Tag Archives: telanagna road transport

హైదరాబాద్‌లో ప్రమాదకరమైన రీల్ కోసం ఈ యువకుడు వేగంగా వస్తున్న బస్సు ముందు పడుకున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుందా? వాస్తవ పరిశీలన

వాదన/దావా: హైదరాబాద్‌లో ప్రమాదకరమైన రీల్ కోసం ఈ యువకుడు వేగంగా వస్తున్న బస్సు ముందు పడుకున్నాడనేది వాదన/దావా.

నిర్ధారణ:తప్పుడు వాదన. యువకుడు రోడ్డుపై ఈ చర్య చేస్తున్నట్టు చూపించడానికి వీడియో ఎడిట్ చేసి సవరించబడింది.

రేటింగ్: తప్పు దారి పట్టించే ప్రయత్నం —

****************************************************************************************************************************

వాస్తవ పరిశీలన వివరాలు:

హైదరాబాద్‌లో ఓ యువకుడు రీళ్లు (Reel) తయారు చేసేందుకు వేగంగా వస్తున్న బస్సు ముందు హఠాత్తుగా పడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్టంట్ వీడియోను చాలా మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేశారు. రద్దీగా ఉండే రోడ్డుపై ఈ యువకుడు ప్రమాదకరమైన స్టంట్‌ చేస్తున్నాడని వాదన/దవా పేర్కొంది.

దావా ఇలా ఉంది: “హైదరాబాద్‌లో వేగంగా వస్తున్న బస్సు ముందు రోడ్డుపై అకస్మాత్తుగా పడుకుని ప్రమాదకరమైన స్టంట్ చేస్తూ ఒక యువకుడు తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ఈ స్టంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, నెటిజన్లలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. .(sic)”

దిగువ  వాదన/దవాలను చూడండి:

అసలు వాస్తవం ఏమిటి

DigitEye India బృందం వైరల్ వీడియోను నిశితంగా పరిశీలించినప్పుడు అది మార్చబడిన వీడియో అని మేము గమనించాము, ఒక వ్యక్తి రోడ్డు దాటుతున్నట్లు చూపుతున్న వీడియోలోని చిత్రాన్ని మార్ఫింగ్ చేశారు. ఇక్కడ, ఈ వీడియో గ్రాబ్‌లో, యువకుడు రోడ్డుపై నడుస్తూ, బస్సు దగ్గరకు వచ్చినప్పుడు, అతను బస్సు వైపు తిరిగి రోడ్డుపై పడుకోవడం చూడవచ్చు. రోడ్డు మధ్యలో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు ఏ బస్సు డ్రైవర్ అయినా వెంటనే బస్సు వేగాన్ని తగ్గించడం లేదా బ్రేక్ వేయడం చేస్తాడు కానీ నిర్లక్ష్యంగా ముందుకు వెళ్ళడు.

దిగువ చిత్రాల్లో మీరు దీన్ని గమనించవచ్చు:

ఈ సంఘటనపై తెలంగాణ పోలీసు లేదా రవాణా శాఖ నుండి ఏదైనా పోస్ట్/వివరణ ఉందా అని మేము పరిశీలించినప్పుడు, అది ఫేక్ వీడియో అని స్పష్టం చేస్తూ MD,తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, VC సజ్జనార్ తన X అధికారిక హ్యాండిల్‌లో ఒక వివరణను గమనించాము.

ఆయన ఇచ్చిన వివరణ ఇలా ఉంది.

అలాంటి ఎడిటింగ్ టెక్నిక్‌లను అనుమతించే అత్యాధునిక టెక్నాలజీలతో, కొంతమంది వీడియోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే, చాలా మంది, అవి ఎడిట్ చేసిన వీడియోలనే విషయం తెలియక, సోషల్ మీడియాలో తక్షణమే పాపులర్ కావడానికి అలాంటి స్టంట్‌లను పునరావృతం చేయడం లేదా అనుకరించడం వంటివి చేస్తూ తమ ప్రాణాలకు తెగిస్తున్నారు.

కాబట్టి, హైదరాబాద్‌లో ప్రమాదకరమైన రీల్ కోసం ఈ యువకుడు వేగంగా వస్తున్న బస్సు ముందు పడుకున్నాడనే వాదన/దవా తప్పు.

 

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

IRCTCలో స్నేహితులకు లేదా బంధువుల కోసం రైలు టికెట్లును బుక్ చేస్తే జరిమానా విధించబడుతుందా? వాస్తవ పరిశీలన

సైనికుల (అగ్నివీర్స్) రిక్రూట్ కోసం అగ్నిపథ్ పథకం కొన్ని మార్పులతో మళ్లీ ప్రారంభించబడిందా? వాస్తవ పరిశీలన-వీడియో