వాదన/Claim: వారణాసి లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా లెక్కించబడిన ఓట్ల మొత్తం , పోలైన ఓట్లను మించిపోయాయనే వాదన సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వార ఆరోపించబడింది.
నిర్ధారణ/Conclusion: ఈ వాదన/దావా తప్పు. 2019లో గానీ, 2024లో గానీ వారణాసిలో మోదీకి పోలైన(నమోదైన) ఓట్ల సంఖ్య, ఓటర్ల సంఖ్యను మించలేదు.
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —
Fact Check వివరాలు:
ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన వారణాసిలో ఈవీఎంలలో (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు) పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు ఆయనకు వచ్చాయని సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది.
वाराणसी में नरेन्द्र मोदी चुनाव लड़ रहे थे 11 लाख लोगों ने वोट डाले और EVM मसीन से निकले 13 लाख 87 हजार वोट…😎🎅😎#EVM_हटाओ_पाखंडी_भगाओ pic.twitter.com/QJZ8FGGVgt
— PRBAZUKA (@prbazuka_21546) April 12, 2024
హిందీలో వాదన ఈ విధముగా ఉంది:”वाराणसी में नरेंद्र मोदी चुनाव लड़ रहे थे। 11 लाख लोगों ने वोट डाले। ईवीएम मशीन में निकले 12 लाख 87 हज़ार। ईवीएम मशीन चोर है, चुनाव आयोग चोरों का सरदार”(తెలుగు అనువాదం:”వారణాసి ఎన్నికల్లో నరేంద్ర మోదీ పోటీ చేశారు. 11 లక్షల మంది ఓటు వేయగా, ఈవీఎం యంత్రం(EVM machine) నుంచి 12 లక్షల 87 వేల ఓట్లు వచ్చాయి. ఈవీఎం యంత్రం(EVM machine) ఒక దొంగ, ఎన్నికల కమిషన్ ఆ దొంగల నాయకుడు”)
వారణాసిలో EVMలకు సంబంధించిన 2019 ఎన్నికల గురించి ఇటీవల తాజాగా చేసిన ఇలాంటి దావాను మేము గుర్తించాము.కింద చూడవచ్చు:
2019 में वाराणसी चुनाव में 11 लाख वोट डाले गए,
लेकिन EVM में 12 लाख 87000 वोट गिने गए।मुर्गी जीतने जल्दीअंडा नही देती, उतने तेजी से EVM वोट दे रही थी-वामन मेश्राम #LokSabhaElections2024 #WamanCMeshram #EVM_हटाओ_लोकतंत्र_बचाओ pic.twitter.com/vw9fHMdDod
— Shubham Dharne (@dharne_shubham) April 7, 2024
ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (BAMCEF) అధ్యక్షుడు వామన్ మెష్రామ్ ఈ వీడియో ద్వార వాదన/దావా చేసారు,అతను ఎన్నికలలో EVMల వాడకాన్ని త్రీవంగా విమర్శించారు. జనవరి 31, 2024న కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు ఈవీఎంల (EVM)ల వాడకాన్ని విమర్శిస్తూ దాని నిరసనకు నాయకత్వం వహించారు.
FACT-CHECK
ముందుగా, పోస్ట్ జూన్ 1,2024న జరిగిన ఓటింగ్ కంటే చాలా ముందుగానే ఏప్రిల్ 12, 2024న షేర్ చేయబడింది.కాబట్టి, ఇది 2024 ఎన్నికలకు వర్తించదు. 2019లో ప్రధాని మోదీ వారణాసి నుంచి విజయవంతంగా పోటీ చేసినందున, 2019 ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓట్ల గణాంకాలను మేము(Digiteye India Team)పరిశీలించాము.
2019 లోక్‌సభ ఎన్నికలలో 18,56,791 మంది ఓటర్లు ఉన్నారు మరియు ECI గణాంకాల ప్రకారం, అదనంగా 2,085 పోస్టల్ ఓట్లతో పాటు, EVMలలో నమోదై,లెక్కించబడిన మొత్తం ఓట్లు సంఖ్య 10,58,744. ఈ గణాంకాలు భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఇటీవలి 2024 లోక్‌సభ ఎన్నికల లెక్కల ప్రకారం వారణాసి నియోజకవర్గంలో 19,97,578 మంది ఓటర్లు ఉన్నారు.నమోదైన ఓట్లు 11,27,081 మరియు పోస్టల్ ఓట్లు 3,062 తో కలిపి మొత్తం ఓట్ల సంఖ్య 11,30,143. ECI వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, PM మోడీ 1,52,513 ఓట్ల తేడాతో లేదా 52.24% ఓట్ షేర్‌తో గెలిచారు. కాబట్టి, ఈ వాదన/దావా తప్పు.
మరి కొన్ని Fact Checks:
రేపటి నుంచి ఉచిత విద్యుత్ సబ్సిడీ ఆగిపోతుందని ఢిల్లీ మంత్రి అతిషి వెల్లడించారా? వాస్తవ పరిశీలన