వీడియోలో రాహుల్ గాంధీ తను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రకటనను చదువుతున్నారా?వాస్తవ పరిశీలన

 వాదన/Claim: వీడియోలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రకటనను చదువుతున్నారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: రాహుల్ గాంధీని అప్రతిష్టపాలు చేసేందుకు ఆయన వాయనాడ్‌లో నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్న అసలు వీడియో సౌండ్ ట్రాక్‌ మార్చబడిందని నిరూపణ అయ్యింది.

రేటింగ్: పూర్తిగా తప్పు -- 

వాస్తవ పరిశీలన వివరాలు:

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటనను చదువుతున్న వీడియో ట్విట్టర్ (X)లో వైరల్ అవుతోంది,అనేక మందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Posted on X handle by user @MithilaWaala with the caption, “Don’t know whether this video is true or edited”, the video can be seen below:

వైరల్ వీడియోలో, రాహుల్ గాంధీ పత్రాలపై సంతకం చేయడం మరియు హిందీలో తన రాజీనామాను ప్రకటించిన ప్రకటనను చదవడం చూడవచ్చు. తెలుగు అనువాదం ఈ విధంగా ఉంది:
“నేను, రాహుల్ గాంధీని, నేను ‘చునావి హిందువు’ (ఎన్నికల సమయంలో హిందువు)గా ఉండటం విసిగిపోయి కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నాను. నేను అన్యాయ యాత్ర చేపట్టి మేనిఫెస్టో విడుదల చేశాను, కానీ మోడీ అవినీతిపరులను జైలుకు పంపుతూనే ఉన్నారు.మోడీ హయాంలో అవినీతిపరులను జైలుకు పంపుతారు కాబట్టి నేను మా తాతగారింటికి (ఇటలీ) వెళ్తున్నాను.”

FACT CHECK

వారం రోజుల క్రితం కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేసిన(వీడియో)వార్త అందరికీ తెలిసిన విషయమే మరియు వాదన(Claim)లో చూపిన వీడియో ఈ వార్తకు సంబంధించిన వీడియోలా కనిపించడంతో Digiteye India Team వాస్తవ పరిశీలనకు పూనుకుంది.
మేము అసలైన సౌండ్‌ట్రాక్‌తో ఉన్న వీడియో కోసం ప్రయత్నించినప్పుడు, అనేక వార్తా ఛానెల్‌లు ఏప్రిల్ 3, 2024న ఈ ఈవెంట్‌/వీడియోను అప్‌లోడ్ చేసినట్లు గమనించాము,ఇందులో కాంగ్రెస్ నాయకుడు వాయనాడ్‌లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నట్లు కనిపించారు.

రాహుల్ గాంధీ  చట్టబద్ధమైన ప్రకటనను చదవడం(వీడియోలో 0.48 secs నుంచి 1.08 secs వరకు)చూడవచ్చు:
“నేను,రాహుల్ గాంధీ, స్థానాన్ని భర్తీ చేయడానికి అభ్యర్థిగా నామినేట్ చేయబడినందున,చట్టం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంపై నేను నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు  దేశ సమగ్రతని మరియు సార్వభౌమాధికారాన్ని నిలబెడతానని వాగ్దానం చేస్తున్నాను.”

అందుకే,రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా అనిపించేలా ఒరిజినల్ వీడియో సౌండ్ ట్రాక్‌ మార్చబడింది. కాబట్టి, ఈ వాదన/దావా పూర్తిగా తప్పు.

మరి కొన్ని Fact Checks:
పీ.వీ నరసింహారావుగారి కుమారుడు భారతరత్న అందుకుంటున్న సమయంలో, ఖర్గే చప్పట్లు కొట్టకుండా 
చేతులు ముడుచుకొని కూర్చున్నారా? వాస్తవ పరిశీలన

రాహుల్ గాంధీ ఇటలీ దేశానికి వెళ్లేందుకు తన భారత్ జోడో న్యాయ్ యాత్రను 10 రోజుల పాటు నిలిపివేశారా? వాస్తవ పరిశీలన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *