ఓ యాంకర్ పాత రూ 2 నాణెంకు లక్షల రూపాయలు చెల్లించి కొనుక్కోవడానికి కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్నందున రూ 2 నాణెం మిమ్మల్ని రాత్రికిరాత్రే ధనవంతులను చేస్తుంది.ఆమె మిమ్మల్ని క్వికర్ ఖాతాను (Quikr account)తెరవమని కోరితు మరియు రూ 2 నాణెం చిత్రాన్ని అప్‌లోడ్ చేయమని అడుగుతుంది. 2 నాణెం కొనుగోలుదారు కోసం వేచి ఉండండి అని చెబుతుంది.
Zeenews.com/business వంటి అనేక వార్తా పబ్లికేషన్‌లు కూడా Quikr ఖాతాను ఎలా తెరవాలనే దానిపై వివరంగా సమాచారాన్ని అందించాయి. రూ 2 నాణెం కోసం Googleలో వెతికినప్పుడు, క్రింద సమాచారం వెలువడుతుంది. Digiteye India వాస్తవం తెలుసుకొనుటకు పై వీడియో స్వీకరించింది.
FACT CHECK
Digiteye team వారు Googleలో వెతికినప్పుడు, Claim/దావా రెండు సంవత్సరాలకు పైగా కొనసాగుతోంది.
‘నుమిస్మాటిక్స్'( numismatics–పాత బ్యాంకు నోట్లు, పాత నాణేల సేకరణ మరియు అధ్యయనం)విభాగంలో పరిశీలించినప్పుడు, పాత రూ.2 నాణేలు చాలా వరకు రూ.500కు మించకుండా అమ్ముడుపోయినట్టు క్వికర్ వెల్లడించింది.అంతేకాదు రూ. 2 నాణేలు అంత అరుదైనవి కావు.
Quoraలోని కొంతమంది వ్యక్తులు ఇది మోసానికి దారితీస్తుందని హెచ్చరించారు, దీని ద్వారా రూ. 2 నాణేలు అమ్మేవాళ్ళు తమ బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ కార్డ్ నంబర్ మరియు OTP లాంటి సమాచారాన్ని అందించేలా తప్పుదారి పట్టించవచ్చు.ఆ తరువాత మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బును సులభంగా బదిలీ చేస్తారు.
Digiteye India బృందం 1994 సంవత్సరం నాటి నాణెం క్వికర్‌లో (Quikr) పెట్టినప్పుడు, కొనాలకున్న వ్యక్తి నాణెంకు రూ. 2 లక్షలు ఇస్తానని, ధృవీకరణ సాకుతో బ్యాంక్ వివరాలు, ఆధార్ కార్డ్ నంబర్ వంటి వివరాలను కోరింది.చివరగా, ఆ వ్యక్తి ధృవీకరణ సాకుతో OTPని షేర్ చేయమని అడిగాడు, దీని వలన team member యొక్క బ్యాంక్ ఖాతా నుండి తక్షణమే నగదు బదిలీ చెయ్యబడే అవకాశం ఉండేది.మా ఆన్‌లైన్ సెర్చ్‌లో వెల్లడైనట్లు ఇది చాలా మందికి అనుభవం అయ్యింది.
ఆర్‌బీఐ ఏం చెబుతోంది:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఆగష్టు 24, 2021న, ఈ విధంగా కొనసాగుతున్న మోసపూరిత కార్యకలాపాలలో భాగంగా వివిధ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పాత నోట్‌లు మరియు నాణేలను కొనుగోలు చేసే లేదా విక్రయించే బోగస్ ఆఫర్‌లకు వ్యతిరేకంగా ప్రజలను హెచ్చరించింది.
ఆర్‌బిఐ (RBI) ఒక పత్రికా ప్రకటనలో, ప్రజలను జాగ్రత్తగా ఉండాలని మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరును ఉపయోగించి ఇటువంటి మోసపూరిత ఆఫర్‌ల ద్వారా డబ్బును రాబట్టడానికి మోసకారుల బారిన పడవద్దని సూచించింది.
కొన్ని అంశాలు మోసపూరితంగా RBI పేరు/లోగోను ఉపయోగిస్తున్నాయని మరియు వివిధ ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ మార్గాల ద్వారా పాత నోట్లు & నాణేల కొనుగోలు మరియు అమ్మకానికి సంబంధించిన లావాదేవీలలో ప్రజల నుండి ఛార్జీలు/కమీషన్/పన్ను కోరుతున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వచ్చింది. ఆర్‌బిఐ సందేశన్ని ఏఎన్ఐ వార్తా సంస్థ (ANI news Agency) పేర్కొంది.
మారుతి సుజుకి వంటి ప్రధాన కంపెనీల వార్షికోత్సవాల సందర్భంగా ప్రజలకు బహుమతులు, కార్లు మరియు గృహోపకరణాల ఇస్తామని WhatsAppలో హామీ ఇవ్వబడిన అనేక వాదనలను గతంలో Digiteye India తిరస్కరించి, వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. కొత్త రూ. 2 కాయిన్ ట్రిక్ అనేది కూడా ప్రజలను మోసం చేయడానికి మరొక మోసపూరిత మార్గం.
Claim/వాదన: పాత రూ.2 నాణేన్ని లక్షల రూపాయలకు ఆన్‌లైన్‌లో విక్రయించండి.
నిర్ధారణ: Quikr లేదా Tezbid.com వంటి ఆన్‌లైన్ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లలో 2 నాణెం గరిష్టంగా రూ.500కి విక్రయిస్తుంది, అంతే కాని లక్షల్లో కాదు.మరియు బ్యాంక్ ఖాతా నుండి డబ్బును దోచుకొడానికి ఆన్‌లైన్ మోసంలో భాగం కావచ్చు. కాబట్టి ఈ Claim/వాదన తప్పు.నిజం లేదు.
Rating: Totally False