Author Archives: Srilatha Dasari

ఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో నెదర్లాండ్స్ PM తన పానీయం/డ్రింక్ పొరపాటున నేల మీద పడితే తానే స్వయంగా శుభ్రం చేసారా? Fact Check

సెప్టెంబర్ 09-10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జి20 సదస్సు జరిగింది. శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నెదర్లాండ్స్ ప్రధాని తన డ్రింక్‌ పొరపాటున నేల మీద పడిపోతే తానే స్వయంగా నేలను శుభ్రం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాట్సాప్‌లో కూడా వీడియో వైరల్ అవుతోంది. వీడియో దావా/ వాదన క్రింద విధంగా ఉంది::

“ఇది G-20 శిఖరాగ్ర సమావేశం 2023లో న్యూఢిల్లీ లో జరిగినప్పుడు,నెదర్లాండ్ ప్రధాని తన చేతిలోని టీ పొరపాటున నేల మీద పడిపోతే,  ఆయన  స్వచ్ఛంద సేవకులను శుభ్రం చేయడానికి పిలవలేదు. తర్వాత ఏమి జరిగిందో దయచేసి చూడండి. ఇది మన దేశ రాజకీయ ప్రజలకు గుణపాఠం.”

అదే విధమైన వాదన/ దావా తో వీడియో ఇక్కడ, ఇక్కడమరియు  ఇక్కడ షేర్ చేయబడ్డది.

ఈ వైరల్ వీడియోను పరిశీలన చేయమని Digiteye India కి WhatsApp అభ్యర్థన వచ్చింది.

FACT CHECK

Digiteye India బృందంవారు వీడియోని అనేక కీఫ్రేమ్‌లుగా విభజించడానికి inVidని(video verification tool) ఉపయోగించారు. మేము కీఫ్రేమ్‌లలో ఒకదాన్ని ఉపయోగించి, Googleలో రివర్స్ ఇమేజ్ ఉపయోగించి పరిశీలించి చూస్తే, అది 2018 నాటి వీడియోకి దారితీసింది.

మేము కీలకపదాలను(Keywords) మరియు Google search ఉపయోగించి , 2018 వరకు వెనక్కి వెళ్లి పరిశిలిస్తే, అనేక ఫలితాలు వేలువడ్డాయి. ఆ ఫలితాలలో ఒకటి ABC న్యూస్ వారి కథనానికి దారితీసింది. నివేదిక జూన్ 5, 2018 నాటిది మరియు నెదర్లాండ్స్ PM ఆయన వల్ల చిందిన టీని ఆయననే స్వయంగా శుభ్రం చేస్తున్నట్లు చూపించింది. డచ్ పార్లమెంట్ భవనం వద్ద మార్క్ రుట్టే(Mark Rutte)అనుకోకుండా తన కప్పును జారవిడిచినట్లు అందులో పేర్కొంది. ఆ పనిని హౌస్ కీపింగ్ సిబ్బంది సిబ్బందికి వదిలివేయకుండా ఆయనే స్వయంగా నేలను శుభ్రం చేసారు.ఆయన శుభ్రం చేస్తుండగా, క్లీనింగ్ సిబ్బంది ఆయన్ని ఉత్సాహపరిచారు.

మేము YouTubeలో ఇదే విధంగా శోధన/పరిశీలించినప్పుడు, యూరోన్యూస్ వారు తీసినా వీడియో కనిపించింది.
వీడియో శీర్షిక, చూడండి: డచ్ పీఎం రుట్టే ఆయన వల్ల చిందిన కాఫీని ఆయనే స్వయంగా శుభ్రం చేస్తున్నట్లు చూపించింది.వైరల్ దావా/వాదనలోఉపయోగించింది అదే వీడియో.వీడియో జూన్ 5, 2018 నాటిది.

అందుకే, G-20 సమావేశం సందర్భంలో తప్పుడు వాదన/దావాతో పాత వీడియో మళ్లీ ప్రచారం చేయబడుతోంది.

వాదన/Claim: ఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో నెదర్లాండ్స్ PM మార్క్ రుట్టే(Mark Rutte)తన పానీయం/డ్రింక్ పొరపాటున నేల మీద పడితే తానే స్వయంగా శుభ్రం చేసారు.

నిర్ధారణ: ఈ వీడియో 2018 నాటిది మరియు డచ్ పార్లమెంట్ వద్ద చిందిన పానీయాన్ని మార్క్ రుట్టే(Mark Rutte) శుభ్రం చేస్తున్నట్లు చూపిస్తుంది. ఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో జరిగిన సంఘటన కాదు.

RATING: Misinterpretation –

[మరి కొన్ని Fact Checks:Is Tata Motors giving out gifts for the success of G20 summit in Delhi? Fact Check]

 

 

 

విండ్ టర్బైన్ల కారణంగా మిలియన్ల కొద్ది పక్షులు చనిపోతున్నాయా; ఏది నిజం [FACT CHECK]

2025 నాటికి దేశంలోని దాదాపు మొత్తం తీరప్రాంతంలో పెద్ద ఎత్తున wind farmsను అభివృద్ధి చేసే ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రభుత్వం అక్టోబర్ 15, 2021న ప్రకటించిన తర్వాత, విండ్ టర్బైన్‌లు(wind turbines) పక్షుల మరణానికి దారితీస్తాయనే పాత చర్చ మళ్లీ దృష్టికి వచ్చింది. .

బోస్టన్‌లో జరిగిన విండ్ పవర్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్‌లో ఇంటీరియర్ సెక్రటరీ ‘దేబ్ హాలాండ్(Deb Haaland)’ ప్రకటన చేసిన వెంటనే, యునైటెడ్ స్టేట్స్‌లోని తీరప్రాంతంలో విండ్ టర్బైన్‌లను ఏర్పాటు చేస్తే పక్షులు ఎక్కువగా ప్రభావితమవుతాయని ట్విట్టర్‌లో అనేక సందేశాలు వచ్చాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి:

https://twitter.com/InfoHarvester/status/1448728457442172934?s=20

 

FACT CHECK

అనేక రకమైన పక్షులు కనుమరుగయ్యే/అంతరించిపోయే పరిస్తితి లో ఉన్నందున పర్యావరణంపై దాని ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వాస్తవం పరిశీలించటం కోసం సమస్యను Digiteye India స్వీకరించింది.యునైటెడ్ స్టేట్స్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్ ప్రకారం, విండ్ టర్బైన్‌ల కంటే పిల్లుల వలన పక్షి జాతికి తీవ్ర హాని కలుగుతుంది.

పిల్లుల దాడి వలన పక్షి మరణాల సంఖ్య 2.4 బిలియన్లుగా ఉన్నట్లు అంచనా.పిల్లులు మరియు గాజు భవనాలు వలన పక్షి జాతికి కలిగించే హాని/నష్టంతో పోల్చితే భూమిపై ఉన్న విండ్ టర్బైన్‌లు వలన జరిగె హాని చాల తక్కువ శాతం.

ల్యాండ్ విండ్ టర్బైన్‌లు వలన 200,000 పైగా పక్షులు మారణిoచగా, గాజు భవనాలు ఢీకొనడం వలన దాదాపు 600 మిలియన్ల పక్షులు మరణిస్తున్నాయని అంచనా వేయబడింది, అయితే ‘యునైటెడ్ స్టేట్స్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్’వారు ఆఫ్‌షోర్ విండ్ టర్బైన్‌ల వల్ల సంభవించే మరణాలకు అంచనాలను అందించలేదు.

పొడవైన విండ్ టర్బైన్‌లు వల్ల పక్షులకు ఖచ్చితంగా ప్రమాదం ఉందని మా పరిశోదనలో తేలింది, కాని పిల్లులు మరియు నగరాల్లో ఎత్తైన గాజు భవనాలు వలన పక్షి జాతికి కలిగించే హాని/నష్టంతో పోల్చితే భూమిపై ఉన్న విండ్ టర్బైన్‌లు వలన జరిగె హాని చాల తక్కువ శాతం. గాజు భవనాలు/కిటికీల ద్వారా చనిపోయిన 624 మిలియన్ల పక్షులతో పోలిస్తే టర్బైన్లు వలన 0.1% పక్షులు మరియు పిల్లులతో పోలిస్తే 0.03% చొప్పున పక్షులు చనిపోతున్నాయి.

నివేదికను ఇక్కడ చూడండి.

కింది ఇన్ఫోగ్రాఫ్ వివరాలను చూపుతుంది.

అయితే, ఈ భారీ టర్బైన్‌ల వల్ల వేలకొద్ది పక్షులు చనిపోతున్నాయన్నది నిజం. ఇటివల కాలంలో, దిన్ని పరిష్కరించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి.ఇప్పటికే అనేక శాస్త్రీయ పరిష్కారాలు సమర్థవంతమైన మరియు కొనుగోలు సామర్ధ్యం ఉన్న పరిష్కారాలుగా మెప్పును పొందాయి. వీడియోను ఇక్కడ చూడండి:

భారతదేశంతో సహా అనేక దేశాలలో విండ్ టర్బైన్‌లు సర్వసాధారణం కావడంతో మరియు వాతావరణ మార్పులకు అనుగుణంగా పునరుత్పాదక శక్తికి(renewable energy) అత్యంత అనుకూలమైన పరిష్కారం కాబట్టి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటే పక్షుల మరణాలను నివారించవచ్చు.

Birds (U.S. Fish & Wildlife Service)

సెన్సార్ టెక్నాలజీ

ఇటీవల, పక్షులు సమీపిస్తున్నప్పుడు టర్బైన్‌లను నెమ్మదిగా లేదా ఆపడానికి కొన్ని సెన్సార్ టెక్నాలజీ అభివృద్ధి చేయబడింది. IdentiFlight అని పిలువబడే AI-ఆధారిత కెమెరా డిటెక్షన్ సిస్టమ్ 2019 సం నుండి పవన శక్తి పరిశ్రమకు (wind energy industry) సురక్షితంగా పక్షులను రక్షించడానికి ఏంతో సహాయపడుతూ ఉంది.

IdentiFlight 360-డిగ్రీల (radiusలో) ఆకాశాన్ని స్కాన్ చేస్తుంది మరియు ఒక కిలోమీటరులోపు ఎగురుతున్న ఏదైనా వస్తువును గుర్తించగలదు. ఏదైనా ఎగిరే వస్తువు/ఇమేజ్/పక్షిని గుర్తిస్తే, సిస్టమ్ విండ్ టర్బైన్‌లను స్విచ్ ఆఫ్ చేసే ముందు, ఆ ఎగిరే వస్తువు/పక్షిని 200 ఇమేజ్ లక్షణాలలో ఉన్నా చిత్రాలతో విశ్లేషించడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగించి, సమీపించే పక్షులను రక్షిస్తుంది. వాస్తవమైన వీడియోని ఇక్కడ చూడండి.

వాదన/Claim:  విండ్ టర్బైన్ల వలన లక్షలాది పక్షులు చనిపోతున్నాయి.
నిర్ధారణ:ఈ వాదన పాక్షికంగా నిజం అయితే పక్షులను చంపే ఇతర కారకాల కంటే ఈ శాతం చాలా తక్కువ.
టర్బైన్‌ల నుండి పక్షులను రక్షించడానికి కొత్త సాంకేతికతలు విజయవంతంగా పరీక్షించబడ్డాయి లేదా
పరీక్షించబడుతున్నాయి, ఎందుకంటే పునరుత్పాదక ఇంధన వనరులలో(renewable energy sources) పవన శక్తి (wind energy) కాలుష్య రహిత మరియు పచ్చని వాతావరణంకి,
శిలాజ ఇంధనాలు (fossil fuels) గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పులకు దోహదం చేస్తున్నాయి కాబట్టి.

Our rating: Misinterpretation

మరి కొన్ని Fact Checks: 
No, Rs.500 Indian currency notes with '*' symbol are NOT FAKE  but genuine; Fact Check ; 
Did these migratory birds Bayan and Onon reach India travelling 5,000 miles? Fact Check;

ISRO చీఫ్ చంద్రయాన్-3 విజయాన్ని డ్యాన్స్ చేస్తు సంబరాలు చేసుకుంటున్నట్లు ఈ వీడియో చూపిస్తుందా? Fact Check

చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్-ల్యాండింగ్ అయిన తర్వాత, ఇస్రో చీఫ్ – ఎస్ సోమనాథ్ – మరియు ఇతర శాస్త్రవేత్తలు ఒక పార్టీలో డ్యాన్స్ చేస్తూ మరియు ఆనందిస్తున్నట్లు చూపించే అనేక వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి.

ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్-3 విజయాన్ని జరుపుకుంటున్నట్లు చాలా మంది ట్విటర్ వినియోగదారులు తమ ప్రొఫైల్‌లలో వీడియోను షేర్ చేస్తు, అది తాజా వీడియోగా పేర్కొన్నారు. భారతదేశం యొక్క మూడవ చంద్ర మిషన్ రోవర్ చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ అయిన రోజు ఆగస్టు 23 నుండి ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో వైరల్‌గా మారింది.

ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ కూడా షేర్ చేయబడింది.

వైరల్ వీడియోలో వాస్తవం ఎంత ఉందో తనిఖీ చేయమని Digiteye Indiaకి WhatsApp అభ్యర్థన వచ్చింది.

FACT CHECK

Digiteye India బృందం గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో ఈ వైరల్ వీడియో నుండి కొన్ని కీలక ఫ్రేమ్‌లను పరిశీలించినప్పుడు, చాలా మంది వ్యక్తులు ఈ వీడియోను షేర్ చేసినట్లు కనుగొన్నాము. ట్విట్టర్‌లో కూడా పరిశీలించినప్పుడు, సిద్ధార్థ్ MP అనే వినియోగదారు ఈ ట్వీట్‌ చేశాడని తెలుసుకున్నాము.WION న్యూస్‌కి చెందిన జర్నలిస్ట్ ఈ వీడియోను క్యాప్షన్‌తో ఇలా పోస్ట్ చేసారు: “Dr S. Somanath & team #isro…గర్వంగా,ఆనందంగా సంబరాలు చేసుకోండి.1.4+bn హృదయాలను గర్వంతో మరియు ఆనందంతో ఉబ్బిపోయేలా చేసే శక్తి మరియు జ్ఞానం ప్రపంచంలో ఎంత మందికి ఉంది!#Chandrayaan3 #Chandrayaan3Landing #Chandrayaan3Mission #india #space #tech.”

అయితే, తరువాతి ట్వీట్‌లో ట్వీట్‌లో, వినియోగదారుడు వీడియో తాజాది కాదని పేర్కొన్నారు. అతను ట్వీట్ చేసాడు, “దయచేసి గమనించండి: ఇది ఈ సంవత్సరం ప్రారంభంలోని వీడియో మరియు ఈ మొత్తం ఈవెంట్‌కు నాకు అధికారిక అనుమతి ఉంది.ఈ వీడియో ఈ రోజుది కాదు!”

ఈ వీడియో యొక్క వాస్తవికతను మరింత పరిశీలించడానికి, మేము ఆగస్టు 23 నుండి ISRO శాస్త్రవేత్తల ఇతర వీడియోలను చూశాము.చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారంలో, S సోమనాథ్ గారు భిన్నమైన వేషధారణలో ఉన్నారు.విజయవంతంగా ల్యాండింగ్ తర్వాత ఇస్రో చీఫ్ ప్రసంగాన్ని మేము చూసినప్పుడు అతను నల్లటి వెయిస్ట్‌కోట్‌తో అదే ఆకాశ-నీలం చొక్కా ధరించారు.

[See Also: Split Moon image goes viral on WhatsApp; Fact Check]

Here is a video of S Somanath’s speech.

ఎస్ సోమనాథ్ గారి ప్రసంగానికి సంబంధించిన వీడియో ఇక్కడ ఉంది.

మేము S సోమనాథ్ యొక్క మరికొన్ని వీడియోల కోసం Googleని పరిశీలించినప్పుడు, అది నెల క్రితం యొక్క పాత వీడియో అని కనుగొన్నాము.కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన G20 స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్‌లో ఇస్రో చీఫ్ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతున్న వీడియో అని తెలుస్తుంది.

S సోమనాథ్ గారు G20 సమావేశం వీడియోలోను మరియు డ్యాన్స్ వైరల్ వీడియోలోను ఒకే వేషధారణలో ఉన్నారు.మరియు రెండు వీడియోలలో మెడలో ఒకే ట్యాగ్ ఉంది.

Claim/వాదన: చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన సందర్భంగా ఇస్రో చీఫ్ డ్యాన్స్ చేస్తు సంబరాలు చేసుకున్నారని ఆగస్టు 23న పోస్ట్ చేసిన పలు వీడియోలు పేర్కొన్నాయి.

నిర్ధారణ: ఈ ఏడాది ప్రారంభంలో బెంగళూరులో జరిగిన G20 సమావేశానికి సంబంధించిన పాత వీడియో.

Rating: Misrepresentation – ???

మరికొన్ని Fact checks:

Split Moon image goes viral on WhatsApp; Fact Check , 

 Fake claim attributed to Chief Justice Chandrachud is going viral on social media; Fact Check]

మహామేరు పుష్పం ప్రతి 400 సంవత్సరాలకు ఒకసారి వికసిస్తుందా? Fact Check

క్యాబేజీని పోలిన ఆకులతో కూడిన పెద్ద పసుపు రంగు పువ్వు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చిత్రంతో ఉన్న శీర్షిక “టిబెట్ యొక్క ప్రత్యేకమైన ‘పగోడా ఫ్లవర్’ శుభప్రదమైనది.హిమాలయాల్లో ప్రతి 400 సంవత్సరాలకు ఒకసారి వికసించే మహామేరు పుష్పం ఇది.మన తరంకు కనీసం ఫోటోల్లో చూసే అదృష్టం ఉంది.దయచేసి ఇతరులు కూడా చూడగలిగేలా షేర్ చేయండి.జీవితాంతం అదృష్టం కలిసి వస్తుంది! ”

పువ్వును చూస్తే అదృష్టం కలిసి వస్తుంది! అని పేర్కొనడంతో చిత్రాలు వైరల్‌గా మారాయి.

Fact Check:

సోషల్ మీడియాలో పరిశీలించినపుడు ఈ చిత్రం 2019 నుండి  చెలామణిలో ఉన్నట్టు చూపించింది.ఇది కాకుండా, ఇతర పువ్వుల చిత్రాలు కూడా అదే శీర్షికతో షేర్ చేయబడ్డాయి.Digit Eye India  వాస్తవం తెలుసుకోవడం కోసం ఈ చిత్రాన్ని/అభ్యర్థనను స్వీకరించింది.

మేము Plant Netలో రివర్స్ ఇమేజ్ ఉపయోగించి పరిశిలిస్తే, ఆ మొక్క పేరు Rheum nobile అని చూపించింది. (Plant Net websiteలో వినియోగదారులు మొక్కల చిత్రాలను అప్‌లోడ్ చేసి దాని శాస్త్రీయ నామాన్ని తెలుసుకోవచ్చును)

Sikkim Rhubarb(సిక్కిం రబర్బ్) అని కూడా పిలువబడే Rheum nobile(రుయం నోబిల్), రెండు మీటర్ల ఎత్తు వరకు పెరిగి,ఎక్కువ కాలం నిలిచి ఉండే మొక్క.ఇది జూలై మరియు ఆగస్టు మధ్య పుష్పాలను వికసిస్తుంది.ఇది హిమాలయాలకు చెందినది మరియు సిక్కిం, భూటాన్,టిబెట్ వంటి ఆల్పైన్ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది.

[మరి కొన్ని Fack Checks చూడండి: [No, Rs.500 Indian currency notes with ‘*’ symbol are NOT FAKE but genuine; Fact Checkమరియు  [Sandals with Ganesha image surface after 2 decades on social media; Fact Check]

అయితే, పగోడా ఫ్లవర్ అని పిలువబడే ఒక పువ్వు ఉంది కానీ పైన చూపిన విధంగా ఎరుపు రంగులో ఉంటుంది.ఇది సాధారణంగా ఆసియాలో కనిపిస్తుంది. Florida Museum. వారి ప్రకారం, దీని శాస్త్రీయనామం Clerodendrum paniculatum, ఇది 6 అడుగుల లేదా అంతకంటే ఎక్కువ పొడవు పెరుగుతుంది. ‘Flowers of India, ‘వారి ప్రకారం పిరమిడ్ ఆకారపు కలిగి జపనీస్ పగోడా లాగా అంచెలంచెలుగా అమర్చబడి ఉంటాయి కాబట్టి ఈ పువ్వుకు ఆ పేరు పెట్టారు.ఒకొక్క పువ్వు కేవలం 0.5-అంగుళాల పొడవు  ఉండి, ఎక్కువ కాలం నిలిచి ఉండే మొక్క.

అదేవిధంగా, చెలామణిలో ఉన్న తెల్లని పువ్వు, చిగురించే దశలో ఉన్న కింగ్ ప్రొటీయా పువ్వు (King Protea flower)యొక్క చిత్రం.  Gardenia వారి ప్రకారం ప్రొటీయా సైనరాయిడ్స్(Protea cynaroides)అని కూడా పిలుస్తారు, ఇది దక్షిణాఫ్రికా జాతీయ పుష్పం.చాలా తక్కువ కొమ్మలు కలిగి పొదగా ఉంటుంది, ఇది ఒక సీజన్‌లో ఆరు నుండి పది పువ్వులను కాసుస్తుంది.

Claim/వాదన: మహామేరు పుష్పం ప్రతి 400 సంవత్సరాలకు వికసిస్తుందా? Fact Check

నిర్ధారణ: 1.క్యాబేజీని పోలిన ఆకులతో కూడిన పెద్ద పసుపు రంగు పువ్వు పేరు Rheum nobile. ప్రతి 400 సంవత్సరాలకు ఒకసారి వికసిస్తుందనే వాదన తప్పు.

2.పగోడా ఫ్లవర్ అని పిలువబడే ఒక పువ్వు ఉంది కానీ తెలుపులో కాకుండ ఎరుపు రంగులో ఉంటుంది.దీని శాస్త్రీయనామం Clerodendrum paniculatum.

3.చెలామణిలో ఉన్న తెల్లని పువ్వు కింగ్ ప్రొటీయా పువ్వు(King Protea flower).ఇది ఒక సీజన్‌లో ఆరు నుండి పది పువ్వులను కాస్తుంది.

4.కార్ప్స్ ప్లాంట్( Corpse Plant)అని కూడా పిలువబడే అమోర్ఫోఫాలస్ టైటానియం(Amorphophallus Titanium) పుష్పాలు వికసించటానికి దాదాపు 4–10 సంవత్సరాలు పడుతుంది.

Rating Misinterpretation:


					

పాత రూ.2 నాణెం ఆన్‌లైన్‌లో లక్షల రూపాయలకు అమ్ముడుపోతోందా? వాట్సాప్‌లో వీడియో వైరల్; Fact Check

ఓ యాంకర్ పాత రూ 2 నాణెంకు లక్షల రూపాయలు చెల్లించి కొనుక్కోవడానికి కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్నందున రూ 2 నాణెం మిమ్మల్ని రాత్రికిరాత్రే ధనవంతులను చేస్తుంది.ఆమె మిమ్మల్ని క్వికర్ ఖాతాను (Quikr account)తెరవమని కోరితు మరియు రూ 2 నాణెం చిత్రాన్ని అప్‌లోడ్ చేయమని అడుగుతుంది. 2 నాణెం కొనుగోలుదారు కోసం వేచి ఉండండి అని చెబుతుంది.

Zeenews.com/business వంటి అనేక వార్తా పబ్లికేషన్‌లు కూడా Quikr ఖాతాను ఎలా తెరవాలనే దానిపై వివరంగా సమాచారాన్ని అందించాయి. రూ 2 నాణెం కోసం Googleలో వెతికినప్పుడు, క్రింద సమాచారం వెలువడుతుంది. Digiteye India వాస్తవం తెలుసుకొనుటకు పై వీడియో స్వీకరించింది.

FACT CHECK

Digiteye team వారు Googleలో వెతికినప్పుడు, Claim/దావా రెండు సంవత్సరాలకు పైగా కొనసాగుతోంది.

‘నుమిస్మాటిక్స్'( numismatics–పాత బ్యాంకు నోట్లు, పాత నాణేల సేకరణ మరియు అధ్యయనం)విభాగంలో పరిశీలించినప్పుడు, పాత రూ.2 నాణేలు చాలా వరకు రూ.500కు మించకుండా అమ్ముడుపోయినట్టు క్వికర్ వెల్లడించింది.అంతేకాదు రూ. 2 నాణేలు అంత అరుదైనవి కావు.

Quoraలోని కొంతమంది వ్యక్తులు ఇది మోసానికి దారితీస్తుందని హెచ్చరించారు, దీని ద్వారా రూ. 2 నాణేలు అమ్మేవాళ్ళు తమ బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ కార్డ్ నంబర్ మరియు OTP లాంటి సమాచారాన్ని అందించేలా తప్పుదారి పట్టించవచ్చు.ఆ తరువాత మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బును సులభంగా బదిలీ చేస్తారు.

 

Digiteye India బృందం 1994 సంవత్సరం నాటి నాణెం క్వికర్‌లో (Quikr) పెట్టినప్పుడు, కొనాలకున్న వ్యక్తి నాణెంకు రూ. 2 లక్షలు ఇస్తానని, ధృవీకరణ సాకుతో బ్యాంక్ వివరాలు, ఆధార్ కార్డ్ నంబర్ వంటి వివరాలను కోరింది.చివరగా, ఆ వ్యక్తి ధృవీకరణ సాకుతో OTPని షేర్ చేయమని అడిగాడు, దీని వలన team member యొక్క బ్యాంక్ ఖాతా నుండి తక్షణమే నగదు బదిలీ చెయ్యబడే అవకాశం ఉండేది.మా ఆన్‌లైన్ సెర్చ్‌లో వెల్లడైనట్లు ఇది చాలా మందికి అనుభవం అయ్యింది.

ఆర్‌బీఐ ఏం చెబుతోంది:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఆగష్టు 24, 2021న, ఈ విధంగా కొనసాగుతున్న మోసపూరిత కార్యకలాపాలలో భాగంగా వివిధ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పాత నోట్‌లు మరియు నాణేలను కొనుగోలు చేసే లేదా విక్రయించే బోగస్ ఆఫర్‌లకు వ్యతిరేకంగా ప్రజలను హెచ్చరించింది.

ఆర్‌బిఐ (RBI) ఒక పత్రికా ప్రకటనలో, ప్రజలను జాగ్రత్తగా ఉండాలని మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరును ఉపయోగించి ఇటువంటి మోసపూరిత ఆఫర్‌ల ద్వారా డబ్బును రాబట్టడానికి మోసకారుల బారిన పడవద్దని సూచించింది.

కొన్ని అంశాలు మోసపూరితంగా RBI పేరు/లోగోను ఉపయోగిస్తున్నాయని మరియు వివిధ ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ మార్గాల ద్వారా పాత నోట్లు & నాణేల కొనుగోలు మరియు అమ్మకానికి సంబంధించిన లావాదేవీలలో ప్రజల నుండి ఛార్జీలు/కమీషన్/పన్ను కోరుతున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వచ్చింది. ఆర్‌బిఐ సందేశన్ని ఏఎన్ఐ వార్తా సంస్థ (ANI news Agency) పేర్కొంది.

మారుతి సుజుకి వంటి ప్రధాన కంపెనీల వార్షికోత్సవాల సందర్భంగా ప్రజలకు బహుమతులు, కార్లు మరియు గృహోపకరణాల ఇస్తామని WhatsAppలో హామీ ఇవ్వబడిన అనేక వాదనలను గతంలో Digiteye India తిరస్కరించి, వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. కొత్త రూ. 2 కాయిన్ ట్రిక్ అనేది కూడా ప్రజలను మోసం చేయడానికి మరొక మోసపూరిత మార్గం.

Claim/వాదన: పాత రూ.2 నాణేన్ని లక్షల రూపాయలకు ఆన్‌లైన్‌లో విక్రయించండి.

నిర్ధారణ: Quikr లేదా Tezbid.com వంటి ఆన్‌లైన్ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లలో 2 నాణెం గరిష్టంగా రూ.500కి విక్రయిస్తుంది, అంతే కాని లక్షల్లో కాదు.మరియు బ్యాంక్ ఖాతా నుండి డబ్బును దోచుకొడానికి ఆన్‌లైన్ మోసంలో భాగం కావచ్చు. కాబట్టి ఈ Claim/వాదన తప్పు.నిజం లేదు.

Rating: Totally False 

 

 

 

 

గుడ్లు చెట్ల నుండి వేలాడుతున్నాయా? Fact Check

చెట్లకు వేలాడుతున్న గుడ్ల యొక్క కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో అవి తెల్లటి మామిడిపండ్లు అనే వాదనలతో ప్రచారం చేయబడ్డాయి.

“కొన్ని ఆఫ్రికన్ల భూములలో మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో తెల్లటి మామిడిపండ్లు కనిపిస్తాయి” అని Facebookలో పోస్ట్ చేయబడినది.
ఆ చిత్రాలను ట్విట్టర్‌లో కూడా షేర్ చేశారు here.
వాదన/Claim ఇలా ఉంది: “హే అబ్బాయిలు, మీరు ఇంతకు ముందు తెల్లటి మామిడిపండ్లు చూశారా లేదా తిన్నారా ??? దేవుని సృష్టి ఎంత అందమైది”.

Hey guys, have you seen or eaten the white mongo before??? What a beautiful God creations ❤️ pic.twitter.com/3f2i05tbi0

— aa alhaji (@aaalhajiii) April 30, 2023

FACT CHECK

చిత్రాల ప్రామాణికత కోసం పరిశీలన చేసినప్పుడు, ఈ చిత్రాలకు ఎడమ దిగువన ‘Bing ఇమేజ్ క్రియేటర్’ ముద్ర వుందని మా బృందం గ్రహించింది.


మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజన్ బింగ్‌లో వెతికితే , Artificial Intelligence ఈ చిత్రాలను ‘బింగ్ ఇమేజ్ క్రియేటర్‌ని’ ఉపయోగించి సృష్టించిన చిత్రాలు అని తేలింది.

Hey guys, have you seen or eaten the white mongo before??? What a beautiful God creations ❤️ pic.twitter.com/3f2i05tbi0

— aa alhaji (@aaalhajiii) April 30, 2023

 

“చిత్రంలోని కొన్ని గుడ్లు లోపాలు మరియు వక్రఆకారం కలిగి ఉన్నాయి,కొన్ని ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి,మరికొన్ని ఆకారంలో అసమానతలను చూపుతున్నాయి”అని మైక్రోసాఫ్ట్‌కు చెందిన ‘జెనరేటివ్ AI మరియు డీప్‌ఫేక్‌’ సలహాదారు హెన్రీ అజ్డర్ (Henry Ajder) రాయిటర్స్‌తో(Reuters) అన్నారు.

అందువల్ల, ఇవి AI- రూపొందించబడిన గుడ్లు, నిజమైన గుడ్లు కావు.

Claim/వాదన: గుడ్ల లేదా తెల్లటి మామిడిపండ్లు చెట్ల నుండి వేలాడుతున్నాయి.

నిర్ధారణ: సృష్టికర్త ‘Bing ఇమేజ్ క్రియేటర్‌ని’ ఉపయోగించి AI చేత రూపొందించిబడిన చిత్రం, అంతేకాని నిజమైనది కాదు.
Rating: Misleading —

హిమాలయాల్లో ప్రతి 400 సంవత్సరాలకు ఒకసారి వికసించే మహామేరు పుష్పమా ఇది? Fact Check

క్యాబేజీని పోలిన ఆకులతో కూడిన పెద్ద పసుపు పువ్వు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిత్రంతో పాటుగా ఉన్న శీర్షిక “టిబెట్ యొక్క ప్రత్యేకమైన ‘పగోడా ఫ్లవర్’ శుభప్రదమైనది.

హిమాలయాల్లో ప్రతి 400 సంవత్సరాలకు ఒకసారి వికసించే మహామేరు పుష్పం ఇది. ఫోటోల్లో కూడా మన తరం చూసే అదృష్టం ఉంది. దయచేసి ఇతరులు చూడగలిగేలా షేర్ చేయండి. జీవితాంతం శుభాకాంక్షలు! ”

పువ్వును చూడటం అదృష్టం తెస్తుంది అని వినియోగదారులు పేర్కొనడంతో ఈ చిత్రాలు వైరల్‌గా మారాయి.

Fact Check:

సోషల్ మీడియాలో ఒక సాధారణ తనిఖీ చిత్రం 2019 నుండి చెలామణిలో ఉందని చూపింది. ఇది కాకుండా, ఇతర పువ్వుల చిత్రాలు కూడా అదే శీర్షికతో భాగస్వామ్యం చేయబడ్డాయి. డిజిట్ ఐ ఇండియా తన వాట్సాప్ ఫాక్ట్-చెకింగ్ నంబర్‌లో వాస్తవ తనిఖీ కోసం ఈ చిత్రాన్ని పెట్టారు.

మేము ప్లాంట్ నెట్‌ వెబ్‌సైట్‌లో రివర్స్ ఇమేజ్ శోధన చేసాము. ఈ వెబ్‌సైట్‌లో వినియోగదారులు మొక్కల చిత్రాలను అప్‌లోడ్ చేయవచ్చు మరియు దాని శాస్త్రీయ నామాన్ని కనుగొనవచ్చు. మా పరిశోధనల ప్రకారం మొక్క పేరు Rheum nobile అని చూపించింది.

సిక్కిం రబర్బ్ అని కూడా పిలువబడే రుయం నోబిల్, రెండు మీటర్ల ఎత్తు వరకు పెరిగే శాశ్వత మొక్క. ఇది జూలై మరియు ఆగస్టు మధ్య పుష్పిస్తుంది, అయితే దాని విత్తనాలు ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు నాటవచ్చు. ఇది హిమాలయాలకు చెందినది మరియు సిక్కిం, భూటాన్ మరియు టిబెట్ వంటి ఆల్పైన్ ప్రాంతాలలో కనిపిస్తుంది.

అయితే, పగోడా ఫ్లవర్ అని పిలువబడే ఒక పువ్వు ఉంది కానీ పైన చూపిన విధంగా ఎరుపు రంగులో ఉంటుంది. ఇది సాధారణంగా ఉష్ణమండల ఆసియాలో కనిపిస్తుంది. ఫ్లోరిడా మ్యూజియం ప్రకారం, శాస్త్రీయంగా Clerodendrum paniculatum అని పెర్కొంటారు. ఇది 6 అడుగుల లేదా అంతకంటే ఎక్కువ పొడవు పెరుగుతుంది.

Flowers of India వెబ్‌సైట్‌ ప్రకారం, ఈ పువ్వు “పిరమిడ్ ఆకారపు క్లస్టర్‌లో జపనీస్ పగోడా విధంగా అంచలంచెలుగా ఉన్నందున ఆ పేరు పెట్టారు. ఒక్కో పువ్వు కేవలం 0.5-అంగుళాల పొడవు మాత్రమే ఉన్నప్పటికీ, అవి కొమ్మల చివర 1 అడుగుల లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో భారీ పానికిల్స్‌లో అమర్చబడి ఉంటాయి. ఇది శాశ్వత పుష్పం.

అదేవిధంగా, చెలామణిలో ఉన్న తెల్లని పువ్వు దాని చిగురించే దశలో ఉన్న కింగ్ ప్రొటీయా (King Protea) పువ్వు యొక్క చిత్రం. ప్రొటీయా సైనరాయిడ్స్ (Protea cynaroides) అని కూడా పిలుస్తారు, ఇది దక్షిణాఫ్రికా జాతీయ పుష్పం. అరుదుగా కొమ్మలుగా ఉండే సతత హరిత పొదగా, ఇది ఒక సీజన్‌లో ఆరు నుండి పది పువ్వులను ఇస్తుందని గార్డెనియా చెబుతుంది.

వాదన: టిబెట్ యొక్క ప్రత్యేకమైన ‘పగోడా ఫ్లవర్’ శుభప్రదమైనది. హిమాలయాల్లో ప్రతి 400 సంవత్సరాలకు ఒకసారి వికసించే మహామేరు పుష్పం ఇది.

నిర్ధారణ: కార్ప్స్ ప్లాంట్ అని కూడా పిలువబడే అమోర్ఫోఫాలస్ టైటానియం పుష్పించడానికి దాదాపు 40 సంవత్సరాలు పడుతుంది. అందుకే పగోడా పువ్వు 400 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వికసిస్తుందనే వాదన నిజం కాదు.

మా రేటింగ్ – తప్పుడు వివరణ.