కేరళ వరదలు ఏమోగానీ వాట్సాప్ లో వచ్చే వదంతులు మాత్రం చాలా ఎక్కువ. సునామీ జపాన్ లో 2011 మార్చిలో వచ్చింది కానీ ఆ వీడియో ని తీసుకొని వచ్చి కేరళ వరదల్లో జోడించి వాట్సాప్ లో మెసేజ్ లు పంపిస్తున్నారు. తెలియని వారు అది నిజమే అని పొరబడే అవకాశం ఉంది.
ఇది ఫేస్బుక్ లో ఆగస్ట్ 23న ‘కేరళ డేంజరస్ వరదలు’ అని పోస్ట్ చేశారు. ఇది ఎంత వైరల్ అయ్యింది అంటే మూడు మిలియన్లు చూశారు. ఇంకా 87 వేల మంది దీన్ని షేర్ చేసుకున్నారు. చాలామంది దీన్ని చూసి అవాక్కయ్యారు. దీన్ని చూసి ఇంకొక వ్యక్తి SIKH ARMY(@AzadSpirit) పేజీలో సేమ్ వీడియో, సేమ్ టెక్స్ట్ వాడి మళ్లీ పోస్ట్ చేశాడు. ఇది మరిన్ని పంతొమ్మిది వేల views తీసుకొచ్చింది. ఇది ఈ ఘరాన వ్యక్తులు చేస్తున్న ఘనకార్యాలు.
అదేమో గాని కేరళ వరదల్లో వరదల న్యూస్ కంటే ఫేక్ న్యూస్ ఎక్కువవుతున్నాయి. మొదట్లో UAE నుంచి వస్తున్న 600 కోట్లు భారత ప్రభుత్వం నిరాకరించింది అనే ఫేక్ న్యూస్. ఆ తర్వాత ఫుట్బాల్ ప్లేయర్ Ronaldo నుంచి వచ్చిన డొనేషన్ అని, ఆ తర్వాత వేరే వాళ్ల నుంచి డొనేషన్ అని తప్పుడు వార్తలు ప్రచారం చేశారు.
అలా పోతూ ఉంటే మనకు ఫేక్ న్యూస్ తప్ప కరెక్ట్ న్యూస్ వచ్చే అవకాశం చాలా తక్కువ అని తెలుస్తోంది.