బ్రహ్మపుత్ర నది కింద అండర్ వరల్డ్ రోడ్డు-రైలు మార్గం రాబోతోందంటూ సోషల్ మీడియాలో ఓ చిత్రం వైరల్ అవుతోంది.
పరిశీలనలో ఉన్న బ్రహ్మపుత్ర నది కింద సొరంగానికి సంబంధించిన అనేక ప్రణాళికల కారణంగా ఇది ప్రాముఖ్యాత సంతరించుకుంది.
इसे कहते हैं नया #भारत………..!!
भारत की पहली पानी के नीचे सड़क व रेलवे लाइन,,,,,,,,
यह #असम में ब्रह्मपुत्र नदी के नीचे बनी लगभग 14 किलोमीटर लंबी सुरंग है।
– जय हो ।।? pic.twitter.com/m3OJCRbfxL— Nil hindu 3693 (@nilhindu07) June 1, 2022
పోస్ట్‌తో పాటు, అండర్ వాటర్ రైల్-కమ్-రోడ్ నెట్‌వర్క్ యొక్క చిత్రం హిందీభాషలో ఉన్న క్లెయిమ్/దావాతో జోడించబడింది.
“इसे कहते हैं नया भारत…..भारत की पहली पानी के नीचे सड़क व रेलवे लाइन, यह असम में ब्रह्मपुत्र नदी के नीचे बनी लगभग 14 किलोमीटर लंबी सुरंग है। – जय हो” (తెలుగు అనువాదం: దీనిని న్యూ ఇండియా అంటారు… భారతదేశపు నీటి అడుగున మొట్టమొదటి రహదారి మరియు రైల్వే లైన్. ఇది అస్సాంలోని బ్రహ్మపుత్ర నది కింద నిర్మించిన సుమారు 14-కిమీ పొడవైన సొరంగం.జై హో).
పోస్ట్ వాట్సాప్‌లో విస్తృతంగా షేర్ చేయబడింది.
FACT CHECK
వాస్తవం తనిఖీ చేయడం కోసం Digiteye India చిత్రాన్ని స్వీకరించి, Google రివర్స్ ఇమేజ్ లో పరిశీలన చేయగా, అది పాత చిత్రమని మరియు దావా తప్పుదారి పట్టించే విధంగా ఉందని కనుగొన్నాము.
జర్మనీని డెన్మార్క్‌తో కలిపే యూరప్‌లోని ఫెహ్‌మార్న్ బెల్ట్ ఫిక్స్‌డ్ లింక్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన చిత్రం. ఈ చిత్రం నీటి అడుగున రైలు మరియు రహదారి లింక్ ఉండడంతో విస్తృతంగా ప్రసిద్ది చెందింది.
ప్రాజెక్ట్ పూర్తి అయినప్పుడు, నీటి అడుగున ఆటో మరియు రైలు సొరంగం జర్మనీ మరియు డెన్మార్క్‌లను కలుపుతుంది” అని ఈ చిత్ర సారాంశం. ఈ చిత్రం క్రెడిట్ ఫెమెర్న్‌కి క్రింద విధంగా ఇవ్వబడింది:
బ్రహ్మపుత్ర నది దిగువన ఉన్న నీటి అడుగున లింక్‌కు(underwater link ) సంబంధించిన వార్తల కోసం వెతుకుతున్నప్పుడు, రైల్వే మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మరియు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) దేశంలోనే నీటి అడుగున మొట్టమొదటి రోడ్-కమ్-రైల్ సొరంగాలను నిర్మించాలని యోచిస్తున్నట్లు పలు వార్తా నివేదికలు వెలువడ్డాయి. బ్రహ్మపుత్ర నది అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్‌లను కలుపుతుంది, దీని నిర్మాణానికి వ్యయం ₹7,000 కోట్లు అని అంచనా.
అయితే, ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ప్రణాళికను లేదా వివరణను విడుదల చేయలేదు. అందువల్ల, ఇది భారతదేశపు నీటి అడుగున మొట్టమొదటి రైలు-రోడ్డు ప్రాజెక్ట్ అనే వాదన తప్పు.
వాదన/Claim:అస్సాంలోని బ్రహ్మపుత్ర నది కింద భారతదేశంలోని నీటి అడుగున మొట్టమొదటి రహదారి మరియు రైల్వే లైన్ సొరంగం నిర్మించబడుతుందనే వాదనతో ఉన్న చిత్రం.
నిర్ధారణ/Conclusion:వార్త సరైనది కానీ చిత్రం తప్పు ,ఆ చిత్రం ఐరోపాలో రాబోయే సొరంగం చిత్రం.
Rating: Misleading:
[మరి కొన్ని fact Checks: Is Nobel laureate Amartya Sen dead? Fake Twitter account’s claim goes viral; Fact Check Image of beautiful marine animal Sea Pen passed off as Nagapushpa, a rare flower]