Tag Archives: fake news

పాత రూ.2 నాణెం ఆన్‌లైన్‌లో లక్షల రూపాయలకు అమ్ముడుపోతోందా? వాట్సాప్‌లో వీడియో వైరల్; Fact Check

ఓ యాంకర్ పాత రూ 2 నాణెంకు లక్షల రూపాయలు చెల్లించి కొనుక్కోవడానికి కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్నందున రూ 2 నాణెం మిమ్మల్ని రాత్రికిరాత్రే ధనవంతులను చేస్తుంది.ఆమె మిమ్మల్ని క్వికర్ ఖాతాను (Quikr account)తెరవమని కోరితు మరియు రూ 2 నాణెం చిత్రాన్ని అప్‌లోడ్ చేయమని అడుగుతుంది. 2 నాణెం కొనుగోలుదారు కోసం వేచి ఉండండి అని చెబుతుంది.

Zeenews.com/business వంటి అనేక వార్తా పబ్లికేషన్‌లు కూడా Quikr ఖాతాను ఎలా తెరవాలనే దానిపై వివరంగా సమాచారాన్ని అందించాయి. రూ 2 నాణెం కోసం Googleలో వెతికినప్పుడు, క్రింద సమాచారం వెలువడుతుంది. Digiteye India వాస్తవం తెలుసుకొనుటకు పై వీడియో స్వీకరించింది.

FACT CHECK

Digiteye team వారు Googleలో వెతికినప్పుడు, Claim/దావా రెండు సంవత్సరాలకు పైగా కొనసాగుతోంది.

‘నుమిస్మాటిక్స్'( numismatics–పాత బ్యాంకు నోట్లు, పాత నాణేల సేకరణ మరియు అధ్యయనం)విభాగంలో పరిశీలించినప్పుడు, పాత రూ.2 నాణేలు చాలా వరకు రూ.500కు మించకుండా అమ్ముడుపోయినట్టు క్వికర్ వెల్లడించింది.అంతేకాదు రూ. 2 నాణేలు అంత అరుదైనవి కావు.

Quoraలోని కొంతమంది వ్యక్తులు ఇది మోసానికి దారితీస్తుందని హెచ్చరించారు, దీని ద్వారా రూ. 2 నాణేలు అమ్మేవాళ్ళు తమ బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ కార్డ్ నంబర్ మరియు OTP లాంటి సమాచారాన్ని అందించేలా తప్పుదారి పట్టించవచ్చు.ఆ తరువాత మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బును సులభంగా బదిలీ చేస్తారు.

 

Digiteye India బృందం 1994 సంవత్సరం నాటి నాణెం క్వికర్‌లో (Quikr) పెట్టినప్పుడు, కొనాలకున్న వ్యక్తి నాణెంకు రూ. 2 లక్షలు ఇస్తానని, ధృవీకరణ సాకుతో బ్యాంక్ వివరాలు, ఆధార్ కార్డ్ నంబర్ వంటి వివరాలను కోరింది.చివరగా, ఆ వ్యక్తి ధృవీకరణ సాకుతో OTPని షేర్ చేయమని అడిగాడు, దీని వలన team member యొక్క బ్యాంక్ ఖాతా నుండి తక్షణమే నగదు బదిలీ చెయ్యబడే అవకాశం ఉండేది.మా ఆన్‌లైన్ సెర్చ్‌లో వెల్లడైనట్లు ఇది చాలా మందికి అనుభవం అయ్యింది.

ఆర్‌బీఐ ఏం చెబుతోంది:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఆగష్టు 24, 2021న, ఈ విధంగా కొనసాగుతున్న మోసపూరిత కార్యకలాపాలలో భాగంగా వివిధ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పాత నోట్‌లు మరియు నాణేలను కొనుగోలు చేసే లేదా విక్రయించే బోగస్ ఆఫర్‌లకు వ్యతిరేకంగా ప్రజలను హెచ్చరించింది.

ఆర్‌బిఐ (RBI) ఒక పత్రికా ప్రకటనలో, ప్రజలను జాగ్రత్తగా ఉండాలని మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరును ఉపయోగించి ఇటువంటి మోసపూరిత ఆఫర్‌ల ద్వారా డబ్బును రాబట్టడానికి మోసకారుల బారిన పడవద్దని సూచించింది.

కొన్ని అంశాలు మోసపూరితంగా RBI పేరు/లోగోను ఉపయోగిస్తున్నాయని మరియు వివిధ ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ మార్గాల ద్వారా పాత నోట్లు & నాణేల కొనుగోలు మరియు అమ్మకానికి సంబంధించిన లావాదేవీలలో ప్రజల నుండి ఛార్జీలు/కమీషన్/పన్ను కోరుతున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వచ్చింది. ఆర్‌బిఐ సందేశన్ని ఏఎన్ఐ వార్తా సంస్థ (ANI news Agency) పేర్కొంది.

మారుతి సుజుకి వంటి ప్రధాన కంపెనీల వార్షికోత్సవాల సందర్భంగా ప్రజలకు బహుమతులు, కార్లు మరియు గృహోపకరణాల ఇస్తామని WhatsAppలో హామీ ఇవ్వబడిన అనేక వాదనలను గతంలో Digiteye India తిరస్కరించి, వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. కొత్త రూ. 2 కాయిన్ ట్రిక్ అనేది కూడా ప్రజలను మోసం చేయడానికి మరొక మోసపూరిత మార్గం.

Claim/వాదన: పాత రూ.2 నాణేన్ని లక్షల రూపాయలకు ఆన్‌లైన్‌లో విక్రయించండి.

నిర్ధారణ: Quikr లేదా Tezbid.com వంటి ఆన్‌లైన్ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లలో 2 నాణెం గరిష్టంగా రూ.500కి విక్రయిస్తుంది, అంతే కాని లక్షల్లో కాదు.మరియు బ్యాంక్ ఖాతా నుండి డబ్బును దోచుకొడానికి ఆన్‌లైన్ మోసంలో భాగం కావచ్చు. కాబట్టి ఈ Claim/వాదన తప్పు.నిజం లేదు.

Rating: Totally False 

 

 

 

 

లేదు, ఈ వీడియో ప్రముఖ నటి వైజయంతిమాల 99 ఏళ్ళ వయసులో డ్యాన్స్ చేసింది కాదు; Fact Check

ఇటీవల ప్రముఖ నటి వైజయంతిమాల 99 ఏళ్ల వయసులో డ్యాన్స్ చేస్తూ కనిపించిందంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక వీడియో వైరల్ అయ్యింది. పోస్ట్ ఇలా ఉంది: ఆమె వైజయంతిమాల అని నమ్మడం కష్టంగా ఉంది… ఆమె అద్భుతమైన నర్తకి. 99 ఏళ్ల వయసులోనూ ఆమె డ్యాన్స్ చేయగలదు. నిజమే… రిటైర్ అయ్యరు కానీ అలసిపోలేదు.

ఇక్కడ షేర్ చేయబడింది.

వైజయంతిమాల

FACT CHECK

వాస్తవం పరిశీలన చేయమని Whatsappలో అభ్యర్థన వచ్చినప్పుడు Digiteye India సంస్థ వారు వీడియో యొక్క కొన్ని ప్రముఖ ఫ్రేమ్‌లను తీసుకొని Google రివర్స్ ఇమేజ్ శోధనలో వాటిని పరిశీలించినప్పుడు, ఆ వీడియో 93 ఏళ్ల వృద్ధురాలు గురించి ABP లైవ్ ద్వారా డిసెంబర్ 6, 2022న ఒక వార్తా నివేదికలో ఉపయోగించినట్లు కనుగొన్నాము.

ఆమె మరియు బాలీవుడ్  నటుడు షమ్మీ కపూర్ యొక్క ప్రసిద్ధ పాట ‘బదన్ పే సితారే లాపేతే హుయే’కి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. కాని వైరల్ వీడియోలో ఉన్న వృద్ధురాలు నటి వైజయంతిమాల అని నివేదికలో పేర్కొనలేదు.

93 साल की उम्र में दादी पर चढ़ा शम्मी कपूर का जादू…
बदन पे सितारे लपेटे हुये गाने पर जमकर थिरक रही दादी…#Viral #Dance #ShammiKapoor

pic.twitter.com/HCLW9cTahU

— Narendra Singh (@NarendraNeer007) December 5, 2022

మరింత పరిశీలించినప్పుడు, అనేక మీడియా నివేదికలలో డిసెంబర్ 2022లో 93 ఏళ్ల వృద్ధురాలు చాలా సరదాగా డ్యాన్స్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆమె ‘ప్రిన్స్’ చిత్రంలో వైజయంతిమాల మరియు షమ్మీ కపూర్ చేసిన ప్రసిద్ధ పాటకి/సంగీతానికి అద్భుతమైన నృత్యం చేయడం కనిపిస్తుంది.

వీడియోలోని నాట్యం చేసిన వృద్ధురాలు వైజయంతిమాల లాగా లేదు.చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వైజయంతిమాల తాజా ఫోటో(పైన ఫోటో) చూస్తే మనకు తెలుస్తుంది.ఈ సంఘటన/ఇవెంట్ మార్చి 21, 2023న Mylapore Times కవర్ చేసారు.

IMDB రికార్డుల ప్రకారం, వైజయంతిమాల ఆగస్టు 13, 1933న జన్మించారు, అంటే ప్రస్తుతం ఆమె వయస్సు 89 సంవత్సరాలు,మరియు వాదన/దావా ప్రకారం 99 సంవత్సరాలు కాదు.

వాదన/దావాలోని ఈ వీడియో సంబంధము లేదనిది, మరియు వైజయంతిమాలకి తప్పుగా ఆపాదించబడింది.

వాదన/Claim: ప్రముఖ నటి వైజయంతిమాల 99 ఏళ్ల వయసులో డ్యాన్స్ చేస్తున్నట్లు తప్పుడు వీడియో షేర్ చేయబడింది.

నిర్ధారణ:వీడియోలో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి వైజయంతిమాల కాదు, ఆమె వయస్సు 89 సంవత్సరాలు, 99 సంవత్సరాలు కాదు.
Rating: Misrepresentation —

మణిపూర్‌లోని పురాతనమైన ఈ చర్చిని బిజెపి మద్దతుదారులు తగులబెట్టారా? నిజమేంటి?

వాదన/Claim:మణిపూర్‌ హింసాకాండలో సెయింట్ జోసెఫ్ చర్చికి బిజెపి కార్యకర్తలు నిప్పంటించారని ఒక వీడియో వైరల్ అయింది.

నిర్ధారణ/Conclusion:తప్పు వాదన. ఫ్రెంచ్ చర్చి దహనం చూపుతున్న వీడియో మణిపూర్‌లో జరిగిన సంఘటనగా ప్రచారం చేయబడింది.

రేటింగ్: పూర్తిగా తప్పు నిరూపణ —

Fact Check వివరాలు:

మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు ముఖ్యాంశాలు అవుతున్న నేపథ్యంలో, మణిపూర్‌లోని చర్చిని బిజెపి మద్దతుదారులే తగులబెట్టారనే వాదనతో చర్చిని తగలబెట్టే ఒక వీడియో వైరల్ అవుతోంది.హిందీలో క్యాప్షన్ ఇలా ఉంది: #मणिपुर सुग्नू इंफाल नही थम रही हिंसा आगजनी भाजपा समर्थक उग्रवादियो ने 300 साल से ज्यादा पुरानी St. Joseph’s चर्च जलाई 74 दिनो से मणिपुर जल रहा है [అనువాదం:  “మణిపూర్- ఇంఫాల్ హింస ఆగటం లేదు. 300 ఏళ్ల నాటి సెయింట్ జోసెఫ్ చర్చిని బీజేపీ కార్యకర్తలు తగులబెట్టారు. మణిపూర్ 74 రోజులుగా మండుతోంది.]

ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

మణిపూర్ యొక్క జాతి రూపురేఖలు రాష్ట్రంలో రెచ్చిపోతున్న హింస గురించి తెలుపుతుంది.మణిపురిలలో సగం మంది హిందువులైన మెయిటీస్, కుకీలు మరియు నాగాలు మిగిలిన జనాభాలో 90 శాతం ఉన్నారు మరియు వారు క్రైస్తవులు. మిగిలిన 10 శాతం జనాభా ముస్లింలు లేదా ఇతర మతాలను అనుసరిస్తున్నారు.

మే 3, 2023న ప్రారంభమైన జాతి హింస ఇప్పటివరకు 140 మంది మరణానికి దారి తీసింది. ఈ నేప‌థ్యంలో, రాష్ట్రంలోని ప్ర‌జ‌ల మ‌ధ్య మ‌రింత మతపరమైన హింసను రేపేందుకు చ‌ర్చి దహనం అయిన వీడియోను షేర్ చేయబడుతోంది.

వాస్తవం ఏంటి?

Digiteye India బృందం వారు చర్చ్‌ను కాల్చేస్తున్న వీడియోలోని కొన్ని ఫ్రేమ్‌లు తీసుకొని పరిశీలించగా, అది మార్నేలోని ‘L’église Notre-Dame-de Drosnay‘చర్చి అగ్నికి ఆహుతై కుప్పకూలిన చారిత్రాత్మక చర్చి యొక్క విజువల్స్కు కు అని తెలిసింది.మంటల్లో కాలిపోయిన 16వ శతాబ్దపు ఫ్రెంచ్ చర్చి వీడియో నుండి 25 సెకన్ల క్లిప్‌ను ఉపయోగించి, మణిపూర్‌ రాష్ట్రంలోని మెజారిటీ కమ్యూనిటీలు చర్చికి నిప్పంటించారని ఒక దావా/వాదన పేర్కొంది.

 




జూలై 7, 2023న అగ్నికి ఆహుతైన ఫ్రెంచ్ చర్చి యొక్క అసలైన వీడియోను చూడండి. మార్నే ప్రిఫెక్చర్ పత్రికా ప్రకటన ప్రకారం, అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది మరియు దానికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించడం జరుగుతోంది.పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలోని(Louvre Museum) క్యూరేటర్ నికోలస్ మిలోవనోవిక్ కూడా అగ్నిప్రమాదం “కోలుకోలేని నష్టం” అంటూ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసారు.ఈ సంఘటన ఇక్కడ మరియు ఇక్కడ ప్రధాన వార్తా సంస్థల్లో కూడా నివేదించబడింది.

మరి కొన్ని Fact Checks:

రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉచిత మొబైల్ రీఛార్జ్‌ను ప్రకటించారా? వాస్తవ పరిశీలన

హమాస్ ఇజ్రాయెల్ ట్యాంకులను స్వాధీనం చేసుకుని వాటిపై పాలస్తీనా జెండాలను ఎగురవేయడం వీడియోలో కనిపిస్తుంది; Fact Check

భారత ఫుట్బాల్ జట్టు 1948 ఒలంపిక్స్ లోబూట్లు లేకుండా ఆడవలసి వచ్చిందా? అసలు నిజం ఏమిటి?

1948 ఒలింపిక్స్లో యొక్క ఉత్సుకతతో అప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా భారత జాతీయ ఫుట్బాల్ జట్టు బూట్లు లేకుండా ఆడారని చాలా కాలం వదంతులు వచ్చాయి. కానీ వాస్తవానికి భారత ఫుట్బాల్ ఆటగాళ్ళు ఆ విధంగా బూట్లు లేకుండా ఆడటానికి ఇష్టపడ్డారు. వారు బృందం ఫోటోలో బూట్లు ధరించి కనిపించారు, కాని తరచూ పుకార్లు నెహ్రూ ప్రభుత్వం బూట్లు కొనడానికి ఏమాత్రం శ్రద్ధ చూపించలేదు అని ఆరోపణలు చేశాయి.

దాదాపు 70 సంవత్సరాల తరువాత, ఈ సుదీర్ఘ చర్చా విషయం మరోసారి సోషల్ మీడియా దృష్టిని సంపాదించింది, సోషల్ తమాషా వారి పేజీలో ఈ విషయం గురించి 70,000 కంటే ఎక్కువ మందిస్పందించారు.

ఇండియన్ నేషనల్ ఫుట్ బాల్ జట్టు మైదానంలో ఆడటానికి బూట్లు కనుగొనడం కష్టంగా ఉన్నప్పుడు జవహర్ లాల్ నెహ్రూ తన పెంపుడు కుక్కతో ప్రయాణించారని సోషల్ తమాషా పోస్ట్ పేర్కొంది. ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వెంటనే వైరల్ అయింది, ఇది ఫేస్బుక్లో 1800 కంటే ఎక్కువ షేర్లను పొందింది. ఈ చిత్రాలు నిజమా?

సోషల్ తమాషాతో పాటు భారత కెప్టెన్ తలిమెరెన్ అయోతో పాటు ఫ్రెంచ్ కెప్టెన్తో చేతులు కలిపిన చిత్రాలు, జవహర్ లాల్ నెహ్రూ యొక్క విమానం నుంచి బయటకు రావడంతో వాస్తవమైనవి. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్లో ఈ చిత్రాల కోసం చూస్తున్నప్పుడు, తలిమెరెన్ అయో యొక్క చిత్రం ఫ్రంట్లైన్ వెబ్ సైట్ లో కనుగొనబడింది, అయితే జవహర్ లాల్ నెహ్రూ చిత్రం టైమ్స్ కంటెంట్ వెబ్సైట్లో ఉన్నది.

 

భారతీయ ఆటగాళ్లు బూట్లు పొందలేకపోయారా?

మే 07, 1948 న ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించిన నివేదిక భారత జట్టు ఆడిన ట్రయల్ మ్యాచ్ల గురించి వివరించింది. “భారీ షవర్ తర్వాత మైదానం కారణంగా ఆటగాళ్ళు బూట్లు వదిలి ఆట ఆడారని” రాసింది. ఈ వార్తా నివేదిక స్పష్టంగా 1948 లో భారతీయ ఫుట్బాల్ జట్టు బూట్లను పొందిందని సూచిస్తుంది.
కాబట్టి, 1948 ఒలంపిక్స్లో బూట్ లేకుండానే భారతీయ ఫుట్బాల్ జట్టు ఎలా ఆడింది? ప్రజాదరణ పొందిన క్రీడల పాత్రికేయుడు జాన్ కేమ్కిన్ రాసిన నివేదిక ప్రకారం, భారతీయుల జట్టుతో బూట్లు వేసుకుని ఆడటం అసాధ్యమని, భారతదేశం వాటిని ధరించకుండా నిషేధించింది.

Here we can see them wearing shoes. Source: thehardtackle

 

ఇక్కడ బూట్లు ధరించిఫోటో దిగిన ఫుట్బాల్ జట్టు చూడగలరు. భారతీయ ఫుట్బాల్ జట్టు వాస్తవానికి బూట్లు లేకుండా ఆడటానికి ఇష్టపడింది. ‘సోషల్తమాషా ‘ ద్వారా  ప్రచారం చేయబడిన ఇటీవలి చిత్రం, సాధారణ ప్రజల ముందు నెహ్రూ మీద దుష్ప్రచారం చేయడానికి ఉద్దేశించినది అని రాజకీయ నిపుణులు నమ్ముతున్నారు.

ప్రకాష్ రాజ్ అసలు పేరు ప్రకాష్ ఆల్బర్ట్ రాజ్ అని ఆరోపించారు; నిజం ఏమిటి?

ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ఎస్ఎస్ విమర్శకుల్లో ఒకరైన ప్రకాష్ రాజ్, గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా పై విపరీతమైన ద్వేషపూరిత ప్రచారాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు, ఫేస్బుక్ లో ఒక పోస్ట్ ఈ నటుడి యొక్క అసలు పేరు ‘ప్రకాష్ ఆల్బర్ట్ రాజ్’ అని పేర్కొంది. ఇతర సోషల్ మీడియా యూజర్లు తన అసలు పేరు ‘ప్రకాష్ ఎడ్వర్డ్ రాయ్’ (RAI) అని ఆరోపించారు. తన పేరును ప్రకాష్ రాజ్ గా మార్చుకున్నాడని, తన అసలు పేరుని ఎందుకు ఉపయోగించకూడదు అని ప్రశ్నించారు.

పోస్ట్ కార్డ్ న్యూస్ ఈ సందర్భంలో ప్రకాష్ రాజ్ యొక్క అసలైన పేరు ప్రకాష్ ఎడ్వర్డ్ రాయ్ అని ఆరోపించి, ప్రకాష్ రాజ్ క్రిస్టియన్ మిషనరీలతో కలిసి దేశంలో హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని పేర్కొంది. ఇంకొకరు తన అసలు పేరు ప్రకాష్ ఎడ్వర్డ్ రాయ్ అని పేర్కొంది. కాబట్టి ప్రకాష్ రాజ్ రియల్ పేరు ఏమిటి? ప్రకాష్ ఎడ్వర్డ్ రాయ్? లేదా ప్రకాష్ ఆల్బర్ట్ రాజ్?

 

మా రీసర్చ్ లో ప్రకాష్ రాజ్ మార్చి 26, 1965 న, మధ్యతరగతి కుటుంబంలో బెంగళూరులో జన్మించారు. అతని తండ్రి పేరు మన్జునాథ్ రాయ్, అతని తల్లి పేరు స్వర్ణలత. ప్రకాష్ రాజ్ ప్రారంభంలో తన తల్లిదండ్రులచే ప్రకాష్ రాయ్ గా పిలువబడ్డాడు. ప్రముఖ తమిళ దర్శకుడు కె.బాలచందర్ అతనిని ఇంట్రడ్యూస్ చేసిన పిక్చర్లో ప్రకాష్ రాజు గా మార్చాడు అని ప్రకాష్ రాజ్ తనే స్వయంగా న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఈ తమిళ చిత్రం 1994లో విడుదల అయింది దాని పేరు ‘డ్యూయెట్’. కె.బాలచందర్ దర్శకత్వం వహించాడు. ఆ సమయంలో, తమిళనాడు మరియు కర్నాటక మధ్య కావేరి నీటి సమస్యపై ఉద్రిక్తత అధికంగా ఉండింది. ప్రకాష్ యొక్క ఇంటిపేరు ‘రాయ్’ కన్నడ పేరని ఈజీగా తెలిసిపోతుందని, బాలాచందర్ దానిని రాజ్ కు మార్చాలని నిర్ణయించుకున్నాడు. దానికి ప్రకాష్ అంగీకరించాడు.

“బాలచందర్ నా మతం లేదా నా రాష్ట్రాన్ని ఎప్పుడూ చూడలేదు, అతను తన కథలను చెప్పే వ్యక్తిని కోరుకున్నాడు,” అని ప్రకాష్ రాజ్ స్వయంగా చెప్పారు. మరి ఇందులో ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకు దీన్ని పెద్ద సమస్యగా పరిగణిస్తున్నారు? ప్రకాష్ రాజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శిస్తూ యువతకు ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి రూ. 3,000 కోట్లు పెట్టి పటేల్ విగ్రహం కట్టించడం తప్పని పలుచోట్ల పేర్కొన్నారు. దీనికి ఈ విధంగా ప్రకాష్ రాజ్ అనుచితంగా విమర్శించడం జరిగింది. ఇది ఫేక్ న్యూస్.

జగన్ డబ్బు కోసం అడుగుతున్నారా? నకిలీ వీడియో శీర్షిక అలా సూచిస్తుంది!

వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ వీడియోలో మాట్లాడుతున్నాడు అని మనకు తెలుస్తోంది కానీ వీడియోలో ఉన్న టెక్స్ట్ మాత్రం వేరే రకంగా ఉంది. ఈ రకమైన విపరీతార్థాలు సృష్టించి ఏ విధంగానూ ధ్వని వినపడకుండా ఉండే ఈ వీడియోలో ఏమైనా సూచించవచ్చు.

ఈ టెక్స్ట్ ప్రకారము ఒక వ్యక్తి జగన్ను ఉద్దేశించి ఇలా  అంటున్నాడు:”సర్,  అతని దగ్గర డబ్బు ఉంది. దయచేసి అతనిని పార్టీలోకి తీసుకోండి.” అప్పుడు జగన్ ఇచ్చిన జవాబు: “అతను డబ్బు సంపాదించాడు కానీ అది అది తీసి ఇవ్వకపోవచ్చు.”  ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం: “అతను దానిని తప్పకుండా తీసి ఇస్తాడు, దయచేసి అతనిని తీసుకోండి సర్!”

ఇలా ఉంటాయి వీడియో వార్తలు. ఈ ఫేక్ న్యూస్  చాలా విపరీతాలకు దారి తీస్తుంది ముఖ్యంగా ఎలక్షన్స్ ముందు ఇటువంటి వీడియోలు చాలా వరకు ఉంటాయి. ఎవరైనా ఒక వినబడని వీడియోను  టెక్స్ట్ ట్వీకింగ్ ఇచ్చి దానికి అనుగుణంగా ఉపయోగించవచ్చు.

జనసేన బహిరంగ సమావేశం రహస్య సమావేశం ఎలా అయ్యింది? Maha TVని

హైదరాబాద్, సెప్టెంబర్ 9, 2018: ఇది సెప్టెంబర్ 9, 2008 న బహిరంగ జనసేన సమావేశం. ఈ ఆహ్వానం మీడియాకు పంపబడింది. అనేకమంది విలేఖరులు హాజరయ్యారు. జనసనా లీడర్ పవన్ కళ్యాణ్ హోటల్లోకి ప్రవేశించి, అభిమానులతో మరియు రిపోర్టర్తో కూడా చిత్రాన్ని తీసుకున్నారు.

కానీ మహా న్యూస్ టీవీ  రిపోర్టర్  దీన్ని సీక్రెట్ కవరేజ్ అని చెప్పి, ఒక బాత్రూమ్ స్నానపు తొట్టెలో కూర్చొని, జానసేనా యొక్క రహస్య సమావేశం ఎలా ఉందో వివరించడం మొదలుపెట్టాడు. అతను దానిని వీక్షకులకు ప్రత్యక్ష ప్రసారం చేశాడు. ఇది “మహ్జా ఎక్స్క్లూజివ్.” ఈ మీడియా ఒక సంఘటన చుట్టూ సంచలనాన్ని ఎలా సృష్టించాలో క్లియర్ గా చూపిస్తుంది. ఇలా ఉంటాయి మన ఆర్డినరీ  న్యూస్ కవరేజ్.  లేనిది ఉన్నట్టు సృష్టించి అదేదో సీక్రెట్ అని అనవసరంగా సెన్సేషనల్ గా ప్రచారం చేస్తున్నారు.

కేరళ వరదలు, నకిలీ వార్తల జోరు; ఇదెక్కడి WhatsApp హోరు?

కేరళ వరదలు ఏమోగానీ వాట్సాప్ లో వచ్చే వదంతులు మాత్రం చాలా ఎక్కువ. సునామీ జపాన్ లో 2011 మార్చిలో వచ్చింది కానీ ఆ వీడియో ని తీసుకొని వచ్చి కేరళ వరదల్లో జోడించి వాట్సాప్ లో మెసేజ్ లు పంపిస్తున్నారు. తెలియని వారు అది నిజమే అని పొరబడే అవకాశం ఉంది.

ఇది ఫేస్బుక్ లో  ఆగస్ట్ 23న ‘కేరళ డేంజరస్ వరదలు’ అని  పోస్ట్ చేశారు. ఇది ఎంత వైరల్ అయ్యింది అంటే  మూడు మిలియన్లు చూశారు. ఇంకా 87 వేల మంది దీన్ని షేర్ చేసుకున్నారు. చాలామంది దీన్ని చూసి అవాక్కయ్యారు. దీన్ని చూసి ఇంకొక వ్యక్తి  SIKH ARMY(@AzadSpirit) పేజీలో సేమ్ వీడియో, సేమ్ టెక్స్ట్ వాడి మళ్లీ పోస్ట్ చేశాడు.  ఇది మరిన్ని పంతొమ్మిది వేల views తీసుకొచ్చింది. ఇది ఈ ఘరాన  వ్యక్తులు  చేస్తున్న ఘనకార్యాలు.

అదేమో గాని కేరళ వరదల్లో వరదల న్యూస్ కంటే ఫేక్ న్యూస్ ఎక్కువవుతున్నాయి.  మొదట్లో UAE నుంచి వస్తున్న 600 కోట్లు భారత ప్రభుత్వం నిరాకరించింది అనే ఫేక్ న్యూస్.  ఆ తర్వాత ఫుట్బాల్ ప్లేయర్ Ronaldo నుంచి వచ్చిన డొనేషన్ అని,  ఆ తర్వాత వేరే వాళ్ల నుంచి డొనేషన్ అని తప్పుడు వార్తలు  ప్రచారం చేశారు.

అలా పోతూ ఉంటే మనకు ఫేక్ న్యూస్ తప్ప కరెక్ట్ న్యూస్ వచ్చే అవకాశం చాలా తక్కువ అని తెలుస్తోంది.

UAE నుంచి కేరళ పునరావాస సహాయం? వివాదానికి దారి తీసిన నకిలీ వార్తలు

Prime Minister Narendra Modi conducting an aerial survey of flood affected areas, in Kerala on August 18, 2018. (PIB)

విదేశీ సహాయాన్ని స్వీకరించడం గురించి మోడీ ప్రభుత్వం తీవ్ర విమర్శలకు గురైయ్యింది. UAE ప్రభుత్వం 600 కోట్ల రూపాయలు సహాయంగా ఇవ్వడానికి తయారుగా ఉన్నదని, కానీ మోడీ ప్రభుత్వం దాన్ని తిరస్కరించిందంటూ వార్తలు వెలువడ్డాయి.

భారతీయ జనతా పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నాయకులలో కేంద్ర, రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రులు ఈ వివాదం లో ఉన్నారు. ఆశ్చర్యకరంగా, మాజీ విదేశాంగ కార్యకర్తలు కూడా అలాగే అభిప్రాయపడ్డారు.

2016 మే లో ప్రభుత్వం తన 200 పేజీల జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక పత్రాన్ని ఆవిష్కరించింది. విదేశాల్లో సహాయం కోసం భారతదేశం సంసిద్ధంగా ఉండకపోయినా, దేశం సహాయ ఆఫర్లను స్వీకరిస్తుందని ఈ విధాన పత్రం స్పష్టంగా చెబుతోంది. ముఖ్యంగా ఆగస్టు 22 న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కేరళ వరద సాయాన్ని హర్షించింది.

కాని ఒక జాతీయ న్యూస్ పేపర్లో వాసు అనే రిపోర్టర్ స్వంత విశ్లేషణతో UAE గవర్నమెంట్ నుండి వచ్ఛే సహాయాన్ని తిరస్కరించిందంటూ రాసాడు. నిజానికి, ఒక ఎమిరేట్స్ ఎయిర్ కార్గో ఫ్లైట్ తిరువనంతపురం వచ్చింది, యుఎఇ ప్రభుత్వ సంస్థలు, మానవతా సంస్థలు, నివాసితులు మరియు వ్యాపారాల ద్వారా విరాళంగా అందించబడిన కేరళకు 175 టన్నుల వస్తువులని తెచ్చింది. ఇంకా 13 విమానాలు సహాయాన్ని తీసుకొని రావచ్చని అంచనా వేస్తున్నారు.

ఇంతలో, జాతీయ మీడియా మోడీ ప్రభుత్వం UAE క్రౌన్ ప్రిన్స్ ఆఫర్ను తిరస్కరించిందని చెప్పినట్లుగా నకిలీ వార్తలను వెల్లడించడం ద్వారా కొత్త వివాదం ప్రారంభించింది. దీనికి తోడు మోడీ ట్వీట్ ను కూడా ఉపయోగించారు:

A big thanks to @hhshkmohd for his gracious offer to support people of Kerala during this difficult time. His concern reflects the special ties between governments and people of India and UAE.

— Narendra Modi (@narendramodi) August 18, 2018

మోడీ ట్వీట్ లో ఎక్కడా UAE ప్రభుత్వ సహాయాన్నితిరస్కరించడానికి ఉద్దేశించిన అంశం లేదు. వివాదం భారతదేశం విదేశీ సాయాన్ని ఎందుకు స్వీకరించకూడదు అని సమర్థించటానికి వెళ్ళింది. ప్రస్తుత ప్రభుత్వం హఠాత్తుగా ఆ విధానాన్ని తిరస్కరించడం మరియు విదేశీ సాయాన్ని అంగీకరించడం వంటి పరిణామాలను అంచనా వేయడం వరకు వెళ్లింది. తర్వాత, అనవసరమైన దౌత్యపరమైన వివాదానికి ఇది దారి తీయడంతో రెండు ప్రభుత్వాలు క్లారిఫికేషన్ ఇచ్చాయి.

దురదృష్టవశాత్తూ, న్యూయార్క్ టైమ్స్, ఫాక్స్ న్యూస్, డ్యుయిష్ వెల్లే వంటి విదేశీ మీడియా సంస్థలు ఈ కథను నమ్మి దాన్ని గురించి విశ్లేషంగా రాయడం జరిగింది. నిజానికి, కేరళ నాయకత్వం లేదా మోడీ ప్రభుత్వం ఎవరికీ సమస్య లేదు అని మాజీ రాయబారి MK భద్రాకుమార్  అభిప్రాయ పడ్డారు.

కేరళ ముఖ్యమంత్రి పినారాయ్ విజయన్ కేంద్రాన్నించి వచ్చిన సాయం పై తన కృతజ్ఞతను బహిరంగంగా వ్యక్తపరిచారు. రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు వివాదాస్పదాలను రేకెత్తించ వద్దని ప్రతి ఒక్కరికి సలహా కూడా ఇచ్చారు. నరేంద్ర మోడీ కూడా తన ట్వీట్లో కేరళకు తన వ్యక్తిగత వేదనను, అవగాహనను నొక్కిచెప్పారు.