ఇజ్రాయెల్ గాజాలో 10G పరీక్ష/పరిశోధనలను ప్రారంభించిందని ఒక సోషల్ మీడియా పోస్ట్ విస్తృతంగా షేర్ చేయబడుతోంది. హిందీలో పెట్టిన వాదన ఇలా ఉంది:
इजराइल ने गाजा में
10G की टेस्टिंग प्रारम्भ कर दी है,
इससे बहुत से “कटे हुए सिम” वाले
मोबाइल, आउट ऑफ नेटवर्क हो गये हैं! #Stand_with_Israel— ilesh n kanada (@kanada_ilesh) May 14, 2021
పై హిందీ పోస్ట్ యొక్క అనువాదం:
ఇజ్రాయెల్ గాజాలో 10G పరీక్షను ప్రారంభించింది, హ్యాక్ చేయబడిన సిమ్‌లతో కూడిన చాలా మొబైలకు నెట్వర్క్ అందుబాటులో లేదు.
#Stand_with_Israel.”
ఈ వాదన ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ కూడా షేర్ చేయబడింది.
FACT CHECK
10G కోసం వెతకగా Google లేదా ఇతర సెర్చ్ ఇంజిన్స్లలో ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు,కాగా ప్రస్తుతం ఇజ్రాయెల్‌తో సహా అనేక దేశాలలో 6G పరిశోధనలు మాత్రమే చేపట్టారు. వాస్తవానికి, ఇజ్రాయెల్ సెప్టెంబర్ 29, 2020న 5Gని ప్రవేశపెట్టింది మరియు దేశం తన జాతీయ విధానంలో భాగంగా 6Gపై పరిశోధనను చేపట్టింది.
యునైటెడ్ స్టేట్స్ మరియు చైనా ఇప్పటికే ‘సిక్స్త్ జనరేషన్ కమ్యూనికేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ల (6G)’ అభివృద్ధిపై పని చేయడం ప్రారంభించాయి.ఫిన్లాండ్, దక్షిణ కొరియా మరియు జపాన్ వంటి ఇతర దేశాలు కూడా 6G అప్లికేషన్‌ల ప్రాథమిక పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించడం ప్రారంభించాయి.
10G డెలివరీ చేయగల సూపర్-ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లను రూపొందించడానికి గ్లోబల్ కేబుల్ పరిశ్రమ జనవరి, 2019లో 10G గురించి విజన్ పేపర్‌ను విడుదల చేసింది.(లేదా సెకనుకు 10 గిగాబిట్‌లు).అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 6G ఇంటర్నెట్ వేగంపై పరిశోధనలు జరుగుతున్నందున ఈ పరిశోధన ఇప్పటికీ ఒక విజన్ స్టేటస్‌లో (vision status )ఉంది.
6Gకే ఇంకా పని చేసే సాంకేతికత లేనప్పుడు , 10Gని పరీక్షించాలనే వాదన ఎప్పటికి తలెత్తదు మరియు అతితక్కువ అవకాశంగానే మిగిలిపోతుంది.
వాదన/Claim:ఇజ్రాయెల్ గాజాలో 10G టెక్నాలజీని పరీక్షించడం ప్రారంభించింది.
నిర్ధారణ/Conclusion: పరిశోధన కోసం ’10G సాంకేతికత’ ఏదీ చేపట్టబడలేదు మరియు గ్లోబల్ కేబుల్ పరిశ్రమ ద్వారా ఇప్పటికీ ఇది విజన్ స్టేజ్‌లో ఉంది, ఇజ్రాయెల్ గాజాలో 10Gని పరీక్షిస్తున్న సంగతి పక్కన పెడితే, ప్రస్తుతం అనేక దేశాలు ఇంకా 6Gపై పరిశోధనలు చేస్తున్నాయి.
Rating: Totally False —
[మరి కొన్ని Fact checks:ఎత్తైన రైల్వే వంతెనపై వెలుతున్న రైలు వీడియో భారతదేశంలోనిది కాదు, చైనా దేశంలోని వీడియో: Fact Check ;
MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check]