Tag Archives: E-tickets

Booking train tickets for friends or relatives on IRCTC attracts penalty? Fact check

IRCTCలో స్నేహితులకు లేదా బంధువుల కోసం రైలు టికెట్లును బుక్ చేస్తే జరిమానా విధించబడుతుందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: భారతీయ రైల్వే కొత్త నియమం ప్రకారం IRCTCలో స్నేహితులకు లేదా బంధువుల కోసం రైలు టికెట్లును బుక్ చేస్తే జైలు లేదా రూ.10,000 జరిమానా విధించబడుతుందనేది వాదన.

నిర్ధారణ/Conclusion:ఈ వాదన/దావా తప్పు.రైల్వే మంత్రిత్వ శాఖ అలాంటి కొత్త రూల్ ఏదీ చేయలేదు. IRCTC కూడా “వేర్వేరు ఇంటిపేర్లతో (లేదా ఇతరుల కోసం) ఇ-టికెట్ల బుకింగ్ గురించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తలు” తప్పు మరియు తప్పుదారి పట్టించేవి అని స్పష్టం చేసింది.

రేటింగ్: పూర్తిగా తప్పు

********************************************************************

వాస్తవ పరిశీలన వివరాలు:

భారతీయ రైల్వే కొత్త నియమం ప్రకారం ఒక వ్యక్తి తన స్నేహితులకు లేదా బంధువుల కోసం IRCTC వెబ్‌సైట్‌లో తన వ్యక్తిగత IDని(లేదా వివిధ ఇంటి పేర్లని ) ఉపయోగించి రైలు ఇ-టికెట్లును బుక్ చేయకూడదనే ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎవరైనా అలా చేస్తే, జైలు శిక్ష విధించబడుతుందని వాదన పేర్కొంది.

దిగువ పోస్ట్ చూడండి:

ఇతరులకు టిక్కెట్లు బుక్ చేస్తే జైలు లేదా రూ.10,000 జరిమానా విధించబడుతుందని మరొక వాదన పేర్కొంది. దిగువ పోస్ట్ చూడండి:

అసలు వాస్తవం ఏమిటి

ఈ వాదనలు భారతీయ రైల్వే శాఖకు సంబంధించినవి మరియు భారతదేశంలోని అన్ని తరగతుల ప్రజలచే అత్యధికంగా ఉపయోగించే రవాణా విధానం అయినందున Digiteye India బృందం ఈ వాదనలలోని వాస్తవాన్ని పరిశీలించడానికి ప్రయత్నించింది.  మేము మొదట Xలో భారతీయ రైల్వే శాఖ అధికారిక హ్యాండిల్‌ను పరిశీలించగా, IRCTC అప్పటికే ఈ వాదన నకిలీదని స్పష్టం చేసిందని మరియు సరైన సమాచారం, మార్గదర్శకాలను కుడా అందించిందని గమనించాము. IRCTC అధికారిక హ్యాండిల్ యొక్క పోస్ట్ దిగువన చూడండి:

రైల్వే మంత్రిత్వ శాఖ కూడా స్పష్టం చేసింది:

కాబట్టి ఈ వాదన/దావా తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కథనాలు :

సైనికుల (అగ్నివీర్స్) రిక్రూట్ కోసం అగ్నిపథ్ పథకం కొన్ని మార్పులతో మళ్లీ ప్రారంభించబడిందా? వాస్తవ పరిశీలన-వీడియో

అనేక దేశాలు భారతదేశం నుండి పండ్లు మరియు కూరగాయల దిగుమతులను నిషేధించాయా? వాస్తవ పరిశీలన