Tag Archives: manipur

బీజేపీ గుర్తు(కమలం)తో కూడిన టీ-షర్ట్ ను రాహుల్ గాంధీ ధరించారని తప్పుడు చిత్రం షేర్ చేయబడుతోంది; వాస్తవ పరిశీలన

వాదన/Claim: రాహుల్ గాంధీ బీజేపీ చిహ్నం ఉన్న టీ-షర్ట్ ధరించిన చిత్రం, ఆయన బీజేపీ ఏజెంట్ అనే వాదనతో షేర్ చేయబడింది

నిర్ధారణ/Conclusion: వాదన తప్పు.రాహుల్ గాంధీ ధరించిన టీ-షర్ట్‌పై బీజేపీ గుర్తును మార్ఫింగ్ చేసి,ఆయన బీజేపీ ఏజెంట్ అని తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో షేర్ చేయబడింది.

రేటింగ్: తప్పుదోవ వార్త —

వాస్తవ పరిశీలన వివరాలు:

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గుర్తు ఉన్న టీ షర్ట్ ధరించి ఉన్న ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ జనవరి 14, 2024న మణిపూర్‌లో ప్రారంభమైనప్పుడు ఈ వాదన చేయబడింది.హిందీలో క్యాప్షన్ ఇలా ఉంది, “हमने तो पहले ही कहा था की यह राहुल गांधी बीजेपी का एजेंट है, आज हमने राहुल गांधी को रंगे हाथो पकड़ लिया है” [తెలుగు అనువాదం: “రాహుల్ గాంధీ బీజేపీ ఏజెంట్ అని ముందే చెప్పాము,ఈరోజు రాహుల్ గాంధీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం.”]

FACT CHECK

బీజేపీ గుర్తు ఉన్న టీ షర్టు ధరించిన రాహుల్ గాంధీ చిత్రం చాలా వింతగా కనిపిస్తుండడంతో ఒరిజినల్(అసలు) చిత్రం కోసం ప్రయత్నించాము.చివరగా, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌తో, ఒరిజినల్(అసలు) చిత్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాట్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసినట్లు మేము గమనించాము.

శ్రీనాట్ కాంగ్రెస్ సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు హెడ్ గా ఉన్నారు మరియు ఆమె జనవరి 14, 2024న హిందీలో ఒక శీర్షికతో చిత్రాన్ని షేర్ చేసుకున్నారు, “जब ईस्ट से वेस्ट की यात्रा की बात हुई थी – तो मैंने कहा कि यह यात्रा सिर्फ़ और सिर्फ़ मणिपुर से शुरू हो सकती है” [తెలుగు అనువాదం: మేము తూర్పు నుండి పడమరకు ప్రయాణించడం గురించి మాట్లాడినప్పుడు – ఈ యాత్ర మణిపూర్ నుండి మాత్రమే ప్రారంభించాలని నేను చెప్పాను]

రాహుల్ గాంధీ ధరించిన టీ-షర్ట్‌పై బీజేపీ గుర్తును మార్ఫింగ్ చేసి,ఆయన చిత్రం మార్చివేయబడింది.

కాబట్టి ఈ వాదన తప్పు.

 

మరి కొన్ని Fact Checks:

రాహుల్ గాంధీ యొక్క ‘భారత్ మాత’ ప్రసంగాన్ని అసందర్భంగా ట్వీట్ చేశారు; వాస్తవ పరిశీలన

రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉచిత మొబైల్ రీఛార్జ్‌ను ప్రకటించారా? వాస్తవ పరిశీలన

 

 

మణిపూర్‌లోని పురాతనమైన ఈ చర్చిని బిజెపి మద్దతుదారులు తగులబెట్టారా? నిజమేంటి?

వాదన/Claim:మణిపూర్‌ హింసాకాండలో సెయింట్ జోసెఫ్ చర్చికి బిజెపి కార్యకర్తలు నిప్పంటించారని ఒక వీడియో వైరల్ అయింది.

నిర్ధారణ/Conclusion:తప్పు వాదన. ఫ్రెంచ్ చర్చి దహనం చూపుతున్న వీడియో మణిపూర్‌లో జరిగిన సంఘటనగా ప్రచారం చేయబడింది.

రేటింగ్: పూర్తిగా తప్పు నిరూపణ —

Fact Check వివరాలు:

మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు ముఖ్యాంశాలు అవుతున్న నేపథ్యంలో, మణిపూర్‌లోని చర్చిని బిజెపి మద్దతుదారులే తగులబెట్టారనే వాదనతో చర్చిని తగలబెట్టే ఒక వీడియో వైరల్ అవుతోంది.హిందీలో క్యాప్షన్ ఇలా ఉంది: #मणिपुर सुग्नू इंफाल नही थम रही हिंसा आगजनी भाजपा समर्थक उग्रवादियो ने 300 साल से ज्यादा पुरानी St. Joseph’s चर्च जलाई 74 दिनो से मणिपुर जल रहा है [అనువాదం:  “మణిపూర్- ఇంఫాల్ హింస ఆగటం లేదు. 300 ఏళ్ల నాటి సెయింట్ జోసెఫ్ చర్చిని బీజేపీ కార్యకర్తలు తగులబెట్టారు. మణిపూర్ 74 రోజులుగా మండుతోంది.]

ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

మణిపూర్ యొక్క జాతి రూపురేఖలు రాష్ట్రంలో రెచ్చిపోతున్న హింస గురించి తెలుపుతుంది.మణిపురిలలో సగం మంది హిందువులైన మెయిటీస్, కుకీలు మరియు నాగాలు మిగిలిన జనాభాలో 90 శాతం ఉన్నారు మరియు వారు క్రైస్తవులు. మిగిలిన 10 శాతం జనాభా ముస్లింలు లేదా ఇతర మతాలను అనుసరిస్తున్నారు.

మే 3, 2023న ప్రారంభమైన జాతి హింస ఇప్పటివరకు 140 మంది మరణానికి దారి తీసింది. ఈ నేప‌థ్యంలో, రాష్ట్రంలోని ప్ర‌జ‌ల మ‌ధ్య మ‌రింత మతపరమైన హింసను రేపేందుకు చ‌ర్చి దహనం అయిన వీడియోను షేర్ చేయబడుతోంది.

వాస్తవం ఏంటి?

Digiteye India బృందం వారు చర్చ్‌ను కాల్చేస్తున్న వీడియోలోని కొన్ని ఫ్రేమ్‌లు తీసుకొని పరిశీలించగా, అది మార్నేలోని ‘L’église Notre-Dame-de Drosnay‘చర్చి అగ్నికి ఆహుతై కుప్పకూలిన చారిత్రాత్మక చర్చి యొక్క విజువల్స్కు కు అని తెలిసింది.మంటల్లో కాలిపోయిన 16వ శతాబ్దపు ఫ్రెంచ్ చర్చి వీడియో నుండి 25 సెకన్ల క్లిప్‌ను ఉపయోగించి, మణిపూర్‌ రాష్ట్రంలోని మెజారిటీ కమ్యూనిటీలు చర్చికి నిప్పంటించారని ఒక దావా/వాదన పేర్కొంది.

 




జూలై 7, 2023న అగ్నికి ఆహుతైన ఫ్రెంచ్ చర్చి యొక్క అసలైన వీడియోను చూడండి. మార్నే ప్రిఫెక్చర్ పత్రికా ప్రకటన ప్రకారం, అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది మరియు దానికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించడం జరుగుతోంది.పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలోని(Louvre Museum) క్యూరేటర్ నికోలస్ మిలోవనోవిక్ కూడా అగ్నిప్రమాదం “కోలుకోలేని నష్టం” అంటూ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసారు.ఈ సంఘటన ఇక్కడ మరియు ఇక్కడ ప్రధాన వార్తా సంస్థల్లో కూడా నివేదించబడింది.

మరి కొన్ని Fact Checks:

రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉచిత మొబైల్ రీఛార్జ్‌ను ప్రకటించారా? వాస్తవ పరిశీలన

హమాస్ ఇజ్రాయెల్ ట్యాంకులను స్వాధీనం చేసుకుని వాటిపై పాలస్తీనా జెండాలను ఎగురవేయడం వీడియోలో కనిపిస్తుంది; Fact Check