భారత రాజధాని ఢిల్లీ త్వరలో ఇంద్రప్రస్థగా పేరు మారబోతుందా?వాస్తవ పరిశీలన
వాదన/Claim : ఢిల్లీ పేరు త్వరలో మహాభారతంలోని పాండవుల నగరం అయిన ‘ఇంద్రప్రస్థగా’ మారబోతుందనేది వాదన.
నిర్ధారణ /Conclusion : ఈ వాదన తప్పు.రాజధాని పేరు మార్చాలని ఇటీవల ప్రతిపాదనలు వచ్చినప్పటికీ, అధికారిక నిర్ణయం, గడువు సమయం లేదా శాసనసభ చర్యలు ఏవీ నిర్ధారించబడలేదు. ప్రభుత్వ వర్గాల నుండి అలాంటి మార్పు జరుగుతుందని నిర్ధారించే విశ్వసనీయ వార్తా నివేదికలు కూడా లేవు.
రేటింగ్ /Rating : తప్పు —
******************************************************
వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి.
లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి.
******************************************************
భారత రాజధాని ఢిల్లీ పేరును త్వరలో ఇంద్రప్రస్థగా మారబోతుందని అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు. X యూజర్ ‘coolfunnytshirt’ అనే వ్యక్తి , ఢిల్లీ పేరును త్వరలో మహాభారతంలోని పాండవుల నగరం అయిన ఇంద్రప్రస్థగా మారబోతుందనే పోస్ట్ ను షేర్ చేస్తూ అలాంటి వాదన చేశారు. జనవరి 25, 2026 నాటి ఈ పోస్ట్ ఇండియా గేట్, కృష్ణుడు,అర్జునుడి చిత్రాలు మరియు హోంమంత్రి అమిత్ షా వంటి చిత్రాలతో కూడి ఉంది. ఈ పోస్ట్ ను 346,000 కంటే ఎక్కువ మంది వీక్షించారు, మరియు క్రింద చూడవచ్చు:
Ab Tandav Hoga?🔥 pic.twitter.com/mpKgdF3D0f
— Keh Ke Peheno (@coolfunnytshirt) January 25, 2026
ఇతర వినియోగదారులు కూడా ఇలాంటి వాదనలనే ఇక్కడ షేర్ చేసారు.
FACT CHECK
ఈ వాదనను దర్యాప్తు చేయాలని DigitEYE India బృందం నిర్ణయించి, పరిశీలించగా, అది అబద్ధమని తేలింది.రాజధాని పేరు మార్చడం గురించి చర్చలు జరిగినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకొనబడలేదు.అధికారిక నిర్ణయం, గడువు సమయం లేదా శాసనసభ చర్యలు ఏవీ నిర్ధారించబడలేదు. ప్రభుత్వ వర్గాల నుండి అలాంటి మార్పు జరుగుతుందని నిర్ధారించే విశ్వసనీయ వార్తా నివేదికలు కూడా లేవు.
వివరాలు:
ఈ విషయం గురించి మరింత తెలుసుకోవడానికి మేము మొదట “ఢిల్లీని ఇంద్రప్రస్థగా పేరు మార్చబోతున్నాం” అనే పదబంధంతో అంతర్జాలంలో అన్వేషించగా, అక్టోబర్ 19, 2025న హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, విశ్వ హిందూ పరిషత్ (VHP) ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రాకు రాసిన లేఖలో పేరు మార్చాలని ప్రతిపాదించింది. “నగరాల పేర్లు ఒక దేశం యొక్క చరిత్రని(విలువలు, చరిత్ర, గుర్తింపు)ప్రతిబింబిస్తాయి, అవి ప్రాచీన చరిత్ర మరియు సంస్కృతితో ముడిపడి ఉంటాయి. “మనం ఢిల్లీ అని చెప్పినప్పుడు, మనం 2,000 సంవత్సరాల కాలాన్ని మాత్రమే చూస్తాము. కానీ ఇంద్రప్రస్థ అని చెప్పినప్పుడు, మనం 5,000 సంవత్సరాల పాటు విస్తరించి ఉన్న అద్భుతమైన చరిత్రతో అనుసంధానించబడతాము,అని లేఖలో ప్రస్తావించినట్లు “, నివేదిక పేర్కొంది. నివేదిక నుండి కొంత భాగాన్ని క్రింద చూడవచ్చు :
దీని తరువాత, నవంబర్ 1, 2025న టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన మరో నివేదికను మేము గమనించాము . నివేదిక ప్రకారం, పురాతన వారసత్వాన్ని/చరిత్రను గౌరవించేలా పేరు మార్చాలని కోరుతూ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. పాత ఢిల్లీ రైల్వే స్టేషన్‌ను ‘ఇంద్రప్రస్థ జంక్షన్’గా, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ‘ఇంద్రప్రస్థ అంతర్జాతీయ విమానాశ్రయం’గా మార్చాలని కూడా ఆయన సూచించారు. నివేదిక నుండి కొంత భాగాన్ని క్రింద చూడవచ్చు :
అయితే, ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలనే ప్రతిపాదనకు సంబంధించి, ప్రభుత్వ అధికారిక ప్రతిస్పందన/నిర్ణయం
ఇంకా స్పష్టంగా తెలియలేదు.“అలాంటి చర్య దిల్లీ యొక్క బహుస్థరాల చరిత్రను(బహుళ-స్థాయి చరిత్రను) ఒకే కథనంగా సరళీకరించే ప్రమాదం కలిగిస్తుంది.” అని ఎకనామిక్ టైమ్స్ నివేదిక చరిత్రకారుల అభిప్రాయాన్ని తన నివేదికలో పెర్కొంది.
2022లో, ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలని అఖిల భారత హిందూ మహాసభకు చెందిన స్వామి చక్రపాణి ఇలాంటి పిలుపులు ఇచ్చారు,కానీ వాటిని కూడా పట్టించుకోలేదని,నేషనల్ హెరాల్డ్ నివేదిక పేర్కొంది.
భారత ప్రభుత్వం నుండి ఎటువంటి వ్యాఖ్య లేదా అధికారిక నోటిఫికేషన్ రాలేదు.
కాబట్టి, ఈ వాదన తప్పు.
More Videos:
