Tag Archives: elections

లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీ అభ్యర్థి మాధవి లత ముస్లింలపై తన వైఖరిని మార్చుకున్నారా? వాస్తవ పరిశీలన-వీడియో

లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీ అభ్యర్థి మాధవి లత ముస్లింలపై తన వైఖరిని మార్చుకున్నారా? వాస్తవ పరిశీలన-వీడియో

వాదన/Claim: లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత  హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత ముస్లింలపై తన వైఖరిని మార్చుకున్నారని,”భారతీయ ముస్లింలు ఉగ్రవాదులు కాలేరు అని” ఆమె అన్నారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. మాధవి లత ఎన్నికల ప్రచార సమయంలో ఈ మాటలు అన్నారు, తన ఓటమి తర్వాత కాదు.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

********************************************************************

వాస్తవ పరిశీలన వివరాలు:

2024 లోక్‌సభ ఎన్నికలలో AIMIM నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఓడిపోయిన తర్వాత, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత “భారతీయ ముస్లింలు ఉగ్రవాదులు కాలేరు అని”నొక్కిచెప్పిన వీడియో వైరల్ అవుతోంది.

 

ప్రచారం సమయంలో,మాధవి లత తను చేసిన ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలకు మరియు ఒక బూత్‌లో కనిపించి,అక్కడి మహిళా ముస్లిం ఓటర్లను వారి బురఖాలను ఎత్తివేయమని,వారి గుర్తింపును చూపించాలని డిమాండ్ చేసినందుకు విమర్శలను ఎదురుకొన్నారు.

ఓటమి తర్వాత ఆమె మాటతీరులో మార్పు వచ్చిందని తాజా వీడియో పేర్కొంది.”భారతీయ ముస్లింలు టెర్రరిస్టులు కాలేరు” అని ఆమె చేసిన ప్రకటనకు క్రింది దావా/వాదన ఆపాదించబడింది.  హిందీలో దావా/వాదన ఈ విధంగా ఉంది:”चुनाव हारते ही जिज्जी को अकल आ गई”[ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆమెకు తెలివి వచ్చింది”]

అసలు వాస్తవం ఏమిటి

Digiteye India బృందం వాట్సాప్‌లో అభ్యర్థనను అందుకుని వాస్తవాన్ని పరిశీలించగా ఏప్రిల్ 22, 2024న యూట్యూబ్ లో హైదరాబాద్ ఫెస్టివల్స్ అప్‌లోడ్ చేసిన అసలైన పోస్ట్‌ను గమనించాము. ఇది ‘హైదరాబాద్ బీజేపీ మాధవి లత ఇంటర్వ్యూ’ అనే శీర్షికతో ఉన్న ఒక ఇంటర్వ్యూలోని భాగం మరియు ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న సమయంలో ఈ వీడియో తీయబడింది, జూన్ 4, 2024న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాదు. పోలింగ్‌లో హైదరాబాద్ మే 13, 2024న జరిగింది.

ఈ వీడియోలో ఆమె పలు అంశాలపై స్పదించారు మరియు, ముస్లింలు ఉగ్రవాదులా అని అడిగినప్పుడు, భారతీయ ముస్లింలు ఉగ్రవాదులు కాలేరు, అది సాధ్యం కాదని ఆమె అన్నారు, “అయితే పేదరికంతో బాధపడే పిల్లలు, మతం పేరుతో రెచ్చగొట్టబడతారు, వారి మనస్సు ఏ దిశలో వెళ్తుంది? నేను ఏమి చెప్పగలను?” అని ఆమె వివరించారు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కథనాలు :

2024 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన కారణంగా నవనీత్ రానా ఈ వీడియోలో ఏడుస్తూ కనిపిస్తున్నారా? వాస్తవ పరిశీలన

రేపటి నుంచి ఉచిత విద్యుత్ సబ్సిడీ ఆగిపోతుందని ఢిల్లీ మంత్రి అతిషి వెల్లడించారా? వాస్తవ పరిశీలన

 

 

 

తెలుగు నటుడు చిరంజీవి పోలింగ్ బూత్ వద్ద క్యూ పద్దతి పాటించకుండా,దాటుకొని ముందుకు వెళ్లారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: తెలుగు నటుడు చిరంజీవి పోలింగ్ బూత్ వద్ద క్యూ పద్దతి పాటించకుండా, దాటుకొని ముందుకు వెళ్లారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: ఈ సంఘటన 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలోనిది కాదని, పదేళ్ల క్రితం 2014 ఎన్నికలు జరిగినప్పుడు జరిగిన సంఘటనని నిర్ధారించబడింది. పాత వీడియో మళ్లీ ఉపయోగించబడింది.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు:

లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, అల్లు అర్జున్,జూనియర్ ఎన్టీఆర్ మరియు ఇతరులతో సహా పలువురు తెలుగు సినీ తారలు సోమవారం, మే 13, 2024 నాడు హైదరాబాద్‌లోని పలు బూత్‌లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.అయితే,తెలుగు నటుడు చిరంజీవి పోలింగ్ బూత్ క్యూ పద్దతి పాటించడం లేదని ఒక ఓటరు ఆయనను ప్రశ్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వాదన/దావా ఇలా ఉంది:”@చిరుట్వీట్స్(@ChiruTweets ) మరియు అతని కుమారుడు RRR నటుడు @ఎల్లప్పుడూ రామ్‌చరణ్‌ని(@AlwaysRamCharan) పోలింగ్ బూత్‌లో క్యూ పద్దతి పాటించడం లేదని ఒక ఒక సామాన్యుడు ప్రశ్నించారు.ఒక సామాన్యుడు ఈ ప్రత్యేకమైన వ్యక్తులను ప్రశ్నించడం అభినందనీయం. (sic)”. మే 13, 2024న తెలంగాణలో పోలింగ్ రోజున ఇది షేర్ చేయబడింది.
చిరంజీవి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ @chirutweets మరియు అతని కొడుకు X హ్యాండిల్ @@AlwaysRamCharan.

క్యూలో ఉన్నవారు”మిమ్మల్ని ప్రత్యేకంగా చూడాలా..క్యూలో చేరండి”అని అనటం మరియు ఓ వ్యక్తి నటుడితో వాదించడం వీడియోలో చూడవచ్చు.

FACT-CHECK

NDTV న్యూస్ ఛానెల్‌కు చెందిన యాంకర్ చిరంజీవిని కేంద్ర మంత్రిగా ప్రస్తావించిన వీడియోను Digiteye India బృందం పరిశీలించగా,ఇది నిజమే కానీ అక్టోబర్ 2012 నుండి మే 2014 వరకు, ఆయన కేంద్ర పర్యాటక మంత్రిగా ఉన్నప్పటి వీడియో. కొన్ని వీడియోలు ఎప్పటికీ పాతవి కావు అంటూనే,మరోపక్క ఇది పాత వీడియో అని మరొక ట్వీట్ పరోక్షంగా పేర్కొంది.

తదుపరి పరిశీలించగా ఈ సంఘటన 2024 లోక్‌సభ ఎఎన్నికల సమయంలోనిది  కాదని, పదేళ్ల క్రితం 2014 ఎన్నికలు జరిగినప్పుడు జరిగిన సంఘటనని గమనించాము. 2014లో జరిగిన అసలైన సంఘటనను ఇక్కడ చూడండి.

చిరంజీవిని ప్రశ్నించిన వ్యక్తి “ఓటు వేయడానికి” లండన్ నుండి వచ్చిన ఎన్నారై (NRI) గంటా రాజా కార్తీక్ అని ఒక వార్తా కథనం గుర్తించింది. కార్తీక్‌ను ప్రస్తావిస్తూ, తాను ఓటు వేయడానికి ఉదయం 8 గంటల నుండి సుమారు ఒకటిన్నర గంటల పాటు వేచి ఉన్నానని,”నేను కూడా ఈ దేశవాసినే మరియు అతను కూడా ఈ దేశవాసే అయినందున ఇది సరైంది కాదని నేను భావించాను” అని కార్తీక్ పేర్కొన్నడని వార్త నివేదిక తెలిపింది.

అయితే ఓటరు లిస్టులో తన పేరు ఉందో లేదో చూసుకునేందుకు బూత్ డెస్క్‌కి వెళ్లానని చిరంజీవి ఆ తర్వాత అదే న్యూస్ వీడియోలో మీడియాకు స్పష్టం చేసారు. “నేను (చట్టాన్ని ఉల్లంఘించే) వ్యక్తిని కాదు. నేను ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిని” అని నటుడు మీడియాతో అన్నారు. కావున తెలుగు నటుడు చిరంజీవి పోలింగ్ బూత్ వద్ద క్యూ పద్దతి పాటించకుండా,దాటుకొని ముందుకు వెళ్లారని వాదన అవాస్తవం.

మరి కొన్ని Fact Checks:

కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారసత్వ పన్ను గురించి ప్రస్తావించారా? వాస్తవ పరిశీలన

AAP నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్ X (ట్విట్టర్)లో కేజ్రీవాల్‌ను అనుసరించటం లేదా? వాస్తవ పరిశీలన

భారత కూటమికి రికార్డు స్థాయిలో ఓటు వేసినందుకు ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఏప్రిల్ 19, 2024న మొదటి దశ పోలింగ్ తర్వాత, రికార్డు సంఖ్యలో INDIA (కూటమి)కి ఓటు వేసిన ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: ఈ వాదన/దావా తప్పు. NDAకు రికార్డు సంఖ్యలో ఓటు వేసినందుకు ప్రజలకు ప్రధాని మోదీ మొదట ధన్యవాదాలు తెలిపారు. కాని ఆయన INDIA (కూటమి)కి ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్వీట్ మార్చబడింది.

రేటింగ్: తప్పు దోవ పట్టించే ప్రయత్నం —

ఏప్రిల్ 19, 2024న లోక్‌సభ ఎన్నికలకు మొదటి దశ పోలింగ్ జరిగిన తర్వాత , రికార్డు సంఖ్యలో INDIA (కూటమి)కు ఓటు వేసినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుతో స్క్రీన్‌షాట్ షేర్ చేయబడుతోంది.

స్క్రీన్‌షాట్‌ జత చేసి ఉన్న అనేక వాదనలు కనిపించాయి. ఒక వినియోగదారు ఇలా అన్నారు: “మోదీ జీకి ఎగ్జిట్ పోల్ సంఖ్యలు అందినవి, దేశవ్యాప్తంగా ప్రజలు NDAకి వ్యతిరేకంగా రికార్డు సంఖ్యలో ఓటు వేశారని ఇవి సూచిస్తున్నాయి. ఈ ఎన్నికలు NDAకి కఠినంగా మారబోతున్నాయి.”

 

FACT-CHECK

మోడీ తన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) తరపున ప్రజలకు కృతజ్ఞతలు తెలపాలి కానీ అందుకు భిన్నంగా INDIA (కూటమి)ను పేర్కొనడం వలన, మేము దానిని వాస్తవ పరిశీలన కోసం తీసుకున్నాము మరియు NDA స్థానంలో INDIA (కూటమి) చూపించడానికి స్క్రీన్‌షాట్ మార్చబడిందని తెలుసుకున్నాము. ప్రధాని మోదీ చేసిన అసలు ట్వీట్ దిగువన చూడవచ్చు:

“మొదటి దశ ఎన్నికలకు అద్భుతమైన స్పందన! ఈరోజు ఓటు వేసిన వారందరికీ ధన్యవాదాలు. నేటి ఓటింగ్ నుండి అద్భుతమైన ఫీడ్ బాక్ అందినది. భారతదేశం అంతటా ప్రజలు రికార్డు సంఖ్యలో NDAకి ఓటు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.”

పైన చూపిన స్క్రీన్‌షాట్ ప్రకారం ఇది INDIA (కూటమి) అని కాకుండా NDA అని స్పష్టమవుతోంది. కావున, ఎన్నికల సమయంలో ప్రజల్లో సందేహం కలిగించేందుకు NDAను INDIA (కూటమి)గా మార్చి, షేర్ చేసారు.

మరి కొన్ని Fact Checks:

చైనాకు భయపడి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అరుణాచల్ ప్రదేశ్‌లో తమ అభ్యర్థులను నిలబెట్టటంలేదా? వాస్తవ పరిశీలన

వీడియోలో రాహుల్ గాంధీ తను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రకటనను చదువుతున్నారా?వాస్తవ పరిశీలన

 

 

175 సీట్లున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీకి 142 సీట్లు వస్తాయని ఏబీపీ న్యూస్ సర్వేలో తేలిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 142 సీట్లతో వైఎస్సార్‌సీపీ(YSRCP) విజయం సాధిస్తుందని ఏబీపీ న్యూస్ సర్వే గ్రాఫిక్ ద్వారా కనపడుతుందనేది వాదన.

నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. YSRCPకి 142 సీట్లు వస్తాయని చూపించే వైరల్ ఒపీనియన్ పోల్ గ్రాఫిక్ కల్పితమని, ABP తాను అలాంటి సర్వే ఏది చేయలేదని కొట్టిపారేసింది.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన సర్వే ఏబీపీ న్యూస్‌కి ఆపాదిస్తూ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.అధికార వైఎస్సార్‌సీపీకి(YSRCP) 142 సీట్లు రావచ్చని, తెలుగుదేశం పార్టీ మరియు జనసేన యొక్క ప్రతిపక్ష కూటమికి 33 సీట్లు వస్తాయని పేర్కొంది.ట్విట్టర్‌లో షేర్ చేయబడిన చిత్రాన్ని/ట్వీట్ ని ఇక్కడ చూడండి:

FACT CHECK

DigitEye India బృందం ABP న్యూస్ నిర్వహించిన ఒరిజినల్ సర్వే రిపోర్టు కోసం తనిఖీ చేయగా, ABP న్యూస్ తన వెబ్‌సైట్‌లో వారు నిర్వహించిన అటువంటి సర్వే ఏది లేదని పేర్కొన్న వార్తాను గమనించారు.క్లెయిమ్‌ను ఫేక్ అని పేర్కొంటూ, ఫిబ్రవరి 29, 2024న ABP న్యూస్ “ఫేక్ న్యూస్ అలర్ట్”ని జారీ చేసింది మరియు ABP లైవ్ మరియు CVoter రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అటువంటి డేటా ఏదీ ప్రచురించలేదని నొక్కి చెప్పింది.

“ఏబీపీ లైవ్ చిత్రాన్ని కలిగి ఉన్న పోస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 2024కి సంబంధించి ABP నెట్‌వర్క్ లేదా మరే ఇతర అనుబంధ సంస్థ అటువంటి డేటాను విడుదల చేయలేదు… వైరల్ పోస్ట్‌లో చేసిన క్లెయిమ్‌/వాదనలకు విరుద్ధంగా, ABP లైవ్ మరియు CVoter ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2024 ఎన్నికలకి సంబంధించి ఎలాంటి అంచనాలు లేదా డేటాను జారీ చేయలేదని” నివేదికలో పేర్కొంటు వాదనని ఖండించారు.

Twitterలో షేర్ చేసిన ఖండించిన నివేదికను ఇక్కడ చూడండి:

రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP 142 సీట్లు గెలుచుకోవచ్చని చెప్పడానికి ఇమేజీని/చిత్రాన్ని కల్పించి విడుదల చేయబడింది. కాబట్టి ఈ వాదన తప్పు.

మరి కొన్ని Fact Checks:

‘భారత్ మాతా కీ జై’ మరియు ‘జై శ్రీరామ్’అని ప్రజలు నినాదాలు చేస్తే ఆకలితో చనిపోతారని రాహుల్ గాంధీ ఈ వీడియోలో అన్నారా? వాస్తవ పరిశీలన

బీజేపీ గుర్తు(కమలం)తో కూడిన టీ-షర్ట్ ను రాహుల్ గాంధీ ధరించారని తప్పుడు చిత్రం షేర్ చేయబడుతోంది; వాస్తవ పరిశీలన