భారత గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా బైక్ విన్యాసాలు చేస్తున్న బైకర్లు కింద పడిపోయారా ?వాస్తవ పరిశీలన
వాదన/Claim : గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా బైక్ విన్యాసాలు చేస్తున్నప్పుడు భారత సైన్యం విఫలమైందని వీడియో ద్వారా ఒక వాదన చేయబడింది.
నిర్ధారణ /Conclusion : ఈ వాదన పూర్తిగా తప్పు/అవాస్తవం. ఈ ఫుటేజ్ AI- ద్వారా రూపొందించబడింది మరియు ఇది ఎటువంటి నిజమైన స్టంట్‌ను ప్రతిబింబించదు. భారత సైన్యం అద్భుతమైన బైక్ విన్యాసాలను విజయవంతంగా ప్రదర్శించింది, వీటిని వివిధ నివేదికలు/టీవీ ఛానెళ్లలో ప్రసారం చేయబడింది.
రేటింగ్ /Rating : పూర్తిగా అవాస్తవం
ఇటీవల, అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు 2026 భారత గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా భారత సైన్యం బైక్ విన్యాసాలు చేస్తూ విఫలమైందని వాదన చేస్తూ ఓకే వీడియో క్లిప్ ను షేర్ చేసారు. X యూజర్ ‘sadafzbaloch’ అటువంటి పోస్ట్/వీడియోను షేర్ చేసారు,భారతీయ జెండా రంగుల్లో పెయింట్ చేయబడిన ర్యాంప్‌పై మోటార్‌సైకిలిస్టులు దూకుతున్నట్లు, అనేక పల్టీలు కొడుతూ కుప్పకూలిపోవడం వంటి వాటిని వీడియోలో చూడవచ్చు.” గురుత్వాకర్షణ శక్తిని ధిక్కరిస్తున్న బాలీవుడ్ హీరోల మాదిరిగా ఎగురుతున్న బైక్‌లు” అంటూ భారతదేశం గురించి వ్యంగ్యంగా విమర్శన చేసారు.
వీడియోపై “టెస్ మెంబూట్ సిమ్ డి ఇండియా(Tes membuat SIM di India)” అనే ఇండోనేషియన్ వాక్యం ఉంది, దీని తెలుగు అనువాదం “భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష”. కింద ఉన్న పోస్ట్ చూడవచ్చు
Indian Army’s parade: Bikes flying high like Bollywood heroes defying gravity.
Reality check: Their defense strategy jumps more loopholes than ramps!pic.twitter.com/NNMJfZKNJj
— Sadaf Baloch (@sadafzbaloch) January 27, 2026
వాస్తవ పరిశీలన
ఈ వాదనను దర్యాప్తు చేయాలని DigitEYE India బృందం నిర్ణయించి,పరిశీలించగా,ఇది పూర్తిగా అబద్ధమని కనుగొంది. ఈ ఫుటేజ్ 2026 భారత గణతంత్ర దినోత్సవ పరేడ్ సంబంధించిందని సూచించే విశ్వసనీయమైన ఆధారాలు ఏవి లేవు. అసమానతలను కలిగి ఉండడం వలన ఇది AI ద్వారా రూపొందించబడిన వీడియో అని తెలుస్తుంది.
వివరాలు:
మొదటగా, ఆ దావాలో షేర్ చేసిన క్లిప్‌లోని వివిధ కీఫ్రేమ్‌లను ఉపయోగించి మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించగా, దాని ప్రామాణికతను ధృవీకరించే ఏ విశ్వసనీయ వార్తా సంస్థలు లేదా నివేదికలు మాకు లభించలేదు. “ఇండియా రిపబ్లిక్ డే పరేడ్ బైక్ స్టంట్ ఫెయిల్యూర్ 2026” అనే వ్యాక్యంతో అంతర్జాలంలో అన్వేషించగా ఎలాంటి ఫలితాలు వెలువడలేదు.
దీని తరువాత, మేము భారతదేశ గణతంత్ర దినోత్సవ పరేడ్ 2026 సందర్భంగా జరిగిన బైక్ విన్యాసాలకు సంబంధించిన వీడియో క్లిప్‌లు మరియు ఫుటేజ్ కోసం అంతర్జాలంలో అన్వేషించగా, జనవరి 26, 2026న పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) చేసిన ఒక ఎక్స్ పోస్ట్‌ను కనుగొన్నము.
ఈ పోస్ట్‌లో సంయుక్త డేర్‌డెవిల్స్ బృందం అయిన రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) మరియు సశస్త్ర సీమా బల్ (SSB) కర్తవ్య పథ్‌లో ప్రదర్శించిన బైక్ విన్యాసాలకు సంబంధించిన వీడియో జత చేసి ఉండగా ,ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.వారు ధైర్యసాహసాలతో ఎటువంటి పొరపాటు జరగకుండా ఉత్కంఠభరితమైన విన్యాసాలను ఎలా ప్రదర్శించారో చూడవచ్చు మరియు ప్రదర్శన అంతటా పల్టీలు కొట్టడం, కుప్పకూలిపోవడం వంటి వైఫల్యాలు లేవు. క్రింద ఉన్న వీడియో/పోస్ట్‌ను చూడవచ్చు.
A joint Daredevils squad from the Central Reserve Police Force (CRPF) and the Sashastra Seema Bal (SSB) captivates crowds at Kartavya Path
They showcase raw bravery and grit via breathtaking stunts#RepublicDay2026 #RepublicDay pic.twitter.com/u22OG7svCr
— PIB India (@PIB_India) January 26, 2026
జనవరి 26, 2026న ప్రచురించబడిన NDTV నివేదికలో “కర్తవ్య పథంలో 2026 రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా CRPF మరియు SSB సిబ్బంది చేసిన థ్రిల్లింగ్ బైక్ డేర్‌డెవిల్ విన్యాసాలు” గురించి నివేదించింది. నివేదికలోని దాదాపు 7 నిమిషాల వీడియో క్లిప్ లో , రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిళ్లపై రైడింగ్, బ్యాలెన్స్ ఫార్మేషన్‌లు మరియు సాహసోపేతమైన విన్యాసాలను ప్రదర్శించడం చూడవచ్చు . అంతేకాకుండా, పరేడ్‌లోని అసలైన విజువల్స్, క్లెయిమ్‌లో షేర్ చేయబడిన వీడియోలోని విజువల్స్ తో సరిపోలడం లేదు. క్రింద స్క్రీన్‌షాట్‌ను చూడవచ్చు.
ఇండియా టుడే మరియు హెచ్‌టి ఇండియా కూడా కవాతు(parade) నుండి అద్భుతమైన విన్యాసాలను ప్రదర్శించే CRPF మరియు SSB డేర్‌డెవిల్స్ వీడియోలను అప్‌లోడ్ చేశాయి, వీటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. బైక్ విన్యాసాలు ఆసాంతం ఎటువంటి పొరపాటు జరగకుండా ప్రదర్శించడం జరిగింది.
77వ గణతంత్ర దినోత్సవం | 26 జనవరి 2026 పూర్తి పరేడ్ ను ఇక్కడ చూడవచ్చు.
చివరగా, మేము ఆ వాదనలోని వీడియోను సేకరించి, దాని ప్రామాణికతను తనిఖీ చేయడానికి ఒక ఏఐ డిటెక్టర్ ద్వారా పరీక్షించగా, ఆ వీడియోలో 99% వరకు ఏఐ లేదా డీప్‌ఫేక్ కంటెంట్ ఉండే అవకాశం ఉందని ఫలితాలు నిరూపించాయి.ఫలితాలను క్రింద చూడవచ్చు :
ప్రస్తుతం తొలగించబడిన ఆ వీడియో కల్పితమైనది మరియు ఈ దావాలోని వీడియో దృశ్యాలు 2026 గణతంత్ర దినోత్సవ పరేడ్ సమయంలో జరిగిన ఏ వాస్తవ సంఘటనను ప్రతిబింబించదు.
అందువల్ల,ఈ వాదన పూర్తిగా అబద్ధం.
******************************************************
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
టెలికాం శాఖ తమ నోటీసులో మొబైల్ టవర్ ఏర్పాటు కోసం నిజంగా ₹2,500 అడుగుతున్నారా? వాస్తవ పరిశీలన
