వాదన/Claim: సైనికులు లేదా అగ్నివీర్లను రిక్రూట్ చేసుకునేందుకు అగ్నిపథ్ పథకం కొన్ని మార్పులతో పునఃప్రారంభించబడిందనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. ప్రభుత్వ అధికారిక PIB(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) వాదన/దావాను తిరస్కరించింది మరియు దానిని నకిలీగా పేర్కొంది.
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —
************************************************************************
వివరాలు:
అగ్నిపథ్ పథకాన్ని ఎన్.డి.ఎ ప్రభుత్వం ‘సైనిక్ సమాన్’ స్కీమ్‌గా మళ్లీ ప్రారంభిస్తోందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టర్ షేర్ అవుతోంది.
आग्निवीर में बदलाव की खबर आ रही है,
क्या ये खबर सही है..? #आग्निवीर #G72024 #लड़कों_का_हक_मत_मारो pic.twitter.com/toCk41mE39— Vinod Meena (@vkmeena443) June 15, 2024
సందర్భం ఏమిటంటే, ప్రతిపక్ష భారత కూటమి(INDIA bloc) ఈ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది మరియు 2022 సెప్టెంబరులో “నాలుగు సంవత్సరాల పాటు రక్షణ దళాలలోని మూడు సర్వీసుల్లోకి సైనికులను నియమించడానికి అమలు చేసిన అగ్నిపథ్” పథకాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చింది.ఈ విధానంలో నియమించబడిన సిబ్బందిని అగ్నివీర్స్ అంటారు. సందేశం/పోస్ట్ ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.
అగ్నిపథ్ (అగ్నివీర్) పథకంపై సమీక్ష కోసం ఎన్.డి.ఎ వారే మనవి చేయడంతో ఈ సందేశం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది.
అసలు వాస్తవం ఏమిటి
వాస్తవ పరిశీలనకై సమాచారం కోసం వెతకగా, అధికారిక వర్గాలు అలాంటి నివేదిక ఏది జారీ చేయలేదని తెలిసింది. అదే ప్రకటించి ఉంటె, అన్ని పార్టీల అభిప్రాయాలను కోరుతూ వార్త ఛానళ్లలో ముఖ్యాంశాలుగా ఉండేవి. ప్రభుత్వ అధికారిక PIB ఆదివారం నాడు అగ్నిపథ్ పథకం పునఃప్రారంభించబడిందనే వార్తలను తోసిపుచ్చింది, మరియు సోషల్ మీడియా సందేశాన్ని నకిలీ వార్తగా పేర్కొంది. ”
సమీక్ష తర్వాత “విధి నిర్వహణ వ్యవధిని 7 సంవత్సరాలకు పొడిగించడం, 60 శాతం శాశ్వత సిబ్బంది & పెరిగిన ఆదాయంతో సహా అనేక మార్పులతో అగ్నిపథ్ పథకం ‘సైనిక్ సమాన్ పథకం’గా మళ్లీ ప్రారంభించబడిందని # నకిలీ వాట్సాప్ సందేశం పేర్కొంది. భారత ప్రభుత్వం (GOI) అలాంటి నిర్ణయం తీసుకోలేదు” అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) తన X హ్యాండిల్‌లో స్పష్టం చేసింది.
A #fake WhatsApp message claims that the Agnipath Scheme has been re-launched as ‘Sainik Saman Scheme’ after review with several changes including duty period being extended to 7 years, 60% permanent staff & increased income#PIBFactCheck
✔️GOI has taken no such decision pic.twitter.com/1a3zmuVjfk
— PIB Fact Check (@PIBFactCheck) June 16, 2024
మరియు, నకిలీ సందేశంలో అనేక స్పెల్లింగ్ తప్పులు ఉన్నాయి, ఇది ప్రభుత్వ ప్రకటన అనేది సందేహాస్పదంగా ఉంది. కాబట్టి, దావా తప్పు.
మరి కొన్ని వాస్తవ పరిశీలన కథనాలు :
అనేక దేశాలు భారతదేశం నుండి పండ్లు మరియు కూరగాయల దిగుమతులను నిషేధించాయా? వాస్తవ పరిశీలన
రేపటి నుంచి ఉచిత విద్యుత్ సబ్సిడీ ఆగిపోతుందని ఢిల్లీ మంత్రి అతిషి వెల్లడించారా? వాస్తవ పరిశీలన