Tag Archives: bank run

ఈ వారాంతం బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు! ఎంతవరకు నిజం?

ఈ వారాంతం బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు ఉండవచ్చు అని ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఇది ఎంత వరకు నిజం? శనివారము మొదటి శనివారం కాబట్టి బ్యాంకులకు హాలిడే ఉంటుంది. ఆ తర్వాత ఆదివారం కూడా హాలిడే.

సోమవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి సెలవు దినము. తరువాత రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఉద్యోగుల రెండు రోజుల బ్యాంక్ సమ్మె సెప్టెంబర్ 4, సెప్టెంబర్ 5 దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలను స్తంభింపచేయడానికి అవకాశం ఉంది.

రిజర్వు బ్యాంకు ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ యునైటెడ్ ఫోరమ్గ్ సమ్మె చేస్తున్నారు కాబట్టి సెప్టెంబర్ 4 మరియు 5 తేదీలలో ఆర్బిఐ ఉద్యోగులు రెండు రోజుల సామూహిక సెలవులకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ సమ్మె దేశవ్యాప్తంగా కేంద్ర, ఇతర రాష్ట్ర బ్యాంకుల బ్యాంకింగ్ కార్యకలాపాలు మొత్తంగా కార్యకలాపాలు మొత్తంగా ఆగిపోయే అవకాశం ఉంది.

కానీ ఇది పూర్తిగా నిజం కాదు. ఆర్బీఐ ఉద్యోగుల సమ్మె వలన మిగిలిన బ్యాంకులకు అంతగా మూసి వేయాల్సిన అవసరం ఉండదు. సామాన్య బ్యాంకింగ్ ఆపరేషన్స్ జరిగే అవకాశం ఉంది. ఎటిఎమ్ లావాదేవీలు, శాఖలలో డిపాజిట్, FD పునరుద్ధరణ, ప్రభుత్వ ట్రెజరీ ఆపరేషన్, మనీ మార్కెట్ ఆపరేషన్ వంటివి 5 రోజులు హిట్ కానున్నాయి. కానీ ఆన్లైన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు.

ఎందుకైనా మంచిది బ్యాంకు పనులు ఏమైనా ఉంటే శుక్రవారము తప్పకుండా ముగించుకోవాలి.