చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్-ల్యాండింగ్ అయిన తర్వాత, ఇస్రో చీఫ్ – ఎస్ సోమనాథ్ – మరియు ఇతర శాస్త్రవేత్తలు ఒక పార్టీలో డ్యాన్స్ చేస్తూ మరియు ఆనందిస్తున్నట్లు చూపించే అనేక వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి.
ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్-3 విజయాన్ని జరుపుకుంటున్నట్లు చాలా మంది ట్విటర్ వినియోగదారులు తమ ప్రొఫైల్‌లలో వీడియోను షేర్ చేస్తు, అది తాజా వీడియోగా పేర్కొన్నారు. భారతదేశం యొక్క మూడవ చంద్ర మిషన్ రోవర్ చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ అయిన రోజు ఆగస్టు 23 నుండి ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో వైరల్‌గా మారింది.
The party has begun… #ISRO chief S Somnath having a light moment after years of non-stop efforts to make #Chandrayaan3 a success. #PragyanRover #Chandrayaan3Success #IndiaOnTheMoon #IndiaOnMoon #MoonLanding pic.twitter.com/n07SguT4mQ
— Dr Richa Tomar (@DrRichaTomar) August 23, 2023
ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ కూడా షేర్ చేయబడింది.
వైరల్ వీడియోలో వాస్తవం ఎంత ఉందో తనిఖీ చేయమని Digiteye Indiaకి WhatsApp అభ్యర్థన వచ్చింది.
FACT CHECK
Digiteye India బృందం గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో ఈ వైరల్ వీడియో నుండి కొన్ని కీలక ఫ్రేమ్‌లను పరిశీలించినప్పుడు, చాలా మంది వ్యక్తులు ఈ వీడియోను షేర్ చేసినట్లు కనుగొన్నాము. ట్విట్టర్‌లో కూడా పరిశీలించినప్పుడు, సిద్ధార్థ్ MP అనే వినియోగదారు ఈ ట్వీట్ చేశాడని తెలుసుకున్నాము.WION న్యూస్‌కి చెందిన జర్నలిస్ట్ ఈ వీడియోను క్యాప్షన్‌తో ఇలా పోస్ట్ చేసారు: “Dr S. Somanath & team #isro…గర్వంగా,ఆనందంగా సంబరాలు చేసుకోండి.1.4+bn హృదయాలను గర్వంతో మరియు ఆనందంతో ఉబ్బిపోయేలా చేసే శక్తి మరియు జ్ఞానం ప్రపంచంలో ఎంత మందికి ఉంది!#Chandrayaan3 #Chandrayaan3Landing #Chandrayaan3Mission #india #space #tech.”
Dr. S. Somanath & team #isro…
Celebrate and dance your hearts out tonight ❤️❤️🇮🇳🇮🇳🚀🚀🌕🌕
How many ppl in the world have the power & knowledge to make 1.4+bn hearts swell with pride & joy! #Chandrayaan3 #Chandrayaan3Landing #Chandrayaan3Mission #india #space #tech pic.twitter.com/gyIOgZaqbs
— Sidharth.M.P (@sdhrthmp) August 23, 2023
అయితే, తరువాతి ట్వీట్‌లో ట్వీట్‌లో, వినియోగదారుడు వీడియో తాజాది కాదని పేర్కొన్నారు. అతను ట్వీట్ చేసాడు, “దయచేసి గమనించండి: ఇది ఈ సంవత్సరం ప్రారంభంలోని వీడియో మరియు ఈ మొత్తం ఈవెంట్‌కు నాకు అధికారిక అనుమతి ఉంది.ఈ వీడియో ఈ రోజుది కాదు!”
Pls note: This is a video from earlier this year and I had formal access to this entire event and that’s how I had filmed it
This video is not from tonight!
— Sidharth.M.P (@sdhrthmp) August 23, 2023
ఈ వీడియో యొక్క వాస్తవికతను మరింత పరిశీలించడానికి, మేము ఆగస్టు 23 నుండి ISRO శాస్త్రవేత్తల ఇతర వీడియోలను చూశాము.చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారంలో, S సోమనాథ్ గారు భిన్నమైన వేషధారణలో ఉన్నారు.విజయవంతంగా ల్యాండింగ్ తర్వాత ఇస్రో చీఫ్ ప్రసంగాన్ని మేము చూసినప్పుడు అతను నల్లటి వెయిస్ట్‌కోట్‌తో అదే ఆకాశ-నీలం చొక్కా ధరించారు.
[See Also: Split Moon image goes viral on WhatsApp; Fact Check]
Here is a video of S Somanath’s speech.
ఎస్ సోమనాథ్ గారి ప్రసంగానికి సంబంధించిన వీడియో ఇక్కడ ఉంది.
మేము S సోమనాథ్ యొక్క మరికొన్ని వీడియోల కోసం Googleని పరిశీలించినప్పుడు, అది నెల క్రితం యొక్క పాత వీడియో అని కనుగొన్నాము.కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన G20 స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్‌లో ఇస్రో చీఫ్ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతున్న వీడియో అని తెలుస్తుంది.
S సోమనాథ్ గారు G20 సమావేశం వీడియోలోను మరియు డ్యాన్స్ వైరల్ వీడియోలోను ఒకే వేషధారణలో ఉన్నారు.మరియు రెండు వీడియోలలో మెడలో ఒకే ట్యాగ్ ఉంది.
Claim/వాదన: చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన సందర్భంగా ఇస్రో చీఫ్ డ్యాన్స్ చేస్తు సంబరాలు చేసుకున్నారని ఆగస్టు 23న పోస్ట్ చేసిన పలు వీడియోలు పేర్కొన్నాయి.
నిర్ధారణ: ఈ ఏడాది ప్రారంభంలో బెంగళూరులో జరిగిన G20 సమావేశానికి సంబంధించిన పాత వీడియో.
Rating: Misrepresentation – ???
Split Moon image goes viral on WhatsApp; Fact Check ,
Fake claim attributed to Chief Justice Chandrachud is going viral on social media; Fact Check]