వాదన/Claim: ఆప్ నేతలు అతిషి మరియు సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌ను X (ట్విట్టర్)లో అనుసరించటం(Follow) లేదనేది వాదన.
నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన,ఇద్దరూ ఇప్పటికీ కేజ్రీవాల్‌ని X (ట్విట్టర్)లో అనుసరిస్తున్నారు(ఫాలోయింగ్).
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —
వాస్తవ పరిశిలన వివిరాలు:
ఢిల్లీ మంత్రులు అతిషి మరియు సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎక్స్‌లో(X లో) అన్‌ఫాలో చేశారని మరియు ‘ట్విట్టర్ ఫాలోవర్ చెక్’ అనే ఆన్‌లైన్ సాధనం నుండి తీసిన రెండు స్క్రీన్‌షాట్‌లు ఈ వాదనకు మద్దతుగా ఉన్నాయని ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది.
Looks like Atishi has stopped following Arvind Kejriwal. Can anyone confirm she used to follow him? pic.twitter.com/jbBFCBLrM9
— Abhijit Iyer-Mitra (@Iyervval) April 1, 2024
లిక్కర్ పాలసీ కేసు ఆరోపణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మార్చి 21, 2024 న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది మరియు అతని రిమాండ్ ఏప్రిల్ 15 వరకు పొడిగించబడింది. అలాగే, తన విచారణలో అతను అతిషి మరియు సౌరభ్ భరద్వాజ్ పేర్లను కూడా బయటపెట్టినట్టు వార్తా నివేదికలు పేర్కొన్నాయి.
క్యాప్షన్ ఇలా ఉంది: “అతిషి అరవింద్ కేజ్రీవాల్‌ను X లో అనుసరించడం(Follow) లేదని తెలుస్తోంది. ఆమె అతనిని అనుసరిస్తుందని ఎవరైనా నిర్ధారించగలరా?”.
FACT-CHECK
భారతీయ జనతా పార్టీ (బిజెపి) “తన రాజకీయ జీవితాన్ని కాపాడుకోవాలంటే” తమతో చేరమని ఆమెకు ఆఫర్ చేసిందని మరియు ఆమె నిరాకరించినట్లయితే అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నట్లు అతిషి ఆరోపించిన తరుణంలో ఈ వాదన వైరల్ అయింది. Digiteye India బృందం ఈ వాదన యొక్క వాస్తవ పరిశీలనకు పూనుకుంది.
మొదట మేము “ట్విట్టర్ ఫాలోవర్ చెకర్” అనే అదే సాధనాన్ని ఉపయోగించి పరిశీలించి చూడగా, ఫలితాలు ఇదే వాదనను ద్రువీకరిస్తున్నట్లు గమనించాము.
కానీ కేజ్రీవాల్ ట్విట్టర్ ఖాతాలో మరింత వెతకగా, అతిషి మరియు సౌరభ్‌లు ఇప్పటికీ అతని ఖాతాలో అతనిని అనుసరిస్తున్నట్లు మేము గమనించాము. కింద చూడవచ్చును.
వెంటనే,సౌరభ్ భరద్వాజ్ తాను కేజ్రీవాల్‌ను “అన్‌ఫాలో” చేశారనే వాదనను ఖండిస్తూ క్రింది సందేశాన్ని ట్వీట్ చేశారు:
To all those spreading fake news, I and @ArvindKejriwal ji both follow each other.
Yesterday’s Ramlila Maidan Rally was superhit. Delhi people are with Kejriwal. pic.twitter.com/d4iacrEWBa
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) April 1, 2024
అందువల్ల, “ట్విట్టర్ ఫాలోవర్ చెకర్”ఆధారంగా చేసిన వాదన తప్పు.
మరి కొన్ని Fact Checks: