ఇందిరా గాంధీ vs సర్దార్ పటేల్ పాత చిత్రం?

అక్టోబర్ 31సర్దార్ వల్లభాయి పటేల్ యొక్క జయంతి జరుపుకునే దినం దేశం మొత్తంలో ఈరోజు సమైక్యత దినంగా పాటిస్తారు అదే రోజు ప్రధాని ఇందిరాగాంధీని  స్వంత రక్షణ బట్టలే కాల్చిచంపిన దురదృష్టకరమైన దినం.

కానీ రాజకీయాల్లో దీన్ని ఎలా హలో అందరికీ చాలా బాగా తెలుసు. అక్టోబరు 31, 2018 న కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ కేరళలోని తిరుపతిపురంలో ఉన్నారు. ఆయన ఐదారు కార్యక్రమాల్లో పాల్గొని ఇందిరాగాంధీకి పుష్పార్చన చేశారు.  ఈ కార్యక్రమాల్లో అన్ని చోట్ల ఇందిరాగాంధీ పటం మీద అర్చన జరిగింది.

కానీ ఒక పురాతన  ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో సర్దార్ పటేల్ ఫోటో పెట్టి పుష్పార్చన నిర్వహించారు.  ఇందిరా గాంధీ ఫోటో చాలా పెద్దగా ఉంది,  సర్దార్ పటేల్ ఫోటో చాలా చిన్నగా ఉంది అని ఎవరు గమనించలేదు.

ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమంలో,  అక్టోబర్ 31న సర్దార్ పటేల్ యూనిటీ statue  ఆవిర్భవించిన సందర్భంలో,  పాత ఫోటోవెలికి తీసి ఫేస్ బుక్ లోనూ, ట్విట్టర్ లోను పెట్టి,  కాంగ్రెస్ ఈ విధంగా వేరే సైజులలో ఫోటోలు పెట్టి సర్దార్ పటేల్ ను అవమానిస్తున్నారు అని పేర్కొనడం జరిగింది.  పటేల్ యొక్క statue ఆఫ్ యూనిటీ ఆవిష్కరణ  వారికి కలిసి వచ్చింది.

కానీ రెండు వేర్వేరు సందర్భాలలో ఉపయోగించిన ఫోటోలు.  2018 లోపసుపు రంగులో ఉన్న కుర్తా ధరించి, అదే దుస్తులలో అనేక విధాలుగా థరూర్ కనిపించాడు,  కాబట్టి ఇది ఈ సంవత్సరం ఫోటో కాదు. పురాతన ఫోటో.  ఈ విధంగా,  ప్రజల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా  సోషల్ మీడియాలో  వదంతులు వ్యాపించడం జరిగింది.

దిగ్విజయ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ అంబులెన్సుల ఫోటోలను ట్వీట్ చేస్తూ, UP ముఖ్యమంత్రి నిర్లక్ష్యం అని పప్పులో కాలేశాడు!

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అంబులెన్సుల ఫోటోలను ట్వీట్ చేస్తూ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి   ఆదిత్యనాథ్అంబులెన్సు వాహనాలను దుమ్ము పెట్టాడని ఆరోపించారు. సింగ్ అంబులెన్సుల చిత్రం ట్వీట్ చేశాడు. చిత్రాలను క్రాస్-వెరిఫై చేయకుండా ట్వీట్ చేశాడు.

బీజేపీ నేతలు వెంటనే స్పందించి కాంగ్రెస్ పార్టీ నేత ట్విట్టర్డి ద్వారా నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ట్విట్టర్లో కొందరు ‘నకిలీ’ ఫోటోను వ్యాపమ్ కేసులో కాంగ్రెస్ నాయకుడి నిక్షేపణకు జతచేశారు. “అతను ముందు కల్పించిన సాక్ష్యం మరియు ఇప్పుడు ఒక నకిలీ ఫోటో ఉత్పత్తి,” ఒకరు ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ ప్రొఫెషినల్ ఎగ్జామినేషన్ బోర్డ్ నిర్వహించిన పరీక్షల్లో జరిగిన అవకతవకలను వ్యాపమ్కేసు అని కూడా పిలుస్తారు.

వరదలు వస్తే చాలు, సోషల్ మీడియాలో నకిలీ వార్తలు సృష్టించడంలోఆరితేరారు ఈ ఉద్దండులు!

గత నెల కేరళ వరదలలో చిక్కుకున్నవారిని ఆదుకోవాల్సింది పోయి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ, బాధితులను అవహేళన చేస్తూ కొంత మంది సోషల్ మీడియాలో నకిలీ వార్తలు సృష్టించడంలోఆరితేరారు. ఈ వార్తల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకునే లోపునే అది వైరల్ అవుతున్నాయి.

కేరళలోని “ముళ్ల పెరియార్‌ డ్యామ్‌‌కు వరద తీవ్రత పెరిగి, మరికొద్ది గంటల్లో ఆనకట్ట లీక్‌ అవుతోంది. మరో గంటలో డ్యామ్‌ కూలిపోతే ఎర్నాకులం పూర్తిగా మునిగిపోతుంది. PMOలోని ఒక స్నేహితుడు నాకు ఈ విషయం చెప్పాడు. ఆ డ్యామ్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారంతా వెంటనే సురక్షిత స్థావరాలకు వెళ్లిపోండి,” అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ మెసేజ్ ప్రజల్లో భయభ్రాంతుల్ని సృష్టించింది. కొంత మంది సుదూర ప్రాంతాలకు పరుగులు తీశారు. అధికారులు చివరికి అది ఫేక్‌ న్యూస్ అని తేల్చారు. నెన్మారాకు చెందిన అశ్విన్ బాబు (19) ఈ ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేసినట్లు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.

NSS volunteers helping Kerala flood victims (PIB Photo)

ఇంకొక దాంట్లోకేరళలోని శబరిమల ఆలయం వద్ద పంబా నదిలో వరదనీటిలో కొట్టుకుపోతున్న జింక పిల్లలు అంటూ వాట్సాప్‌లో ఓ వీడియో వచ్చింది. కానీఅది కేరళ వీడియో కాదు. గతంలో ఒడిశాను ముంచెత్తిన వరదల సందర్భంలో తీసిన వీడియో. గంజాం జిల్లాకు సంబంధించిన వీడియో అని ఒడిశా ప్రభుత్వం తెలిపింది.

సైన్యం సహాయక చర్యల్లో పాల్గొనకుండా కేరళ ప్రభుత్వం అడ్డుకుంటోంది. భారత సైన్యం సహాయ చర్యల్లో పాల్గొనవద్దంటూ ఆంక్షలు విధించింది,” అంటూ ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. ఇది కూడా ఫేక్ వీడియోనే. వీడియోలో ఉన్న వ్యక్తికి, భారత సైన్యానికి ఎలాంటి సంబంధం లేదని ఆర్మీ స్పష్టం చేసింది.

తుపాన్లు, వరదలు లాంటి సమయాల్లో పాత ఫోటోలనే మళ్లీ మళ్లీ షేర్‌ చేస్తుండటం సోషల్‌ మీడియాలో ఒక అలవాటుగా మారింది. ‘కొచ్చి వరదల్లో బారులు తీరిన కార్లు’అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్న ఫొటో అయిదేళ్ల కిందటిదని అధికారులు తేల్చారు. వరదలలో ఇళ్లలోకి కొట్టుకొచ్చిన భారీ సర్పాలు అంటూ వచ్చిన కొన్ని ఫొటోలు కూడా ఫేక్‌వేనని చెప్పారు.

జగన్ డబ్బు కోసం అడుగుతున్నారా? నకిలీ వీడియో శీర్షిక అలా సూచిస్తుంది!

వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ వీడియోలో మాట్లాడుతున్నాడు అని మనకు తెలుస్తోంది కానీ వీడియోలో ఉన్న టెక్స్ట్ మాత్రం వేరే రకంగా ఉంది. ఈ రకమైన విపరీతార్థాలు సృష్టించి ఏ విధంగానూ ధ్వని వినపడకుండా ఉండే ఈ వీడియోలో ఏమైనా సూచించవచ్చు.

ఈ టెక్స్ట్ ప్రకారము ఒక వ్యక్తి జగన్ను ఉద్దేశించి ఇలా  అంటున్నాడు:”సర్,  అతని దగ్గర డబ్బు ఉంది. దయచేసి అతనిని పార్టీలోకి తీసుకోండి.” అప్పుడు జగన్ ఇచ్చిన జవాబు: “అతను డబ్బు సంపాదించాడు కానీ అది అది తీసి ఇవ్వకపోవచ్చు.”  ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం: “అతను దానిని తప్పకుండా తీసి ఇస్తాడు, దయచేసి అతనిని తీసుకోండి సర్!”

ఇలా ఉంటాయి వీడియో వార్తలు. ఈ ఫేక్ న్యూస్  చాలా విపరీతాలకు దారి తీస్తుంది ముఖ్యంగా ఎలక్షన్స్ ముందు ఇటువంటి వీడియోలు చాలా వరకు ఉంటాయి. ఎవరైనా ఒక వినబడని వీడియోను  టెక్స్ట్ ట్వీకింగ్ ఇచ్చి దానికి అనుగుణంగా ఉపయోగించవచ్చు.

జనసేన బహిరంగ సమావేశం రహస్య సమావేశం ఎలా అయ్యింది? Maha TVని

హైదరాబాద్, సెప్టెంబర్ 9, 2018: ఇది సెప్టెంబర్ 9, 2008 న బహిరంగ జనసేన సమావేశం. ఈ ఆహ్వానం మీడియాకు పంపబడింది. అనేకమంది విలేఖరులు హాజరయ్యారు. జనసనా లీడర్ పవన్ కళ్యాణ్ హోటల్లోకి ప్రవేశించి, అభిమానులతో మరియు రిపోర్టర్తో కూడా చిత్రాన్ని తీసుకున్నారు.

కానీ మహా న్యూస్ టీవీ  రిపోర్టర్  దీన్ని సీక్రెట్ కవరేజ్ అని చెప్పి, ఒక బాత్రూమ్ స్నానపు తొట్టెలో కూర్చొని, జానసేనా యొక్క రహస్య సమావేశం ఎలా ఉందో వివరించడం మొదలుపెట్టాడు. అతను దానిని వీక్షకులకు ప్రత్యక్ష ప్రసారం చేశాడు. ఇది “మహ్జా ఎక్స్క్లూజివ్.” ఈ మీడియా ఒక సంఘటన చుట్టూ సంచలనాన్ని ఎలా సృష్టించాలో క్లియర్ గా చూపిస్తుంది. ఇలా ఉంటాయి మన ఆర్డినరీ  న్యూస్ కవరేజ్.  లేనిది ఉన్నట్టు సృష్టించి అదేదో సీక్రెట్ అని అనవసరంగా సెన్సేషనల్ గా ప్రచారం చేస్తున్నారు.

ఈ నకిలీ ఫోటో స్పేస్ నీడిల్ ముందు లేని వెండింగ్ మెషిన్ ఉన్నట్లు చూపిస్తుంది !

ఈమధ్య  ఫోటోల ద్వారా  నకిలీ న్యూస్ ఎక్కువగా వ్యాపిస్తుంది. గత బుధవారం అమెరికాలోని కాపిటల్ హిల్ దగ్గర ఉన్న ఒక పాత కాలపు కోకా కోలా మెషిన్ తిరిగి ఫిషర్ ప్లాజాకు పక్కన ఉన్న స్పేస్ నీడిల్ ముందు ప్రత్యక్షమైనట్లు చూపించింది.

దానిని సియాటెల్ టైమ్స్ విచారణ చేసి అది ఒక నకిలీ ఫోటో అని కనుగొంది. ఇది మిస్టరీ మెషిన్ సోషల్ మీడియాలో పెట్టారు. అమెరికా రాజధాని లో రెండు దశాబ్దాలుగా చౌకగా సోడాను పంపిణీ చేసిన తరువాత జూన్లో కాపిటల్ హిల్ నుండి ఈ పాతకాలపు కోక్ యంత్రం అదృశ్యమయ్యింది. ఇది సోషల్ మీడియాలో స్పేస్ స్ప్రింగ్ సమీపంలో పునఃస్థాపించబడింది అనే వదంతిని వ్యాప్తి చేసింది.

ఫిషర్ పాలలో దాదాపు 14 సంవత్సరాలుగా ఉన్న రెస్టారెంట్ గ్రేసియస్ ఎంప్లాయి లూయి వెలోరాస్ అక్కడ కోక్ మెషీన్ ఎప్పుడూ చూడలేదని చెప్పాడు. బుధవారం పెట్టి ఉంటే, వెలోరాస్ ఉద్యోగులు గమనించి ఉంటారు, ఎందుకంటే వారు 9 గంటలకు పనిలో ఉన్నారు మరియు వారి రెస్టారెంట్ ఫోటో తీసినట్లు కనిపించే ప్రదేశానికి కుడి వైపున ఉంది.

పోస్ట్ చేయబడిన రోజు లేదు. “ఇది ఒక పాత ఫోటో అయి ఉండాలి,” అని వెలోరాస్ చెప్పాడు. స్పేస్ నీడిల్ యొక్క పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ డేవ్ మండపాట్ కూడా ఇది ఒక పాత ఫోటోగా ఉందని ధ్రువీకరించాడు.

ఇంకొక విషయం ఏమంటే ఈ ఫోటోలో సోడా ధర కేవలం 75 సెంట్లు అని రాసి ఉంది కానీ ప్రస్తుతం సోడా $1 కు అమ్ముతున్నారు కాబట్టి ఇది ఒక పాత ఫోటో  అని నమ్ముతున్నారు.ఇంకొకటి ఏమంటే కాపిటల్ హిల్ రోడ్ లో ఉన్న ఈ మిషన్ చాలా ఫేమస్. ఫేస్బుక్లో 24,000 మంది కంటే ఎక్కువ మంది ప్రజలు దీనికి  అభిమానులు. చాలామంది ఈ రోడ్డులో కారు ఆపి ఈ సోడా కొనుక్కుని తీసుకొని వెళ్లేవారు. జూన్ లో ఈ కోక్ మెషీన్ ఇక్కడి నుంచి తీసేశారు.

మరి ఎందుకు ఈ ఫోటోను ఉపయోగించి మిస్టరీ మెషిన్ ఫేస్ బుక్ లో కొత్త వ్యాఖ్యలు చేసింది?  దీనికి ఎవరు బాధ్యులు?  ఎందుకు మిస్టరీ మెషిన్ సైలెంట్ గా ఉంది?

 

కేరళ వరదలు, నకిలీ వార్తల జోరు; ఇదెక్కడి WhatsApp హోరు?

కేరళ వరదలు ఏమోగానీ వాట్సాప్ లో వచ్చే వదంతులు మాత్రం చాలా ఎక్కువ. సునామీ జపాన్ లో 2011 మార్చిలో వచ్చింది కానీ ఆ వీడియో ని తీసుకొని వచ్చి కేరళ వరదల్లో జోడించి వాట్సాప్ లో మెసేజ్ లు పంపిస్తున్నారు. తెలియని వారు అది నిజమే అని పొరబడే అవకాశం ఉంది.

ఇది ఫేస్బుక్ లో  ఆగస్ట్ 23న ‘కేరళ డేంజరస్ వరదలు’ అని  పోస్ట్ చేశారు. ఇది ఎంత వైరల్ అయ్యింది అంటే  మూడు మిలియన్లు చూశారు. ఇంకా 87 వేల మంది దీన్ని షేర్ చేసుకున్నారు. చాలామంది దీన్ని చూసి అవాక్కయ్యారు. దీన్ని చూసి ఇంకొక వ్యక్తి  SIKH ARMY(@AzadSpirit) పేజీలో సేమ్ వీడియో, సేమ్ టెక్స్ట్ వాడి మళ్లీ పోస్ట్ చేశాడు.  ఇది మరిన్ని పంతొమ్మిది వేల views తీసుకొచ్చింది. ఇది ఈ ఘరాన  వ్యక్తులు  చేస్తున్న ఘనకార్యాలు.

అదేమో గాని కేరళ వరదల్లో వరదల న్యూస్ కంటే ఫేక్ న్యూస్ ఎక్కువవుతున్నాయి.  మొదట్లో UAE నుంచి వస్తున్న 600 కోట్లు భారత ప్రభుత్వం నిరాకరించింది అనే ఫేక్ న్యూస్.  ఆ తర్వాత ఫుట్బాల్ ప్లేయర్ Ronaldo నుంచి వచ్చిన డొనేషన్ అని,  ఆ తర్వాత వేరే వాళ్ల నుంచి డొనేషన్ అని తప్పుడు వార్తలు  ప్రచారం చేశారు.

అలా పోతూ ఉంటే మనకు ఫేక్ న్యూస్ తప్ప కరెక్ట్ న్యూస్ వచ్చే అవకాశం చాలా తక్కువ అని తెలుస్తోంది.

ఈ వారాంతం బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు! ఎంతవరకు నిజం?

ఈ వారాంతం బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు ఉండవచ్చు అని ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఇది ఎంత వరకు నిజం? శనివారము మొదటి శనివారం కాబట్టి బ్యాంకులకు హాలిడే ఉంటుంది. ఆ తర్వాత ఆదివారం కూడా హాలిడే.

సోమవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి సెలవు దినము. తరువాత రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఉద్యోగుల రెండు రోజుల బ్యాంక్ సమ్మె సెప్టెంబర్ 4, సెప్టెంబర్ 5 దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలను స్తంభింపచేయడానికి అవకాశం ఉంది.

రిజర్వు బ్యాంకు ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ యునైటెడ్ ఫోరమ్గ్ సమ్మె చేస్తున్నారు కాబట్టి సెప్టెంబర్ 4 మరియు 5 తేదీలలో ఆర్బిఐ ఉద్యోగులు రెండు రోజుల సామూహిక సెలవులకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ సమ్మె దేశవ్యాప్తంగా కేంద్ర, ఇతర రాష్ట్ర బ్యాంకుల బ్యాంకింగ్ కార్యకలాపాలు మొత్తంగా కార్యకలాపాలు మొత్తంగా ఆగిపోయే అవకాశం ఉంది.

కానీ ఇది పూర్తిగా నిజం కాదు. ఆర్బీఐ ఉద్యోగుల సమ్మె వలన మిగిలిన బ్యాంకులకు అంతగా మూసి వేయాల్సిన అవసరం ఉండదు. సామాన్య బ్యాంకింగ్ ఆపరేషన్స్ జరిగే అవకాశం ఉంది. ఎటిఎమ్ లావాదేవీలు, శాఖలలో డిపాజిట్, FD పునరుద్ధరణ, ప్రభుత్వ ట్రెజరీ ఆపరేషన్, మనీ మార్కెట్ ఆపరేషన్ వంటివి 5 రోజులు హిట్ కానున్నాయి. కానీ ఆన్లైన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు.

ఎందుకైనా మంచిది బ్యాంకు పనులు ఏమైనా ఉంటే శుక్రవారము తప్పకుండా ముగించుకోవాలి.

రియల్ ఫోటో, నకిలీ వార్త : ఏవిధంగా సాధ్యం? కేరళ బిజెపిని అడగండి!

కేరళ వరదబాధితులకు చాలా మంది సహాయం చేయడానికి ముందుకు వచ్చారు వారిలో కొందరు సహాయం చేయకుండా, చేశామని ప్రచారం చేసుకుంటున్నారు. ఎందుకు వాళ్లు నకిలీ వార్తలు ప్రచారం చేయడం మొదలుపెట్టారు?

ఈమధ్య Facebookలో, శ్రీ కుమార్ శ్రీధర్ అనే వ్యక్తి ఒక పిక్చర్ తీసుకొని ఈ విధంగా రాశాడు– బీజేపీ ఏమి చేయలేదు అని చెప్పవద్దు. కేరళ బిజెపి ఎంపీలు రూ.25 కోట్లకు ఒక చెక్కు కేరళ చీఫ్ మినిస్టర్ కు అందజేశారు. — ఇది నకిలీ పిక్చర్. పిక్చర్లో హెచ్పిసిఎల్ అధికారులు బీజేపీ ఎంపీలు ఉన్నారు.

కానీ ఆ చెక్కు హెచ్పీసీఎల్ పెట్రోలియం కంపెనీలు ఉమ్మడిగా చేరి ఇచ్చిన చెక్కు. బీజేపీ ఎంపీలు డొనేట్ చేసిన చెక్కు కాదు. తర్వాత ఆల్ ట్ న్యూస్ వాళ్ళు అది ఫేక్ న్యూస్ అని పిక్చర్ లతో సహా నిరూపించారు.

Sh. @alphonstourism Hon. MoS Tourism (I/C), handed over contribution cheque of Rs. 25 crore from Oil Marketing Companies in Kerala for Chief Minister’s Distress Relief Fund to Sh. @vijayanpinarayi @CMOKerala#KeralaFloodRelief #KeralaWeAreWithYou@dpradhanbjp @PetroleumMin pic.twitter.com/lU0IhzCZB5— Hindustan Petroleum Corporation Limited (@HPCL) August 21, 2018

ఈ విధంగా ఉంటాయి ఫేక్ న్యూస్ ఒకపిక్చర్ ద్వారా అందరినీ పిచ్చివాళ్లని చేయవచ్చు.

ఫోటో కాప్షన్: బీజేపీ ఏమి చేయలేదు అని చెప్పవద్దు. కేరళ బిజెపి ఎంపీలు రూ.25 కోట్లకు ఒక చెక్కు కేరళ చీఫ్ మినిస్టర్ కు అందజేశారు. ఈ పిక్చర్లో హెచ్పిసిఎల్ అధికారులు, కేరళ చీఫ్ మినిస్టర్, బీజేపీ ఎంపీలు — ఉన్నారు.

కేరళ వరదలు: సైన్యం రెస్క్యూ కార్యకలాపాలను తప్పుదారి పట్టించే నకిలీ ఫోటోలు

ఈ ట్విట్టర్ మెసేజిలో వాడిన ఫోటో ఎవరిదో తెలుసా?

నరేంద్ర మోడి అభిమాని జితేంద్ర సింగ్ కేరళలో మన సైన్యం చేస్తున్న సహాయక కార్యక్రమాల్ని విభిన్నంగా చూపించాలని ఈ ఫోటోను వాడినారు. అంతేకాకుండా దానికింద ఒక కాప్షన్ కూడా! ఏమని? “ట్రూ ఇండియన్. ఇది మన సైన్యం” కానీ ఇది ఒరిజినల్ పిక్చర్ కాదు. ఇది కేరళ నుంచి తీసింది కాదు. ఇరాక్ లో ఒక సైనికుడిని ట్రక్కు నుంచి దిగువకు తీసుకువెళ్ళడానికి మహిళకు సహాయం చేయడానికి ఉపయోగించారు.

ఈ చిత్రాలను ఎక్కడినుంచో తెచ్చిఉపయోగించిన ఫేక్ న్యూస్ ఈ విధంగా సర్క్యులేట్ చేయడం ఇతనికే చెందింది. దానికి ఒక కాప్షన్.
ఇండియన్ ఆర్మీకి ఇది ఏ విధంగానూ ఉపయోగపడదు కానీ ప్రజల్లో ఆర్మీ మీద నమ్మకం తగ్గుతుంది. అంతేకాదు ఈ పిక్చర్ 18వేల సార్లు రిపీట్ చేశారు. ‘నరేంద్ర మోడీ – ట్రూ ఇండియన్’ ఈ నకిలీ ఫోటోను పంపిణీ చేసిన కొంతమందిలో ఉన్నారు.

ఒక్కసారి చూస్తే ఈ ఫోటో కేరళలో తీసింది కాదు. ఈ సైనికాధికారి ఒక భారతీయుడు కాదు, ఆ మహిళ కేరళలో లేదు. ప్రస్తుతం, ఈ చిత్రం వైరల్ అయింది. ఇది ట్విట్టర్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనుసరిస్తున్న జితేంద్ర ప్రతాప్ సింగ్ ట్వీట్ చేసాడు. “ఆమె కూడా బూట్లు తీసుకోవాలని మర్యాద కలిగి లేదు … .మరియు షూ యొక్క మడమ అతనికి చాలా బాధించింది ఉండాలి … వారి తల్లిదండ్రులు వారికి మర్యాద, విలువలు ఎప్పుడూ నేర్పలేదా?”

ఇలా ఉంటాయి ఫేక్ న్యూస్! గూగుల్లో ఇమేజ్ రివర్స్ సర్చ్ చేస్తే క్లియర్ గా తెలుస్తోంది ఇది జూన్ 2016 లో పల్లూజా పట్టణానికి చెందిన ఇరాకీ చిత్రం. కాశ్మీర్ వరదలలో కూడా ఇదే చిత్రం పంపిణీ చేయబడింది.