చైనాకు చెందిన మహిళా SWAT జట్టు భారత పురుష జట్టును ఓడించిందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim :యుఎఇలో జరిగిన వ్యూహాత్మక(tactical) పోటీలో చైనా SWAT మహిళా జట్టు భారత పురుష జట్టు కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచిందనేది వాదన.
నిర్ధారణ/Conclusion : తప్పుదారి పట్టించే వాదన. వీడియో క్లిప్‌ల వ్యాఖ్యానాలు స్పష్టంగా లేవు మరియు చైనా మహిళా SWAT జట్టు భారతదేశాన్ని ముఖాముఖిగా ఎదుర్కోలేదు. మహిళా జట్లు మరియు పురుష జట్లు ముఖాముఖిగా పోటీ పడుతున్నట్లు అధికారిక ప్రకటన గాని ఫలితాలు గాని లభించలేదు.
రేటింగ్/Rating : తప్పుదారి పట్టించే వాదన–
******************************************************
వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి
లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి.
******************************************************
యుఎఇలో జరిగిన వ్యూహాత్మక(tactical) టోర్నమెంట్‌లో చైనా మహిళా SWAT జట్టు భారత పురుష జట్టును ఓడించిందని అనేక మంది వినియోగదారులు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. X వినియోగదారు ‘PolymarketIntel’ అటువంటి వాదనను ఇలా షేర్ చేసారు : పూర్తిగా మహిళలతో కూడిన చైనీస్ SWAT జట్టు ‘UAE వ్యూహాత్మక పోటీ’ లో పూర్తిగా పురుషులతో కూడిన భారతీయ జట్టును ఓడించింది. ఈ పోస్ట్‌తో పాటు రెండు జట్ల సామర్థ్యాన్ని/ప్రదర్శనని పోల్చి చూపిస్తున్న 2:46 నిమిషముల నిడివి గల వీడియో క్లిప్ కూడా ఉంది.కింద పోస్ట్ ను చూడవచ్చు :
An all-female Chinese SWAT team defeated an all-male Indian squad at a UAE tactical competition. pic.twitter.com/7Dypo5hkun
— Polymarket Intel (@PolymarketIntel) February 9, 2026
ఇతర వినియోగదారులు కూడా ఇలాంటి వాదనలనే ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేసారు.
వాస్తవ పరిశీలన
ఈ వాదనను దర్యాప్తు చేయాలని DigitEYE India బృందం నిర్ణయించి,పరిశీలించగా,ఇది తప్పుదారి పట్టించేదిగా ఉందని కనుగొంది. ఈ వీడియోను సమాంతరంగా వేర్వేరు వ్యాఖ్యానాలతో పోస్ట్ చేయబడింది మరియు చైనా మహిళా SWAT జట్టు భారత పురుష జట్టుతో నేరుగా పోటీ పడినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. అధికారిక రికార్డులు ద్వారా కూడా పురుష జట్లతో మహిళా జట్లు పోటీ పడిన సంఘటన తేలియరాలేదు.
టోర్నమెంట్ గురించి మరింత తెలుసుకోవడానికి మేము మొదట “దుబాయ్ SWAT ఛాలెంజ్” అనే పదబంధంతో అంతర్జాలంలో అన్వేషించగా, అధికారిక UAE SWAT ఛాలెంజ్ వెబ్‌సైట్ ప్రకారం, 7వ UAE SWAT ఛాలెంజ్ ఫిబ్రవరి 7–11, 2026 వరకు దుబాయ్ పోలీసులు నిర్వహించిన దుబాయ్ SWAT శిక్షణా కేంద్రంలో జరిగిందని కనుగొన్నము.ఈ ఈవెంట్ ఫిబ్రవరి 11, 2026న ముగిసింది, కజకిస్తాన్ “C” “మొత్తం 536 పాయింట్లతో జనరల్ స్టాండింగ్స్‌లో మొదటి స్థానాన్ని సంపాదించి ఛాంపియన్‌గా నిలిచింది.”
తరువాత, మేము అధికారిక వెబ్‌సైట్‌లోని “జట్లు” విభాగాన్ని పరిశీలించగా, భారతదేశం NSG (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) యొక్క ఒక పురుష జట్టును పంపిందని తెలుసుకున్నాము. మరోవైపు, చైనా పోలీస్ A నుండి చైనా పోలీస్ F వరకు 6 జట్లను పంపింది. 2026 ఛాంపియన్‌షిప్‌లో చైనా జట్టు మరియు వారి ప్రదర్శన యొక్క స్క్రీన్‌షాట్‌ను క్రింద చూడవచ్చు-
భారతదేశం మరియు చైనా జట్లను సమీక్షించిన తర్వాత, చైనా మహిళా జట్టు ఏదైనా ఈవెంట్‌లో భారతదేశాన్ని ఎదుర్కుందాని పరిశీలించాము. PRN కథనం ప్రకారం, UAE SWAT ఛాలెంజ్‌లో మొత్తం ఎనిమిది మహిళా జట్లు పాల్గొన్నాయి, వాటిలో చైనా నుండి రెండు జట్లు ఉండగా , “చిలీ మరియు దక్షిణాఫ్రికా మిశ్రమ-లింగ(mixed-gender) జట్లు పోటీలో పాల్గొంటాయని ” పేర్కొంది, కానీ భారతదేశం నుండి మహిళా జట్టు గురించి ప్రస్తావన లేదు. నివేదికలోని కొంత భగాన్ని కింద చూడవచ్చు:
దీని తరువాత, మేము ఈవెంట్ యొక్క ర్యాంకింగ్‌లను పరిశీలించగా, పట్టికలో చూపిన విధంగా భారతదేశ NSG 62వ స్థానంలో ఉందని కనుగొన్నాము. మరోవైపు, చైనా పోలీస్ C 3వ స్థానంలో, చైనా పోలీస్ A 4వ స్థానంలో మరియు చైనా పోలీస్ B 11వ స్థానంలో నిలిచాయి.బాస్టిల్ పోస్ట్ గ్లోబల్ రాసిన కథనం ప్రకారం, చైనా నుండి వచ్చిన మహిళల జట్టు పోటీ ప్రారంభ దశలో బలమైన ప్రదర్శన ఇచ్చి, అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, చైనా మహిళా జట్లు భారతదేశ పురుష NSG జట్టుతో నేరుగా పోటీ పడలేదు.
చివరగా, మేము వాదనలోని వీడియోను విశ్లేషించగా, వీడియో క్లిప్‌లపై వ్యాఖ్యానం మిశ్రమంగా/అస్పష్టంగా ఉందని కనుగొన్నాము. వీడియో ప్రారంభంలో చైనా మహిళా జట్టు vs కజకిస్తాన్ టోమిరిస్ జట్టు గురించి ఇంగ్లీషులో వ్యాఖ్యానం వినవచ్చు. చైనా మహిళా జట్టు ‘అసాల్ట్ ఈవెంట్ టాస్క్’ను 2 నిమిషాల 8 సెకన్లలో పూర్తి చేసిందన్నది నిజం, భారతదేశ పురుష NSG జట్టు 2 నిమిషాల 31 సెకన్లలో పూర్తి చేసింది.రెండు దేశాల జట్లు వేరువేరుగా ఈ ప్రదర్శనను పూర్తి చేశాయి. ( 8:44:15 టైమ్‌స్టాంప్ దగ్గర చూడవచ్చు).
అయితే, ఆ వాదనలో రెండు వేర్వేరు వీడియో క్లిప్‌లను కలిపి ముఖాముఖి(హెడ్-టు-హెడ్) పోటీ అనే అభిప్రాయాన్ని సృష్టించింది , కానీ అది నిజం కాదు.ఈ టోర్నమెంట్ ఐదు రోజుల పాటు కొనసాగింది, కానీ ఈ వాదన మొదటి రోజు ప్రదర్శనని మాత్రమే చూపించి పురుష, మహిళా జట్ల మధ్య ప్రత్యక్ష పోటీ అన్నట్లు చూపించింది. కానీ భారత పురుష, చైనా మహిళా జట్ల మధ్య ప్రత్యక్ష పోటీ జరిగినట్లు అధికారిక ప్రకటనలేవి లభించలేదు.
కజకిస్తాన్ సి జట్టు అస్సాల్ట్ ఈవెంట్‌లో మొదటి స్థానంలో నిలిచింది మరియు ప్రతిష్టాత్మక UAE SWAT పూర్తి టోర్నమెంట్‌లోనూ విజేతగానూ ప్రకటించబడింది.
కాబట్టి, ఈ వాదన తప్పుదారి పట్టించేదిగా ఉంది .
******************************************************
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
భారత రాజధాని ఢిల్లీ త్వరలో ఇంద్రప్రస్థగా పేరు మారబోతుందా?వాస్తవ పరిశీలన
