క్లాడ్ మైథోస్ నిజంగానే 15-బిట్ ప్రైవేట్ కీని ఛేదించిందా మరియు బిట్‌కాయిన్‌కు ముప్పుగా పరిణమించిందా ? వాస్తవ పరిశీలన
వాదన/Claim: బిట్‌కాయిన్‌ను హ్యాక్ చేసి, 15 బిట్ ప్రైవేట్ కీని ఛేదించిన క్లాడ్ మిథోస్‌ను ఆంత్రోపిక్ విడుదల చేయనుందనేది వాదన.
నిర్ధారణ/Conclusion: ఆ వాదన అవాస్తవం /అబద్ధం. 256-బిట్ ఎలిప్టిక్ కర్వ్ సెక్యూరిటీని ఉపయోగించే బిట్‌కాయిన్-శైలి ప్రైవేట్ కీని క్లాడ్ మిథోస్ ఛేదించినట్లు ఆంత్రోపిక్ డాక్యుమెంటేషన్ లేదా ప్రకటనలు ఏవీ లభించలేదు . 15-బిట్ ప్రైవేట్ కీని ఒక పరిశోధకుడైన గియాన్‌కార్లో లెల్లీ ఛేదించారు, అంతేగానీ ఏఐ (AI) కాదు.
రేటింగ్ /Rating: False
క్లాడ్ మిథోస్ బిట్‌కాయిన్‌ను ఛేదించగలదు కాబట్టి అది ప్రమాదంలో ఉందని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు. వెరిఫైడ్ ఎక్స్ యూజర్ ‘క్రిప్టోనోబ్లర్’ ఇలాంటి ఒక పోస్ట్‌ను షేర్ చేసారు, దాని క్యాప్షన్‌లోని కొంత భాగం ఇలా ఉంది: “బిట్‌కాయిన్‌ను ‘హ్యాక్’ చేసిన ఏఐని ఆంత్రోపిక్ రేపు విడుదల చేయనుంది! 6 వారాల క్రితం, క్లాడ్ మిథోస్ 15-బిట్ ప్రైవేట్ కీని చేధించింది , ఇది 6.9 మిలియన్ల BTCకి యాక్సెస్ ఇచ్చే అవకాశం/ప్రమాదం ఉంది, దీని విలువ $430,000,000,000 కంటే ఎక్కువ.” ఈ పోస్ట్‌కు ‘టెర్మినల్ కోడ్ ఎగ్జిక్యూషన్’ లాగా కనిపించే ఒక వీడియో జత చేయబడింది. పోస్ట్‌ను కింద చూడవచ్చు :
🚨 BREAKING
ANTHROPIC TO RELEASE AI THAT “HACKED” BITCOIN TOMORROW!
6 WEEKS AGO, CLAUDE MYTHOS CRACKED A 15-BIT PRIVATE KEY THAT POTENTIALLY GIVES ACCESS TO 6.9 MILLION BTC, WORTH OVER $430,000,000,000.
THIS IS NOT LOOKING GOOD FOR BITCOIN AND CRYPTO… https://t.co/ssocpcGFUC pic.twitter.com/d8PiTG6ZZQ
— 0xNobler (@CryptoNobler) June 9, 2026
ఇతర వినియోగదారులు కూడా ఇలాంటి వాదనలనే ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేసారు.
FACT CHECK
బిట్‌కాయిన్ తరహా ప్రైవేట్ కీని ఛేదించడానికి క్లాడ్ మిథోస్‌ను ఉపయోగించినట్లు ఏ అధికారిక ఆంత్రోపిక్ ప్రకటన లేదా పరిశోధనా పత్రం పేర్కొనలేదు. విస్తృతంగా వార్తల్లోకి వచ్చిన 15-బిట్ ఎలిప్టిక్ కర్వ్ కీ ప్రదర్శనను క్వాంటం కంప్యూటింగ్ పరిశోధకుడు గియాన్‌కార్లో లెల్లీ బహిరంగంగా అందుబాటులో ఉన్న హార్డ్‌వేర్‌పై నిర్వహించారు, అయితే ఈ ఘనత సాధించడంలో క్లాడ్ మిథోస్ పాత్ర పోషించినట్లు ఎటువంటి సూచన/ఆధారం లేదు.
వివరాలు:
దాని గురించి మరింత తెలుసుకోవడానికి మేము మొదట “ఆంత్రోపిక్ క్లాడ్ మిథోస్‌ను విడుదల చేసింది” అనే పదబంధంతో వెబ్లో అన్వేషించగా, జూన్ 9, 2026న ఆంత్రోపిక్ ప్రచురించిన ఒక నివేదికను గమనించాము. దానిలో మిథోస్ 5 “ప్రపంచంలోని ఏ మోడల్‌లోనైనా అత్యంత బలమైన సైబర్‌సెక్యూరిటీ సామర్థ్యాలను కలిగి ఉంది” అని వర్ణించబడింది. అంతేకాకుండా, మిథోస్ 5 “ఒక వారానికి పైగా చాలావరకు స్వయంప్రతిపత్తితో పనిచేసిన” జీనోమిక్స్ పరిశోధనను మరియు నైపుణ్యం కలిగిన మానవ ఆపరేటర్లకు “సమానంగా లేదా వారిని మించి” మరియు ఔషధ-రూపకల్పన పనులను నిర్వహించింది. ఈ నివేదికలోని కొంత భాగాన్ని క్రింద చూడవచ్చు:
సైబర్ భద్రతకు సంబంధించిన విభాగంలో, 1,000 గంటలకు పైగా నిర్వహించిన పరీక్షల్లో ఎటువంటి ‘యూనివర్సల్ జైల్‌బ్రేక్‌లు’ (universal jailbreaks) కనిపించలేదని పరిశోధకులు గుర్తించినట్లు నివేదిక పేర్కొంది. జైల్‌బ్రేక్ ప్రయత్నాలను భారీ స్థాయిలో వినియోగించే కంటే ముందే గుర్తించి అడ్డుకునేలా, వాటిని “తగినంత నెమ్మదిగా మరియు ఖర్చుతో కూడుకున్నవిగా” మార్చడమే తమ లక్ష్యమని వారు తెలిపారు. ఇందులో భద్రతా చర్యల గురించి చర్చించారు; అలాగే, ‘Mythos 5’ను అటువంటి ప్రయోజనాల కోసం ఉపయోగించినట్లు ‘Anthropic’ నుండి ఎటువంటి ప్రకటనలు లేదా నివేదికలు వెలువడలేదు. నివేదికలోని ఆ భాగాన్ని కింద చూడవచ్చు:
తరువాత, క్లాడ్ మిథోస్ 15-బిట్ ప్రైవేట్ కీని చేధించిందా లేదాని మేము అన్వేషించగా,ఎటువంటి ఆధారాలు లభించలేదు. కాయిన్‌డెస్క్ నివేదిక ప్రకారం, పరిశోధకుడు గియాన్‌కార్లో లెల్లీ, బహిరంగంగా అందుబాటులో ఉన్న క్వాంటం హార్డ్‌వేర్‌ను ఉపయోగించి 15-బిట్ ఎలిప్టిక్ కర్వ్ కీని విజయవంతంగా ఛేదించి, ప్రాజెక్ట్ ఎలెవెన్ యొక్క 1 BTC “Q-డే ప్రైజ్”ను గెలుచుకున్నారు. అయితే, “బిట్‌కాయిన్ 256-బిట్ ఎలిప్టిక్ కర్వ్ భద్రతను ఉపయోగిస్తుంది” అని మరియు లెల్లీ సాధించిన విజయం బిట్‌కాయిన్‌ను ఛేదించవచ్చని అర్థం కాదని ఆ నివేదిక నొక్కి చెబుతోంది. నివేదికలోని కొంత భాగాన్ని కింద చూడవచ్చు:
పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా, క్లాడ్ మిథోస్ 6.9 మిలియన్ల BTCకి యాక్సెస్ ఇచ్చే కీని ఛేదించినట్లు ‘డిజిటై’ బృందానికి ఎటువంటి ఆధారాలు లేదా విశ్వసనీయమైన నివేదికలు లభించలేదు.
అందువల్ల, ఈ వాదన అవాస్తవం /అబద్ధం.
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
ట్రంప్‌ను 2025 నోబెల్ శాంతి బహుమతి నామినీల జాబితా నుండి తొలగించారా? వాస్తవ పరిశీలన
