వాదన/Claim: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 142 సీట్లతో వైఎస్సార్‌సీపీ(YSRCP) విజయం సాధిస్తుందని ఏబీపీ న్యూస్ సర్వే గ్రాఫిక్ ద్వారా కనపడుతుందనేది వాదన.
నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. YSRCPకి 142 సీట్లు వస్తాయని చూపించే వైరల్ ఒపీనియన్ పోల్ గ్రాఫిక్ కల్పితమని, ABP తాను అలాంటి సర్వే ఏది చేయలేదని కొట్టిపారేసింది.
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —
వాస్తవ పరిశీలన వివరాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన సర్వే ఏబీపీ న్యూస్‌కి ఆపాదిస్తూ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.అధికార వైఎస్సార్‌సీపీకి(YSRCP) 142 సీట్లు రావచ్చని, తెలుగుదేశం పార్టీ మరియు జనసేన యొక్క ప్రతిపక్ష కూటమికి 33 సీట్లు వస్తాయని పేర్కొంది.ట్విట్టర్‌లో షేర్ చేయబడిన చిత్రాన్ని/ట్వీట్ ని ఇక్కడ చూడండి:
🚨Breaking News🚨
ABP survey on Andhra elections#YSRCP #TDPJanasenaCollapse #PackageStarPK pic.twitter.com/kLEI6QUadV
— Andhra Live News (@live_andhra) February 29, 2024
FACT CHECK
DigitEye India బృందం ABP న్యూస్ నిర్వహించిన ఒరిజినల్ సర్వే రిపోర్టు కోసం తనిఖీ చేయగా, ABP న్యూస్ తన వెబ్‌సైట్‌లో వారు నిర్వహించిన అటువంటి సర్వే ఏది లేదని పేర్కొన్న వార్తాను గమనించారు.క్లెయిమ్‌ను ఫేక్ అని పేర్కొంటూ, ఫిబ్రవరి 29, 2024న ABP న్యూస్ “ఫేక్ న్యూస్ అలర్ట్”ని జారీ చేసింది మరియు ABP లైవ్ మరియు CVoter రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అటువంటి డేటా ఏదీ ప్రచురించలేదని నొక్కి చెప్పింది.
“ఏబీపీ లైవ్ చిత్రాన్ని కలిగి ఉన్న పోస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 2024కి సంబంధించి ABP నెట్‌వర్క్ లేదా మరే ఇతర అనుబంధ సంస్థ అటువంటి డేటాను విడుదల చేయలేదు… వైరల్ పోస్ట్‌లో చేసిన క్లెయిమ్/వాదనలకు విరుద్ధంగా, ABP లైవ్ మరియు CVoter ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2024 ఎన్నికలకి సంబంధించి ఎలాంటి అంచనాలు లేదా డేటాను జారీ చేయలేదని” నివేదికలో పేర్కొంటు వాదనని ఖండించారు.
Twitterలో షేర్ చేసిన ఖండించిన నివేదికను ఇక్కడ చూడండి:
A social media post containing and bearing the image of ABP Live is going viral on social media platforms. ABP Network or any other subsidiary has not released any such data regarding Andhra Pradesh Assembly Election 2024.
Click on the 🔗 to know morehttps://t.co/3UGIZEOOO4… pic.twitter.com/gsTGmuLw22
— ABP LIVE (@abplive) February 29, 2024
రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP 142 సీట్లు గెలుచుకోవచ్చని చెప్పడానికి ఇమేజీని/చిత్రాన్ని కల్పించి విడుదల చేయబడింది. కాబట్టి ఈ వాదన తప్పు.
మరి కొన్ని Fact Checks:
Pingback: LATEST FACT CHECKS in TELUGU | DigitEye India