Tag Archives: floods

ఏనుగులు 1 గంట ముందే వాయనాడ్ కొండచరియలను పసిగట్టి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశాయా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఏనుగులు 1 గంట ముందే వాయనాడ్ కొండచరియలను పసిగట్టి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశాయనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. దావా చేయబడిన వీడియో జనవరి 2024 నాటి పాత వీడియో, మరియు జూలై 30, 2024న వాయనాడ్ కొండచరియలు విరిగిపడడానికి ఒక గంట ముందు జరిగిన సంఘటన కాదు.

రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటానికి ముందు ఏనుగుల గుంపు సురక్షిత ప్రాంతానికి పరుగెడుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

వీడియో క్లిప్ఈ విధంగా షేర్ చేయబడింది: “కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటానికి 1 గంట ముందు ఏనుగులు సురక్షిత ప్రాంతానికి పరుగెత్తుతున్నాయి. జంతువులకు సూక్ష్మ దృష్టి ఉంటుంది.”

(సూక్ష్మ దృష్టి(subtle vision)అనేది భౌతిక కంటికి కనిపించని వస్తువులను/పరిస్థితులను చూడగల/పసిగట్టగల అంతర్గత భావం లేదా దృష్టి.)

జూలై 30, 2024న సంభవించిన విషాదకరమైన కొండచరియలను జంతువులు ఒక గంట ముందే పసిగట్టాయని మరియు జంతువులకు ప్రకృతి వైపరీత్యాల గురించి సూక్ష్మ దృష్టి ఉంటుందని దావా/ వాదన చేయబడింది. వాదనలు ఇక్కడ మరియు ఇక్కడ Xలో అందుబాటులో ఉన్నాయి.

వాస్తవ పరిశీలన వివరాలు:

మేము(DigitEye India బృందం) వీడియో నుండి కొన్ని కీలక ఫ్రేమ్‌లను తీసుకొని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో పరిశీలించగా ఈ వీడియో క్లిప్ నాలుగు నెలల క్రితం 2024లో అప్‌లోడ్ చేయబడిన @TravelwithAJ96 యొక్క Youtube ఛానెల్లోనిదని తెలుసుకున్నాము.

ఇదే వీడియోని Instagramలో @wayanadan మరియు jashir.ibrahim ద్వారా జనవరి 12, 2024న “కేవలం 900 కండి విషయాలు…” అనే శీర్షికతో చూడవచ్చు.

క్లెయిమ్ చేసినట్లుగా ఏనుగులు వాయనాడ్ కొండచరియలు విరిగిపడటానికి(జూలై 30, 2024) ఒక గంట ముందు కాక, జనవరి 2024లో సురక్షిత ప్రాంతానికి పరుగెత్తుతున్నాయని ఒరిజినల్ వీడియో క్లిప్ స్పష్టంగా చూపిస్తుంది. కాబట్టి, ఈ వాదన తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

మీ లిప్ స్టిక్ కోచినియల్ బగ్స్ నుండి తీసిన రంగుతో తయారు చేయబడిందా? వాస్తవ పరిశీలన

IRCTCలో స్నేహితులకు లేదా బంధువుల కోసం రైలు టికెట్లును బుక్ చేస్తే జరిమానా విధించబడుతుందా? వాస్తవ పరిశీలన

 

వరదలు వస్తే చాలు, సోషల్ మీడియాలో నకిలీ వార్తలు సృష్టించడంలోఆరితేరారు ఈ ఉద్దండులు!

గత నెల కేరళ వరదలలో చిక్కుకున్నవారిని ఆదుకోవాల్సింది పోయి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ, బాధితులను అవహేళన చేస్తూ కొంత మంది సోషల్ మీడియాలో నకిలీ వార్తలు సృష్టించడంలోఆరితేరారు. ఈ వార్తల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకునే లోపునే అది వైరల్ అవుతున్నాయి.

కేరళలోని “ముళ్ల పెరియార్‌ డ్యామ్‌‌కు వరద తీవ్రత పెరిగి, మరికొద్ది గంటల్లో ఆనకట్ట లీక్‌ అవుతోంది. మరో గంటలో డ్యామ్‌ కూలిపోతే ఎర్నాకులం పూర్తిగా మునిగిపోతుంది. PMOలోని ఒక స్నేహితుడు నాకు ఈ విషయం చెప్పాడు. ఆ డ్యామ్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారంతా వెంటనే సురక్షిత స్థావరాలకు వెళ్లిపోండి,” అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ మెసేజ్ ప్రజల్లో భయభ్రాంతుల్ని సృష్టించింది. కొంత మంది సుదూర ప్రాంతాలకు పరుగులు తీశారు. అధికారులు చివరికి అది ఫేక్‌ న్యూస్ అని తేల్చారు. నెన్మారాకు చెందిన అశ్విన్ బాబు (19) ఈ ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేసినట్లు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.

NSS volunteers helping Kerala flood victims (PIB Photo)

ఇంకొక దాంట్లోకేరళలోని శబరిమల ఆలయం వద్ద పంబా నదిలో వరదనీటిలో కొట్టుకుపోతున్న జింక పిల్లలు అంటూ వాట్సాప్‌లో ఓ వీడియో వచ్చింది. కానీఅది కేరళ వీడియో కాదు. గతంలో ఒడిశాను ముంచెత్తిన వరదల సందర్భంలో తీసిన వీడియో. గంజాం జిల్లాకు సంబంధించిన వీడియో అని ఒడిశా ప్రభుత్వం తెలిపింది.

సైన్యం సహాయక చర్యల్లో పాల్గొనకుండా కేరళ ప్రభుత్వం అడ్డుకుంటోంది. భారత సైన్యం సహాయ చర్యల్లో పాల్గొనవద్దంటూ ఆంక్షలు విధించింది,” అంటూ ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. ఇది కూడా ఫేక్ వీడియోనే. వీడియోలో ఉన్న వ్యక్తికి, భారత సైన్యానికి ఎలాంటి సంబంధం లేదని ఆర్మీ స్పష్టం చేసింది.

తుపాన్లు, వరదలు లాంటి సమయాల్లో పాత ఫోటోలనే మళ్లీ మళ్లీ షేర్‌ చేస్తుండటం సోషల్‌ మీడియాలో ఒక అలవాటుగా మారింది. ‘కొచ్చి వరదల్లో బారులు తీరిన కార్లు’అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్న ఫొటో అయిదేళ్ల కిందటిదని అధికారులు తేల్చారు. వరదలలో ఇళ్లలోకి కొట్టుకొచ్చిన భారీ సర్పాలు అంటూ వచ్చిన కొన్ని ఫొటోలు కూడా ఫేక్‌వేనని చెప్పారు.