వాదన/Claim: ఐసిసి ఉమెన్ వరల్డ్ కప్ 2025 లో బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు బురఖాలో క్రికెట్ ఆడారనేది వాదన.

నిర్ధారణ/Conclusion:పూర్తిగా తప్పు . వాదనలో చూపబడిన చిత్రం జెమిని AI ఉపయోగించి మార్చబడింది/రూపొందించబడింది. ఐసిసి ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో బంగ్లాదేశ్ మహిళా జట్టు వారి అధికారిక జెర్సీలో (క్రీడా దుస్తులు) క్రికెట్ ఆడారు.

రేటింగ్ /Rating : పూర్తిగా తప్పు —


ఐసిసి ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో బంగ్లాదేశ్ మహిళా జట్టు బురఖాలో క్రికెట్ ఆడుతోందని అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు. X యూజర్ ‘GemsOfCrickets’ న్యూజిలాండ్ మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగిన ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 మ్యాచ్ నుండి ఒక చిత్రాన్ని షేర్ చేస్తూ ఈ వాదన చేసారు.
“బంగ్లాదేశ్ మహిళా జట్టు” అని పుర్రె ఎమోజితో జట్టును ఎగతాళి చేస్తూ ,పోస్ట్ చేసారు. పోస్ట్ మరియు చిత్రాన్ని దిగువన చూడవచ్చు .

ఆ చిత్రంలో ఇద్దరు బంగ్లాదేశ్ మహిళా క్రీడాకారిణులు పూర్తిగా నల్ల బురఖాలు ధరించి మైదానంలో ఉన్నట్లు చూపుతోంది.
స్కోరుబోర్డు “NZ v BAN”; లక్ష్యం 228; 3 ఓవర్లు పూర్తయినట్లు , స్కోరు 10/4, బంగ్లాదేశ్ తరఫున “JHELIK” మరియు “SUPTA” మరియు న్యూజిలాండ్ తరఫున “J KERR” ఆడుతున్నట్లు చూపిస్తుంది.

ఇతర వినియోగదారులు కూడా ఇదే దావాను ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేసారు.

వాస్తవ పరిశీలన

ఈ వాదనను దర్యాప్తు చేయాలని DigitEYE India నిర్ణయించుకొని పరిశీలించగా, అది అబద్ధమని తేలింది.
ఈ చిత్రం జెమిని AI ద్వార రూపొందించింది మరియు జెమిని AI లోగో పూర్తి చిత్రంలో కనిపిస్తుంది(కింద చూడవచ్చు ). అంతేకాకుండా, అధికారిక మ్యాచ్ ముఖ్యాంశాలలో బంగ్లాదేశ్ మహిళా జట్టు తమ అధికారిక జెర్సీతో(క్రీడా దుస్తులతో) ఆడిందని మరియు బురఖాలో లేదని స్పష్టమవుతుంది.

మొదట మేము “బురఖాలో ఆడుతున్న బంగ్లాదేశ్ మహిళా జట్టు” అనే పదంతో అన్వేషించగా,ఎటువంటి ఫలితాలను లేదా నివేదికలను దొరకలేదు.ఇంకా,మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించి,ఇతర వాదనలను/దావాలను నిశితంగా పరిశీలించినప్పుడు,దిగువ కుడి వైపున జెమిని AI లోగో కనిపించింది. దిగువ స్క్రీన్‌షాట్‌లో చూడవచ్చు.

మరింత వివరాల కోసం మేము ICC మహిళల ప్రపంచ కప్ 2025లో ఉపయోగించబోయే అధికారిక బంగ్లాదేశ్ మహిళల జట్టు జెర్సీ కోసం చూడగా,సెప్టెంబర్ 16, 2025న BSS న్యూస్ బంగ్లాదేశ్ మహిళల జట్టు అధికారిక జెర్సీ ఆవిష్కరణ వార్తా నివేదికను ప్రచురించడం గమనించాము.నివేదికలో కొంత భాగాన్ని కింద చూడవచ్చు :

బంగ్లాదేశ్ మహిళల జట్టు క్రీడలు మరియు ICC మహిళల ప్రపంచ కప్ 2025లో ముఖ్యాంశాలను నివేదించే అధికారిక ICC వెబ్‌సైట్‌ను కూడా మేము పరిశీలించాము.
అన్ని వీడియో క్లిప్‌లలో మరియు నివేదికలలో, ఆటగాళ్ళు వారి జాతీయ రంగులు ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులను కలిగి ఉన్న అధికారిక బంగ్లాదేశ్ జెర్సీని ధరించి ఉన్నారు. దిగువ స్క్రీన్‌షాట్‌లో చూడవచ్చు.  

బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ క్రీడాకారిణులు సుప్తా మరియు జెలిక్ ఇద్దరూ బంగ్లాదేశ్ మహిళల జట్టు అధికారిక జెర్సీని ధరించారు,బురఖాను ధరించలేదు. మ్యాచ్ యొక్క ముఖ్యాంశాలను ఇక్కడ చూడవచ్చు.

జెమిని AI ఉపయోగించి చిత్రం మార్చబడింది. 2025 ICC మహిళల ప్రపంచ కప్ సందర్భంగా బంగ్లాదేశ్ మహిళల జట్టు వారి అధికారిక జెర్సీ ధరించి క్రికెట్ ఆడడం జరిగింది.

కాబట్టి, ఈ వాదన తప్పు.

****************************************************

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

MTV ఇండియా డిసెంబర్ 2025 నాటికి అన్ని కార్యకలాపాలను మూసివేస్తుందా? వాస్తవ పరిశీలన

ప్రభుత్వ సేవలలో అవినీతిని నివేదించడానికి PMO ఇండియా 9851145045 హాట్‌లైన్‌ను పౌరుల కోసం ప్రారంభించిందా? వాస్తవ పరిశీలన

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

Exit mobile version