వాదన/Claim : అన్ని ప్రకటనలలో  శ్వేతజాతి మోడళ్లను మరియు బ్రిటిష్ మోడళ్లను నిషేధించిన మొదటి దేశంగా నైజీరియా నిలిచిందనేది వాదన.

నిర్ధారణ/Conclusion :ఈ వాదన తప్పుదారి పట్టించేది. ఈ విధానం 2022 నాటిది మరియు అడ్వర్టైజింగ్ రెగ్యులేటరీ కౌన్సిల్ ఆఫ్ నైజీరియా (ARCON) ద్వారా జారీ చేయబడింది, ఇది అన్ని ప్రకటనలలో విదేశీ మోడల్స్ మరియు వాయిస్-ఓవర్ ఆర్టిస్టులను నిషేదిస్తున్నట్లు పేర్కొంది . అయితే, ఇది జాతితో సంబంధం లేకుండా అన్ని విదేశీ పౌరులకు (నైజీరియా దేశస్థులు కానివారు) వర్తిస్తుంది మరియు వాదన/దావాలో సూచించినట్లుగా శ్వేతజాతి  మోడల్స్‌కు లేదా బ్రిటిష్ మోడల్స్‌కు మాత్రమే కాదు.

రేటింగ్/Rating : తప్పుదారి పట్టించేది

**********************************************************

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి

లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి
******************************************************

నైజీరియా ప్రకటనల పరిశ్రమలో శ్వేతజాతి మోడళ్లను మరియు బ్రిటిష్ మోడళ్లను నిషేధించిన మొదటి దేశంగా అవతరించిందని అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు ఒక వాదనను షేర్ చేసారు.
X వినియోగదారుడు ‘FightStorage’ అటువంటి వాదనను ఇలా షేర్ చేసారు : ‘అన్ని ప్రకటనలలో శ్వేతజాతి మోడళ్లను మరియు బ్రిటిష్ మోడళ్లను నిషేధించిన మొదటి దేశం నైజీరియా. “మాకు ఇక్కడ 200 మిలియన్ల అందమైన మనుషులు ఉన్నారు.. మేము మా స్వంత వారినే వినియోగించుకుంటాము ”..పోస్ట్ లో జాతీయ జెండాను పట్టుకున్న నైజీరియన్ మోడల్స్ బృందం యొక్క చిత్రం జతచేసి ఉంది . ఈ పోస్ట్ ను  1.2 మిలియన్ల మందికి పైగా వీక్షించారు మరియు క్రింద చూడవచ్చు

ఇతర వినియోగదారులు కూడా ఇలాంటి వాదననే ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేసారు.

FACT CHECK

DigitEYE India బృందం ఈ వాదనను దర్యాప్తు చేయాలని నిర్ణయించి,పరిశీలించగా, అది తప్పుదారి పట్టించేదిగా ఉందని కనుగొంది. ఈ నిబంధనను 2022లో అడ్వర్టైజింగ్ రెగ్యులేటరీ కౌన్సిల్ ఆఫ్ నైజీరియా (ARCON) ప్రవేశపెట్టింది మరియు ప్రకటనలలో విదేశీ మోడల్స్ మరియు వాయిస్ ఓవర్ ఆర్టిస్టులను వినియోగించడాన్ని నిషేధిస్తుంది. ఇది జాతితో సంబంధం లేకుండా నైజీరియన్లు కాని దేశస్తులందరికి వర్తిస్తుంది మరియు వాదనలో పేర్కొన్నట్లుగా శ్వేతజాతి లేదా బ్రిటిష్ వ్యక్తులకు మాత్రమే పరిమితం కాదు.

మరింత సమాచారం తెలుసుకోవడానికి మేము మొదట “నైజీరియా శ్వేతజాతి మరియు బ్రిటిష్ మోడళ్లను నిషేధించింది” అనే పదబంధంతో అంతర్జాలంలో అన్వేషించగా, ఆగస్టు 30, 2022న, అల్ జజీరా ప్రచురించిన నివేదికను  కనుగొన్నము. నైజీరియా “పరిశ్రమలో మరియు ఇతర రంగాలలో స్థానిక ప్రమేయం మరింత పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది” అని నివేదిక పేర్కొంది . నైజీరియా ప్రకటనల ఏజెన్సీల సంఘం అధ్యక్షుడు స్టీవ్ బాబాయికో: ఇది దేశానికి “ఒక కొత్త ప్రతిష్ట/గౌరవాన్ని” కలిగిస్తుందని వ్యాఖ్యానించారని నివేదిక పేర్కొంది. దిగువ నివేదిక నుండి కొంత భాగాన్ని చూడవచ్చు:

‘ఓకేఆఫ్రికా’ ప్రచురించిన మరో నివేదిక కూడా ప్రకటనలలో విదేశీ మోడళ్లను నిషేధించాలనే నైజీరియా చర్యను ధృవీకరించింది. “నైజీరియా ప్రకటనల నియంత్రణ మండలి (అడ్వర్టైజింగ్ రెగ్యులేటరీ కౌన్సిల్ ఆఫ్ నైజీరియా/ARCON) ఈ ప్రణాళికను రూపొందించి , ఇది నైజీరియన్ ప్రకటనల పరిశ్రమ మొత్తాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా,  ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఉందని ప్రకటించిందని”, నివేదిక పేర్కొంది. అయితే, జాతి వివక్షతను లేదా నిషేధం ప్రత్యేకంగా శ్వేతజాతి లేదా బ్రిటిష్ విదేశీ పౌరులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవు.

అడ్వర్టైజింగ్ రెగ్యులేటరీ కౌన్సిల్ ఆఫ్ నైజీరియా (ARCON) అధికారిక నోటీసు కోసం అన్వేషించగా, ఆగస్టు 22, 2022న జారీ చేయబడిన ARCON (చట్టం నంబర్ 23, 2022)ప్రకారం, ఇది “అక్టోబర్ 1, 2022 నుండి అమలులోకి వచ్చేలా మరియు నైజీరియన్ ప్రకటన పరిశ్రమను లక్ష్యంగా చేసుకున్న ఏదైనా ప్రకటనలో విదేశీ మోడల్‌లు మరియు వాయిస్-ఓవర్ ఆర్టిస్టులను వినియోగించడాన్ని నిషేధిస్తుందని” కనుగొన్నము.
“అన్ని ప్రకటనలు… నైజీరియన్ మోడల్ మరియు వాయిస్-ఓవర్ ఆర్టిస్ట్‌ను మాత్రమే వినియోగించుకోవాలని “, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రచారాలకు అనుమతి ఉంది, అయితే, తదుపరి దరఖాస్తులు మంజూరు చేయబడవని …” ఆదేశం పేర్కొంది. దిగువ ఆదేశాన్ని చూడవచ్చు :

ఈ విధానం/పధ్ధతి ప్రత్యేకంగా శ్వేతజాతి లేదా బ్రిటిష్ వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదు. నోటీసు ప్రకారం, ఇది అన్ని విదేశీ పౌరులకు వర్తిస్తుంది మరియు ప్రపంచవ్యాప్తంగా విదేశీ మోడల్స్ మరియు వాయిస్ ఓవర్ ఆర్టిస్టుల వినియోగన్ని నిషేధిస్తుంది. నవీకరించబడిన విధానం/పధ్ధతిలో, జాతి వివక్షత కోణం లేదా దావాలో పేర్కొన్నట్లుగా 2026లో శ్వేతజాతి లేదా బ్రిటిష్ మోడల్స్‌పై మాత్రమే నిషేధం ప్రకటించబడలేదు.

కాబట్టి, ఇది తప్పుదారి పట్టించే వాదన.

******************************************************
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

భారతదేశం ఇప్పటికే దేశవ్యాప్తంగా వినియోగదారుల మధ్య ఒకరి నుంచి మరొకరికి విద్యుత్ ట్రేడింగ్‌ను ప్రారంభించిందా? వాస్తవ పరిశీలన

భారత గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా బైక్ విన్యాసాలు చేస్తున్న బైకర్లు కింద పడిపోయారా ?వాస్తవ పరిశీలన

 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

Exit mobile version