వాదన/Claim: గత 5 ఏళ్లలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో తీర్థం పారేసి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశాడని వీడియో పేర్కొంది.
నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం.జగన్ మోహన్ రెడ్డి చరణామృతం/తీర్థాన్ని పారబోస్తున్నట్లు చూపించే తప్పుడు వీడియో(కత్తిరించిన(cropped) వీడియో)షేర్ చేయబడింది.
రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం —
వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై
లేదా దిగువ కథనాన్ని చదవండి.
************************************************************************
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలయ ప్రసాదం, తీర్థాన్ని పారబోస్తున్నట్లు కన్పించే ఒక వీడియోను, ఆంధ్రప్రదేశ్‌లోని అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి చెందిన కొందరు అనుచరులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోని ఇక్కడ చూడండి:
గత 5 ఏళ్ళ వ్యక్తిగతంగా కూడా స్వామి వారిని అపవిత్రం చేసాడు జగన్ రెడ్డి… pic.twitter.com/rsg56AxSG0
— Telugu Desam Party (@JaiTDP) September 22, 2024
తెలుగులో దావా/వాదన ఈ విధంగా ఉంది: “తిరుమల లడ్డూ ప్రసాదంగా ఇస్తే, వాసన చూడటం వదిలేయటం. ఇంట్లో గుడి సెట్టింగ్ వేసుకోవటం, అక్కడ తీర్ధం ఇస్తే తాగినట్టు యాక్షన్ చేసి కింద పోసేయటం. ఏ నాడు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు ఇవ్వక పోవటం. గత 5 ఏళ్ళ వ్యక్తిగతంగా కూడా స్వామి వారిని అపవిత్రం చేసాడు జగన్ రెడ్డి.”
వాస్తవ పరిశీలన వివరాలు:
మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని నిర్వహించగా, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ,ఆయన సతీమణి వైఎస్ భారతి రెడ్డి వార్షిక సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న వీడియోకి దారి తీసింది.అది జనవరి 14, 2024న సాక్షి టీవీ అప్‌లోడ్ చేసిన ఒరిజినల్ యూట్యూబ్ వీడియో అని తేలింది.
ఈ వీడియోలో, పూజారి, జగన్ ‘కు చరణామృతం'(తీర్థం)ని ఇవ్వడం , ఆయన తాగడం 2:58 టైమ్‌స్టాంప్ దగ్గర స్పష్టంగా చూడవచ్చును.మరియు దక్షిణ భారతదేశంలో ఆచారం ప్రకారం అతని తల చుట్టూ తన చేతిని తిప్పాడు. కానీ వైరల్ అయిన వాదన/దావాలో షేర్ చేయబడిన వీడియో నుండి ఈ భాగం తొలగించబడింది. కత్తిరించిన(cropped) వీడియో మరియు ఒరిజినల్ వీడియో దిగువన చూసినట్లుగా YSRCP ద్వారా మళ్లీ షేర్ చేయబడింది:
శ్రీవారి లడ్డుపై అసత్య ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోయావు.. అయినా సిగ్గులేకుండా మళ్లీ ఫేక్ వీడియోతో మొదలెట్టావా? @ysjagan గారు సతీసమేతంగా పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలను ఎంత భక్తి శ్రద్ధలతో స్వీకరించారో నీ పచ్చ కళ్ల జోడు తీసి చూడు @JaiTDP
నీకు అనుకూలంగా వీడియోను ఎడిట్… https://t.co/jyDXfwHN2k pic.twitter.com/p4oVF0VIb3
— YSR Congress Party (@YSRCParty) September 22, 2024
అందువల్ల, X హ్యాండిల్ @JaiTDP ద్వారా చేయబడిన దావా/వాదన తప్పు.
మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన