Tag Archives: arunachal pradesh airport

బెంగళూరు టెర్మినల్ 2 చిత్రాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి సంబంధించినవిగా పేర్కొనబడ్డాయి; Fact Check

నవంబర్ 19, 2022న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లోని దోనీ పోలో విమానాశ్రయమని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.

క్లెయిమ్/వాదన ఈ విధంగా ఉంది: “అరుణాచల్ ప్రదేశ్ ఈ విమానాశ్రయాన్ని ఎక్కువగా BAMBU(Bamboo)తో తయారు చేసి రాష్ట్రానికి అందించారు, వావ్… నమ్మలేకపోతున్నాను… వారు ఇక్కడ భారతదేశంలో చేస్తున్నారు. అద్భుతమైన భారత్.”వీడియోలో పైకప్పు నుండి వేలాడుతున్న అలంకరణలతో కూడిన పెద్ద, ఆధునిక విమానాశ్రయ టెర్మినల్ కనపడుతుంది.

FACT CHECK

వీడియోలో ఉన్న విమానాశ్రయం ఇటీవలి బెంగుళూరు టెర్మినల్ 2 అలంకరణలను పోలి ఉన్నందున, Digiteye India బృందం దానిని పరిశీలించగా, ఆ వీడియో అరుణాచల్ ప్రదేశ్‌లోని విమానాశ్రయానికి చెందినది కాదని, బెంగుళూరులోనిదని కనుగొన్నారు.

నవంబర్ 11, 2022న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరు టెర్మినల్ 2ను ప్రారంభించినప్పుడు, దిగువ చూపిన విధంగా వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది:

వాస్తవానికి, అరుణాచల్ ప్రదేశ్ యొక్క డోనీ పోలో విమానాశ్రయం చిత్రాలు(దిగువ చిత్రాలు) అక్టోబర్ 19, 2022న DGCA ద్వారా అధికారికంగా విడుదల చేయబడ్డాయి:

కావున, ఈ వార్త సరైనదే కావచ్చు, అయితే ఈ చిత్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి చెందినదనే వాదన తప్పు.చిత్రం బెంగళూరులోని టెర్మినల్ 2 విమానాశ్రయం చెందినది.

వాదన/Claim: చిత్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని దోనీ పోలో విమానాశ్రయంలోని bamboo అలంకరణలతో ఉన్న లోపలి భాగము.

నిర్ధారణ/Conclusion:బెంగళూరు విమానాశ్రయం టెర్మినల్ 2 చిత్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని దోనీ పోలో విమానాశ్రయం అని తప్పుగా తీసుకోబడింది.

Rating: Misrepresentation —

[మరి కొన్ని Fact Checks: ఎత్తైన రైల్వే వంతెనపై వెలుతున్న రైలు వీడియో భారతదేశంలోనిది కాదు, చైనా దేశంలోని వీడియో: Fact Check ; 

ఆంధ్రా తీరం ఒడ్డుకు కొట్టుకొచ్చిన రథం బంగారంతో చేసింది కాదు, బంగారు రంగులో మాత్రమే ఉంది; Fact Check]