Tag Archives: fake news

క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో 1.5 లక్షల మంది హనుమాన్ చాలీసా పఠించారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచకప్‌ ఆఖరి మ్యాచ్‌లో భారీ సంఖ్యలో ప్రేక్షకులు గుమికూడి హనుమాన్ చాలీసా పఠించిన వీడియో వైరల్‌గా మారింది.

నిర్ధారణ/Conclusion: తప్పు వాదన , హనుమాన్‌ చాలీసాతో వీడియో సౌండ్ ట్రాక్ మార్చబడింది.

రేటింగ్:తప్పుగా సూచిస్తుంది. —

Fact Check వివరాలు:

నవంబర్ 19, 2023 ఆదివారం నాడు అహ్మదాబాద్‌లో జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌పై హంగామా తర్వాత, చాలా వీడియోలు మరియు మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రారంభించాయి. అందులో ఒక వీడియో క్లిప్ గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా దాదాపు 1.5 లక్షల మంది ప్రజలు గుమిగూడి హనుమాన్ చాలీసా ( హనుమాన్ చాలీసా —హనుమంతుని ఆశీర్వాదాలను కోరుతూ ప్రార్థన) చేయడం ప్రారంభించారనే వాదనతో కనిపిస్తోంది.

ఇది వైరల్‌గా మారి, టీవీ ఛానెల్‌లు కూడా తమ ఛానెల్‌లో ఇలాంటి దావాతో వీడియో క్లిప్‌ను చూపించాయి. పోస్ట్ ఇక్కడ మరియు ఇక్కడ చూడండి.

FACT CHECK

వాట్సాప్‌లో వీడియో మాకు అందినప్పుడు, మేము సోషల్ మీడియాలో వెతకగా అది ట్విట్టర్‌లో కూడా విస్తృతంగా షేర్ చేయబడిందని కనుగొన్నాము.

వీడియో క్లిప్ నుండి కొన్ని కీలక ఫ్రేమ్‌లను తీసుకొని, Google రివర్స్ ఇమేజ్ లో వెతకగా, అదే స్టేడియంలో గాయకుడు దర్శన్ రావల్ ప్రదర్శన ఇస్తున్న వీడియో మరియు పెద్ద స్క్రీన్‌లో అతని ప్రదర్శనని( క్రింద చిత్రంలో చూడవచ్చును) గమనించాము.

గూగుల్ సెర్చ్‌లో ఈవెంట్ కోసం వెతికినప్పుడు, సింగర్ దర్శన్ రావల్ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌ సమయంలో స్టేడియంలో ఉన్నభారీ ప్రేక్షకుల ముందు అతను ప్ర్రదర్శన ఇచ్చే వీడియోకి దారి తీసింది. ఈ మ్యాచ్ అక్టోబర్ 14, 2023న జరిగింది మరియు వీడియో అక్టోబర్ 16, 2023న Youtubeలో అప్‌లోడ్ చేయబడింది. అసలు వీడియోను కూడా ఇక్కడ చూడండి.

 

వీడియోను కూడా ఇక్కడ చూడవచ్చు మరియు ప్రపంచ కప్ 2023 క్రికెట్ మ్యాచ్‌లలో భాగంగా అదే స్టేడియంలో అక్టోబర్ 14, 2023న జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లో గాయకుడు విరామ సమయంలో ప్రదర్శన ఇచ్చాడు, అంతే కానీ హనుమాన్ చాలీసాను పఠించలేదు. కింది Instagram పోస్ట్ దీన్ని మరింత ధృవీకరిస్తుంది:

1.5 లక్షల మంది ప్రజలు హనుమాన్ చాలీసాను జపిస్తున్నట్లు వినిపించేలా వీడియో సౌండ్ ట్రాక్‌ని మార్చారు.

మరి కొన్ని Fact Checks:

ఈ మనిషి యోగా శక్తితో గాలిలో తేలియాడుతున్నాడా? Fact Check

వాస్తవ పరిశీలన: స్టంట్ టీమ్ చేసిన స్ట్రీట్ ఫైట్ ప్రదర్శనను సోషల్ మీడియాలో మతపరమైన కోణంతో షేర్ చేయబడింది.

 

క్లెయిమ్ చేసినట్లుగా అంబేద్కర్ పోస్టర్‌ను అమెరికా రైలు పైన ప్రదర్శించలేదు; Fact Check

అమెరికాలోని రైలు పైన బి.ఆర్ అంబేద్కర్ పోస్టర్‌ను చూపుతూ బాబాసాహెబ్ పోస్టర్‌ను అమెరికా వేసిందని,భారతదేశంలోని “మనువాది మీడియా”(“manuwadi media”)ఈ వార్తను కవర్ చేయడం లేదని పేర్కొంటూ ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

హిందీలో క్యాప్షన్ ఇలా ఉంది: “जो काम भारत नहीं कर सका वह काम अमरीका ने करके दिखाया अमरीका की सबसे लम्बी दूरी की ट्रेन पे बाबासाहब का पोस्टर लगाया गया ? मगर भारत की मनुवादी मीडिया यह खबर नहीं दिखाएगी जय भीम” (తెలుగు అనువాదం–భారతదేశం చేయలేని పనిని అమెరికా చేసి చూపించింది, బాబాసాహెబ్ పోస్టర్‌ను అమెరికా సుదూర రైలులో ఉంచారు. కానీ భారతదేశ మనువాడి మీడియా(manuwadi media) ఈ వార్తలను చూపించదు– Jai Bhim)

ఇది ఇక్కడ ,ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

FACT CHECK

ఈ రైలు భారతదేశంలో సుపరిచితం మరియు నిశితంగా పరిశీలిస్తే ఇది మెట్రో కోచ్ లాగా కనిపిస్తుంది, అమెరికా  రైలు మాత్రం కాదు.భారతదేశంలోని మెట్రో రైళ్ల కోసం గూగుల్‌లో వెతికితే, ఆ చిత్రం ఢిల్లీ మెట్రోపై బాబాసాహెబ్ పోస్టర్‌ సూపెర్-ఇంపోజ్డ్ చేయబడిందని తెలుస్తుంది.దిగువన అసలైన ఢిల్లీ మెట్రో మరియు పోస్టర్‌తో సూపెర్-ఇంపోజ్డ్ చేయబడిన రైలు చూడండి.

అసలు చిత్రాన్ని ఇక్కడ చూడవచ్చు మరియు లోగో స్పష్టంగా ఢిల్లీ మెట్రోది, క్లెయిమ్/వాదన ప్రకారం అమెరికా రైలుది కాదు.అంతేకాకుండా, అటువంటి చర్య ఏదైనా ఉంటె భారతీయ మీడియా ద్వారా విస్తృతంగా కవర్ చేయబడి ఉండేది మరియు క్లెయిమ్/వాదనను ధృవీకరించడానికి ఏ విశ్వసనీయమైన వార్త సంస్థలు నుండి ఎటువంటి వార్త అందుబాటులో లేదు.

ఉదాహరణకు కొన్ని US హై-స్పీడ్ రైళ్లు క్లెయిమ్‌లో చూపిన రైలుకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తాయి. దిగువన ఉన్న చిత్రాలు/ఇమేజ్ చూడండి.

కావున ఈ క్లెయిమ్/వాదన పూర్తిగా తప్పు.

Claim/వాదన:US ప్రభుత్వం తమ సుదూర రైలులో(లాంగ్-జర్నీ రైలు) BR అంబేద్కర్ పోస్టర్‌ను ప్రదర్శిస్తోంది.

Conclusion/నిర్ధారణ:ఈ Claim/వాదన పూర్తిగా తప్పు మరియు ఆ చిత్రం/పోస్టర్‌ ఢిల్లీ మెట్రోపై సూపెర్-ఇంపోజ్డ్ చేయబడింది.

Rating: Misrepresentation —

మరి కొన్ని Fact Checks:

బెంగళూరు టెర్మినల్ 2 చిత్రాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి సంబంధించినవిగా పేర్కొనబడ్డాయి; Fact Check

ఈ వైరల్ వీడియో ప్లాస్టిక్ నుండి గోధుమ ఉత్పత్తిని చూపుతుందా? Fact Check

 

 

 

హమాస్ ఇజ్రాయెల్ ట్యాంకులను స్వాధీనం చేసుకుని వాటిపై పాలస్తీనా జెండాలను ఎగురవేయడం వీడియోలో కనిపిస్తుంది; Fact Check

ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణలో రెండు వైపులా వేలాది మందిని చనిపోయారు. ఈ వార్త మరణాల సంఖ్యపై అనేక వాదనలకు పుష్కలమైన అవకాశాలను ఇచ్చింది.ఈ వాదనల మధ్య, హమాస్ తమ ట్యాంకులతో ఇజ్రాయెల్ వైపు కదులుతూ యుద్ధంలో ముందుకెళుతున్నట్లు ఒక వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.

ఈ వాదన/క్లెయిమ్‌లతో కూడిన వీడియో క్లిప్‌లో పాలస్తీనా జెండాతో కూడిన ట్యాంకులు సైనిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని మరియు హమాస్ అనేక ఇజ్రాయెల్ ట్యాంకులను ధ్వంసం చేసి వాటిపై పాలస్తీనా జెండాలను ఎగురవేసినట్లు కనిపిస్తుంది.

క్యాప్షన్ ఈ విధంగా ఉంది:”हम गाजा को तुम्हारे लिए जन्नुम बना देगा । हमास ने कई इजरायली टैंकों को नष्ट कर दिया, सैनिकों को पकड़ लिया… मुजाहिद्दीन ने दुश्मन के टैंको पर फलस्तीनि के झंडे लहरा दिए।। शुक्र अलहमदुलिलाह”.[తెలుగు అనువాదం:మేము మీ కోసం గాజాను నరకంగా తయారు చేస్తాము.హమాస్ అనేక ఇజ్రాయెలీ ట్యాంకులను ధ్వంసం చేసింది మరియు సైనికులను బంధీ చేసుకున్నారు… శత్రువు ట్యాంకులపై పాలస్తీనా జెండాలు ఎగురవేశారు.]

ఇలాంటి వాదన/దావాతో పోస్ట్ ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

FACT CHECK

Digiteye India వాదన/క్లెయిమ్‌ యొక్క వాస్తవం పరిశీలించినప్పుడు, అది పూర్తిగా తప్పు అని తేలింది. మేము వీడియో నుండి కీలక ఫ్రేమ్‌లను తీసి,Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో చిత్రాల కోసం అన్వేషించగా, అది డిసెంబర్ 30, 2020న ప్రచురించిన మిడిల్ ఈస్ట్ మానిటర్‌లో వార్తా నివేదికకు దారితీశాయి.ముఖ్య శీర్షిక ఇలా ఉంది: “పాలస్తీనా వర్గాలు గాజాలో సంయుక్త సైనిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.” ఇది 29 డిసెంబర్ 2020న దక్షిణ గాజా స్ట్రిప్‌లోని రఫాలో హమాస్, ఇస్లామిక్ జిహాద్ మరియు ఇతర PLO సభ్యులతో సహా పాలస్తీనా వర్గాల మిలటరీ విభాగాల మధ్య నిర్వహించిన మాక్ డ్రిల్ అని నివేదిక స్పష్టంగా వివరించింది.

మరింత అన్వేషించగా, డిసెంబర్ 30, 2020 తేదీన Facebookలో ఈ లింక్‌ని గమనించాము.

 

ఈ వార్తను డిసెంబర్ 30, 2020న అల్జజీరా కవర్ చేసింది: “2008లో గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ యుద్ధ వార్షికోత్సవం రోజున పాలస్తీనా వర్గాలు ఉమ్మడి సైనిక విన్యాసాలను నిర్వహించాయి. గాజా స్ట్రిప్ అంతటా అనేక రక్షణ దృశ్యాలు విన్యాసాలలో కనిపించాయి”.

కావున, వాదన/దావా తప్పు.వీడియో డిసెంబర్ 2020కి చెందినది మరియు హమాస్ మరియు ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుత వివాదానికి సంబంధించినది కాదు.

వాదనClaim:హమాస్ ఇజ్రాయెల్ వైపు ముందుకు సాగుతోంది మరియు స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ ట్యాంకులపై పాలస్తీనా జెండాలను ఎగురవేసింది.

నిర్ధారణ/Conclusion:వీడియోక్లిప్ డిసెంబర్ 29, 2020న జరిగిన హమాస్‌తో సహా పాలస్తీనా గ్రూపుల సంయుక్త ‘సైనిక డ్రిల్ల్’ కు చెందినది.
Rating: Misrepresentation — 

మరి కొన్ని fact checks:

ఇజ్రాయెల్ గాజాలో సూపర్-ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ 10G పరీక్షలు నిర్వహిస్తోంది? Fact Check

భారతదేశం గౌరవార్థం దుబాయ్‌లోని ‘అల్ మిన్‌హాద్’ అనే జిల్లా పేరును ‘హింద్’ గా మార్చారా? Fact Check

 

Fact Check: డిసెంబర్ 28న మైక్రోసాఫ్ట్ ‘ జాపనీస్ కంపెనీ సోనీ మరియు సోనీ ప్లేస్టేషన్’ను కొనుగోలు చేసినట్టు ఒక వాదన

హిస్పానిక్స్‌కు(Hispanics) చెందిన స్పానిష్ వెబ్‌సైట్ డిసెంబర్ 28, 2020న గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ జపనీస్ కంపెనీ సోనీని, దాని అనుబంధ వ్యాపారాలు మరియు ప్లేస్టేషన్‌తో సహా $130 బిలియన్లకు కొనుగోలు చేసిందని పేర్కొంటూ బ్రేకింగ్ న్యూస్‌ను విడుదల చేసింది.

వెబ్‌సైట్లో ముఖ్యంశం ఇలా ఉంది: “ప్లేస్టేషన్‌తో సహా సోనీ యొక్క అన్ని విభాగాలను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది.ఒప్పందం యొక్క వివరాలను వెల్లడించింది.టెక్ దిగ్గజం మరియు Xbox యజమానైనా మైక్రోసాఫ్ట్ కు ప్రత్యర్థియైన సోనీ యొక్క ప్లేస్టేషన్‌ను సొంతం చేసుకోవడం ఎలా సహాయపడుతుందో వివరించింది.

 

కథనాన్నిమైక్రోసాఫ్టర్స్‘ అనే వెబ్‌సైట్ షేర్ చేసి,చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది మరియు చాలా మంది వ్యక్తులు ఈ వార్తలను విశ్వసించి, రీట్వీట్ చేయడం లేదా కొనుగోలుపై అంచనా వేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సోనీ లేదా మైక్రోసాఫ్ట్ నుండి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన/జవాబు లేదా అధికారిక ప్రకటన లేదు. ఇది డిసెంబర్ 28, 2020న రోజంతా ట్విట్టర్‌లో వైరల్ అయింది.

FACT CHECK

అయినప్పటికీ, Google సహాయంతో ఆంగ్లంలోకి అనువదించబడినప్పుడు స్పానిష్‌లో చక్కటి అక్షరాల ముద్రణతో,దిగువ చిత్రంలో చూపిన విధంగా “ఏప్రిల్ ఫూల్స్ డే’ అని వ్రాసి ఉంది.

ఏప్రిల్ ఫూల్స్ డే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న వచ్చినప్పటికీ, సోనీ మీద కధనం డిసెంబర్ 28న కనిపించింది.గూగుల్‌లో మరింత పరిశీలించగా, అనేక హిస్పానిక్ సంస్కృతులలో ఈ రోజును “పవిత్ర అమాయకుల దినోత్సవం”(Day of the Holy Innocents)గా విస్తృతంగా పాటిస్తారు, ఇది ప్రపంచ ఏప్రిల్ ఫూల్స్ డేకి సమానం.

ఇది నిజమైన వార్త అయితే, రెండు ప్రపంచ దిగ్గజాలు కలిసిపోతున్నట్లు గ్లోబల్ మీడియా విస్తృతంగా నివేదించి ఉండేది.హిస్పానిక్ సంస్కృతిలో చిలిపి పనుల (pranks) కోసం ఒక రోజు కేటాయిస్తారని,అందులో భాగంగానే ఈ కధనాన్ని ప్రచురించారని గ్రహించిన చాలా మంది కధనాన్ని మరియు ట్వీట్‌ను శీఘ్రంగా తొలగించారు.

వాదన/Claim:మైక్రోసాఫ్ట్ సోనీని $130 బిలియన్లకు కొనుగోలు చేసింది.

నిర్ధారణ/Conclusion:స్పానిష్ ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా సోనీని మైక్రోసాఫ్ట్ 130 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిందన్న నకిలీ వార్త(prank) సోషల్ మీడియాలో ప్రచారంలో జరిగింది.

Our rating   —Totally False.

[మరి కొన్ని fact checks: ట్రక్కు వంతెనని దాటుతూ రాకెట్‌ను తీసుకువెళుతున్నట్లు ఒక వాదన వైరల్ అయింది Fact Check

ఈ వైరల్ వీడియో ప్లాస్టిక్ నుండి గోధుమ ఉత్పత్తిని చూపుతుందా? Fact Check]

 

ఇజ్రాయెల్ గాజాలో సూపర్-ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ 10G పరీక్షలు నిర్వహిస్తోంది? Fact Check

ఇజ్రాయెల్ గాజాలో  10G పరీక్ష/పరిశోధనలను ప్రారంభించిందని ఒక సోషల్ మీడియా పోస్ట్ విస్తృతంగా షేర్ చేయబడుతోంది. హిందీలో పెట్టిన వాదన ఇలా ఉంది:

పై హిందీ పోస్ట్ యొక్క అనువాదం:

ఇజ్రాయెల్ గాజాలో 10G పరీక్షను ప్రారంభించింది, హ్యాక్ చేయబడిన సిమ్‌లతో కూడిన చాలా మొబైలకు నెట్వర్క్ అందుబాటులో లేదు.
#Stand_with_Israel.”
ఈ వాదన ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ కూడా షేర్ చేయబడింది.

FACT CHECK

10G కోసం వెతకగా Google లేదా ఇతర సెర్చ్ ఇంజిన్స్లలో ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు,కాగా ప్రస్తుతం ఇజ్రాయెల్‌తో సహా అనేక దేశాలలో 6G పరిశోధనలు మాత్రమే చేపట్టారు. వాస్తవానికి, ఇజ్రాయెల్ సెప్టెంబర్ 29, 2020న 5Gని ప్రవేశపెట్టింది మరియు దేశం తన జాతీయ విధానంలో భాగంగా 6Gపై పరిశోధనను చేపట్టింది.

యునైటెడ్ స్టేట్స్ మరియు చైనా ఇప్పటికే ‘సిక్స్త్ జనరేషన్ కమ్యూనికేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ల (6G)’ అభివృద్ధిపై పని చేయడం ప్రారంభించాయి.ఫిన్లాండ్, దక్షిణ కొరియా మరియు జపాన్ వంటి ఇతర దేశాలు కూడా 6G అప్లికేషన్‌ల ప్రాథమిక పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించడం ప్రారంభించాయి.

10G డెలివరీ చేయగల సూపర్-ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లను రూపొందించడానికి గ్లోబల్ కేబుల్ పరిశ్రమ జనవరి, 2019లో 10G గురించి విజన్ పేపర్‌ను విడుదల చేసింది.(లేదా సెకనుకు 10 గిగాబిట్‌లు).అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 6G ఇంటర్నెట్ వేగంపై పరిశోధనలు జరుగుతున్నందున ఈ పరిశోధన ఇప్పటికీ ఒక విజన్ స్టేటస్‌లో (vision status )ఉంది.

6Gకే ఇంకా పని చేసే సాంకేతికత లేనప్పుడు , 10Gని పరీక్షించాలనే వాదన ఎప్పటికి తలెత్తదు మరియు అతితక్కువ అవకాశంగానే మిగిలిపోతుంది.

వాదన/Claim:ఇజ్రాయెల్ గాజాలో 10G టెక్నాలజీని పరీక్షించడం ప్రారంభించింది.
నిర్ధారణ/Conclusion: పరిశోధన కోసం ’10G సాంకేతికత’ ఏదీ చేపట్టబడలేదు మరియు గ్లోబల్ కేబుల్ పరిశ్రమ ద్వారా ఇప్పటికీ ఇది విజన్ స్టేజ్‌లో ఉంది, ఇజ్రాయెల్ గాజాలో 10Gని పరీక్షిస్తున్న సంగతి పక్కన పెడితే, ప్రస్తుతం అనేక దేశాలు ఇంకా 6Gపై పరిశోధనలు చేస్తున్నాయి.

Rating: Totally False —

[మరి కొన్ని Fact checks:ఎత్తైన రైల్వే వంతెనపై వెలుతున్న రైలు వీడియో భారతదేశంలోనిది కాదు, చైనా దేశంలోని వీడియో: Fact Check ;

MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check]

ట్రక్కు వంతెనని దాటుతూ రాకెట్‌ను తీసుకువెళుతున్నట్లు ఒక వాదన వైరల్ అయింది Fact Check

ఓ ట్రక్కు రాకెట్‌ను మోసుకెళుతూ వంతెన దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఫుటేజీ చంద్రయాన్-3 విజయవంతం వెనుక చేసిన కృషిని చూపుతుందని వీడియో పేర్కొంది.సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో వైరల్‌గా మారింది.

వాదన/దావాకు జోడించబడిన సందేశం ఇలా ఉంది,

“अंतरिक्ष के प्रोजेक्ट सफल बनाने मे वैज्ञानिकों के अलावा बहुत लोगो का योगदान होता है। छोटी सी भूल से ही हजारों करोड़ों रुपए स्वाहा हो सकते हैं। आप इस ट्रक ड्राइवर की मनोदशा का अंदाजा लगाएं। जब वह यह कर रहा होगा, सांसें रोक देने वाला वीडियो।”

[అనువాదం: శాస్త్రవేత్తలే కాకుండా, అంతరిక్ష ప్రాజెక్టులు విజయవంతం కావడానికి చాలా మంది సహకరిస్తారు. ఎవరైనా చిన్న పొరపాటు చేస్తే వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది.ఈ ట్రక్ డ్రైవర్ మానసిక స్థితిని మీరు ఊహించవచ్చు.ఈ వీడియో చుస్తే మీ ఊపిరి బిగుసుకుపోతుంది.]

వీడియో ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ కూడా ఇలాంటి వాదనలతో ట్విట్టర్లో షేర్ చేయబడింది.

వైరల్ అయిన ఈ వీడియో యొక్క వాస్తవాన్ని తనిఖీ చేయమని Digiteye Indiaకు అభ్యర్థన వచ్చింది..

FACT CHECK

వీడియోను అనేక కీఫ్రేమ్‌లుగా విభజించడానికి Digiteye India బృందం వారు inVid -(ఒక వీడియో ధృవీకరణ సాధనం) ఉపయోగించారు.మేము ఈ కీఫ్రేమ్‌లను ఉపయోగించి, Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ను అమలు చేయగా,YouTubeలో కూడా ఇదే దావాతో పలువురు వ్యక్తులు ఈ వీడియోను షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము.

వీడియో ప్రామాణికమైనదా కాదా అని తెలుసుకోవడానికి క్షుణ్ణంగా పరిశీలించగా ఏప్రిల్ 2, 2023న ఒక వినియోగదారుడు షేర్ చేసిన ఈ వీడియో Facebookలో మాకు కనిపించింది. “ఎమర్జెన్సీ బ్రిడ్జ్ టెక్నాలజీ ఇలాంటి పరిస్థితిలో చాలా సహాయపడుతుంది” అని క్యాప్షన్తో ఉన్న విజువల్స్ వీడియోలో కనిపించాయి.”

కాని మరింత క్షుణ్ణంగా పరిశీలించగా వీడియోలో “జిమ్ నాటెలో” అనే వాటర్‌మార్క్ ఉంది. మేము Gim Natelo కోసం Googleలో వెతకగా అతను తన పేజీలో అనుకరణ వీడియోలను (simulation videos)పోస్ట్ చేసే గేమర్ అని కనుగొన్నాము.మేము వీడియో యొక్క స్క్రీన్‌షాట్‌లను తీసుకుని,కీవర్డ్‌లు మరియు అతని పేరును ఉపయోగించి వెతకగా, ఈ వీడియో Spintires: MudRunner అనే గేమ్‌లోనిది అని తేలింది.

మేము జిమ్ నాటెలో(Jim Natelo) ప్రొఫైల్‌లో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెతకగా, అదే గేమ్ నుండి అదే గ్రాఫిక్స్ ఉన్న ఇతర వీడియోలు దృష్టికి వచ్చాయి.అయితే, ఈ వీడియో అతని ప్రొఫైల్‌లో అందుబాటులో లేదు.మేము YouTubeలో పరిశీలించగా,వైరల్ సందేశంలో షేర్ చేసిన అవే విజువల్స్ ఉన్న వీడియోను కనుగొన్నాము.యూట్యూబ్ వీడియోలో ఇవి గేమ్‌ విజువల్స్ అని స్పష్టంగా పేర్కొంది. అంతేకాదు, వీడియోలో చూపిన రాకెట్‌పై ఇస్రో లోగో లేదా ఇండియా అని రాసి లేదు.

కావున, వైరల్ వీడియో చేసిన వాదన తప్పు.

వాదన/CLAIM: ఒక ట్రక్కు రాకెట్‌ను మోసుకెళుతూ వంతెన మీదుగా రవాణా చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అది ఇస్రో రాకెట్ అని వీడియో పేర్కొంది.

నిర్ధారణ/CONCLUSION: వీడియో ‘Spintires: Mudrunner’ అనే గేమ్ నుండి తీసింది మరియు ఇది గేమ్‌లో ఉపయోగించగల కొత్త హ్యాక్‌ను(ట్రిక్) చూపుతుంది.

RATING: Misrepresentation —

[మరి కొన్ని Fact Checks: MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check ;

మొబైల్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లపై GST 31.3% నుంచి 18%కి తగ్గిందని క్లెయిమ్/వాదన వైరల్ అవుతోంది; Fact Check]

హమాస్ ఇజ్రాయెల్‌లోకి పారాగ్లైడ్ చేసి ఆడుకునే కోర్టులోకి ప్రవేశించిందని వైరల్ వీడియో ఆరోపించింది; Fact Check

హమాస్ అని పిలవబడే, పాలస్తీనా సైనిక సమూహం, ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి మోటరైజ్డ్ పారాగ్లైడర్‌లను ఉపయోగించింది.అయితే, దాడికి సంబంధం లేని అనేక ఇతర వీడియోలు సోషల్ మీడియాలో హమాస్ చేస్తున్న నిజమైన దాడిని ఎలా చూపుతున్నాయో తెలియజేస్తున్నాయి.అలాంటి ఒక వీడియో పారాగ్లైడర్‌లు ప్లేయింగ్ కోర్ట్ లాగా కనిపించే దానిలోకి దిగుతున్నట్లు చూపిస్తుంది.

వీడియోకు జోడించిన వాదన ప్రకారం, “హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి పారాగ్లైడ్ చేశారు, వారు అమాయక పౌరులను ఊచకోత కోయడానికి, మహిళలు మరియు పిల్లలపై అత్యాచారం మరియు హత్య చేయడానికి ఇంటింటికీ వెళ్లారు.పారాగ్లైడర్‌లు గాలిలో ప్రయాణిస్తూ ప్లేగ్రౌండ్‌లోకి దిగడం వీడియోలో కనిపిస్తుంది.

వీడియో ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ కూడా ఇలాంటి వాదనలతో షేర్ చేయబడింది.వాట్సాప్‌లో వైరల్ అయిన ఈ వీడియోను యొక్క వాస్తవాన్ని తనిఖీ చేయమని Digiteye Indiaకు అభ్యర్థన వచ్చింది.

FACT CHECK

Digiteye India బృందం వారు వీడియోను అనేక కీఫ్రేమ్‌లుగా విభజించి, ప్రతి కీఫ్రేమ్‌లను ఉపయోగించి Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ అమలు చేయగా, 13 రోజుల క్రితం, అంటే సెప్టెంబర్ 30, 2023న YouTubeలో పోస్ట్ చేసిన ఈ వీడియోకి (క్రింద ఉన్న వీడియో) దారితీసింది.వీడియో అరబిక్‌ భాషలో ఉంది , మరియు అనువదించగా’పారాచూట్ ఫోర్సెస్ ఇన్ హెలియోపోలిస్’గా తెలుస్తుంది.వైరల్ అవుతున్న వీడియో, ఈ వీడియో రెండు ఒకటే. ఆడియో కూడా సరిగ్గా సరిపోయింది.

వీడియో యొక్క ఖచ్చితమైన స్థానాన్ని తెలియజేసే క్లూలను కనుగొనడానికి మేము వీడియోను నిశితంగా పరిశీలించాము. 0:01 సెకన్ల వద్ద, భుజంపై సమాంతర చారలతో నీలిరంగు జాకెట్ ధరించిన వ్యక్తిని గుర్తించాము.జాకెట్ వెనుక భాగంలో ‘EL NASR SC’ అని రాసి ఉంది. మేము కీవర్డ్ సెర్చ్ నిర్వహించగా, El Nasr SC అనేది ఈజిప్టులోని కైరోలో ఉన్న ఈజిప్షియన్ ఫుట్‌బాల్ క్లబ్ అని తేలింది.

Googleలో కీవర్డ్ సెర్చ్ నిర్వహించడానికి మేము ఈ ఆధారాలను ఉపయోగించాము. కైరోలో ఎల్-నాస్ర్ (El-Nasr)స్పోర్టింగ్ క్లబ్ ఉందని కనుగొన్నాము.అదే లొకేషనా కదా అని నిర్ధారించడానికి క్లబ్ యొక్క వివిధ చిత్రాలను పరిశీలించాము.Googleలో ఒక వినియోగదారు అదే ప్లేయింగ్ అరేనాని వేరే కోణం నుండి చూపుతూ చిత్రాన్ని పోస్ట్ చేసాడు.ఇది వీడియో యొక్క సరైనా స్థానాన్ని నిర్ధారించడంలో మాకు సహాయపడింది.

కాబట్టి, ఆ వీడియో ఇజ్రాయెల్‌కు చెందినదనే వాదన అబద్ధం.

వాదన/CLAIM: ఇజ్రాయెల్ పౌరులపై దాడి చేయడానికి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోని ప్లేగ్రౌండ్‌లోకి పారాగ్లైడింగ్ చేస్తున్నట్లు వైరల్ వీడియో ఆరోపించింది.

నిర్ధారణ/CONCLUSION: వీడియో ఇజ్రాయెల్‌కి చెందినది కాదు. ఇది ఈజిప్టులో చిత్రీకరించబడింది, ఇక్కడ పారాగ్లైడర్లు కైరోలోని ప్లేగ్రౌండ్‌లోకి దిగుతున్నారు. ఈజిప్టులోని ఎల్-నాస్ర్ (El-Nasr)స్పోర్టింగ్ క్లబ్‌లో వీడియో తీయబడింది.వైరల్ వీడియోలో చూపిన లొకేషన్, స్పోర్టింగ్ క్లబ్‌ లొకేషన్ ఒకటే.

RATING: Misrepresentation-???
[మరి కొన్ని Fact Checks: MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check ;

మొబైల్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లపై GST 31.3% నుంచి 18%కి తగ్గిందని క్లెయిమ్/వాదన వైరల్ అవుతోంది; Fact Check]

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని సైన్యంలోకి పంపారా? Fact Check

ఈ వైరల్ వీడియో ప్లాస్టిక్ నుండి గోధుమ ఉత్పత్తిని చూపుతుందా? Fact Check

ప్లాస్టిక్‌ నుంచి గోధుమలు తయారవుతున్నట్లు ఒక వైరల్‌ వీడియో చూపుతోంది.
1: 15 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో కార్మికులు ‘ఉపయోగించిన ప్లాస్టిక్‌ను’ఫ్యాక్టరీలో డంప్ చేయడం,అక్కడ నుండి ప్లాస్టిక్‌ను చిన్న ముక్కలుగా విభజించి, అనేకసార్లు కడిగి, ప్లాస్టిక్ దారాలుగా చేసి, ఆపై గోధుమ గింజల వలె కనిపించేలా తయారు చేయడం కనిపిస్తుంది.ఈ వీడియో వాట్సాప్‌లో విస్తృతంగా షేర్ అవుతోంది.

ఈ వైరల్ వీడియో యొక్క వాస్తవాన్ని పరిశీలన చేయమని Digiteye India టీమ్‌ వారికీ వాట్సాప్‌లో రిక్వెస్ట్ వచ్చింది.

FACT CHECK

Digiteye India బృందం వారు వీడియో అంతటా మధ్య దిగువన ‘స్మార్టెస్ట్ వర్కర్స్’ అనే వాటర్‌మార్క్‌ను గుర్తించారు. మేము ఈ క్లూని తీసుకొని,Googleలో కీవర్డ్ searchలో ఉపయోగించగా,’స్మార్టెస్ట్ వర్కర్స్’ యొక్క YouTube పేజీకి దారితీశాయి, అక్కడ మేము ఈ వైరల్ వీడియోను కనుగొన్నాము.

వైరల్ వీడియో సెప్టెంబరు 24, 2023న ప్రచురించబడింది మరియు దాని శీర్షిక – ప్లాస్టిక్ యొక్క కొత్త ప్రయోజనం: రీసైక్లింగ్ జర్నీని ఆవిష్కరించడం.

స్మార్టెస్ట్ వర్కర్స్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ వెంచర్ యొక్క తుది ఉత్పత్తి వాస్తవానికి ఏమిటో గుర్తించడానికి మేము ఈ ఆధారాలు ఉపయోగించాము. ఇదే విధమైన ప్రక్రియను అనుసరించే వీడియోలలో ఒకదానిలో, వీడియో తుది ఉత్పత్తి ప్లాస్టిక్ LLDPE అని పేర్కొంది, అంటే, ‘లీనియర్ తక్కువ-సాంద్రత’ కలిగిన పాలిథిలిన్.ఈ ఉత్పత్తులు ప్రాథమికంగా ప్లాస్టిక్-గుళికలు(plastic-pellets), వీటిని ప్లాస్టిక్ సీసాలు, ఆటోమొబైల్స్, నిత్యావసర వినియోగ వస్తువులు మొదలైన వాటి తయారీ వంటి బహుళ పరిశ్రమలలో ఉపయోగిస్తారు.

ఆటోమొబైల్ పరిశ్రమలో ఉపయోగించే ప్లాస్టిక్ గుళికలను(plastic pellets) తయారు చేయడానికి అదే ప్రక్రియను/పద్దతిని ఉపయోగించే మరొక వీడియోను మేము గుర్తించాము.

Digiteye India బృందం వారు ఉజ్జయినిలో ఉన్న వ్యాపారి నిరుపమ్ అగర్వాల్‌తో మాట్లాడినప్పుడు, ఆయన ఈ వైరల్ వీడియోలోని ఈ గుళికలు(pellets) బియ్యం లేదా గోధుమ గింజలు కాదని నిర్ధారించారు.ఈ గుళికలు (pellets)రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌తో తయారు చేసినవని మరియు వాటిని పరిశ్రమల్లో వాడతాం, మనుషుల వినియోగానికి కాదని’ అగర్వాల్ అన్నారు.

కాబట్టి, ఈ వాదన/దావా తప్పు.

వాదన/CLAIM: ప్లాస్టిక్‌తో గోధుమ గింజలను తయారు చేస్తున్న ఒక ఫ్యాక్టరీ వైరల్ వీడియో కనిపిస్తుంది.

నిర్ధారణ/CONCLUSION: వైరల్ వీడియో ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేసే ఫ్యాక్టరీని చూపిస్తుంది.ప్లాస్టిక్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసి, కడిగి, ప్లాస్టిక్ దారాలుగా చేసి, ఆపై చిన్న గుళికలగా(pellets)ఏర్పరుస్తుంది.ఈ గుళికలను(pellets) పరిశ్రమలలో ఉపయోగిస్తారు మరియు అవి మనుషుల వినియోగానికి ఉద్దేశించినవి కావు. అవి ఏ రకమైన ఆహార ధాన్యాలు కావు.

RATING: – Totally False–?????

[మరి కొన్ని Fact Checks: MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check ;

మొబైల్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లపై GST 31.3% నుంచి 18%కి తగ్గిందని క్లెయిమ్/వాదన వైరల్ అవుతోంది; Fact Check]

 

బ్రహ్మపుత్ర నది కింద రాబోయే 14-కిమీ సొరంగం గురించి తప్పు చిత్రంతో దావా చేయబడింది ; Fact Check

బ్రహ్మపుత్ర నది కింద అండర్ వరల్డ్ రోడ్డు-రైలు మార్గం రాబోతోందంటూ సోషల్ మీడియాలో ఓ చిత్రం వైరల్ అవుతోంది.
పరిశీలనలో ఉన్న బ్రహ్మపుత్ర నది కింద సొరంగానికి సంబంధించిన అనేక ప్రణాళికల కారణంగా ఇది ప్రాముఖ్యాత సంతరించుకుంది.

పోస్ట్‌తో పాటు, అండర్ వాటర్ రైల్-కమ్-రోడ్ నెట్‌వర్క్ యొక్క చిత్రం హిందీభాషలో ఉన్న క్లెయిమ్‌/దావాతో జోడించబడింది.
“इसे कहते हैं नया भारत…..भारत की पहली पानी के नीचे सड़क व रेलवे लाइन, यह असम में ब्रह्मपुत्र नदी के नीचे बनी लगभग 14 किलोमीटर लंबी सुरंग है। – जय हो” (తెలుగు అనువాదం: దీనిని న్యూ ఇండియా అంటారు… భారతదేశపు నీటి అడుగున మొట్టమొదటి రహదారి మరియు రైల్వే లైన్. ఇది అస్సాంలోని బ్రహ్మపుత్ర నది కింద నిర్మించిన సుమారు 14-కిమీ పొడవైన సొరంగం.జై హో).

పోస్ట్‌ వాట్సాప్‌లో విస్తృతంగా షేర్ చేయబడింది.

FACT CHECK

వాస్తవం తనిఖీ చేయడం కోసం Digiteye India చిత్రాన్ని స్వీకరించి, Google రివర్స్ ఇమేజ్ లో పరిశీలన చేయగా, అది పాత చిత్రమని మరియు దావా తప్పుదారి పట్టించే విధంగా ఉందని కనుగొన్నాము.

జర్మనీని డెన్మార్క్‌తో కలిపే యూరప్‌లోని ఫెహ్‌మార్న్ బెల్ట్ ఫిక్స్‌డ్ లింక్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన చిత్రం. ఈ చిత్రం నీటి అడుగున రైలు మరియు రహదారి లింక్ ఉండడంతో విస్తృతంగా ప్రసిద్ది చెందింది.

ప్రాజెక్ట్‌ పూర్తి అయినప్పుడు, నీటి అడుగున ఆటో మరియు రైలు సొరంగం జర్మనీ మరియు డెన్మార్క్‌లను కలుపుతుంది” అని ఈ చిత్ర సారాంశం. ఈ చిత్రం క్రెడిట్ ఫెమెర్న్‌కి క్రింద విధంగా ఇవ్వబడింది:

బ్రహ్మపుత్ర నది దిగువన ఉన్న నీటి అడుగున లింక్‌కు(underwater link ) సంబంధించిన వార్తల కోసం వెతుకుతున్నప్పుడు, రైల్వే మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మరియు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) దేశంలోనే నీటి అడుగున మొట్టమొదటి రోడ్-కమ్-రైల్ సొరంగాలను నిర్మించాలని యోచిస్తున్నట్లు పలు వార్తా నివేదికలు వెలువడ్డాయి. బ్రహ్మపుత్ర నది అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్‌లను కలుపుతుంది, దీని నిర్మాణానికి వ్యయం ₹7,000 కోట్లు అని అంచనా.

అయితే, ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ప్రణాళికను లేదా వివరణను విడుదల చేయలేదు. అందువల్ల, ఇది భారతదేశపు నీటి అడుగున మొట్టమొదటి రైలు-రోడ్డు ప్రాజెక్ట్ అనే వాదన తప్పు.

వాదన/Claim:అస్సాంలోని బ్రహ్మపుత్ర నది కింద భారతదేశంలోని నీటి అడుగున మొట్టమొదటి రహదారి మరియు రైల్వే లైన్ సొరంగం నిర్మించబడుతుందనే వాదనతో ఉన్న చిత్రం.

నిర్ధారణ/Conclusion:వార్త సరైనది కానీ చిత్రం తప్పు ,ఆ చిత్రం ఐరోపాలో రాబోయే సొరంగం చిత్రం.

Rating: Misleading:

[మరి కొన్ని fact Checks: Is Nobel laureate Amartya Sen dead? Fake Twitter account’s claim goes viral; Fact Check  Image of beautiful marine animal Sea Pen passed off as Nagapushpa, a rare flower]

ఎత్తైన రైల్వే వంతెనపై వెలుతున్న రైలు వీడియో భారతదేశంలోనిది కాదు, చైనా దేశంలోని వీడియో: Fact Check

ఎత్తైన రైల్వే వంతెనపై రైలు నడుస్తున్న వీడియో వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ మరియు ఇతర సోషల్ మీడియాలో షేర్ చేయబడింది.
Claim/దావా ఈ విధంగా ఉంది: “అభినందనలు భారతదేశం!!! జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్‌పై నిర్మాణంలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ట్రాక్‌పై మార్చి 21న చిన్న రైలు టెస్ట్ రన్ విజయవంతంగా నిర్వహించబడింది.”

రెండు పర్వతాలను కలిపే ఎత్తైన వంతెనపై రైలు ప్రయాణిస్తున్నట్లు వీడియో చూపిస్తుంది. ట్విట్టర్‌లో కూడా ఇక్కడ షేర్ చేశారు.

 

FACT CHECK:

వాట్సాప్ పంపినవారు క్లెయిమ్‌ను పరిశీలన చేయమని Digiteye Indiaని కోరారు.

మేము రైలు ట్రాక్ కోసం ఎత్తైన వంతెన కోసం Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో సెర్చ్ చేయగా, ఆ వంతెన వాస్తవానికి చైనాలోని బీపాంజియాంగ్ రైల్వే వంతెన అని మరియు భారతదేశంలోనిది కాదని మేము కనుగొన్నాము. ఈ వంతెన 2001లో ప్రారంభించబడింది మరియు 275 మీటర్ల ఎత్తు మరియు 118 కిలోమీటర్ల పొడవుతో చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌లోని(Guizhou province) లియుపాన్‌షుయ్(Liupanshui) మరియు బైగావోలను(Baigao) కలుపుతుంది.

వాస్తవానికి, ఈ క్లెయిమ్‌లోని వీడియో బీపాంజియాంగ్ వంతెన గుండా ప్రయాణిస్తున్న రైలు యొక్క వైరల్ వీడియో మరియు మొట్టమొదటగా చైనా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడింది. Highstbridges.com పేరుతో ఉన్న మరో వెబ్‌సైట్ అదే వంతెనను తన వీడియోలో చూపిస్తుంది.

వాస్తవానికి, భారతదేశంలో మరియు ప్రపంచంలోనే ఎత్తైన వంతెన జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ఇప్పటికీ నిర్మాణంలో ఉంది, ఇది మార్చి 26, 2023న టెస్ట్ రన్ నిర్వహించినప్పుడు వార్తల్లో నిలిచింది. దీనిని రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించారు.


భారతదేశంలో చీనాబ్ నదిపై 1,178 అడుగుల ఎత్తులో ఉన్న ఈ వంతెన భద్రత తనిఖీ చెయ్యడం కోసం వంతెన పైన రైలు నడుపుతు పరీక్షల నిర్వహణ జరుగుతుంది మరియు జనవరి 2024 నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుంది.అందువల్ల, Claim/దావాలో చూపిన వీడియో తప్పుదారి పట్టించే విధంగా ఉంది.

Claim/దావా: జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మాణంలో ఉన్న ఎత్తైన రైల్వే వంతెనను వీడియో చూపిస్తుంది.

నిర్ధారణ:వీడియో చైనీస్ వంతెనను చూపుతుంది,అంతే కాని భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కాదు.

Rating: Misleading —

[మరి కొన్ని Fact checks: ఢిల్లీలో జరిగిన జి20 సదస్సు విజయవంతం అయిన సందర్బంగా టాటా మోటార్స్ బహుమతులు ఇస్తోందా? Fact CheckMMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check]