Did Rahul Gandhi book ticket to Bangkok on June 5, 2024, the day after poll results? Fact Check

ఎన్నికల ఫలితాలను ప్రకటించిన వెంటనే జూన్ 5న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దేశం విడిచి వెళ్ళిపోతున్నారా? వాస్తవ పరిశీలన

వాదన./Claim: ఎన్నికల ఫలితాల మరుసటి రోజే రాహుల్ గాంధీ జూన్ 5, 2024న బ్యాంకాక్‌కి టికెట్ బుక్ చేసుకొని దేశం వదిలి వెళ్ళిపోతున్నారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. టిక్కెట్ మార్ఫింగ్ చేసి,డిజిటల్‌గా మార్చబడింది మరియు ఎయిర్‌లైన్స్ ఉపయోగించే PDF417 బార్‌కోడ్ లేదు.

రేటింగ్: పూర్తిగా తప్పు–

వాస్తవ పరిశీలన వివరాలు:

భారతదేశంలో అధికార భారతీయ జనతా పార్టీకి భారీ మెజారిటీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన వెంటనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పేరు మీద ఉన్న విస్తారా ఫ్లైట్ బోర్డింగ్ పాస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

జూన్ 4, 2024న అధికారికంగా కౌంటింగ్ మరియు ఎన్నికల ఫలితాలను ప్రకటించిన వెంటనే జూన్ 5న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దేశం విడిచి వెళుతున్నారని వాదన చేయబడింది. బోర్డింగ్ పాస్‌లో టికెట్ హోల్డర్‌గా రాహుల్ గాంధీ పేరు మరియు భారతదేశం నుండి థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌కి జూన్ 5, 2024 నాటి ప్రయాణ తేదీని ఉన్నట్లు పేర్కొని ఉంది.

FACT-CHECK

Digiteye India బృందం తమ WhatsApp టిప్‌లైన్‌లో అభ్యర్ధనను అందుకొని, వాస్తవ పరిశీలన కోసం మొదట ఇమేజ్/చిత్రంపై Google రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించగా,అది పాత చిత్రమని, డిజిటల్‌గా మార్చబడినట్లు గుర్తించాము.ఒకే బోర్డింగ్ పాస్‌లో 2 వేర్వేరు విమాన నంబర్‌లు ఉన్నాయి. చిత్రం 1D బార్‌కోడ్‌ను కలిగి ఉంది, అయితే ఎయిర్‌లైన్ PDF417 బార్‌కోడ్‌ను ఉపయోగిస్తుంది.

ప్రయాణీకుల చివరి పేరు ఎల్లప్పుడూ మొదట వ్రాయబడుతుంది, కానీ ఈ చిత్రంలో, మొదటి పేరు మొదట వ్రాయబడుతుంది.ముందు గాంధీ, ఆ తర్వాత రాహుల్ అని ఉండాలి. బోర్డింగ్ పాస్‌లో రెండు వేర్వేరు ఫ్లైట్ నంబర్లను (సంఖ్యలు) — ‘UK121’ అని ఒక చోట మరియు ‘UK115’ అని కౌంటర్‌ఫాయిల్‌లో చూపుతోంది.

మేము టిక్కెట్‌కి సంబంధించిన చిత్రాన్ని తీసుకొని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో సెర్చ్ చేయగా, టికెట్ ఇమేజ్/చిత్రం వాస్తవానికి 2019 ఆగస్టు 9న ఢిల్లీ విమానాశ్రయం నుండి సింగపూర్‌కి విస్తారా అంతర్జాతీయ విమానం ఎక్కిన అజయ్ అవతానీ ద్వారా పోస్ట్ చేయబడిందని మేము గమనించాము.  ‘లైవ్ ఫ్రమ్ ఎ లాంజ్‘ అనే వెబ్‌సైట్ ప్రచురించిన కథనంలో అతను ఈ చిత్రాన్ని ఉపయోగించారు.

అందువలన, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జూన్ 5, 2024న బ్యాంకాక్‌కు వెళ్లేందుకు తను టిక్కెట్‌ను బుక్ చేసుకున్నారని తప్పుడు వాదన చేయడానికి చిత్రం మార్చి చూపించబడింది. కాబట్టి ఈ వార్తలో ఎలాంటి నిజం లేదు.

మరి కొన్ని Fact Checks:

అనేక దేశాలు భారతదేశం నుండి పండ్లు మరియు కూరగాయల దిగుమతులను నిషేధించాయా? వాస్తవ పరిశీలన

రేపటి నుంచి ఉచిత విద్యుత్ సబ్సిడీ ఆగిపోతుందని ఢిల్లీ మంత్రి అతిషి వెల్లడించారా? వాస్తవ పరిశీలన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *