Tag Archives: Beipanjiang railway bridge in China

ఎత్తైన రైల్వే వంతెనపై వెలుతున్న రైలు వీడియో భారతదేశంలోనిది కాదు, చైనా దేశంలోని వీడియో: Fact Check

ఎత్తైన రైల్వే వంతెనపై రైలు నడుస్తున్న వీడియో వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ మరియు ఇతర సోషల్ మీడియాలో షేర్ చేయబడింది.
Claim/దావా ఈ విధంగా ఉంది: “అభినందనలు భారతదేశం!!! జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్‌పై నిర్మాణంలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ట్రాక్‌పై మార్చి 21న చిన్న రైలు టెస్ట్ రన్ విజయవంతంగా నిర్వహించబడింది.”

రెండు పర్వతాలను కలిపే ఎత్తైన వంతెనపై రైలు ప్రయాణిస్తున్నట్లు వీడియో చూపిస్తుంది. ట్విట్టర్‌లో కూడా ఇక్కడ షేర్ చేశారు.

 

FACT CHECK:

వాట్సాప్ పంపినవారు క్లెయిమ్‌ను పరిశీలన చేయమని Digiteye Indiaని కోరారు.

మేము రైలు ట్రాక్ కోసం ఎత్తైన వంతెన కోసం Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో సెర్చ్ చేయగా, ఆ వంతెన వాస్తవానికి చైనాలోని బీపాంజియాంగ్ రైల్వే వంతెన అని మరియు భారతదేశంలోనిది కాదని మేము కనుగొన్నాము. ఈ వంతెన 2001లో ప్రారంభించబడింది మరియు 275 మీటర్ల ఎత్తు మరియు 118 కిలోమీటర్ల పొడవుతో చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌లోని(Guizhou province) లియుపాన్‌షుయ్(Liupanshui) మరియు బైగావోలను(Baigao) కలుపుతుంది.

వాస్తవానికి, ఈ క్లెయిమ్‌లోని వీడియో బీపాంజియాంగ్ వంతెన గుండా ప్రయాణిస్తున్న రైలు యొక్క వైరల్ వీడియో మరియు మొట్టమొదటగా చైనా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడింది. Highstbridges.com పేరుతో ఉన్న మరో వెబ్‌సైట్ అదే వంతెనను తన వీడియోలో చూపిస్తుంది.

వాస్తవానికి, భారతదేశంలో మరియు ప్రపంచంలోనే ఎత్తైన వంతెన జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ఇప్పటికీ నిర్మాణంలో ఉంది, ఇది మార్చి 26, 2023న టెస్ట్ రన్ నిర్వహించినప్పుడు వార్తల్లో నిలిచింది. దీనిని రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించారు.


భారతదేశంలో చీనాబ్ నదిపై 1,178 అడుగుల ఎత్తులో ఉన్న ఈ వంతెన భద్రత తనిఖీ చెయ్యడం కోసం వంతెన పైన రైలు నడుపుతు పరీక్షల నిర్వహణ జరుగుతుంది మరియు జనవరి 2024 నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుంది.అందువల్ల, Claim/దావాలో చూపిన వీడియో తప్పుదారి పట్టించే విధంగా ఉంది.

Claim/దావా: జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మాణంలో ఉన్న ఎత్తైన రైల్వే వంతెనను వీడియో చూపిస్తుంది.

నిర్ధారణ:వీడియో చైనీస్ వంతెనను చూపుతుంది,అంతే కాని భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కాదు.

Rating: Misleading —

[మరి కొన్ని Fact checks: ఢిల్లీలో జరిగిన జి20 సదస్సు విజయవంతం అయిన సందర్బంగా టాటా మోటార్స్ బహుమతులు ఇస్తోందా? Fact CheckMMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check]