వాదన/Claim: భారత ప్రభుత్వం ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది మరియు ఆయుష్ (AYUSH), మత్స్యశాఖ, పురావస్తు శాఖ వంటి అనేక మంత్రిత్వ శాఖలను మూసివేయాలని యోచిస్తుందనేది వాదన.

నిర్ధారణ/Conclusion:ఈ వాదన అవాస్తవం. ఏ ప్రభుత్వ మంత్రిత్వ శాఖ గానీ, సంబంధిత విభాగం గానీ, లేదా అధికారిక వర్గాలు గానీ ఆయుష్, మత్స్య, పురావస్తు (ఏఎస్ఐ), చిన్న నీటిపారుదల మరియు చేనేత విభాగాలను మూసివేయనున్నట్లు ప్రకటించలేదు, ఆలా చేయాలనే ప్రణాళిక కూడా ఆలోచనలో లేదు.
ఈ చిత్రం కల్పితమైనది; ప్రభుత్వం ఇటీవల పొదుపు చర్యలను ప్రోత్సహిస్తున్నప్పటికీ,ఈ శాఖలను మూసివేసినట్లు నమ్మదగిన ఆధారాలు ఏవీ లేవు..

రేటింగ్ /Rating: అవాస్తవం

******************************************************

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి

లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి

******************************************************

భారత ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని పేర్కొంటూ, వార్తాపత్రికలోని ఒక చిన్న భాగంలా కనిపించే చిత్రాన్ని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేసారు.
X వినియోగదారు ‘dramithmpa’ అటువంటి పోస్ట్‌ను “#संविधानवादियों_आवाज_दो_हम_एक_हैं”, దీనిని ఆంగ్లంలోకి అనువదించగా, “రాజ్యాంగవాదులు మీ గొంతులు విప్పండి , మనమంతా ఒక్కటే ” అనే క్యాప్షన్‌తో షేర్ చేసారు.పోస్ట్‌కు జత చేసిన వార్తాపత్రిక శైలి గ్రాఫిక్ ప్రకారం, ఆయుష్, మత్స్య, పురావస్తు శాఖల వంటి అనేక విభాగాలు సంక్షోభంలో ఉన్నాయని పేర్కొనబడింది. పోస్ట్‌ను మరియు ఆ చిత్రం యొక్క ఆంగ్ల అనువాదాన్ని కింద చూడవచ్చు –

 

ఇతర వినియోగదారులు ఇలాంటి వాదనలనే ఇక్కడ మరి యు ఇక్కడ షేర్ చేశారు.

వాస్తవ పరిశీలన

ఈ వాదనను డిజిటై బృందం పరిశీలించగా, అది అవాస్తవమని నిర్ధారించింది. ఆయుష్ (AYUSH), మత్స్య, పురావస్తు (ASI), చిన్న నీటిపారుదల లేదా చేనేత శాఖలను మూసివేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సూచించే ఎటువంటి అధికారిక ప్రకటన గానీ, విశ్వసనీయమైన ఆధారాలు గానీ లేవు. వైరల్ అవుతున్న ఆ చిత్రం డిజిటల్‌గా సృష్టించబడినట్లు కనిపిస్తోంది. పొదుపు మరియు ఖర్చుల తగ్గింపుపై ప్రభుత్వం ఇటీవల చర్యలు చేపట్టినప్పటికీ, ఈ విభాగాలను రద్దు చేస్తారని ఏ మంత్రిత్వ శాఖ లేదా అధికారిక వర్గం కూడా సూచించలేదు.

ఆ చిత్రం యొక్క మూలం లేదా అది ఏ వార్తాపత్రికకు చెందినదో తెలుసుకోవడానికి మేము మొదట ‘రివర్స్ ఇమేజ్ సెర్చ్’ (reverse image search) చేశాము. అయితే, ఈ శోధనలో మాకు ఎటువంటి మీడియా సంస్థ లేదా అటువంటి వార్తను ప్రచురించిన ఏ ఇతర సంస్థ వివరాలు లభించలేదు. భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖల వెబ్‌సైట్లను పరిశీలించగా, కేంద్ర మంత్రిత్వ శాఖలు లేదా విభాగాలను మూసివేసే విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటనలు కనిపించలేదు.

ఈ పోస్ట్‌కు జత చేసిన చిత్రం, ఆయుష్ (AYUSH), మత్స్యశాఖ, పురావస్తు శాఖ (ASI), చిన్న తరహా నీటిపారుదల మరియు చేనేత శాఖ వంటి విభాగాలు మూసివేయబడతాయని పేర్కొంది. మేము ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించగా, వాటి మూసివేతకు సంబంధించిన ఎలాంటి పత్రికా ప్రకటన కనిపించలేదు. ఆయుష్ శాఖ పూర్తిస్థాయిలో పనిచేస్తోంది; అంతేకాకుండా, రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి వారు తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తాజాగా పోస్టు చేసినట్లు గమనించాము . వారి తాజా పత్రికా ప్రకటనకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కింద చూడండి –

దీనిని అనుసరించి, మేము భారత మత్స్యశాఖ (Fisheries Department of India) వివరాలను పరిశీలించగా, అది పూర్తిస్థాయిలో పనిచేస్తోందని తెలిసింది. 2026 ఏప్రిల్ 22న, వారు గ్రాంట్ల కోసం సమగ్ర డిమాండ్‌కు సంబంధించిన పది నివేదికలను అప్‌లోడ్ చేశారు. అదేవిధంగా, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత పురావస్తు సర్వేక్షణ విభాగం (Archaeological Survey of India) కూడా, 2026 మే 15న నలంద మ్యూజియంను ప్రజల సందర్శనార్థం తెరవడంపై ఒక నివేదికను అప్‌లోడ్ చేసింది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఈ కార్యక్రమాల స్క్రీన్‌షాట్‌ను కింద చూడవచ్చు –

వస్త్ర పరిశ్రమ మంత్రిత్వ శాఖ మరియు జలశక్తి మంత్రిత్వ శాఖ (చిన్న నీటిపారుదల వ్యవహారాలు నిర్వహణ) కూడా పూర్తిగా పనిచేస్తున్నాయి. ఆలోచనతో ఖర్చు చేయాలని, బంగారం కొనుగోలుకు దూరంగా ఉండాలని, విదేశీ పర్యటనలను పరిమితం చేసుకోవాలని, ఇంటి నుంచే పని చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఏడు విజ్ఞప్తులు చేశారు.

మే 13, 2026న ప్రచురితమైన ‘TOI’ నివేదిక ప్రకారం, అదనపు ఖర్చును నివారించడానికి ప్రధాని మోదీ తన కాన్వాయ్ పరిమాణాన్ని తగ్గించుకున్నారు. అయితే, ఇవి వ్యక్తిగత పౌరులకు సంబంధించిన వ్యయ నియంత్రణ చర్యలే తప్ప, ఏ రకమైన శాఖల రద్దుకు సంబంధించినవి కావు. చివరగా, ఆ క్లెయిమ్‌లోని/వాదనలోని చిత్రాన్ని డౌన్‌లోడ్ చేసి ‘AI డిటెక్టర్’ ద్వారా పరిశీలించగా, ఆ చిత్రం AIని ఉపయోగించి రూపొందించబడిందని తేలింది. ఫలితాలను కింద చూడవచ్చు

కాబట్టి, ఈ వాదన అవాస్తవం.

******************************************************
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

భారతదేశం ఇప్పటికే దేశవ్యాప్తంగా వినియోగదారుల మధ్య ఒకరి నుంచి మరొకరికి విద్యుత్ ట్రేడింగ్‌ను ప్రారంభించిందా? వాస్తవ పరిశీలన

భారత గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా బైక్ విన్యాసాలు చేస్తున్న బైకర్లు కింద పడిపోయారా ?వాస్తవ పరిశీల

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

Exit mobile version