Tag Archives: christian

ప్రకాష్ రాజ్ అసలు పేరు ప్రకాష్ ఆల్బర్ట్ రాజ్ అని ఆరోపించారు; నిజం ఏమిటి?

ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ఎస్ఎస్ విమర్శకుల్లో ఒకరైన ప్రకాష్ రాజ్, గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా పై విపరీతమైన ద్వేషపూరిత ప్రచారాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు, ఫేస్బుక్ లో ఒక పోస్ట్ ఈ నటుడి యొక్క అసలు పేరు ‘ప్రకాష్ ఆల్బర్ట్ రాజ్’ అని పేర్కొంది. ఇతర సోషల్ మీడియా యూజర్లు తన అసలు పేరు ‘ప్రకాష్ ఎడ్వర్డ్ రాయ్’ (RAI) అని ఆరోపించారు. తన పేరును ప్రకాష్ రాజ్ గా మార్చుకున్నాడని, తన అసలు పేరుని ఎందుకు ఉపయోగించకూడదు అని ప్రశ్నించారు.

పోస్ట్ కార్డ్ న్యూస్ ఈ సందర్భంలో ప్రకాష్ రాజ్ యొక్క అసలైన పేరు ప్రకాష్ ఎడ్వర్డ్ రాయ్ అని ఆరోపించి, ప్రకాష్ రాజ్ క్రిస్టియన్ మిషనరీలతో కలిసి దేశంలో హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని పేర్కొంది. ఇంకొకరు తన అసలు పేరు ప్రకాష్ ఎడ్వర్డ్ రాయ్ అని పేర్కొంది. కాబట్టి ప్రకాష్ రాజ్ రియల్ పేరు ఏమిటి? ప్రకాష్ ఎడ్వర్డ్ రాయ్? లేదా ప్రకాష్ ఆల్బర్ట్ రాజ్?

 

మా రీసర్చ్ లో ప్రకాష్ రాజ్ మార్చి 26, 1965 న, మధ్యతరగతి కుటుంబంలో బెంగళూరులో జన్మించారు. అతని తండ్రి పేరు మన్జునాథ్ రాయ్, అతని తల్లి పేరు స్వర్ణలత. ప్రకాష్ రాజ్ ప్రారంభంలో తన తల్లిదండ్రులచే ప్రకాష్ రాయ్ గా పిలువబడ్డాడు. ప్రముఖ తమిళ దర్శకుడు కె.బాలచందర్ అతనిని ఇంట్రడ్యూస్ చేసిన పిక్చర్లో ప్రకాష్ రాజు గా మార్చాడు అని ప్రకాష్ రాజ్ తనే స్వయంగా న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఈ తమిళ చిత్రం 1994లో విడుదల అయింది దాని పేరు ‘డ్యూయెట్’. కె.బాలచందర్ దర్శకత్వం వహించాడు. ఆ సమయంలో, తమిళనాడు మరియు కర్నాటక మధ్య కావేరి నీటి సమస్యపై ఉద్రిక్తత అధికంగా ఉండింది. ప్రకాష్ యొక్క ఇంటిపేరు ‘రాయ్’ కన్నడ పేరని ఈజీగా తెలిసిపోతుందని, బాలాచందర్ దానిని రాజ్ కు మార్చాలని నిర్ణయించుకున్నాడు. దానికి ప్రకాష్ అంగీకరించాడు.

“బాలచందర్ నా మతం లేదా నా రాష్ట్రాన్ని ఎప్పుడూ చూడలేదు, అతను తన కథలను చెప్పే వ్యక్తిని కోరుకున్నాడు,” అని ప్రకాష్ రాజ్ స్వయంగా చెప్పారు. మరి ఇందులో ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకు దీన్ని పెద్ద సమస్యగా పరిగణిస్తున్నారు? ప్రకాష్ రాజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శిస్తూ యువతకు ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి రూ. 3,000 కోట్లు పెట్టి పటేల్ విగ్రహం కట్టించడం తప్పని పలుచోట్ల పేర్కొన్నారు. దీనికి ఈ విధంగా ప్రకాష్ రాజ్ అనుచితంగా విమర్శించడం జరిగింది. ఇది ఫేక్ న్యూస్.