రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం భారతరత్న అవార్డులను ప్రదానం చేసిన కార్యక్రమంలో, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ప్రకటించిన భారతరత్న అవార్డును ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు అందుకుంటున్న సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చప్పట్లు కొట్టలేదని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఇతర ప్రముఖులు చప్పట్లు కొట్టడం చూడవచ్చు.
what is Mr.Karge doing when all others are applauding and celebrating. I see his demeanor different no indifferent to the occasion pic.twitter.com/IJ5F0810Q2
— SETHU S RAMAN (@CaptSSSR) March 30, 2024
“అందరూ చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేయగా ఖర్గే గారు ఏమి చేస్తున్నారు.అతని ప్రవర్తన భిన్నంగా, ఉదాసీనంగా ఉంది, సందర్భానుసారంగా లేదు.” భారతీయులందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఒక్క వ్యక్తి తప్ప ” అని మరొక వాదన/దావా పేర్కొంది.
ట్వీట్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
FACT-CHECK
Digiteye India బృందం ట్విట్టర్‌లో “నరసింహారావు భారతరత్న”అనే శీర్షికతో శోధనను నిర్వహించినప్పుడు, అదే వాదన/క్లెయిమ్ తో ఉన్న చిత్రాన్ని చూపుతున్న అనేక ట్వీట్‌లను గమనించాము. కానీ PIB యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో తదుపరి ప్రయత్నించగా, పీ.వీ ప్రభాకర్ రావు అవార్డును అందుకున్న ఒరిజినల్ వీడియో మార్చి 31, 2024న రాష్ట్రపతి అధికారిక Youtube ఖాతాలో అప్‌లోడ్ చేయబడినట్లు గమనించాము.
ఈ వీడియోలో, అవార్డును ప్రకటించినప్పుడు ఖర్గే చప్పట్లు కొట్టడం స్పష్టంగా చూడవచ్చు.
దిగువ చిత్రాలను చూడండి (ఎడమవైపు, అవార్డును స్వీకరించినప్పుడు; కుడివైపు, అవార్డును స్వీకరించే ఒక నిమిషం ముందు అవార్డు ప్రకటించినప్పుడు):
కావున, పివి నరసింహారావు కుమారుడు భారతరత్న అందుకుంటున్న సమయంలో ఖర్గే చప్పట్లు కొట్టలేదన్న వాదన అబద్ధం.
వాదన/Claim:దివంగత పీవీ నరసింహారావుగారి తరపున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ భారతరత్న అందుకున్నప్పుడు, ఖర్గే చప్పట్లు కొట్టలేదనేది వాదన.
నిర్ధారణ/Conclusion: పి.వి నరసింహారావుగారి పేరును ప్రకటించినప్పుడు, ఖర్గే చప్పట్లు కొట్టారు, కానీ వైరల్ చిత్రాన్ని ఆ తరువాత తీసి, దానిని వాదనకు మద్దతుగాఉపయోగించబడింది.
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —
మరి కొన్ని Fact Checks: