Tag Archives: fake videos

Fact Check: డిసెంబర్ 28న మైక్రోసాఫ్ట్ ‘ జాపనీస్ కంపెనీ సోనీ మరియు సోనీ ప్లేస్టేషన్’ను కొనుగోలు చేసినట్టు ఒక వాదన

హిస్పానిక్స్‌కు(Hispanics) చెందిన స్పానిష్ వెబ్‌సైట్ డిసెంబర్ 28, 2020న గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ జపనీస్ కంపెనీ సోనీని, దాని అనుబంధ వ్యాపారాలు మరియు ప్లేస్టేషన్‌తో సహా $130 బిలియన్లకు కొనుగోలు చేసిందని పేర్కొంటూ బ్రేకింగ్ న్యూస్‌ను విడుదల చేసింది.

వెబ్‌సైట్లో ముఖ్యంశం ఇలా ఉంది: “ప్లేస్టేషన్‌తో సహా సోనీ యొక్క అన్ని విభాగాలను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది.ఒప్పందం యొక్క వివరాలను వెల్లడించింది.టెక్ దిగ్గజం మరియు Xbox యజమానైనా మైక్రోసాఫ్ట్ కు ప్రత్యర్థియైన సోనీ యొక్క ప్లేస్టేషన్‌ను సొంతం చేసుకోవడం ఎలా సహాయపడుతుందో వివరించింది.

 

కథనాన్నిమైక్రోసాఫ్టర్స్‘ అనే వెబ్‌సైట్ షేర్ చేసి,చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది మరియు చాలా మంది వ్యక్తులు ఈ వార్తలను విశ్వసించి, రీట్వీట్ చేయడం లేదా కొనుగోలుపై అంచనా వేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సోనీ లేదా మైక్రోసాఫ్ట్ నుండి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన/జవాబు లేదా అధికారిక ప్రకటన లేదు. ఇది డిసెంబర్ 28, 2020న రోజంతా ట్విట్టర్‌లో వైరల్ అయింది.

FACT CHECK

అయినప్పటికీ, Google సహాయంతో ఆంగ్లంలోకి అనువదించబడినప్పుడు స్పానిష్‌లో చక్కటి అక్షరాల ముద్రణతో,దిగువ చిత్రంలో చూపిన విధంగా “ఏప్రిల్ ఫూల్స్ డే’ అని వ్రాసి ఉంది.

ఏప్రిల్ ఫూల్స్ డే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న వచ్చినప్పటికీ, సోనీ మీద కధనం డిసెంబర్ 28న కనిపించింది.గూగుల్‌లో మరింత పరిశీలించగా, అనేక హిస్పానిక్ సంస్కృతులలో ఈ రోజును “పవిత్ర అమాయకుల దినోత్సవం”(Day of the Holy Innocents)గా విస్తృతంగా పాటిస్తారు, ఇది ప్రపంచ ఏప్రిల్ ఫూల్స్ డేకి సమానం.

ఇది నిజమైన వార్త అయితే, రెండు ప్రపంచ దిగ్గజాలు కలిసిపోతున్నట్లు గ్లోబల్ మీడియా విస్తృతంగా నివేదించి ఉండేది.హిస్పానిక్ సంస్కృతిలో చిలిపి పనుల (pranks) కోసం ఒక రోజు కేటాయిస్తారని,అందులో భాగంగానే ఈ కధనాన్ని ప్రచురించారని గ్రహించిన చాలా మంది కధనాన్ని మరియు ట్వీట్‌ను శీఘ్రంగా తొలగించారు.

వాదన/Claim:మైక్రోసాఫ్ట్ సోనీని $130 బిలియన్లకు కొనుగోలు చేసింది.

నిర్ధారణ/Conclusion:స్పానిష్ ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా సోనీని మైక్రోసాఫ్ట్ 130 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిందన్న నకిలీ వార్త(prank) సోషల్ మీడియాలో ప్రచారంలో జరిగింది.

Our rating   —Totally False.

[మరి కొన్ని fact checks: ట్రక్కు వంతెనని దాటుతూ రాకెట్‌ను తీసుకువెళుతున్నట్లు ఒక వాదన వైరల్ అయింది Fact Check

ఈ వైరల్ వీడియో ప్లాస్టిక్ నుండి గోధుమ ఉత్పత్తిని చూపుతుందా? Fact Check]

 

Fact Check: సుడాన్‌లో డ్రోన్ దాడికి సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం గాజాపై జరుగుతున్న దాడులలో ఒకటని క్లెయిమ్

గాజాలో వైమానిక దాడికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గాజా మరియు పాలస్తీనా పిల్లలు వాటర్ ట్యాంక్ దగ్గర మిగూడినప్పుడు ఇజ్రాయెల్ వారిపై బాంబులు వేసిందని వీడియో పేర్కొంది.వీడియోతో వైరల్ అవుతున్న వాదన/దావా ఇలా ఉంది:

भूख और प्यास से तड़प रहे पेलेस्टाइन, गाज़ा के बच्चे जब पानी पीने के लिए पानी की टंकी के पास पहुंचे तो, जालिम कातिल इजरायल आतंकवादी यो ने ऊपर से बम गिरा दिया और कइयों की जान चली गई कई जल गए!

क्या लाचारी है जो दुनिया यह सब देख रही है और देखकर आंख बंद कर लेती है??

(పై హిందీ అనువాదం:గాజా మరియు పాలస్తీనా పిల్లలు, ఆకలి మరియు దాహంతో బాధపడుతున్నప్పుడు, నీరు త్రాగడానికి వాటర్ ట్యాంక్ దగ్గరకు చేరుకున్నప్పుడు, ఇజ్రాయెల్ పై నుండి బాంబును విసిరింది. ఆ బాంబు దాడిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, చాలా మంది కాలిపోయారు! ప్రపంచం ఇదంతా చూస్తూ కళ్లు మూసుకుంటుంది,ఏంటి నిస్సహాయత??)

వీడియో X (గతంలో Twitter)లో కూడా వైరల్ అవుతోంది మరియు ఇలాంటి వాదనలతో ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది

వాట్సాప్‌లో వైరల్ అయిన ఈ వీడియోను పరిశీలన చేయమని Digiteye India బృందానికి అభ్యర్థన వచ్చింది.

FACT CHECK

Digiteye India బృందంవారు వీడియోను అనేక కీఫ్రేమ్‌లుగా విభజించింది.ఈ కీఫ్రేమ్‌లతో Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ను అమలు చేయగా, అది టర్కిష్ వార్తల వెబ్‌సైట్, Haber 7కి దారితీసింది. అదే వీడియోతో కూడిన వీడియో నివేదిక అక్టోబర్ 13, 2023న పోస్ట్ చేయబడింది.నివేదిక యొక్క ముఖ్యాంశం, “సూడాన్‌లో డ్రోన్ దాడి విధ్వంసకు/విపత్తుకు కారణమైంది!” వీడియోకు టర్కిష్ భాషలో వివరణ కూడా ఉంది. దాని అనువాదం, “RSF దళాలపై సూడాన్ సైన్యం యొక్క సాయుధ డ్రోన్ దాడిలో ఇంధనం మండడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు మంటల్లో చిక్కుకున్నారు! ఆ దృశ్యాలు ఇలా కెమెరాలో బంధించబడ్డాయి.”

మేము ఈ క్లూని ఉపయోగించి,ఈ వైరల్ వీడియో యొక్క మూలం గురించి మరింత తెలుసుకోవడానికి Googleలో కీవర్డ్ సెర్చ్ను నిర్వహించగా,అల్ జజీరా వారి ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన వీడియోకు దారి తీసింది. వారి నివేదికలో, వారు అరబిక్‌లో ఒక వివరణను జోడించారు, “సుడానీస్ సైన్యం ఖార్టూమ్‌లోని ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌కు చెందిన ఇంధన ట్యాంకర్‌పై బాంబు దాడి చేసింది, #Video #Al Jazeera_Sudan.” వీడియో అక్టోబర్ 12, 2023న పోస్ట్ చేయబడింది.

సోషల్ మీడియా ‘X’లో మరింత పరిశీలన చేసినప్పుడు, అక్టోబర్ 12, 2023న అదే వీడియోను పోస్ట్ చేసిన ‘సుడాన్ న్యూస్’ యొక్క ఈ క్రింద  ట్వీట్‌ని మేము గమనించాము.”తమ మోటార్‌సైకిళ్లకు ఇంధనం నింపడానికి గుమిగూడిన రాపిడ్ సపోర్ట్ సైనికుల సమూహాన్ని లక్ష్యంగా చేసుకున్న ఆర్మీ మార్చ్, అని వారు ట్వీట్ చేశారు”.”

కాబట్టి,వైరల్ వీడియో, ఖార్టూమ్ (సూడాన్)లో జరిగిన సంఘటన చూపిస్తుంది, గాజాలోనిది కాదు.

వాదన/CLAIM:గాజా మరియు పాలస్తీనా పిల్లలు వాటర్ ట్యాంక్ ముందు గుమికూడుతుండగా వారిపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిని వైరల్ వీడియోలో కనపడుతుంది.

నిర్ధారణ/CONCLUSION:వీడియో గాజా లేదా పాలస్తీనాకు చెందినది కాదు.సుడాన్‌లోని ఖార్టూమ్‌లో పారామిలిటరీ దళం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF)కి చెందిన ఇంధన ట్యాంకర్‌పై సూడాన్ సైన్యం బాంబు దాడి చేసినప్పటి వీడియో.అక్టోబర్ ప్రారంభంలో సూడాన్‌లో ఆర్మీ, ఆర్‌ఎస్‌ఎఫ్ మధ్య ఘర్షణలు జరుగుతున్నప్పటి వీడియో ఇది.

RATING: Misrepresentation —

[మరి కొన్ని fact checks: హమాస్ ఇజ్రాయెల్‌లోకి పారాగ్లైడ్ చేసి ఆడుకునే కోర్టులోకి ప్రవేశించిందని వైరల్ వీడియో ఆరోపించింది; Fact Check

ట్రక్కు వంతెనని దాటుతూ రాకెట్‌ను తీసుకువెళుతున్నట్లు ఒక వాదన వైరల్ అయింది Fact Check]

 

 

 

ఈ వైరల్ వీడియో ప్లాస్టిక్ నుండి గోధుమ ఉత్పత్తిని చూపుతుందా? Fact Check

ప్లాస్టిక్‌ నుంచి గోధుమలు తయారవుతున్నట్లు ఒక వైరల్‌ వీడియో చూపుతోంది.
1: 15 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో కార్మికులు ‘ఉపయోగించిన ప్లాస్టిక్‌ను’ఫ్యాక్టరీలో డంప్ చేయడం,అక్కడ నుండి ప్లాస్టిక్‌ను చిన్న ముక్కలుగా విభజించి, అనేకసార్లు కడిగి, ప్లాస్టిక్ దారాలుగా చేసి, ఆపై గోధుమ గింజల వలె కనిపించేలా తయారు చేయడం కనిపిస్తుంది.ఈ వీడియో వాట్సాప్‌లో విస్తృతంగా షేర్ అవుతోంది.

ఈ వైరల్ వీడియో యొక్క వాస్తవాన్ని పరిశీలన చేయమని Digiteye India టీమ్‌ వారికీ వాట్సాప్‌లో రిక్వెస్ట్ వచ్చింది.

FACT CHECK

Digiteye India బృందం వారు వీడియో అంతటా మధ్య దిగువన ‘స్మార్టెస్ట్ వర్కర్స్’ అనే వాటర్‌మార్క్‌ను గుర్తించారు. మేము ఈ క్లూని తీసుకొని,Googleలో కీవర్డ్ searchలో ఉపయోగించగా,’స్మార్టెస్ట్ వర్కర్స్’ యొక్క YouTube పేజీకి దారితీశాయి, అక్కడ మేము ఈ వైరల్ వీడియోను కనుగొన్నాము.

వైరల్ వీడియో సెప్టెంబరు 24, 2023న ప్రచురించబడింది మరియు దాని శీర్షిక – ప్లాస్టిక్ యొక్క కొత్త ప్రయోజనం: రీసైక్లింగ్ జర్నీని ఆవిష్కరించడం.

స్మార్టెస్ట్ వర్కర్స్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ వెంచర్ యొక్క తుది ఉత్పత్తి వాస్తవానికి ఏమిటో గుర్తించడానికి మేము ఈ ఆధారాలు ఉపయోగించాము. ఇదే విధమైన ప్రక్రియను అనుసరించే వీడియోలలో ఒకదానిలో, వీడియో తుది ఉత్పత్తి ప్లాస్టిక్ LLDPE అని పేర్కొంది, అంటే, ‘లీనియర్ తక్కువ-సాంద్రత’ కలిగిన పాలిథిలిన్.ఈ ఉత్పత్తులు ప్రాథమికంగా ప్లాస్టిక్-గుళికలు(plastic-pellets), వీటిని ప్లాస్టిక్ సీసాలు, ఆటోమొబైల్స్, నిత్యావసర వినియోగ వస్తువులు మొదలైన వాటి తయారీ వంటి బహుళ పరిశ్రమలలో ఉపయోగిస్తారు.

ఆటోమొబైల్ పరిశ్రమలో ఉపయోగించే ప్లాస్టిక్ గుళికలను(plastic pellets) తయారు చేయడానికి అదే ప్రక్రియను/పద్దతిని ఉపయోగించే మరొక వీడియోను మేము గుర్తించాము.

Digiteye India బృందం వారు ఉజ్జయినిలో ఉన్న వ్యాపారి నిరుపమ్ అగర్వాల్‌తో మాట్లాడినప్పుడు, ఆయన ఈ వైరల్ వీడియోలోని ఈ గుళికలు(pellets) బియ్యం లేదా గోధుమ గింజలు కాదని నిర్ధారించారు.ఈ గుళికలు (pellets)రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌తో తయారు చేసినవని మరియు వాటిని పరిశ్రమల్లో వాడతాం, మనుషుల వినియోగానికి కాదని’ అగర్వాల్ అన్నారు.

కాబట్టి, ఈ వాదన/దావా తప్పు.

వాదన/CLAIM: ప్లాస్టిక్‌తో గోధుమ గింజలను తయారు చేస్తున్న ఒక ఫ్యాక్టరీ వైరల్ వీడియో కనిపిస్తుంది.

నిర్ధారణ/CONCLUSION: వైరల్ వీడియో ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేసే ఫ్యాక్టరీని చూపిస్తుంది.ప్లాస్టిక్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసి, కడిగి, ప్లాస్టిక్ దారాలుగా చేసి, ఆపై చిన్న గుళికలగా(pellets)ఏర్పరుస్తుంది.ఈ గుళికలను(pellets) పరిశ్రమలలో ఉపయోగిస్తారు మరియు అవి మనుషుల వినియోగానికి ఉద్దేశించినవి కావు. అవి ఏ రకమైన ఆహార ధాన్యాలు కావు.

RATING: – Totally False–?????

[మరి కొన్ని Fact Checks: MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check ;

మొబైల్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లపై GST 31.3% నుంచి 18%కి తగ్గిందని క్లెయిమ్/వాదన వైరల్ అవుతోంది; Fact Check]