాదన.

నిర్ధారణ/Conclusion:సెప్టెంబరు 2023లో జరిగే G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు దేశాధినేతలు భారతదేశానికి చేరుకుంటున్న సంబంధిత వీడియోను జనవరి 2024లో జరిగిన రామమందిర కార్యక్రమానికి వస్తున్నట్లుగా షేర్ చేయబడింది.

రేటింగ్: సంపూర్ణంగా తప్పు–

వాస్తవ పరిశీలన వివరాలు

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇతర ప్రపంచ నేతలు, విదేశీ ప్రముఖులతో సహా జనవరి 22, 2024న రామాలయ ప్రతిష్ఠాపన లేదా ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమానికి హాజరయ్యారని పేర్కొంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను వీడియో క్యాప్చర్ చేసిందని దావా పేర్కొంది.

“22 జనవరి 2024న రామమందిరం,అయోధ్యకు హాజరవుతున్న అతిథులు” అనే శీర్షికతో ఇక్కడ మరియు ఇక్కడ Facebookలో షేర్ చేయబడింది.

FACT CHECK

సంబంధిత సమాచారం కోసం మేము Googleలో పరిశీలించగా, పైన పేర్కొన్న ప్రపంచ నాయకులు వేడుకకు హాజరవుతున్నట్లు పేర్కొన్న వార్తలేవీ కనిపించలేదు.మరియు, ఈ వీడియో నుండి కొన్ని కీలక ఫ్రేమ్‌లను తీసుకుంటే, సెప్టెంబరు 2023లో భారతదేశంలో జరిగిన G20 సమ్మిట్‌కు ప్రపంచ నాయకులు హాజరైనప్పుడు,దానికి సంబంధించిన పాత వీడియో అని నిర్ధారణకు వచ్చాము.

ఈ పాత వీడియో నుండి తీసిన క్లిప్స్,ఇప్పుడు ఈ నాయకులు రామమందిరం యొక్క ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరయ్యారనే వాదన/దావాకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించబడింది.కావున,వీడియో మరియు వాదన/దావా పూర్తిగా తప్పు.వీడియోలో చూపబడిన ప్రపంచ నాయకులెవరూ కూడా జనవరి 22,2024న జరిగిన రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరు కాలేదు.

మరి కొన్ని Fact Checks:

నేపాలీ హిందువులు బహుమతులతో అయోధ్యకు చేరుకున్నట్లుగా షేర్ చేయబడిన వీడియో; వాస్తవ పరిశీలన

మాల్దీవుల అధ్యక్షుడు భారత ప్రధాని మోడీపై తన మంత్రులు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేసారా?; వాస్తవ పరిశీలన