Tag Archives: NDA

భారత కూటమికి రికార్డు స్థాయిలో ఓటు వేసినందుకు ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఏప్రిల్ 19, 2024న మొదటి దశ పోలింగ్ తర్వాత, రికార్డు సంఖ్యలో INDIA (కూటమి)కి ఓటు వేసిన ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: ఈ వాదన/దావా తప్పు. NDAకు రికార్డు సంఖ్యలో ఓటు వేసినందుకు ప్రజలకు ప్రధాని మోదీ మొదట ధన్యవాదాలు తెలిపారు. కాని ఆయన INDIA (కూటమి)కి ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్వీట్ మార్చబడింది.

రేటింగ్: తప్పు దోవ పట్టించే ప్రయత్నం —

ఏప్రిల్ 19, 2024న లోక్‌సభ ఎన్నికలకు మొదటి దశ పోలింగ్ జరిగిన తర్వాత , రికార్డు సంఖ్యలో INDIA (కూటమి)కు ఓటు వేసినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుతో స్క్రీన్‌షాట్ షేర్ చేయబడుతోంది.

స్క్రీన్‌షాట్‌ జత చేసి ఉన్న అనేక వాదనలు కనిపించాయి. ఒక వినియోగదారు ఇలా అన్నారు: “మోదీ జీకి ఎగ్జిట్ పోల్ సంఖ్యలు అందినవి, దేశవ్యాప్తంగా ప్రజలు NDAకి వ్యతిరేకంగా రికార్డు సంఖ్యలో ఓటు వేశారని ఇవి సూచిస్తున్నాయి. ఈ ఎన్నికలు NDAకి కఠినంగా మారబోతున్నాయి.”

 

FACT-CHECK

మోడీ తన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) తరపున ప్రజలకు కృతజ్ఞతలు తెలపాలి కానీ అందుకు భిన్నంగా INDIA (కూటమి)ను పేర్కొనడం వలన, మేము దానిని వాస్తవ పరిశీలన కోసం తీసుకున్నాము మరియు NDA స్థానంలో INDIA (కూటమి) చూపించడానికి స్క్రీన్‌షాట్ మార్చబడిందని తెలుసుకున్నాము. ప్రధాని మోదీ చేసిన అసలు ట్వీట్ దిగువన చూడవచ్చు:

“మొదటి దశ ఎన్నికలకు అద్భుతమైన స్పందన! ఈరోజు ఓటు వేసిన వారందరికీ ధన్యవాదాలు. నేటి ఓటింగ్ నుండి అద్భుతమైన ఫీడ్ బాక్ అందినది. భారతదేశం అంతటా ప్రజలు రికార్డు సంఖ్యలో NDAకి ఓటు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.”

పైన చూపిన స్క్రీన్‌షాట్ ప్రకారం ఇది INDIA (కూటమి) అని కాకుండా NDA అని స్పష్టమవుతోంది. కావున, ఎన్నికల సమయంలో ప్రజల్లో సందేహం కలిగించేందుకు NDAను INDIA (కూటమి)గా మార్చి, షేర్ చేసారు.

మరి కొన్ని Fact Checks:

చైనాకు భయపడి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అరుణాచల్ ప్రదేశ్‌లో తమ అభ్యర్థులను నిలబెట్టటంలేదా? వాస్తవ పరిశీలన

వీడియోలో రాహుల్ గాంధీ తను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రకటనను చదువుతున్నారా?వాస్తవ పరిశీలన