వాదన/Claim: బీజేపీ ప్రముఖ నేత ఎల్.కే. అద్వానీ కన్నుమూశారు.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన/దావా. ఎల్.కె. అద్వానీని జూలై 3,2024న న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు మరియు అతని పరిస్థితి ‘స్థిరంగా’ మెరుగుపడటంతో మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యారు.
రేటింగ్/Rating: పూర్తిగా తప్పు — .
వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.
భాజపాకు చెందిన ప్రముఖ నాయకుడు, భారత మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ 6 జూలై 2024న మరణించారని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పేర్కొంది.
96 ఏళ్ల అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు 2002 నుండి 2004 వరకు భారతదేశ 7వ ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు.ఆయన భారతీయ జనతా పార్టీ (BJP) సహ వ్యవస్థాపకులలో ఒకరు మరియు 1998 నుండి 2004 వరకు సుదీర్ఘకాలం పాటు హోం వ్యవహారాల మంత్రిగా పనిచేసిన ఘనతను సాధించారు.
దిగువ పోస్ట్ చూడండి:
🇮🇳भाजपाचे ज्येष्ठ नेते भारतरत्न लालकृष्ण अडवाणी यांचे दुःखद निधन!
भावपूर्ण श्रद्धांजली.
Shri L. K. Advani
Former Deputy Prime Minister of India.
Died: 06 July 2024
( SATURDAY) pic.twitter.com/RFT8wBNeKe
— Komal Eknath Shinde (modi ka parivar) (@KomalKalbhor1) July 6, 2024
తెలుగు అనువాదం ఇలా ఉంది: “బిజెపి యొక్క ప్రముఖ నాయకుడు భారతరత్న లాల్ కృష్ణ అద్వానీ విచారకరమైన మరణం. ప్రగాఢ సంతాపం.
శ్రీ ఎల్.కె. అద్వానీ
భారతదేశ మాజీ ఉప ప్రధాని.
మరణం: 06 జూలై 2024”
సోషల్ మీడియాలో షేర్ చేయబడిన పోస్ట్ నమ్మదగిన విధంగా ఉంది మరియు తుమకూరులో బహిరంగ సభలో ప్రసంగిస్తున్నప్పుడు ఒక కేంద్ర మంత్రి ప్రముఖ నాయకుడికి నివాళులు కూడా అర్పించారు.
Fact Check:
Digiteye India బృందం గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో చిత్రాన్ని పరిశీలించగా,ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అనేక వార్తలు వెలువడ్డాయని గమనించాము.
96 ఏళ్ల అనుభవజ్ఞుడు,బీజేపీ నాయకుడు వృద్ధాప్య సంబంధిత సమస్యల కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో బుధవారం, జూలై 3, 2024న చేరారు మరియు మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు డిశ్చార్జ్ అయ్యారు.ఆయన పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. వార్తా కథనాలు ధృవీకరించడంతో కేంద్ర మంత్రి కూడా తన తప్పిదానికి క్షమాపణలు చెప్పారు.
96 years old Veteran BJP leader Lal Krishna Advani ji who was admitted to the #AIIMS Hospital in New Delhi now discharged.
L. K. Advani ji is one of the top most BJP leader who got blessings from Sant Shri Asharamji Bapu. लालकृष्ण आडवाणी जी राम मंदिर🙏#LKAdvani#LalKrishnaAdvanipic.twitter.com/xo40vILTMx
వాదన/Claim:లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత ముస్లింలపై తన వైఖరిని మార్చుకున్నారని,”భారతీయ ముస్లింలు ఉగ్రవాదులు కాలేరు అని” ఆమె అన్నారనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. మాధవి లత ఎన్నికల ప్రచార సమయంలో ఈ మాటలు అన్నారు, తన ఓటమి తర్వాత కాదు.
2024 లోక్‌సభ ఎన్నికలలో AIMIM నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఓడిపోయిన తర్వాత, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత “భారతీయ ముస్లింలు ఉగ్రవాదులు కాలేరు అని”నొక్కిచెప్పిన వీడియో వైరల్ అవుతోంది.
ప్రచారం సమయంలో,మాధవి లత తను చేసిన ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలకు మరియు ఒక బూత్‌లో కనిపించి,అక్కడి మహిళా ముస్లిం ఓటర్లను వారి బురఖాలను ఎత్తివేయమని,వారి గుర్తింపును చూపించాలని డిమాండ్ చేసినందుకు విమర్శలను ఎదురుకొన్నారు.
ఓటమి తర్వాత ఆమె మాటతీరులో మార్పు వచ్చిందని తాజా వీడియో పేర్కొంది.”భారతీయ ముస్లింలు టెర్రరిస్టులు కాలేరు” అని ఆమె చేసిన ప్రకటనకు క్రింది దావా/వాదన ఆపాదించబడింది. హిందీలో దావా/వాదన ఈ విధంగా ఉంది:”चुनाव हारते ही जिज्जी को अकल आ गई”[ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆమెకు తెలివి వచ్చింది”]
అసలు వాస్తవం ఏమిటి
Digiteye India బృందం వాట్సాప్‌లో అభ్యర్థనను అందుకుని వాస్తవాన్ని పరిశీలించగా ఏప్రిల్ 22, 2024న యూట్యూబ్ లో హైదరాబాద్ ఫెస్టివల్స్ అప్‌లోడ్ చేసిన అసలైన పోస్ట్‌ను గమనించాము. ఇది ‘హైదరాబాద్ బీజేపీ మాధవి లత ఇంటర్వ్యూ’ అనే శీర్షికతో ఉన్న ఒక ఇంటర్వ్యూలోని భాగం మరియు ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న సమయంలో ఈ వీడియో తీయబడింది, జూన్ 4, 2024న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాదు. పోలింగ్‌లో హైదరాబాద్ మే 13, 2024న జరిగింది.
ఈ వీడియోలో ఆమె పలు అంశాలపై స్పదించారు మరియు, ముస్లింలు ఉగ్రవాదులా అని అడిగినప్పుడు, భారతీయ ముస్లింలు ఉగ్రవాదులు కాలేరు, అది సాధ్యం కాదని ఆమె అన్నారు, “అయితే పేదరికంతో బాధపడే పిల్లలు, మతం పేరుతో రెచ్చగొట్టబడతారు, వారి మనస్సు ఏ దిశలో వెళ్తుంది? నేను ఏమి చెప్పగలను?” అని ఆమె వివరించారు.
వాదన/Claim: ‘ఈ దేశంలో ఉండాలంటే జై శ్రీరామ్ అనడం తప్పనిసరి’ అని పట్టుబట్టిన నవనీత్ రానా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కారణంగా ఏడుస్తున్నారనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. నవనీత్ రాణా యొక్క ఏప్రిల్ 2022 నాటి పాత వీడియోను అమరావతి లోక్‌సభ స్థానంలో ఆమె ఓడిపోయిన తర్వాత ఏడుస్తున్నట్లు చిత్రీకరించడానికి ఉపయోగించబడింది.
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —
Fact Check వివరాలు:
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై మహారాష్ట్రలోని అమరావతి నుంచి పోటీ చేసిన నవనీత్ రాణా, ఎన్నికల్లో ఓటమి కారణంగా ఏడుస్తున్నారనే వాదనతో ఒక వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
క్యాప్షన్ ఇలా ఉంది: “ప్రచార సమయంలో ~ మీరు ఈ దేశంలో ఉండాలనుకుంటే, మీరు జై శ్రీరామ్ అని చెప్పాలి… ఫలితాల తర్వాత…”
నవనీత్ రాణా మాట్లాడుతున్న సందర్భాన్ని మరియు ఆమె ఆసుపత్రి బెడ్‌పై ఏడుస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు.
During Campaign ~ If you want to be in this country, you should say Jai Shri Ram
వీడియో యొక్క వాస్తవ పరిశీలనలో భాగంగా Digiteye India బృందం Googleలో సాధారణ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా న్యూస్18 TV ఛానెల్ వారు మే 5, 2022న పోస్ట్ చేసిన పాత వీడియో అని గమనించాము.హెడ్ లైన్ స్పష్టంగా కనబడుతుంది.
“అరెస్టయిన మహారాష్ట్ర ఎంపి నవనీత్ రాణా ముంబైలోని ఆసుపత్రిలో చేరారు” అనే శీర్షికతో ఉన్న వీడియో, అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నివాసం వెలుపల హనుమాన్ చాలీసా పఠించమని పిలుపునిచ్చిన తర్వాత ఆమెను తన భర్తతో పాటు అరెస్టు చేయబడినప్పుడు తీసిన వీడియో. ఇది మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.
కాబట్టి, 2024 ఎన్నికల్లో ఓటమి కారణంగా నవనీత్ రాణా ఏడుస్తున్నారనే వాదన తప్పు.
వాదన/Claim: అధికారంలోకి వస్తే వారసత్వ పన్నును అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ ఇచ్చిందనేది వాదన/దావా.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారసత్వ పన్నును అమలు చేసే ప్రణాళిక గురించి ప్రస్తావించలేదు.ఈ పన్నుగురించి విదేశాలలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు మరియు అతను అమెరికాలో పన్నుల గురించి ఒక ఉదాహరణ ఇస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఈ వాదనను పార్టీ ప్రణాళిక కాదని కొట్టిపారేసింది.
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —
Fact Check వివరాలు:
లోక్‌సభ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న తరుణంలో,రెండు జాతీయ పార్టీలు — బిజెపి మరియు కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం, కాంగ్రెస్ వాగ్దానం చేసిన సంపద పునర్విభజనపై విచిత్రమైన మలుపు తిరిగింది. వార్తా సంస్థ ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా “యుఎస్‌లో వారసత్వపు పన్ను” గురించి ప్రస్తావించినప్పుడు,ఈ అంశానికి ఆజ్యం పోసింది.
సాధారణంగా, మరణించిన వ్యక్తి యొక్క ఆస్తులు/సంపదపై వారసత్వపు పన్ను విధించబడుతుంది, అది వారి వారసుల మధ్య పంపిణీ చేయబడుతుంది. జపాన్, అమెరికా మరియు ఫ్రాన్స్ వంటి అనేక దేశాలు అటువంటి పన్నును విధిస్తున్నాయి.
అయితే,భారతదేశంలో వ్యతిరేకులు కూడా ఇలాంటి పన్నుకు అభ్యంతరం చెప్పినప్పుడు, సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఇది ఊపందుకుంది. అనేక మీమ్‌లు, వార్తా నివేదికలు, టీవీ చర్చలు ఈ సమస్యను ప్రసారం చేయడంతో ప్రతి వార్తా ఛానెల్‌లో ఇవి ముఖ్యాంశాలుగా మారాయి.
Inheritance tax- Money for illegal inva*ers.
If you have saved Rs 10 lakhs in your bank after toiling all your life, after your death Rs 5.5 lakhs will be taken away by govt.😇😇 Your children will inherit only Rs 4.5 lakhs.😇😇
It is such a dangerous idea.
It will be… pic.twitter.com/hCOBxWy63Q
Digiteye India బృందం WhatsApp టిప్‌లైన్‌లో దీని గురించి అభ్యర్ధనను అందుకొని పరిశీలించగా, ఈ సమస్యపై కొన్ని క్లెయిమ్‌లను ఇక్కడ మరియు ఇక్కడ గమనించాము.
FACT CHECK
మొదట, మేము కాంగ్రెస్ మ్యానిఫెస్టోను పరిశీలించగా, కాంగ్రెస్ “న్యాయ పాత్ర” అనే డాక్యుమెంట్‌లో వారసత్వపు పన్ను లేదా దానికి సంబంధించిన చర్య గురించి ప్రస్తావించలేదు. ‘పన్ను మరియు పన్ను సంస్కరణలు’ సెక్షన్ కింద, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రత్యక్ష పన్నుల కోడ్ అమలు చేయడం, ఏంజెల్ పన్ను తొలగింపు, వ్యక్తులు మరియు భాగస్వామ్య సంస్థల యాజమాన్యంలోని MSMEలపై పన్ను భారాన్ని తగ్గించడం మరియు GST కౌన్సిల్‌ను పునఃరూపకల్పన చేయడం వంటివి ప్రస్తావించబడ్డాయి.
“వివాహం, వారసత్వం, దత్తత, సంరక్షకత్వం మొదలైన విషయాలలో స్త్రీ మరియు పురుషులకు సమాన హక్కులు ఉండాలి” అని పార్టీ వాగ్దానం చేసినప్పుడు “వారసత్వం” అనే పదం మహిళా సాధికారత అనే దృష్టికోణం నుంచీ సూచించబడింది. మేము(పార్టీ) అన్ని చట్టాలను సమీక్షిస్తాము మరియు స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని నిర్ధారిస్తాము. కాబట్టి, దీనికి వారసత్వపు పన్నుతో సంబంధం లేదు.
తర్వాత, మేము శామ్ పిట్రోడా యొక్క ANI ఇంటర్వ్యూని పరిశీలించగా, అక్కడ అతను అమెరికాలోని వారసత్వపు పన్నును గురించి ప్రస్తావించడం గమనించాము. “భారతదేశంలో వారసత్వ పన్నును కాంగ్రెస్ సమర్థిస్తున్నారా? అనే శీర్షికతో ఇంటర్వ్యూ యొక్క పూర్తి వీడియో ANI యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉంది. ఈ ఇంటర్వ్యూలో సామ్ పిట్రోడా పెద్ద సూచనను ఇచ్చారు. దీన్ని ANI తన X హ్యాండిల్‌లో ఏప్రిల్ 24, 2024న ఇక్కడ షేర్ చేసింది:
ఈ ఇంటర్వ్యూలో,శామ్ పిట్రోడాని “దేశంలోని సంపదపై సర్వే గురించి కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని మరియు “ప్రజల మధ్య తిరిగి పంపిణీ చేసే కార్యక్రమం” గురించి అడిగారు.
అతని ప్రత్యుత్తరంలో, సామ్ పిట్రోడా ఇలా అన్నారు: “అమెరికాలో వారసత్వపు పన్ను ఉంది. ఉదాహరణకి ఒకరి వద్ద $100 మిలియన్ల విలువైన సంపద ఉందని అనుకుందాం మరియు అతను చనిపోయినప్పుడు అతను బహుశా 45% మాత్రమే తన పిల్లలకు బదిలీ చేయగలడు. మిగిలిన 55% ప్రభుత్వం తీసుకుంటుంది.ఇప్పుడు ఇది ఒక ఆసక్తికరమైన చట్టం. మీ తరంలో మీరు, సంపదను సంపాదించారు, మీరు ఇప్పుడు వెళ్లిపోతున్నారు, మీరు మీ సంపదను ప్రజల కోసం వదిలివేయాలి, మొత్తం కాదు, అందులో సగం, ఇది నాకు న్యాయంగానే అనిపిస్తుంది.భారతదేశంలో, మీకు అలా లేదు. ఎవరికైనా 10 బిలియన్ల సంపద ఉంటే మరియు అతను చనిపోతే, అతని పిల్లలకు 10 బిలియన్లు వస్తాయి, ప్రజలకు ఏమీ లభించదు. అందులో సగం మీకు అందుతుందని, అందులో సగం ప్రజలకు అందుతుందని చట్టం చెబుతోంది. (sic)”
“కాబట్టి ఇవి ప్రజలు చర్చించాల్సిన సమస్యలే.ఆఖరున ఎలాంటి తీర్మానం చేస్తారో నాకు తెలియదు కానీ సంపద పునఃపంపిణీ గురించి మాట్లాడేటప్పుడు, మేము కొత్త విధానాలు మరియు కొత్త కార్యక్రమాల గురించి,మరియు ఇది అతి ధనవంతుల ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతున్నాము, (sic)” అని ఆయన చెప్పారు.
US నివాసిగా, శామ్ పిట్రోడా తన దేశంలో పన్నుగురించి ఒక ఉదాహరణ ఇస్తున్నారు, కానీ భారతదేశంలో అదే అమలు చేయాలని స్పష్టంగా ప్రతిపాదించటంలేదు.
ఈ ఇంటర్వ్యూపై బిజెపి నుండి విమర్శలు వచ్చినప్పుడు, శామ్ పిట్రోడా ఒక వివరణను జారీ చేసారు, “నేను టివిలో నా సంభాషణలో యుఎస్‌లో “యుఎస్ వారసత్వ పన్ను” ఉంటుందని సాధారణంగా ప్రస్తావించాను.నేను వాస్తవాలను ప్రస్తావించకూడదా? ప్రజలు చర్చించుకోవాల్సిన సమస్యలపై నేను మాట్లాడాను. దీనికి కాంగ్రెస్‌తో సహా ఏ పార్టీ విధానాలకి సంబంధం లేదు(sic).” ఆయన ఇంకా మాట్లాడుతూ, “55% తీసుకుంటామని ఎవరు చెప్పారు? భారతదేశంలో ఇలాంటివి చేయాలని ఎవరు చెప్పారు? బీజేపీ, మీడియా ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు.(sic)”
కాంగ్రెస్ పార్టీ తన వంతుగా, ఈ సమస్య నుండి దూరంగా ఉంది.
కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఆలోచన లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. “రాజ్యాంగం ఉంది, మాకు అలాంటి ఉద్దేశ్యం లేదు. అతని ఆలోచనలను మా పై ఎందుకు రుద్దుతున్నారు? ఓట్ల కోసమే ఈ ఆటలన్నీ ఆడుతున్నాడు…””
विरासत कर (Inheritance Tax) लागू करने की कांग्रेस की कोई योजना नहीं है। दरअसल राजीव गांधी ने तो 1985 में एस्टेट ड्यूटी को ख़त्म कर दिया था।
कृपया मोदी सरकार के पूर्व वित्त राज्य मंत्री और बाद में वित्त संबंधी संसदीय समिति के अध्यक्ष जयंत सिन्हा को सुनिए। उन्होंने अमेरिका की तरह… pic.twitter.com/0oxEr1XGLs
కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జైరాం రమేష్ అదే విషయాన్ని పునరుద్ఘాటిస్తూ, “కాంగ్రెస్‌కు వారసత్వ పన్నును ప్రవేశపెట్టే ఆలోచన లేదు. వాస్తవానికి, ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 1985లో ఎస్టేట్ డ్యూటీని రద్దు చేశారు.”
Wow. #InheritanceTax is proposed by none other BJP MP, former Minister of State, Finance.
కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ ఇలా అన్నారు, “ఎవరి బంగారాన్ని తీసుకోవాలో మరియు మహిళల మంగళసూత్రాన్ని లాక్కోవాలని (కాంగ్రెస్ మ్యానిఫెస్టో) ఎక్కడా మాట్లాడలేదు… మేనిఫెస్టో కమిటీలో శామ్ పిట్రోడా లేరు.ఇది మా ఎజెండాలో భాగం కాదు…ఇది అతని వ్యక్తిగత అభిప్రాయం. మీరు ఇతరుల వ్యక్తిగత అభిప్రాయాన్ని తీసుకోలేరు మరియు అది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యం అని చెప్పలేరు.”
#WATCH | Thiruvananthapuram, Kerala: On Chairman of Indian Overseas Congress Sam Pitroda’s remark, party MP and candidate from Thiruvananthapuram, Shashi Tharoor says, “…What Sam Pitoda has said is not in the manifesto…We are a democratic party, everyone has a right to their… pic.twitter.com/FyqCOs33Fv
వాదన/Claim: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన/దావా. బీజేపీ రిజర్వేషన్లన్నింటినీ రద్దు చేస్తుందని అమిత్ షా చెబుతున్నట్లుగా ఆయన గొంతును మారుస్తూ వీడియో ఎడిట్ చేయబడింది.
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం–
Fact Check వివరాలు:
బీజేపీ ప్రభుత్వం మళ్లీ ఏర్పాటైతే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీ (SC/ST/OBC)లకు ఇచ్చే “రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్ల”ను రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన వీడియో క్లిప్ విస్తృతంగా షేర్ అవుతోంది.
తెలుగు, హిందీ మరియు ఇంగ్లీషులో షేర్ చేయబడిన ఈ వీడియో క్లిప్ రిజర్వేషన్లు మరియు అందరికీ రిజర్వేషన్ల రద్దు అనే వివాదాన్ని లేవనెత్తింది.
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) సభ్యుడు తన X హ్యాండిల్‌లో షేర్ చేసిన ట్వీట్ దిగువన చూడవచ్చు:
भारतीय जनता पार्टी की सरकार बनेगी तो आज संवैधानिक एससी एसटी ओबीसी का रिजर्वेशन खत्म कर देंगे:- अमित शाह जी
आंखें खोलो भाइयों ये बीजेपी वाले क्या षड्यंत्र रच रहे हैं pic.twitter.com/bxxVg4IRMF
— Office Sanjeev Sagar BSP (@OfficeSanjeev) April 27, 2024
X (గతంలో ట్విట్టర్లో)ని అనేక మంది ఇతర వినియోగదారులు ఈ వైరల్ క్లిప్‌ను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయగా, ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో పెద్ద చర్చకు దారితీసింది.
FACT CHECK
వీడియో క్లిప్లో తెలుగు న్యూస్ అవుట్‌లెట్ V6 న్యూస్ లోగో కనిపిస్తోంది. “బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను రద్దు చేస్తాం” అని అమిత్ షా చెబుతున్న అసలు వీడియోని దిగువున చూడవచ్చును. రిజర్వేషన్ల హక్కు తెలంగాణలోని SC/ST/OBCలకు చెందినది. వారు తమ హక్కును పొందుతారు మరియు మేము ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాము.”
సమావేశానికి సంబంధించిన పూర్తి వీడియోను బీజేపీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో చూడవచ్చు:
ఏప్రిల్ 23, 2023న తెలంగాణలోని చేవెళ్లలో జరిగిన తన బహిరంగ ర్యాలీలో అమిత్ షా 14:58 మార్కు వద్ద తాను ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తానని, SC/ST/OBC రిజర్వేషన్‌లను కాదని చెప్పడం చూడవచ్చు. SC/ST/OBC రిజర్వేషన్‌లను రద్దు చేయడం గురించి కేంద్ర హోంమంత్రి మాట్లాడుతున్నట్లు అనిపించేలా వీడియో ఎడిట్ చేయబడింది మరియు డిజిటల్‌గా మార్చి వైరల్ చేయబడింది. కావున, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీలకు రిజర్వేషన్లు కొనసాగించడం మరియు తెలంగాణలోని ఓబీసీ రిజర్వేషన్ల కింద కొన్ని ముస్లిం వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లను తొలగించడంపై ప్రసంగం జరిగింది.బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను పూర్తిగా తొలగిస్తుందని ఆయన చెప్పలేదు. కాబట్టి, ఈ వాదన/దావా తప్పు.
వాదన/Claim: ఏప్రిల్ 19, 2024న మొదటి దశ పోలింగ్ తర్వాత, రికార్డు సంఖ్యలో INDIA (కూటమి)కి ఓటు వేసిన ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారనేది వాదన.
నిర్ధారణ/Conclusion: ఈ వాదన/దావా తప్పు. NDAకు రికార్డు సంఖ్యలో ఓటు వేసినందుకు ప్రజలకు ప్రధాని మోదీ మొదట ధన్యవాదాలు తెలిపారు. కాని ఆయన INDIA (కూటమి)కి ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్వీట్ మార్చబడింది.
రేటింగ్: తప్పు దోవ పట్టించే ప్రయత్నం —
ఏప్రిల్ 19, 2024న లోక్‌సభ ఎన్నికలకు మొదటి దశ పోలింగ్ జరిగిన తర్వాత , రికార్డు సంఖ్యలో INDIA (కూటమి)కు ఓటు వేసినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుతో స్క్రీన్‌షాట్ షేర్ చేయబడుతోంది.
స్క్రీన్‌షాట్ జత చేసి ఉన్న అనేక వాదనలు కనిపించాయి. ఒక వినియోగదారు ఇలా అన్నారు: “మోదీ జీకి ఎగ్జిట్ పోల్ సంఖ్యలు అందినవి, దేశవ్యాప్తంగా ప్రజలు NDAకి వ్యతిరేకంగా రికార్డు సంఖ్యలో ఓటు వేశారని ఇవి సూచిస్తున్నాయి. ఈ ఎన్నికలు NDAకి కఠినంగా మారబోతున్నాయి.”
Modi ji got the exit poll numbers, which suggest that people have voted against the NDA in record numbers all across the country. This election will be tough for the NDA.#HaathBadlegaHalaatpic.twitter.com/yzovL3FSBf
మోడీ తన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) తరపున ప్రజలకు కృతజ్ఞతలు తెలపాలి కానీ అందుకు భిన్నంగా INDIA (కూటమి)ను పేర్కొనడం వలన, మేము దానిని వాస్తవ పరిశీలన కోసం తీసుకున్నాము మరియు NDA స్థానంలో INDIA (కూటమి) చూపించడానికి స్క్రీన్‌షాట్ మార్చబడిందని తెలుసుకున్నాము. ప్రధాని మోదీ చేసిన అసలు ట్వీట్ దిగువన చూడవచ్చు:
First phase, great response! Thank you to all those who have voted today.
Getting EXCELLENT feedback from today’s voting. It’s clear that people across India are voting for NDA in record numbers.
“మొదటి దశ ఎన్నికలకు అద్భుతమైన స్పందన! ఈరోజు ఓటు వేసిన వారందరికీ ధన్యవాదాలు. నేటి ఓటింగ్ నుండి అద్భుతమైన ఫీడ్ బాక్ అందినది. భారతదేశం అంతటా ప్రజలు రికార్డు సంఖ్యలో NDAకి ఓటు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.”
పైన చూపిన స్క్రీన్‌షాట్ ప్రకారం ఇది INDIA (కూటమి) అని కాకుండా NDA అని స్పష్టమవుతోంది. కావున, ఎన్నికల సమయంలో ప్రజల్లో సందేహం కలిగించేందుకు NDAను INDIA (కూటమి)గా మార్చి, షేర్ చేసారు.
వాదన/Claim: RSS (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) INDIA కూటమికి మద్దతు ఇచ్చింది మరియు INDIA కూటమికి అనుకూలంగా ఓటు వేయమని దేశవ్యాప్తంగా సంఘీలకు విజ్ఞప్తి చేసిందనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన.నమోదు చేయబడని(రిజిస్టర్ కాని) సంస్థ బీజేపీ మాతృ సంస్థైన ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ పేరుతో,ఈ విజ్ఞప్తి చేసిందని నిరూపణ అయ్యింది.
రేటింగ్: పూర్తిగా తప్పు -- వాస్తవ పరిశీలన వివరాలు:
‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ అని రాసి ఉన్న బ్యానర్ ప్రముఖంగా కనిపిస్తున్న ప్రెస్ సమావేశంలో, అధికార BJP యొక్క మాతృ సంస్థ(RSS) ఏప్రిల్ 19 నుండి జూన్ 1, 2024 వరకు జరగాల్సిన లోక్‌సభ ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీలతో కూడిన కూటమి(ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్–INDIA)కి తమ మద్దతు ఇస్తామని ప్రతిజ్ఞ చేసిందనే వాదనతో సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేయబడుతోంది.
హిందీ లోని పోస్ట్ అనువాదం ఈ విధంగా ఉంది: “RSS (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) INDIA కూటమికి మద్దతు ఇచ్చింది, INDIA కూటమికి అనుకూలంగా ఓటు వేయమని దేశవ్యాప్తంగా సంఘీలకు విజ్ఞప్తి చేసింది.”
🔥 Big News.. Please make viral this
देशभर में RSS (राष्ट्रीय स्वयंसेवक संघ) ने दिया INDIA गठबंधन को समर्थन,
देशभर के संघियों से INDIA गठबंधन के पक्ष में Vote करने की अपील की।
ఈ వీడియోలో, జనార్దన్ మూన్ అనే వ్యక్తి, ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ బ్యానర్ ఉన్న ప్రెస్ సమావేశంలో మాట్లాడుతూ, బిజెపిని ఓడించాలని పిలుపునిస్తున్నట్లు, INDIA కూటమికి తమ మద్దతు ప్రకటిస్తున్నట్టు చూడవచ్చు.
ఈ వీడియో Xలో వైరల్ అయ్యింది. ఇది ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
FACT-CHECK
క్లెయిమ్ అవాస్తవంగా ఉన్నందున, Digiteye India బృందం వీడియో నుండి కొన్ని ఆధారాల కోసం వెతకగా, స్పీకర్ పేరు జనార్దన్ మూన్,వ్యవస్థాపకుడు మరియు ప్రెసిడెంట్ అని గమనించాము. దీని ఆధారంగా, మేము ఆర్‌ఎస్‌ఎస్+జనార్దన్ మూన్ అని గూగుల్‌లో సెర్చ్ చేయగా, బీజేపీ మాతృసంస్థ పేరుతో ఉన్న వేరే సంస్థకు సంబంధించిన వార్తా నివేదికలని తెలిశాయి.
వార్తా నివేదికల ప్రకారం,2017 నుండి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పేరును నమోదు చేయడానికి జనార్దన్ మూన్ చేస్తున్న ప్రయత్నం విఫలమైంది.రిజిస్ట్రార్ మరియు బాంబే హైకోర్టు కూడా దీనిని తిరస్కరించింది.అదే సమయంలో,అసలైన RSS,జనార్దన్ మూన్ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియోపై స్పందిస్తూ భారత ఎన్నికల కమిషన్‌ను సంప్రదించింది, మరియు RSS పేరును ఉపయోగించి ప్రజలను తప్పుదోవ పట్టించే అతని ప్రయత్నాన్ని నిరోధించమని ఎన్నికల సంఘాన్ని కోరింది.
వాదన/Claim: భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ కుక్క నిరాకరించిన బిస్కెట్ ను కాంగ్రెస్ కార్యకర్తకు ఇచ్చారనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పు వాదన. కుక్కకు ఆహారం ఇవ్వడానికి రాహుల్ గాంధీ ఆ బిస్కెట్‌ను కుక్క యజమానికి ఇచ్చారు.
అంతేకాని, ఆ కుక్క యజమాని కాంగ్రెస్ కార్యకర్త లేదా ఏ రాజకీయ పార్టీకి మద్దతుదారుడు కాదు.
రేటింగ్ :పూర్తిగా తప్పు
వాస్తవ పరిశీలన వివరాలు:
కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర నేపథ్యంలో,కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మళ్లీ ప్రతికూల కథనంకు టార్గెట్ అయ్యారు,ఈసారి కుక్కల పట్ల ఆయనకున్న ప్రేమ వలన. యాత్రలో కుక్కతో ఆడుకుంటూ బిస్కెట్ తినిపించడానికి ప్రయత్నించగా, కుక్క బిస్కట్ తీసుకోకపోవడంతో పక్కనే ఉన్న వ్యక్తికి బిస్కెట్ అందిస్తూ కనిపించారు.
అయితే, వీడియోను ఉటంకిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన కొన్ని వాదనలతో సహా అనేక వాదనలు ఆన్‌లైన్‌లో కనిపించాయి, విమర్శలకు దారి తీశాయి.కుక్క నిరాకరించిన బిస్కెట్‌ను పక్కనే నిలబడి ఉన్న కాంగ్రెస్ కార్యకర్తకు రాహుల్ అందించారని వీడియోతో కూడిన వాదన/దావా పేర్కొంది. ఈ ట్వీట్లను క్రింద చూడవచ్చు:
వీడియోను ఈ క్యాప్షన్‌తో షేర్ చేశారు: “అందుకే ఆత్మగౌరవం ఉన్నవారు ఎవరూ కాంగ్రెస్‌లో ఉండలేరు.ఆ రోజు హిమంత శర్మ చెప్పింది ఈ రోజు నిరూపితమైంది.రాహుల్ ముందుగా కుక్కకు బిస్కెట్ అందించారు. కుక్క నిరాకరించినప్పుడు అదే బిస్కెట్‌ను కాంగ్రెస్ కార్యకర్త (కార్మికుడు)కి ఇచ్చాడు.”
This is why nobody with self respect can stay in Congress.. today Himanta Sharma ji has been vindicated…
Rahul first offers biscuit to dog
When dog refuses he gives the same biscuit to Congress karyakarta
ఇదే వ్యాఖ్యను బీజేపీ అధికార ప్రతినిధి షెజాద్ పూనావాలా మరో వ్యాఖ్యతో షేర్ చేసుకున్నారు:”కాంగ్రెస్ కార్యకర్తలకు “న్యాయం” జరగదా? కుక్క నిరాకరించిన బిస్కెట్లను రాహుల్ గాంధీ కార్యకర్తలకు తినిపించారు! ఉన్నత వర్గం యొక్క ఆలోచనా విధానం.”
FACT CHECK
మేము ఒరిజినల్ వీడియో మొత్తం పరిశీలించగా,క్లెయిమ్ చేసినట్లు రాహుల్ గాంధీ బిస్కెట్‌ను కాంగ్రెస్ కార్యకర్తకు కాకుండా కుక్క యజమానికి ఇవ్వడాన్ని గమనించాము, చివరికి కుక్క యజమాని తన చేతితో దానికి తినిపించాడు.ఇదే విషయాన్ని వివరిస్తూ, రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కుక్క బాధను గమనించి, కుక్కకి తినిపించడానికి, బిస్కెట్ను దాని యజమానికే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
#WATCH | On the viral video of him feeding a dog during the ‘Bharat Jodo Nyay Yatra’, Congress leader Rahul Gandhi says, “…I called the dog and the owner. The dog was nervous, shivering and when I tried to feed it, the dog got scared. So I gave biscuits to the dog’s owner and… pic.twitter.com/QhO6QvfyNB
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “నేను కుక్కను మరియు దాని యజమానిని పిలిచాను. కుక్క భయపడి, వణుకుతోంది, నేను దానిని తినిపించడానికి ప్రయత్నించినప్పుడు, కుక్క భయపడింది. కాబట్టి నేను కుక్క యజమానికి బిస్కెట్లు ఇచ్చాను, కుక్క అతని చేతిలో నుండి వాటిని తినేసింది”.
రాహుల్ గాంధీ స్వయంగా కుక్కను పెంచుకుంటున్నారు మరియు కుక్కల మనస్తత్వం గురించి అవగాహన ఉంది.కుక్క యజమాని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పిన కథనానికి మద్దతునిచ్చాడు మరియు అతను కాంగ్రెస్ కార్యకర్త లేదా ఏ రాజకీయ పార్టీకి మద్దతుదారుని కాదని స్పష్టం చేశారు.
Rahul Gandhi’s reply on viral video of Dog & biscuits:
The owner came with his pet, the dog was scared and didn’t eat biscuit by my hand so I gave the Biscuit to the owner to feed the dog and the dog ate.
ధన్‌బాద్‌లో నివాసముంటున్న జితేంద్ర కుమార్ అనే కుక్క యజమాని తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ తన కుక్కను నిమురుతూ,దానికి బిస్కెట్ ఇచ్చారని తెలిపారు.”నా కుక్క, లూసీ, ఒక ఆడ పోమెరేనియన్, కారుపై ఉండడం వలన భయపడి తినడానికి నిరాకరించింది.” కుక్క భయాందోళనలను అర్థం చేసుకున్న రాహుల్ గాంధీ, దానికి ఆహారం ఇవ్వమని నన్ను కోరారని ఆయన తెలిపారు.
వాదన/Claim: రాహుల్ గాంధీ బీజేపీ చిహ్నం ఉన్న టీ-షర్ట్ ధరించిన చిత్రం, ఆయన బీజేపీ ఏజెంట్ అనే వాదనతో షేర్ చేయబడింది
నిర్ధారణ/Conclusion: వాదన తప్పు.రాహుల్ గాంధీ ధరించిన టీ-షర్ట్‌పై బీజేపీ గుర్తును మార్ఫింగ్ చేసి,ఆయన బీజేపీ ఏజెంట్ అని తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో షేర్ చేయబడింది.
రేటింగ్: తప్పుదోవ వార్త —
వాస్తవ పరిశీలన వివరాలు:
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గుర్తు ఉన్న టీ షర్ట్ ధరించి ఉన్న ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
हमने तो पहले ही कहा था की यह राहुल गांधी बीजेपी का एजेंट है, आज हमने राहुल गांधी को रंगे हाथो पकड़ लिया है 😋 pic.twitter.com/pUfd16UnLt
ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ జనవరి 14, 2024న మణిపూర్‌లో ప్రారంభమైనప్పుడు ఈ వాదన చేయబడింది.హిందీలో క్యాప్షన్ ఇలా ఉంది, “हमने तो पहले ही कहा था की यह राहुल गांधी बीजेपी का एजेंट है, आज हमने राहुल गांधी को रंगे हाथो पकड़ लिया है” [తెలుగు అనువాదం: “రాహుల్ గాంధీ బీజేపీ ఏజెంట్ అని ముందే చెప్పాము,ఈరోజు రాహుల్ గాంధీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం.”]
FACT CHECK
బీజేపీ గుర్తు ఉన్న టీ షర్టు ధరించిన రాహుల్ గాంధీ చిత్రం చాలా వింతగా కనిపిస్తుండడంతో ఒరిజినల్(అసలు) చిత్రం కోసం ప్రయత్నించాము.చివరగా, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌తో, ఒరిజినల్(అసలు) చిత్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాట్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసినట్లు మేము గమనించాము.
శ్రీనాట్ కాంగ్రెస్ సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు హెడ్ గా ఉన్నారు మరియు ఆమె జనవరి 14, 2024న హిందీలో ఒక శీర్షికతో చిత్రాన్ని షేర్ చేసుకున్నారు, “जब ईस्ट से वेस्ट की यात्रा की बात हुई थी – तो मैंने कहा कि यह यात्रा सिर्फ़ और सिर्फ़ मणिपुर से शुरू हो सकती है” [తెలుగు అనువాదం: మేము తూర్పు నుండి పడమరకు ప్రయాణించడం గురించి మాట్లాడినప్పుడు – ఈ యాత్ర మణిపూర్ నుండి మాత్రమే ప్రారంభించాలని నేను చెప్పాను]
రాహుల్ గాంధీ ధరించిన టీ-షర్ట్‌పై బీజేపీ గుర్తును మార్ఫింగ్ చేసి,ఆయన చిత్రం మార్చివేయబడింది.