వాదన/Claim: భారత జట్టు ఆడటానికి బయటకు వచ్చే ముందు పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు ఎయిర్ ఫ్రెషనర్ స్ప్రే చేసిందనేది వాదన.

నిర్ధారణ /Conclusion: ఈ వాదన తప్పుగా చూపించబడింది. పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు మైదానంలో చాలా కీటకాలు వ్యాపించి ఉండటంతో కీటకాల/పురుగుమందును పిచికారీ చేస్తున్నారు.

రేటింగ్ /Rating: తప్పుగా చూపించబడింది —

*****************************************************************************

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి

లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి
******************************************************

పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు గాల్లోకి ఏదో స్ప్రే చేస్తున్న క్లిప్‌ను చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేశారు.X యూజర్ ‘jayroo69’ అటువంటి వాదనను/క్లెయిమ్‌ను ఇలా షేర్ చేసారు: భారత ప్రత్యర్థులు బయటకు రాకముందే పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు ఎయిర్ ఫ్రెషనర్ స్ప్రే చేస్తోంది . క్రింద పోస్ట్‌ను చూడవచ్చు. 

మరొక X వినియోగదారుడు ‘JeffreyxEpstein’ కూడా ఇలాంటి వాదననే ఈ విధంగా  షేర్ చేసారు ,”భారతీయులు మైదానంలో అడుగు పెట్టడానికి ముందు పాకిస్తాన్ ఆటగాళ్ళు ఎయిర్ ఫ్రెషనర్ స్ప్రేను ఉపయోగించారు”. ఈ పోస్ట్ దాదాపు 662,000 మంది వీక్షించగా,ఆ పోస్టును క్రింద చూడవచ్చును.

వాస్తవ పరిశీలన

ఆ వాదనను దర్యాప్తు చేయాలని నిర్ణయించిన DigitEYE India బృందం, అది వాస్తవాలను తప్పుగా చూపించిందని కనుగొన్నారు.మ్యాచ్ సమయంలో కీటకాలవల్ల అంతరాయం కలిగినందున పాకిస్తాన్ మహిళా జట్టు కీటక నాశన రసాయనాన్ని స్ప్రే చేస్తున్న సందర్భాన్ని, వారు భారత జట్టును అవమానించారంటూ పోస్టులో వక్రీకరించబడింది.

ఈ వాదన గురించి తెలుసుకోవడానికి మేము మొదట “ఇండియా vs పాకిస్తాన్ మహిళల క్రికెట్ ఎయిర్ ఫ్రెషనర్” అనే పదంతో వెబ్లో అన్వేషించగా, NDTV స్పోర్ట్స్ నివేదికతో సహా అనేక నివేదికలు “ఈగల/కీటకాల గుంపు ఆటకు అంతరాయం కలిగించి, రెండు వైపుల ఆటగాళ్లకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడంతో ఈ సంఘటన జరిగింది…” అని ధృవీకరించినట్లు కనుగొన్నము .నివేదికలో కొంత భాగాన్ని క్రింద చూడవచ్చు-

ESPN నివేదిక నుండి, ఈ ఫుటేజ్ అక్టోబర్ 5, 2025న శ్రీలంకలోని కొలంబోలో జరిగిన భారతదేశం vs. పాకిస్తాన్ మహిళల ODI ప్రపంచ కప్ 2025 మ్యాచ్ నుండి తీసుకోబడిందని మేము తెలుసుకున్నాము.ఇది 28వ ఓవర్‌ సమయంలో ఒక కీటకాల /ఈగల గుంపు ఆటకు అంతరాయం కలిగిస్తుండగా, దీనితో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా మరియు క్రీడాకారిణి అనమ్ అమీన్ కీటకాలను తరిమికొట్టడానికి వారి దుస్తులపై మరియు గాలిలో కీటక నాశన రసాయనాన్ని స్ప్రే చేయవలసి వచ్చింది. ఇది ఎయిర్ ఫ్రెషనర్ కాదు.నివేదికలో కొంత భాగాన్ని క్రింద చూడవచ్చు-

హిందూస్తాన్ టైమ్స్ ప్రచురించిన ఒక నివేదికలో “కీటకాలు రాకుండా ఉండటానికి నష్రా తన టవల్ ఊపుతూ కనిపించింది. కొంతమంది పాకిస్తానీ ఆటగాళ్ళు మైదానంలో ఉన్న అంపైర్‌ను సంప్రదించి మాట్లాడుకున్నారు…” అని రాశారు. X నుండి ఈ సంఘటన యొక్క మరొక క్లిప్‌ను ఇక్కడ చూడవచ్చు.

కీటకాల వల్లే అంతరాయం కలిగిందని మరియు వాటి నియంత్రణ కోసం స్ప్రే ఉపయోగించబడిందని అనేక వార్తా సంస్థలు ధృవీకరించాయి.మరియు గ్రౌండ్ సిబ్బంది కూడా
మొత్తం మైదానంలో కీటక నాశన రసాయనాన్ని స్ప్రే చేయడం మనం చూడవచ్చు.

కాబట్టి, ఈ వాదన తప్పుగా చూపించబడింది.

****************************************************

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

ఐసిసి మహిళా వరల్డ్ కప్ 2025 లో బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు బురఖాలో ఆడిందా? వాస్తవ పరిశీలన

ప్రభుత్వ సేవలలో అవినీతిని నివేదించడానికి PMO ఇండియా 9851145045 హాట్‌లైన్‌ను పౌరుల కోసం ప్రారంభించిందా? వాస్తవ పరిశీలన

 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

Exit mobile version