Tag Archives: arunachal Pradesh

Didn't Congress field candidates in 2024 poll in Arunachal Pradesh fearing China? Fact Check

చైనాకు భయపడి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అరుణాచల్ ప్రదేశ్‌లో తమ అభ్యర్థులను నిలబెట్టటంలేదా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: చైనాకు భయపడి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అరుణాచల్ ప్రదేశ్‌లో అభ్యర్థులను నిలబెట్టటంలేదనేది వాదన.

నిర్ధారణ/Conclusion: పోస్ట్‌లో చేసిన వాదన/దావా తప్పు. మరియు దీనికి విరుద్ధంగా,రాబోయే అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ మరియు పార్లమెంటు నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను నిలబెడుతోంది.అదనంగా, భారత ఎన్నికల సంఘం డేటా 2004 నుండి కాంగ్రెస్ పార్లమెంటరీ ఎన్నికలలో స్థిరంగా పాల్గొంటుందని నిర్ధారిస్తుంది.

రేటింగ్: పూర్తిగా తప్పు -- 

వాస్తవ పరిశీలన వివరాలు:

చైనా కలవరపడుతుందనే ఆందోళన కారణంగా రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అరుణాచల్ ప్రదేశ్‌లో ఎవరినీ నామినేట్ చేయలేదనే వాదనతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేయబడుతోంది.రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇలాంటి కారణాల వల్ల అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించకుండా తప్పించుకుందని పరోక్షంగా ఆరోపించబడింది.

పోస్ట్‌ ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

FACT CHECK

గతంలో అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాన్ని రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర నివారించిందని వచ్చిన వాదనను Digiteye India బృందం తప్పు అని నిరూపించింది.

అరుణాచల్ ప్రదేశ్లో 60 అసెంబ్లీ మరియు 2 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19, 2024న ఏకకాలంలో ఎన్నికలు జరగనున్నాయి.
నిజానికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ మరియు పార్లమెంటరీ నియోజకవర్గాలకు అభ్యర్థులను నిలబెట్టింది. అభ్యర్థుల ప్రకటనను ఇక్కడ చూడవచ్చు.

 

ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న డేటా కాంగ్రెస్ రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలకు అభ్యర్థులను నామినేట్ చేసిందని మరియు వారి అభ్యర్థిత్వం ఆమోదించబడిందని నిర్ధారిస్తుంది.

 

అంతేకాకుండా, అరుణాచల్ ప్రదేశ్‌లో పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించిన చారిత్రక డేటాను కూడా ఎన్నికల కమిషన్ పోర్టల్‌లో చూడవచ్చు.అభ్యర్థుల అఫిడవిట్‌లను చూస్తే 2004 నుండి ప్రతి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ స్థిరంగా పాల్గొంటుందని తెలుస్తుంది.

“రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర” యొక్క దావాకు సంబంధించి, నిజానికి ఆ యాత్ర జనవరి 2024లో అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందని రికార్డులు చూపిస్తున్నాయి.
రాహుల్ గాంధీ దృశ్యలు చూస్తే ఆయన అరుణాచల్ ప్రదేశ్‌లో యాత్ర సాగించారని తెలుస్తుంది. ఈ దావాపై Digiteye India బృందం చేసిన వాస్తవ పరిశీలన ఇక్కడ చూడవచ్చు.

కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలకు అరుణాచల్ ప్రదేశ్‌లోని అసెంబ్లీ మరియు పార్లమెంటరీ నియోజకవర్గాలకు అభ్యర్థులను నామినేట్ చేసినందున, చైనాకు భయపడి కాంగ్రెస్ అరుణాచల్ ప్రదేశ్‌లో అభ్యర్థులను నిలబెట్టలేదనే వాదన అబద్ధం.


మరి కొన్ని Fact Checks:

ఎన్నికల సంఘం 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిందా? వైరల్ అవుతున్న నకిలీ సర్క్యులర్; వాస్తవ పరిశీలన

రాహుల్ గాంధీ ఇటలీ దేశానికి వెళ్లేందుకు తన భారత్ జోడో న్యాయ్ యాత్రను 10 రోజుల పాటు నిలిపివేశారా? వాస్తవ పరిశీలన