వాదన./Claim: ఎన్నికల ఫలితాల మరుసటి రోజే రాహుల్ గాంధీ జూన్ 5, 2024న బ్యాంకాక్‌కి టికెట్ బుక్ చేసుకొని దేశం వదిలి వెళ్ళిపోతున్నారనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. టిక్కెట్ మార్ఫింగ్ చేసి,డిజిటల్‌గా మార్చబడింది మరియు ఎయిర్‌లైన్స్ ఉపయోగించే PDF417 బార్‌కోడ్ లేదు.
రేటింగ్: పూర్తిగా తప్పు–
వాస్తవ పరిశీలన వివరాలు:
భారతదేశంలో అధికార భారతీయ జనతా పార్టీకి భారీ మెజారిటీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన వెంటనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పేరు మీద ఉన్న విస్తారా ఫ్లైట్ బోర్డింగ్ పాస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Rahul Gandhi’s flight ✈️ ticket for June 5 – 2024 Business class Vistara Airlines 😲🤔 pic.twitter.com/sdGGnkc6nG
— M S Manral ( Modi ka pariwar ) (@MSManral2) June 1, 2024
జూన్ 4, 2024న అధికారికంగా కౌంటింగ్ మరియు ఎన్నికల ఫలితాలను ప్రకటించిన వెంటనే జూన్ 5న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దేశం విడిచి వెళుతున్నారని వాదన చేయబడింది. బోర్డింగ్ పాస్‌లో టికెట్ హోల్డర్‌గా రాహుల్ గాంధీ పేరు మరియు భారతదేశం నుండి థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌కి జూన్ 5, 2024 నాటి ప్రయాణ తేదీని ఉన్నట్లు పేర్కొని ఉంది.
FACT-CHECK
Digiteye India బృందం తమ WhatsApp టిప్‌లైన్‌లో అభ్యర్ధనను అందుకొని, వాస్తవ పరిశీలన కోసం మొదట ఇమేజ్/చిత్రంపై Google రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించగా,అది పాత చిత్రమని, డిజిటల్‌గా మార్చబడినట్లు గుర్తించాము.ఒకే బోర్డింగ్ పాస్‌లో 2 వేర్వేరు విమాన నంబర్‌లు ఉన్నాయి. చిత్రం 1D బార్‌కోడ్‌ను కలిగి ఉంది, అయితే ఎయిర్‌లైన్ PDF417 బార్‌కోడ్‌ను ఉపయోగిస్తుంది.
ప్రయాణీకుల చివరి పేరు ఎల్లప్పుడూ మొదట వ్రాయబడుతుంది, కానీ ఈ చిత్రంలో, మొదటి పేరు మొదట వ్రాయబడుతుంది.ముందు గాంధీ, ఆ తర్వాత రాహుల్ అని ఉండాలి. బోర్డింగ్ పాస్‌లో రెండు వేర్వేరు ఫ్లైట్ నంబర్లను (సంఖ్యలు) — ‘UK121’ అని ఒక చోట మరియు ‘UK115’ అని కౌంటర్‌ఫాయిల్‌లో చూపుతోంది.
మేము టిక్కెట్‌కి సంబంధించిన చిత్రాన్ని తీసుకొని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో సెర్చ్ చేయగా, టికెట్ ఇమేజ్/చిత్రం వాస్తవానికి 2019 ఆగస్టు 9న ఢిల్లీ విమానాశ్రయం నుండి సింగపూర్‌కి విస్తారా అంతర్జాతీయ విమానం ఎక్కిన అజయ్ అవతానీ ద్వారా పోస్ట్ చేయబడిందని మేము గమనించాము. ‘లైవ్ ఫ్రమ్ ఎ లాంజ్‘ అనే వెబ్‌సైట్ ప్రచురించిన కథనంలో అతను ఈ చిత్రాన్ని ఉపయోగించారు.
అందువలన, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జూన్ 5, 2024న బ్యాంకాక్‌కు వెళ్లేందుకు తను టిక్కెట్‌ను బుక్ చేసుకున్నారని తప్పుడు వాదన చేయడానికి చిత్రం మార్చి చూపించబడింది. కాబట్టి ఈ వార్తలో ఎలాంటి నిజం లేదు.
వాదన/Claim:పురుగుమందుల కారణంగా భారతదేశం నుండి కూరగాయల దిగుమతిని అనేక దేశాలు నిషేధించాయని వార్తాపత్రిక పేర్కొంది.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. వార్తాపత్రిక క్లిప్పింగ్ (వార్తా) 2015 నాటిది, ఢిల్లీ హైకోర్టు విచారణలోకి తీసుకున్న పురుగుమందుల సమస్యకు సంబంధించినది, ఇటీవల జరిగినది కాదు.
రేటింగ్: తప్పు దోవ పట్టించే వార్తా —
Fact Check వివరాలు:
పురుగుమందుల కారణంగా అనేక దేశాలు భారతదేశం నుండి కూరగాయలను నిషేధించాయని వాట్సాప్‌లో ఇటీవల వార్తాపత్రిక క్లిప్పింగ్ ఒకటి షేర్ చేయబడింది.
పంటలు మరియు ఆహార సాగులో మితిమీరిన పురుగుమందుల వినియోగాన్ని ప్రభుత్వం నిలిపివేయాలని ఆరోపించిన పిఐఎల్‌పై(PIL) 2024 మే 17న సుప్రీంకోర్టు ఆరోగ్య, వ్యవసాయ మంత్రిత్వ శాఖలు మరియు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నుండి ప్రతిస్పందనను కోరింది. మితిమీరిన పురుగుమందుల వినియోగం వలన ప్రజలకు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాన్ని కలిగిస్తుంది.
Digiteye India బృందం వాస్తవ-తనిఖీ పరిశీలన కోసం న్యూస్‌క్లిప్‌ని అందుకుంది మరియు X ప్లాట్‌ఫారమ్‌లో క్రింద చూసినట్లుగా ఒక నెల క్రితం షేర్ చేయబడిందని మేము గమనించాము:
ज्यादा कीटनाशक प्रयोग करने से हमारा देश बीमार पड़ा।
लेकिन विश्व के अन्य देश पैसे के लिए शरीर से खिलवाड़ नहीं करते।
उन्होंने एकमत होकर भारत की जहरीली सब्जियों पर ही रोक लगा दी। pic.twitter.com/OFb6gPNndv
హిందీలో వాదన/దావా ఇలా ఉంది:”ज्यादा कीटनाशक प्रयोग करने से हमारा देश बीमार पड़ा। लेकिन विश्व के अन्य देश पैसे के लिए शरीर से खिलवाड़ नहीं करते।
उन्होंने एकमत होकर भारत की जहरीली सब्जियों पर ही रोक लगा दी।” [తెలుగు అనువాదం:“మితిమీరిన పురుగుమందుల వాడకం వల్ల మన దేశం అనారోగ్యానికి గురైంది.కానీ ప్రపంచంలోని ఇతర దేశాలు డబ్బు కోసం తమ ఆరోగ్యంతో ఆడుకోరు.భారతదేశంలోని విషపూరిత కూరగాయలపై వారు ఏకగ్రీవంగా నిషేధం విధించారు.”]
అదే క్లిప్(వార్తా)ను ఫేస్‌బుక్‌లో కూడా షేర్ చేశారు.
FACT-CHECK
Digiteye India బృందం ఈ వార్త క్లిప్ యొక్క సమాచారం కోసం మరింత పరిశీలించగా, పండ్లు మరియు కూరగాయలలో పురుగుమందులకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిల్ గురించిన వార్తని గుర్తించాము. న్యాయమూర్తుల పేర్ల ఆధారంగా — జస్టిస్ జి. రోహిణి మరియు జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లావ్, మేము Google Newsలో శోదించగా, బిజినెస్ స్టాండర్డ్‌లో ప్రచురించబడిన ఫిబ్రవరి 11, 2015 నాటి అసలు PTI వార్తా నివేదికను గురించి తెలుకున్నాము.
ఈ నివేదిక ఇలా పేర్కొంది: “మితిమీరిన పురుగుమందుల వాడకం కారణంగా చాలా దేశాలు భారతదేశం నుండి కూరగాయలు మరియు పండ్ల దిగుమతిని నిషేధించాయి, ఈ రోజు ఢిల్లీ హైకోర్టుకు ఈ విషయం తెలుపబడింది. ప్రధాన న్యాయమూర్తి జి రోహిణి మరియు జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లావ్‌లతో కూడిన ధర్మాసనానికి, కోర్టు నియమించిన అమికస్ క్యూరీ సమర్పించిన నివేదిక ద్వారా అనేక కూరగాయలు మరియు తినే పదార్థాలలో, పురుగుమందుల అవశేషాలు అనుమతించదగిన పరిమితులకు మించి ఉన్నట్లు తెలుపబడింది. ఢిల్లీ అంతటా విక్రయించే తినుబండారాలలో పురుగుమందులను అధికంగా వాడుతున్నప్పటికీ, ఈ ముప్పును అరికట్టేందుకు పెద్దగా చర్యలు తీసుకోలేదని నివేదిక పేర్కొంది. ఈ సమస్య కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాదని, ఇది”పాన్-ఇండియా” సమస్య అని కూడా పేర్కొంది.
అందువల్ల, పండ్లు మరియు కూరగాయలలో పురుగుమందుల వాడకంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఈ పురుగుమందుల సమస్య 2014లో ప్రధాన వార్తల్లోకి వచ్చింది. అనేక దేశాల దిగుమతి నిషేధంపై న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
2017లో మరియు 2021లో ఇదే న్యూస్‌క్లిప్(వార్తా)ని అనేక Facebook పేజీలు ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడినట్లు మేము గమనించాము.
అందువల్ల, కొన్ని దేశాలు భారతదేశం నుండి పండ్లు మరియు కూరగాయల దిగుమతులను నిషేధించాయనే వాదన పాతది, ఇటీవలి జరిగినది కాదు.
వాదన/Claim: వీడియో క్లిప్‌లో లడఖ్ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ కాశ్మీర్ కోసం ప్రజాభిప్రాయ సేకరణను కోరుతున్నారనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. కార్గిల్‌పై పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేసిన ప్రకటనను వక్రీకరించి, అసందర్భానుసారంగా చేసారు.
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —
Fact Checks వివరాలు:
లడఖ్ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ కాశ్మీర్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ కోరుతున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.వీడియో క్లిప్‌లో సోనమ్ వాంగ్‌చుక్, “రిఫరెండమ్‌లు మరియు ప్రజాభిప్రాయ సేకరణలు జరగాలని మీరు విని ఉండవచ్చు,మరి అందరూ అలా అనుకుంటే,ఎందుకు చేయకూడదు?” అని అనడం వినవచ్చు.
Sad to see Environmentalist Sonam Wangchuk in Leh demanding a plebiscite for Kashmir. Mr. Wangchuk, Jammu & Kashmir is an integral part of India, will always remain so. Last hurdle of Article 370 was nullified both by Indian Parliament and Supreme Court. Don’t push separatism. pic.twitter.com/wrziWywbXB
క్యాప్షన్ ఈ విధంగా ఉంది: “కశ్మీర్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ కొరకై లేహ్‌లో పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ డిమాండ్ చేయడం విచారకరం.మిస్టర్ వాంగ్‌చుక్, జమ్మూ మరియు కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం మరియు ఎల్లప్పుడూ అలాగే ఉంటాయి.ఆర్టికల్ 370 య అడ్డంకును భారత పార్లమెంటు మరియు సుప్రీంకోర్టు రెండూ రద్దు చేశాయి. వేర్పాటువాదాన్ని(సెపరేటిజంను)ముందుకు తేవాలని చూడవద్దు”.
సున్నితమైన సమస్య కారణంగా,Digiteye India బృందం కొన్ని కీలక ఫ్రేమ్‌లను తీసుకొని, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో పరిశీలించగా,అసలు ఇంటర్వ్యూని (అసలు వీడియో)ది ఫోర్త్ ఎస్టేట్ Youtube ఛానెల్ మే 13, 2024న అప్‌లోడ్ చేసిందని గుర్తించాము. వీడియోను ఇక్కడ చూడండి:
వీడియోలో 14:23 నిమిషాల వద్ద, ది ఫోర్త్ ఎస్టేట్ రిపోర్టర్ రవీంద్ర సింగ్ కార్గిల్ నివాసితులు ఇంకా జమ్మూ మరియు కాశ్మీర్‌తో అనుబంధం కోరుకుంటున్నారా అని సోనమ్ వాంగ్‌చుక్‌ను అడగగా, దానికి వాంగ్‌చుక్ ఇలా సమాధానమిచ్చారు, “లేదు, ఇది కొంతమంది వ్యక్తిగత అభిప్రాయమా (లేదా) మొత్తం ప్రాంతం జనాభాదా అని నేను అడగాలనుకుంటున్నాను.అప్పుడు మేము ప్రార్థన చేస్తూ ఆ దిశలో పని చేస్తాము. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నస్వేచ్ఛ ఉండాలి.అందుకే రెఫరెండమ్స్ మరియు ప్రజాభిప్రాయ సేకరణలు ఉన్నాయి. అందరూ ఇదే విధంగా ఆలోచిస్తే కాశ్మీర్‌లో ఎందుకు ఉండకూడదు?
కానీ సోనమ్ వాంగ్‌చుక్ కాశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ డిమాండ్‌ను ప్రస్తావిస్తున్నారనే విషయం గందరగోళాన్ని సృష్టించటంతో, వెంటనే ఇంటర్వ్యూయర్ రవీంద్ర సింగ్ షియోరాన్, మే 20, 2024న మరొక వీడియోలో ఈ క్రింది విధంగా వివరణ ఇచ్చారు:
ఈ వీడియోలో,రవీంద్ర సింగ్ షెరాన్ మాట్లాడుతూ,“ కార్గిల్ మరియు లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిన తర్వాత అధ్వాన్న స్థితిలో ఉన్నాయని, మనం దుర్భర స్థితిలో ఉన్నప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా ఎందుకు వారు చేయాలనుకుంటున్నారని,మమ్మల్ని తిరిగి ఒక్కటిగా కలపడం మంచిది” అని కార్గిల్ నాయకుడు సజ్జాద్ కార్గిలీ అన్నారన్న విషయాన్నీ నేను సోనమ్ వాంగ్‌చుక్‌తో ఇంటర్వ్యూ తీసుకున్నపుడు ప్రస్తావించగా, దానికి ఇది సజ్జాద్ కార్గిలీ వ్యక్తిగత అభిప్రాయం లేదా కార్గిల్ ప్రజల వ్యక్తిగత ఎంపిక అని సోనమ్ వాంగ్‌చుక్ సమాధానమిచ్చారు. ప్రతి కార్గిల్ పౌరుడు వాళ్ళని కాశ్మీర్‌లో తిరిగి కలిపితే మంచిదనుకుంటే,కలపడంలో తప్పు లేదు.వాళ్ళు సంతోషంగా ఉంటే,కలిపితేనే మంచిదని ఆయన అన్నారు.కాశ్మీర్‌లో రెఫరెండమ్స్, ప్రజాభిప్రాయ సేకరణలు జరగడానికి ఇదే కారణమని వాంగ్‌చుక్ తెలిపారు.
వీడియోలో 2:10 నిమిషాల వద్ద, సోనమ్ వాంగ్‌చుక్ స్టేట్‌మెంట్‌ను ఎడిట్ చేసి,కాశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ కావాలని సోనమ్ చెబుతున్నట్లు మార్చారని, ఇది నిజం కాదని రవీంద్ర సింగ్ షెరాన్ అన్నారు.
అదనంగా,సోనమ్ వాంగ్‌చుక్ స్వయంగా మే 20, 2024న చేసిన ట్వీటీని మేము గుర్తించాము: “నా ప్రకటనను గుర్తించలేనంతగా వక్రీకరించడం బాధాకరం.కానీ సందర్భానికి అనుచితంగా నా వీడియో యొక్క డాక్టరేడ్ వెర్షన్ ఎలా తప్పుగా అర్థం చేసుకోబడుతుందో నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. దయచేసి అబద్ధాలు కాకుండా సత్యాన్ని ప్రచారం చేయండి. సత్యమేవ జయతే” అని రాశారు.
Sad to see my statement being twisted beyond recognition. But I can totally understand how the doctored version of my video could be misunderstood when taken out of its context. Please spread truth not lies. Satyamev jayate https://t.co/v1RilzE5ZLpic.twitter.com/IopcPWq8M8
వాంగ్‌చుక్ చేసిన రిఫరెండమ్‌లు లేదా ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి చేసిన ఒక సాధారణ సూచనను, అతను కాశ్మీర్ ప్రజాభిప్రాయ సేకరణ గురించి మాట్లాడుతున్నారని చెప్పడానికి వక్రీకరించబడింది,కాబట్టి,ఈ వాదన/దావా తప్పు.
వాదన/Claim: వీడియో క్లిప్‌లో ఢిల్లీ మంత్రి అతిషి విద్యుత్ సబ్సిడీని రేపటి నుండి (మే 23, 2024) నిలిపివేస్తున్నట్లు వెల్లడిస్తున్నారనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. ఏప్రిల్ 2023 నాటి మంత్రి అతిషి యొక్క పాత వీడియో ఇటీవల జరిగిన సంఘటనగా షేర్ చేయబడుతోంది.అయితే,తాజా అధికారిక ధృవీకరణ ప్రకారం ఉచిత విద్యుత్ సబ్సిడీ 2025 వరకు కొనసాగుతుంది.
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —
మరి కొన్ని Fact Checks:
శనివారం, మే 25, 2024న ఢిల్లీలో ఏడు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఢిల్లీ వాసులకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ సబ్సిడీని ఉపసంహరించుకుంటున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది.మరుసటి రోజు (May 23, 2024) నుంచి ఉచిత విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఢిల్లీ మంత్రి అతిషి మర్లెనా చెబుతున్నట్లు వీడియో క్లిప్‌లో ఉంది.
लो भाई उतर गया बुखार😂😂😂people who voted for freebies deserved this. Freebies are a sure recipe for economic disaster✌
याने कल से फोकटगिरी बंद ! @AamAadmiParty का फोकटिया वादा अब चुकाओ बिल ज्यादा ।इसीलिए चुनो मोदी का वादा। @BJP4Indiapic.twitter.com/nMA182LBaC
— Jc Naithani🇮🇳*Modi Ka Parivar (@JcNaithani) May 23, 2024
వాదన ఈ విధంగా ఉంది: “ఉచిత పథకాలు/ఉచిత రాయితీలు ఖచ్చితంగా ఆర్థిక విపత్తుకు దారి తీస్తాయి.ఉచిత పథకాలు కోసం ఓటు వేసిన వ్యక్తులు దీనికి కారణం,కావున మీరే బాధపడతారు.”
ఢిల్లీ వాసులకు ఢిల్లీ ప్రభుత్వం 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)అందజేస్తున్న ఈ సబ్సిడీ దేశ రాజధానిలో రాజకీయ పార్టీల మధ్య వివాదంగా మారింది.
విభిన్న వ్యాఖ్యలు మరియు శీర్షికలతో వాదన/దావా ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.
FACT-CHECK
Digiteye India బృందం WhatsAppలో అభ్యర్థనను స్వీకరించినప్పుడు, మేము ముందుగా Atishi మరియు AAP యొక్క అధికారిక హ్యాండిల్ కోసం పరిశీలించగా,ఒక సంవత్సరం క్రితం వార్తా సంస్థ ANI అప్‌లోడ్ చేసిన అసలైన వీడియోలో మంత్రి అతిషి విద్యుత్ సబ్సిడీ గురించి మాట్లాడుతున్నట్లు మేము గుర్తించాము.ఇది ఏప్రిల్ 14, 2023న ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నప్పుడు పోస్ట్ చేయబడింది, మే 24, 2024న జరిగిన సంఘటన కాదు.
#WATCH | From today, the subsidized electricity given to the people of Delhi will be stopped. This means from tomorrow, the subsidized bills will not be given. This subsidy is stopped because AAP govt has taken the decision to continue subsidy for the coming year, but that file… pic.twitter.com/lYZ3lJ0Od7
ఏఎన్‌ఐ(ANI) కథనం ప్రకారం, “ఈ రోజు నుండి, ఢిల్లీ ప్రజలకు ఇచ్చే సబ్సిడీ విద్యుత్ నిలిపివేయబడుతుంది. అంటే రేపటి నుండి,సబ్సిడీ బిల్లులు ఇవ్వబడవు.AAP ప్రభుత్వం రాబోయే సంవత్సరానికి సబ్సిడీని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది,కానీ ఆ ఫైల్ ఢిల్లీ LG (లెఫ్టినెంట్ గవర్నర్) పరిశీలనలో ఉంది మరియు ఫైల్ ఆమోదించే వరకు, AAP ప్రభుత్వం సబ్సిడీ బిల్లును విడుదల చేయడం కుదరదు: ఢిల్లీ మంత్రి అతిషి” మరియు తేదీ ఏప్రిల్ 14, 2023 అని స్పష్టంగా కనపడుతుంది.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర సబ్సిడీ ఫైల్ పెండింగ్‌లో ఉండడం వలన ఆలస్యానికి కారణమైందని అతిషి హిందీలో చెప్పడం వీడియోలో వినవచ్చు. అయితే, తాజా అధికారిక ధృవీకరణ ప్రకారం సమస్య పరిష్కరించబడిందని మరియు సబ్సిడీని 2025 వరకు కొనసాగించాలనే నిర్ణయం జరిగిందని వార్తా నివేదికలు ధృవీకరించాయి.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీ.కే సక్సేనా ఏప్రిల్ 13, 2024న ఢిల్లీలో విద్యుత్, నీరు, బస్సు ఛార్జీల రాయితీలు యధావిధిగా కొనసాగుతాయని,మరియు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉన్నందున పథకాలను నిలిపివేస్తామనే ప్రకటనలను పట్టించుకోవద్దని/నమ్మవద్దని ప్రజలను కోరారు.
వాదన/Claim: రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో భారత రాజ్యాంగానికి బదులు చైనా రాజ్యాంగం కాపీని ప్రదర్శిస్తూ కనిపిస్తున్నారనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన.రాహుల్ గాంధీ చైనా రాజ్యాంగాన్ని కాకుండా గోపాల్ శంకరనారాయణన్ (EBC ద్వారా ప్రచురించబడింది) వ్రాసిన భారత రాజ్యాంగంతో (కోటు పాకెట్ పుస్తకం) కనిపిస్తున్నారు.
రేటింగ్: పూర్తిగా తప్పు —
Fact Check వివరాలు:
ఇటీవల అనేక ర్యాలీలలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత రాజ్యాంగం యొక్క ఎరుపు రంగు కాపీని ప్రదర్శిస్తూ కనిపిస్తుండంతో,అతని ప్రత్యర్థులు ఆ కాపీ చైనా రాజ్యాంగం కాపీ అని, భారత రాజ్యాంగం కాదని పేర్కొనడం జరిగింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వాస్ శర్మ పోస్ట్ చేసిన దావాను క్రింద చూడండి:
భారత రాజ్యాంగం కవర్ నీలం రంగులో ఉంది. చైనా రాజ్యాంగం కవర్ ఎరుపు రంగులో ఉంది. రాహుల్ చైనా రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తూ కనిపిస్తున్నారా? ధృవీకరించవలసిన అవసరం ఉంది.
The original copy of the Constitution of India has a blue cover .
The original Chinese constitution has a red cover.
— Himanta Biswa Sarma (Modi Ka Parivar) (@himantabiswa) May 17, 2024
“రాహుల్ తన సమావేశాలకు హాజరయ్యే ప్రజలకు ఎరుపు రంగులో ఉన్న చైనా రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తున్నారు.నీలి రంగులో ఉన్న మన రాజ్యాంగం, ‘రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు’ అనే అధ్యాయాన్ని కలిగి ఉంది.ఈ అధ్యాయం మన దేశంలో యూనిఫాం సివిల్ కోడ్‌ని అమలు చేయడం ఒక విధి అని సూచిస్తుంది.దీన్ని ఇప్పుడు రాహుల్ వ్యతిరేకిస్తున్నారు.అందుకే అతని చేతిలో ఉన్న రాజ్యాంగం తప్పనిసరిగా చైనాదేనని నేను ఖచ్చితంగా భావిస్తున్నానని”ఆయన మరుసటి రోజు,మే 18, 2024న సమర్ధించుకున్నారు.
Rahul is displaying a red Chinese constitution to the people attending his meetings.
Our constitution, in blue, includes a chapter called the Directive Principles of State Policy, which makes it a sacred duty to enact a Uniform Civil Code in our country; Rahul is now opposing… https://t.co/U06wC5U2gwpic.twitter.com/rHlxxzd37z
— Himanta Biswa Sarma (Modi Ka Parivar) (@himantabiswa) May 18, 2024
పైన ట్వీట్‌లో చూసినట్లుగా, ఎరుపు రంగు కవర్‌తో ఉన్న చైనా రాజ్యాంగం మరియు మరొకటి నీలం రంగు కవర్‌తో ఉన్న భారత రాజ్యాంగం చూడవచ్చు.ఈ ట్వీట్ వైరల్‌గా మారి సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
FACT-CHECK
తన ఇటీవలి బహిరంగ ర్యాలీలన్నింటిలో, రాహుల్ గాంధీ ఎరుపు రంగు కవర్‌తో ఉన్న పుస్తకంతో కనిపించారు.భారతదేశంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు,ఒకే విధమైన ప్రాథమిక హక్కులతో పేదలు మరియు ధనికుల మధ్య సమానత్వాన్ని నిర్ధారించిన రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.మేము పుస్తకాన్ని నిశితంగా పరిశీలించినప్పుడు, ఎరుపు కాపీపై “భారత రాజ్యాంగం” అని స్పష్టంగా వ్రాయబడిందని మేము గ్రహించాము.Digiteye బృందం పుస్తకాన్ని నిశితంగా పరిశీలించినప్పుడు,ఎరుపురంగు కాపీపై “భారత రాజ్యాంగం” అని స్పష్టంగా వ్రాయబడిందని మేము గమనించాము.
— Telangana Youth Congress (@IYCTelangana) April 29, 2024
ఆంగ్లంలో మరియు చేతితో వ్రాసిన అసలు భారత రాజ్యాంగం ఇక్కడ చూడవచ్చు:
అయితే, ఎరుపు రంగు కవర్‌తో ఉన్న భారత రాజ్యాంగం పుస్తకం, గోపాల్ శంకరనారాయణన్ వ్రాసిన ‘కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా (కోట్ పాకెట్ ఎడిషన్)’ అనే ప్రత్యేక సంచికను ఈస్టర్న్ బుక్ కంపెనీ (EBC) ప్రచురించింది, ఇది EBC వెబ్‌స్టోర్‌లో మరియు అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్ లో కూడా అందుబాటులో ఉంది:
కావున,రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో ప్రదర్శిస్తున్న కాపీ,గోపాల్ శంకరనారాయణన్ వ్రాసిన EBC ఎడిషనని తెలుస్తుంది.
చైనీస్ రాజ్యాంగం కూడా ఎరుపు రంగులో కనిపిస్తుంది, కానీ కవర్ పైన అక్షరాలు దివువన ఉండడం చూడవచ్చు.
వాదన/Claim: మెట్రో ఫోటోతో ఉన్న పోస్టర్, ప్రధాని మోదీ సాధించిన విజయాల్లో ఒకటిగా బీజేపీ పశ్చిమ బెంగాల్ విభాగము వారిచే చేయబడిన వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. సింగపూర్‌లోని జురాంగ్ మెట్రో ఇమేజ్ను/చిత్రాన్ని, మోదీ సాధించిన ఘనతగా చూపబడింది.
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —
Fact Check వివరాలు:
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ బిజెపి సోషల్ మీడియాలో పోస్టర్‌ను విడుదల చేసింది, దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో భారతదేశం యొక్క మెట్రో రైలు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కృషికి అభినందనలు తెలిపారు.
কর্মসংস্থান না বাড়লে কীভাবে ভারতের শহরে শহরে পৌঁছে গেল মেট্রো পরিষেবা?
బెంగాలీలో దావా ఇలా ఉంది: কর্মসংস্থান না বাড়লে কীভাবে ভারতের শহরে শহরে পৌঁছে গেল মেট্রো পরিষেবা? কংগ্রেস বলবে, বিজেপি করবে!” [బెంగాలీ అనువాదం ఇలా ఉంది: “ఉపాధిని పెంచకుండా మెట్రో సేవలు భారతదేశంలోని నగరాలకు ఎలా వచ్చాయి? కాంగ్రెస్ మాటలు చెబుతుంది, బీజేపీ చేసి చూపిస్తుంది!”]
భారత్‌లో మోడీ సాధించిన విజయానికి సంబంధించి,ఈ ఇమేజ్ ను ఆయనకు ఆపాదించడం గురించి వినియోగదారులు ప్రశ్నిస్తూన్న ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. పోస్టర్‌లో ఉపయోగించిన రైల్వే లైన్ సింగపూర్‌లోని జురాంగ్ ఈస్ట్ MRT చిత్రమని, భారతదేశంలోనిది కాదని పలువురు X వినియోగదారులు సూచించారు.
FACT CHECK
Digiteye India టీం జురాంగ్ ఈస్ట్ MRT చిత్రాల కోసం వెతకగా, BJP యొక్క పశ్చిమ బెంగాల్ విభాగము వికీపీడియాలో ఉపయోగించిన చిత్రాన్ని తీసుకొని అది మోడీచే నిర్మించబడిందని వాదన/దావా చేయడం జరిగిందని గుర్తించాము. జురాంగ్ ఈస్ట్ MRT స్టేషన్ అనేది సింగపూర్‌లోని జురాంగ్ ఈస్ట్‌లో ఒక ఎత్తైన కూడలి, ఇది సింగపూర్ యొక్క SMRT ట్రైన్స్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతుంది.
మరిన్ని వివరాల కోసం Digiteye India టీం Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో చిత్రాన్ని పరిశీలించగా,ఇదే చిత్రాన్నిఫిబ్రవరి 13, 2020న సింగపూర్‌కు చెందిన “ది స్ట్రెయిట్స్ టైమ్స్‌లో” ప్రచురించబడిందని మేము గుర్తించాము.
“ట్రాక్ లోపం వల్ల చోవా చు కాంగ్ మరియు జురాంగ్ ఈస్ట్ మధ్య MRT ప్రయాణానికి అంతరాయం” ఏర్పడిందనే శీర్షికతో ప్రచురించబడింది.
మౌలిక సదుపాయాల పరంగా సాధించిన విజయాన్ని క్లెయిమ్ చేయడానికి బిజెపి విభాగము తప్పు చిత్రాన్ని ఉపయోగించడం ఇదేం మొదటిసారి కాదు. 2021లో ఉత్తరప్రదేశ్‌లో ఎక్స్‌ప్రెస్‌వే గురించి ఇదే విధమైన వాదనను Digiteye India బృందం తప్పని నిరూపించింది.
అందువల్ల, సంబంధం లేని ఫోటోతో చేసిన వాదన/దావా తప్పు.
వాదన/Claim:మోదీ మళ్లీ ప్రధాని అవుతారని రాహుల్ గాంధీ చెప్పారనేది వాదన.
నిర్ధారణ/Conclusion: ఈ వాదన తప్పు. రాహుల్ గాంధీ ‘మోదీ మళ్లీ ప్రధాని అవుతారని’ చెపుతున్నట్లుగా ఆయన గొంతు/వాయిస్ మార్చబడింది.
రేటింగ్: పూర్తిగా తప్పు —
వాస్తవ పరిశీలన వివరాలు:
నరేంద్ర మోడీ మళ్లీ భారత ప్రధాని కాబోతున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ బహిరంగ ర్యాలీలో చెప్పినట్లుగా వాట్సాప్‌లో సంచలనాత్మక వీడియో షేర్ చేయబడుతోంది.దిగువ చూపిన విధంగా ఇది Xలో కూడా షేర్ చేయబడింది:
మొత్తం ఏడు దశలలో నాలుగు దశల లోక్‌సభ ఎన్నికలు జరిగిన తర్వాత ఇది సంచలనం కావడంతో Digiteye India టీమ్ ఈ పోస్ట్ యొక్క వాస్తవ పరిశీలన చేపట్టింది.
మొదట, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మోదీకి అనుకూలంగా మాట్లాడటం అసంభవం మరియు అహేతుకం. రెండవది,పెదవి-సమకాలీకరణ దృశ్యం భిన్నంగా కనిపిస్తుండడంతో,ఇది వాయిస్ ట్రాక్ మార్చబడిందని సూచిస్తుంది.ఇంకా,మేము ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) అధికారిక వెబ్‌సైట్ మరియు ట్విట్టర్‌లోని సోషల్ మీడియా హ్యాండిల్‌ను పరిశీలించాము.
ఈ వీడియోకు ప్రతిస్పందనగా, INCఈ వాదనను వెంటనే ఖండించింది మరియు ఇక్కడ చూసినట్లుగా వీడియో యొక్క నకిలీ మరియు నిజమైన వీడియోను అందుబాటులో ఉంచింది.
डूबती हुई BJP और नरेंद्र मोदी की फेक न्यूज फैक्ट्री को अब फेक वीडियो का ही सहारा है।
आदतन राहुल गांधी जी के भाषण को कांट-छांटकर झूठा वीडियो बनाया और फिर रंगे हाथों पकड़े गए।
ఇంకా, INC ఇలా పేర్కొంది, “डूबती हुई BJP और नरेंद्र मोदी की फेक न्यूज फैक्ट्री को अब फेक वीडियो का ही सहारा है। आदतन राहुल गांधी जी के भाषण को कांट-छांटकर झूठा वीडियो बनाया और फिर रंगे हाथों पकड़े गए। आप खुद देख लें [తెలుగులో అనువాదం:మునిగిపోతున్న బీజేపీ మరియు నరేంద్ర మోదీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఇప్పుడు కేవలం ఫేక్ వీడియోలపైనే ఆధారపడాల్సి వస్తోంది. అలవాటు ప్రకారం రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ఎడిట్ చేసి ఫేక్ వీడియో చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.మీరే స్వయంగా చూడవచ్చు.👇”.]
వాదన/Claim: తెలుగు నటుడు చిరంజీవి పోలింగ్ బూత్ వద్ద క్యూ పద్దతి పాటించకుండా, దాటుకొని ముందుకు వెళ్లారనేది వాదన.
నిర్ధారణ/Conclusion: ఈ సంఘటన 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలోనిది కాదని, పదేళ్ల క్రితం 2014 ఎన్నికలు జరిగినప్పుడు జరిగిన సంఘటనని నిర్ధారించబడింది. పాత వీడియో మళ్లీ ఉపయోగించబడింది.
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —
వాస్తవ పరిశీలన వివరాలు:
లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, అల్లు అర్జున్,జూనియర్ ఎన్టీఆర్ మరియు ఇతరులతో సహా పలువురు తెలుగు సినీ తారలు సోమవారం, మే 13, 2024 నాడు హైదరాబాద్‌లోని పలు బూత్‌లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.అయితే,తెలుగు నటుడు చిరంజీవి పోలింగ్ బూత్ క్యూ పద్దతి పాటించడం లేదని ఒక ఓటరు ఆయనను ప్రశ్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వాదన/దావా ఇలా ఉంది:”@చిరుట్వీట్స్(@ChiruTweets ) మరియు అతని కుమారుడు RRR నటుడు @ఎల్లప్పుడూ రామ్‌చరణ్‌ని(@AlwaysRamCharan) పోలింగ్ బూత్‌లో క్యూ పద్దతి పాటించడం లేదని ఒక ఒక సామాన్యుడు ప్రశ్నించారు.ఒక సామాన్యుడు ఈ ప్రత్యేకమైన వ్యక్తులను ప్రశ్నించడం అభినందనీయం. (sic)”. మే 13, 2024న తెలంగాణలో పోలింగ్ రోజున ఇది షేర్ చేయబడింది.
చిరంజీవి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ @chirutweets మరియు అతని కొడుకు X హ్యాండిల్ @@AlwaysRamCharan.
క్యూలో ఉన్నవారు”మిమ్మల్ని ప్రత్యేకంగా చూడాలా..క్యూలో చేరండి”అని అనటం మరియు ఓ వ్యక్తి నటుడితో వాదించడం వీడియోలో చూడవచ్చు.
FACT-CHECK
NDTV న్యూస్ ఛానెల్‌కు చెందిన యాంకర్ చిరంజీవిని కేంద్ర మంత్రిగా ప్రస్తావించిన వీడియోను Digiteye India బృందం పరిశీలించగా,ఇది నిజమే కానీ అక్టోబర్ 2012 నుండి మే 2014 వరకు, ఆయన కేంద్ర పర్యాటక మంత్రిగా ఉన్నప్పటి వీడియో. కొన్ని వీడియోలు ఎప్పటికీ పాతవి కావు అంటూనే,మరోపక్క ఇది పాత వీడియో అని మరొక ట్వీట్ పరోక్షంగా పేర్కొంది.
తదుపరి పరిశీలించగా ఈ సంఘటన 2024 లోక్‌సభ ఎఎన్నికల సమయంలోనిది కాదని, పదేళ్ల క్రితం 2014 ఎన్నికలు జరిగినప్పుడు జరిగిన సంఘటనని గమనించాము. 2014లో జరిగిన అసలైన సంఘటనను ఇక్కడ చూడండి.
చిరంజీవిని ప్రశ్నించిన వ్యక్తి “ఓటు వేయడానికి” లండన్ నుండి వచ్చిన ఎన్నారై (NRI) గంటా రాజా కార్తీక్ అని ఒక వార్తా కథనం గుర్తించింది. కార్తీక్‌ను ప్రస్తావిస్తూ, తాను ఓటు వేయడానికి ఉదయం 8 గంటల నుండి సుమారు ఒకటిన్నర గంటల పాటు వేచి ఉన్నానని,”నేను కూడా ఈ దేశవాసినే మరియు అతను కూడా ఈ దేశవాసే అయినందున ఇది సరైంది కాదని నేను భావించాను” అని కార్తీక్ పేర్కొన్నడని వార్త నివేదిక తెలిపింది.
అయితే ఓటరు లిస్టులో తన పేరు ఉందో లేదో చూసుకునేందుకు బూత్ డెస్క్‌కి వెళ్లానని చిరంజీవి ఆ తర్వాత అదే న్యూస్ వీడియోలో మీడియాకు స్పష్టం చేసారు. “నేను (చట్టాన్ని ఉల్లంఘించే) వ్యక్తిని కాదు. నేను ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిని” అని నటుడు మీడియాతో అన్నారు. కావున తెలుగు నటుడు చిరంజీవి పోలింగ్ బూత్ వద్ద క్యూ పద్దతి పాటించకుండా,దాటుకొని ముందుకు వెళ్లారని వాదన అవాస్తవం.
వాదన/Claim: అధికారంలోకి వస్తే వారసత్వ పన్నును అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ ఇచ్చిందనేది వాదన/దావా.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారసత్వ పన్నును అమలు చేసే ప్రణాళిక గురించి ప్రస్తావించలేదు.ఈ పన్నుగురించి విదేశాలలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు మరియు అతను అమెరికాలో పన్నుల గురించి ఒక ఉదాహరణ ఇస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఈ వాదనను పార్టీ ప్రణాళిక కాదని కొట్టిపారేసింది.
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —
Fact Check వివరాలు:
లోక్‌సభ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న తరుణంలో,రెండు జాతీయ పార్టీలు — బిజెపి మరియు కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం, కాంగ్రెస్ వాగ్దానం చేసిన సంపద పునర్విభజనపై విచిత్రమైన మలుపు తిరిగింది. వార్తా సంస్థ ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా “యుఎస్‌లో వారసత్వపు పన్ను” గురించి ప్రస్తావించినప్పుడు,ఈ అంశానికి ఆజ్యం పోసింది.
సాధారణంగా, మరణించిన వ్యక్తి యొక్క ఆస్తులు/సంపదపై వారసత్వపు పన్ను విధించబడుతుంది, అది వారి వారసుల మధ్య పంపిణీ చేయబడుతుంది. జపాన్, అమెరికా మరియు ఫ్రాన్స్ వంటి అనేక దేశాలు అటువంటి పన్నును విధిస్తున్నాయి.
అయితే,భారతదేశంలో వ్యతిరేకులు కూడా ఇలాంటి పన్నుకు అభ్యంతరం చెప్పినప్పుడు, సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఇది ఊపందుకుంది. అనేక మీమ్‌లు, వార్తా నివేదికలు, టీవీ చర్చలు ఈ సమస్యను ప్రసారం చేయడంతో ప్రతి వార్తా ఛానెల్‌లో ఇవి ముఖ్యాంశాలుగా మారాయి.
Inheritance tax- Money for illegal inva*ers.
If you have saved Rs 10 lakhs in your bank after toiling all your life, after your death Rs 5.5 lakhs will be taken away by govt.😇😇 Your children will inherit only Rs 4.5 lakhs.😇😇
It is such a dangerous idea.
It will be… pic.twitter.com/hCOBxWy63Q
Digiteye India బృందం WhatsApp టిప్‌లైన్‌లో దీని గురించి అభ్యర్ధనను అందుకొని పరిశీలించగా, ఈ సమస్యపై కొన్ని క్లెయిమ్‌లను ఇక్కడ మరియు ఇక్కడ గమనించాము.
FACT CHECK
మొదట, మేము కాంగ్రెస్ మ్యానిఫెస్టోను పరిశీలించగా, కాంగ్రెస్ “న్యాయ పాత్ర” అనే డాక్యుమెంట్‌లో వారసత్వపు పన్ను లేదా దానికి సంబంధించిన చర్య గురించి ప్రస్తావించలేదు. ‘పన్ను మరియు పన్ను సంస్కరణలు’ సెక్షన్ కింద, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రత్యక్ష పన్నుల కోడ్ అమలు చేయడం, ఏంజెల్ పన్ను తొలగింపు, వ్యక్తులు మరియు భాగస్వామ్య సంస్థల యాజమాన్యంలోని MSMEలపై పన్ను భారాన్ని తగ్గించడం మరియు GST కౌన్సిల్‌ను పునఃరూపకల్పన చేయడం వంటివి ప్రస్తావించబడ్డాయి.
“వివాహం, వారసత్వం, దత్తత, సంరక్షకత్వం మొదలైన విషయాలలో స్త్రీ మరియు పురుషులకు సమాన హక్కులు ఉండాలి” అని పార్టీ వాగ్దానం చేసినప్పుడు “వారసత్వం” అనే పదం మహిళా సాధికారత అనే దృష్టికోణం నుంచీ సూచించబడింది. మేము(పార్టీ) అన్ని చట్టాలను సమీక్షిస్తాము మరియు స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని నిర్ధారిస్తాము. కాబట్టి, దీనికి వారసత్వపు పన్నుతో సంబంధం లేదు.
తర్వాత, మేము శామ్ పిట్రోడా యొక్క ANI ఇంటర్వ్యూని పరిశీలించగా, అక్కడ అతను అమెరికాలోని వారసత్వపు పన్నును గురించి ప్రస్తావించడం గమనించాము. “భారతదేశంలో వారసత్వ పన్నును కాంగ్రెస్ సమర్థిస్తున్నారా? అనే శీర్షికతో ఇంటర్వ్యూ యొక్క పూర్తి వీడియో ANI యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉంది. ఈ ఇంటర్వ్యూలో సామ్ పిట్రోడా పెద్ద సూచనను ఇచ్చారు. దీన్ని ANI తన X హ్యాండిల్‌లో ఏప్రిల్ 24, 2024న ఇక్కడ షేర్ చేసింది:
ఈ ఇంటర్వ్యూలో,శామ్ పిట్రోడాని “దేశంలోని సంపదపై సర్వే గురించి కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని మరియు “ప్రజల మధ్య తిరిగి పంపిణీ చేసే కార్యక్రమం” గురించి అడిగారు.
అతని ప్రత్యుత్తరంలో, సామ్ పిట్రోడా ఇలా అన్నారు: “అమెరికాలో వారసత్వపు పన్ను ఉంది. ఉదాహరణకి ఒకరి వద్ద $100 మిలియన్ల విలువైన సంపద ఉందని అనుకుందాం మరియు అతను చనిపోయినప్పుడు అతను బహుశా 45% మాత్రమే తన పిల్లలకు బదిలీ చేయగలడు. మిగిలిన 55% ప్రభుత్వం తీసుకుంటుంది.ఇప్పుడు ఇది ఒక ఆసక్తికరమైన చట్టం. మీ తరంలో మీరు, సంపదను సంపాదించారు, మీరు ఇప్పుడు వెళ్లిపోతున్నారు, మీరు మీ సంపదను ప్రజల కోసం వదిలివేయాలి, మొత్తం కాదు, అందులో సగం, ఇది నాకు న్యాయంగానే అనిపిస్తుంది.భారతదేశంలో, మీకు అలా లేదు. ఎవరికైనా 10 బిలియన్ల సంపద ఉంటే మరియు అతను చనిపోతే, అతని పిల్లలకు 10 బిలియన్లు వస్తాయి, ప్రజలకు ఏమీ లభించదు. అందులో సగం మీకు అందుతుందని, అందులో సగం ప్రజలకు అందుతుందని చట్టం చెబుతోంది. (sic)”
“కాబట్టి ఇవి ప్రజలు చర్చించాల్సిన సమస్యలే.ఆఖరున ఎలాంటి తీర్మానం చేస్తారో నాకు తెలియదు కానీ సంపద పునఃపంపిణీ గురించి మాట్లాడేటప్పుడు, మేము కొత్త విధానాలు మరియు కొత్త కార్యక్రమాల గురించి,మరియు ఇది అతి ధనవంతుల ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతున్నాము, (sic)” అని ఆయన చెప్పారు.
US నివాసిగా, శామ్ పిట్రోడా తన దేశంలో పన్నుగురించి ఒక ఉదాహరణ ఇస్తున్నారు, కానీ భారతదేశంలో అదే అమలు చేయాలని స్పష్టంగా ప్రతిపాదించటంలేదు.
ఈ ఇంటర్వ్యూపై బిజెపి నుండి విమర్శలు వచ్చినప్పుడు, శామ్ పిట్రోడా ఒక వివరణను జారీ చేసారు, “నేను టివిలో నా సంభాషణలో యుఎస్‌లో “యుఎస్ వారసత్వ పన్ను” ఉంటుందని సాధారణంగా ప్రస్తావించాను.నేను వాస్తవాలను ప్రస్తావించకూడదా? ప్రజలు చర్చించుకోవాల్సిన సమస్యలపై నేను మాట్లాడాను. దీనికి కాంగ్రెస్‌తో సహా ఏ పార్టీ విధానాలకి సంబంధం లేదు(sic).” ఆయన ఇంకా మాట్లాడుతూ, “55% తీసుకుంటామని ఎవరు చెప్పారు? భారతదేశంలో ఇలాంటివి చేయాలని ఎవరు చెప్పారు? బీజేపీ, మీడియా ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు.(sic)”
కాంగ్రెస్ పార్టీ తన వంతుగా, ఈ సమస్య నుండి దూరంగా ఉంది.
కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఆలోచన లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. “రాజ్యాంగం ఉంది, మాకు అలాంటి ఉద్దేశ్యం లేదు. అతని ఆలోచనలను మా పై ఎందుకు రుద్దుతున్నారు? ఓట్ల కోసమే ఈ ఆటలన్నీ ఆడుతున్నాడు…””
विरासत कर (Inheritance Tax) लागू करने की कांग्रेस की कोई योजना नहीं है। दरअसल राजीव गांधी ने तो 1985 में एस्टेट ड्यूटी को ख़त्म कर दिया था।
कृपया मोदी सरकार के पूर्व वित्त राज्य मंत्री और बाद में वित्त संबंधी संसदीय समिति के अध्यक्ष जयंत सिन्हा को सुनिए। उन्होंने अमेरिका की तरह… pic.twitter.com/0oxEr1XGLs
కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జైరాం రమేష్ అదే విషయాన్ని పునరుద్ఘాటిస్తూ, “కాంగ్రెస్‌కు వారసత్వ పన్నును ప్రవేశపెట్టే ఆలోచన లేదు. వాస్తవానికి, ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 1985లో ఎస్టేట్ డ్యూటీని రద్దు చేశారు.”
Wow. #InheritanceTax is proposed by none other BJP MP, former Minister of State, Finance.
కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ ఇలా అన్నారు, “ఎవరి బంగారాన్ని తీసుకోవాలో మరియు మహిళల మంగళసూత్రాన్ని లాక్కోవాలని (కాంగ్రెస్ మ్యానిఫెస్టో) ఎక్కడా మాట్లాడలేదు… మేనిఫెస్టో కమిటీలో శామ్ పిట్రోడా లేరు.ఇది మా ఎజెండాలో భాగం కాదు…ఇది అతని వ్యక్తిగత అభిప్రాయం. మీరు ఇతరుల వ్యక్తిగత అభిప్రాయాన్ని తీసుకోలేరు మరియు అది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యం అని చెప్పలేరు.”
#WATCH | Thiruvananthapuram, Kerala: On Chairman of Indian Overseas Congress Sam Pitroda’s remark, party MP and candidate from Thiruvananthapuram, Shashi Tharoor says, “…What Sam Pitoda has said is not in the manifesto…We are a democratic party, everyone has a right to their… pic.twitter.com/FyqCOs33Fv
దావా/వాదన/Claim: IMF తన ఏప్రిల్ 2024 వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ నివేదికలో “2025 నాటికి బంగ్లాదేశ్ కంటే భారతదేశం పేదరికంలో ఉంటుంది” అని పేర్కొన్నదనేది వాదన.
నిర్ధారణ/Conclusion: దావా తప్పు. ఇది 2020 కోవిడ్ మహమ్మారి కాల అంచనాల ఆధారంగా రూపొందించబడింది, అయితే ప్రస్తుత IMF అంచనా ప్రకారం 2025 నాటికి మొత్తం GDP వృద్ధి పరంగా భారతదేశం బంగ్లాదేశ్ కంటే చాలా ముందుంటుంది.
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —
Fact Check వివరాలు:
2025 నాటికి భారతదేశం బంగ్లాదేశ్ కంటే పేదదేశంగా మారబోతుందని ఇటీవలి అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ నివేదిక హెచ్చరించిందని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ప్రచారం చేయబడింది.శీర్షిక ఇలా ఉంది:
“India becoming poorer and poorer – ANOTHER SHOCKING REPORT BY IMF !!!*INDIA WILL POORER THAN BANGLADESH BY 2025*”
India becoming poorer and poorer ANOTHER SHOCKING REPORT BY IMF !!!*
— thangminlien haokip (@thangminli88118) April 6, 2024
మరొక X వినియోగదారు ఈ విధంగా షేర్ చేసారు: “ఇంతవరకు ఇది సంభవించలేదు. మోదీ భారతదేశ భవిష్యత్తును పణంగా పెట్టారు. భారతదేశం ఇప్పుడు “అభివృద్ధి చెందుతున్న దేశం” కాదు.ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.
FACT CHECK
Digiteye India బృందం దావా/క్లెయిమ్ యొక్క ప్రామాణికతను పరిశీలించినప్పుడు, 2020లో మరియు 2021లో భారతదేశంతో సహా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కోవిడ్ మహమ్మారి సంభవించినప్పుడు మేము ఇదే విధమైన దావా/క్లెయిమ్‌లను గమనించాము. దీని ప్రకారం, IMF 2020 నివేదిక, భారతదేశం వాస్తవ తలసరి GDP వృద్ధి పరంగా $1,876.53 వద్ద బంగ్లాదేశ్ అంచనా $1,887.97 ( డాలర్ పరంగా)కంటే ఎలా కొంచెం తక్కువగా ఉందొ వివరించింది.
వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ పేరుతో ఏప్రిల్ 2024లో ప్రచురించబడిన తాజా IMF నివేదిక, 2024లో భారతదేశ GDP 6.8% మరియు 2025లో 6.5% వృద్ధి అంచనాలను అందించింది. అదేవిధంగా, నివేదిక బంగ్లాదేశ్ జిడిపి వృద్ధికి 2024లో 5.7% మరియు 2025లో 6.6% అంచనాలను అందించింది.
అయితే, వృద్ధి రేటు దేశం యొక్క మొత్తం GDP వృద్ధిని ప్రతిబింబించదు. అంతేకాకుండా, 2024 IMF నివేదిక ప్రకారం, ప్రొజెక్షన్ తలసరి GDP గురించి ఇచ్చింది, కానీ ఇది దేశం యొక్క మొత్తం సంపదను ఎప్పుడూ ప్రతిబింబించదు. మొత్తం GDP మరియు తలసరి GDP మధ్య చాలా తేడా ఉంటుంది, ఎందుకంటే రెండోది జనాభాను పరిగణనలోకి తీసుకుంటుంది, మరియు మొత్తం GDPని జనాభాతో భాగించడం ద్వారా లెక్కించబడుతుంది. మొత్తం GDP పరంగా, అదే IMF నివేదిక 2025లో భారతదేశ GDP $4.3 ట్రిలియన్‌లకు చేరుకుంటుందని అంచనా వేసింది, అయితే బంగ్లాదేశ్ కేవలం $491.81 బిలియన్ లేదా అంతకంటే తక్కువ హాఫ్-బిలియన్‌కు చేరుకుంటుందని అంచనా.
కోవిడ్ మహమ్మారి కాలం యొక్క నివేదికను పక్కన పెడితే, 2024 IMF అంచనా ప్రకారం బంగ్లాదేశ్ యొక్క తలసరి GDP$2,650తో పోలిస్తే భారతదేశ తలసరి GDP $2,730కి చేరుతుందని సూచిస్తుంది. అందువల్ల, భారతదేశ తలసరి GDP బంగ్లాదేశ్ కంటే ఎక్కువగానే కొనసాగుతుంది మరియు తాజా అంచనాల ప్రకారం ఈ ట్రెండ్ కనీసం 2028 వరకు కొనసాగే అవకాశం ఉంది. పవర్ పర్చేజింగ్ ప్యారిటీ (PPP) పరంగా కూడా, బంగ్లాదేశ్ యొక్క $10,170తో పోలిస్తే, PPP తలసరి భారతదేశ GDP 2025 నాటికి $10,870కి చేరుతుందని అంచనా వేయబడింది.
అందుకే, బంగ్లాదేశ్ కంటే భారతదేశం పేదరికంలో ఉంటుందన్న వాదన తప్పుదారి పట్టించే విధంగా ఉంది.