వాదన/Claim: MTV ఇండియా డిసెంబర్ 2025 నాటికి అన్ని కార్యకలాపాలను మూసివేస్తుందనేది వాదన.

నిర్ధారణ /Conclusion: ఆ వాదన తప్పు. MTV ఇండియా తాము మూసివేయడం లేదని స్పష్టం చేసింది. పారామౌంట్ గ్లోబల్ కొన్ని MTV ఛానెళ్లను మూసివేస్తున్నట్టు, MTV ఇండియాను కాదని  ధృవీకరించింది.

రేటింగ్ /Rating: పూర్తిగా తప్పు —


MTV ఇండియా తన మ్యూజిక్ ఛానెల్‌ను మూసివేస్తోందని అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు.ఒక పోస్ట్ ఈ విధంగా ఉంది: “దేశంలో యువత సంస్కృతి మరియు సంగీత టెలివిజన్‌కు మూలస్తంభమైన MTV ఇండియా, డిసెంబర్ 31, 2025 నాటికి కార్యకలాపాలను నిలిపివేయనుంది”.
ఆ పోస్ట్‌లో,ఛానల్ ప్రభావం టెలివిజన్‌ను మించి ఎలా విస్తరించిందో, సంగీతాన్ని ఎలా ప్రభావితం చేసిందో, భారతీయ యువతలో ఫ్యాషన్ ట్రెండ్‌లు మరియు పాప్ కల్చర్ ట్రెండ్‌లను కూడా ఎలా ప్రభావితం చేసిందో ప్రస్తావించబడింది. క్రింద ఉన్న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను చూడవచ్చు:

ఒక X వినియోగదారుడు ‘LibertyValkyrie’ అటువంటి క్లెయిమ్‌నే ఒక చిత్రంతో షేర్ చేసారు: MTV మ్యూజిక్ ఛానల్ 40 సంవత్సరాల తర్వాత మూసివేయబడుతోంది’. ఈ పోస్ట్ను దాదాపు మూడు లక్షల మంది చూసారు, క్రింద చూడవచ్చు: 

1996లో ప్రారంభించబడిన MTV ఇండియా, MTV రోడీస్ మరియు స్ప్లిట్స్‌విల్లా వంటి షోలను ప్రసారం చేస్తూ స్వచ్ఛమైన సంగీత వీడియోలకు పరిమితి కాకుండా అంతకు మించి అభివృద్ధి చెందింది.

ఇతర వినియోగదారులు కూడా ఇలాంటి వాదన/ క్లెయిమ్‌నే ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేసారు.

వాస్తవ పరిశీలన

DigitEYE India బృందం ఈ వాదనను పరిశీలించగా అది అబద్ధమని, అందులో నిజం లేదని తేలింది.
డిసెంబర్ 31, 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఐదు ప్రత్యేక అంతర్జాతీయ సంగీత ఛానెల్‌లను (MTV మ్యూజిక్, MTV 80లు, MTV 90లు, క్లబ్ MTV, మరియు MTV లైవ్) నిలిపివేయాలనే పారామౌంట్ నిర్ణయాన్ని, తప్పుగా చూపించి వాదన చేయబడింది. ఈ పుకార్లను MTV అధికారిక వివరణను విడుదల చేస్తూ తోసిపుచ్చింది.

ముందుగా, ఈ క్లెయిమ్/వాదన గురించి తెలుసుకోవడానికి మేము ‘MTV ఇండియా షట్ డౌన్’ అనే పదంతో వెబ్ సెర్చ్ నిర్వహించాము.గ్లోబల్ మ్యూజిక్ వైబ్ నివేదిక ప్రకారం, పారామౌంట్ గ్లోబల్ అక్టోబర్ 10, 2025న పేర్కొన్న ఐదు మ్యూజిక్ ఛానెల్‌ల మూసివేతను నిర్ధారించింది. ఈ ఐదు ఛానెల్‌ల (MTV మ్యూజిక్, MTV 80లు, MTV 90లు, క్లబ్ MTV మరియు MTV లైవ్)మూసివేత, డిసెంబర్ 31, 2025 నుండి UK మరియు ఐర్లాండ్‌తో ప్రారంభం అవుతుంది.
నివేదికలోని కొంత భాగాన్ని క్రింద చూడవచ్చు.

హిందూస్తాన్ టైమ్స్ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికతో సహా ఇతర మీడియా సంస్థలు కూడా అక్టోబర్ 12, 2025న, పారామౌంట్ గ్లోబల్ ఈ 5 MTV ఛానెల్‌లను మూసివేస్తున్నట్లు ప్రకటించినట్లు ధృవీకరించాయి. ఫాక్స్ 61 కనెక్టికట్ కూడా ఈ వార్తను కవర్ చేసి Xలో దీని గురించి పోస్ట్ చేసింది. దిగువ పోస్ట్‌ను చూడవచ్చు:

ఈ విషయంపై మరింత సమాచారం కోసం చూడగా అక్టోబర్ 19, 2025న, MTV ఇండియా యొక్క ఇన్‌స్టాగ్రామ్ ఖాతా “హమ్ కహిన్ నహీ జా రహే” (“మేము ఎక్కడికీ వెళ్ళడం లేదు”) అనే శీర్షికతో ఒక వీడియోను పోస్ట్ చేసింది, ఇది షట్‌డౌన్/మూసివేత పుకార్లను స్పష్టంగా ఖండించింది. పోస్ట్‌ను ఇక్కడ చూడవచ్చు.

కాబట్టి,ఈ వాదన తప్పు.

*******************************************************

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

ప్రభుత్వ సేవలలో అవినీతిని నివేదించడానికి PMO ఇండియా 9851145045 హాట్‌లైన్‌ను పౌరుల కోసం ప్రారంభించిందా? వాస్తవ పరిశీలన

నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ మరణించారా? నకిలీ ట్విట్టర్ ఖాతా యొక్క దావా వైరల్ అవుతుంది; Fact Check

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

Exit mobile version