ట్రంప్‌ను 2025 నోబెల్ శాంతి బహుమతి నామినీల జాబితా నుండి తొలగించారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim :ట్రంప్‌ను 2025 నోబెల్ శాంతి బహుమతి నామినీల జాబితా నుండి తొలగించారనేది వాదన
నిర్దారణ/Conclusion : ఆ వాదన పూర్తిగా తప్పు/అవాస్తవం. ట్రంప్‌ను కొద్దిమంది నామినేట్ చేసి, ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. అయితే, నార్వేజియన్ నోబెల్ కమిటీకి తమకు అందిన నామినీల జాబితాను బహిరంగపరదు, కాబట్టి ఆ జాబితా నుండి ట్రంప్‌ను తొలగించారా లేదా అని చూసే అవకాశం లేదు,ఎందుకంటే ఆ జాబితా 50 సంవత్సరాల పాటు గోప్యంగా ఉంచబడుతుంది.
రేటింగ్/Rating : పూర్తిగా అవాస్తవం–
నోబెల్ శాంతి బహుమతి నామినీల జాబితా నుండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తొలగించారని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు. X యూజర్ ‘GyanJaraHatk’ అలాంటి పోస్ట్‌నే షేర్ చేశారు, అందులో “ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి నామినీల జాబితా నుండి తొలగించబడ్డారని: మూలం” అని పేర్కొన్నారు, దానితో పాటు నవ్వుతున్న ఎమోజీలు మరియు కన్నీళ్లు కారుస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖం యొక్క చిత్రం కూడా ఉంది. 2025 నోబెల్ శాంతి బహుమతి లభించని నేపథ్యంలో, ఈ పోస్ట్ ట్రంప్‌ను ఎగతాళి చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ పోస్ట్‌కు 10,400 కంటే ఎక్కువ మంది వీక్షించారు మరియు దీనిని మీరు క్రింద చూడవచ్చు.
Trump removed from a list of Nobel Peace Prize nominees: source 😆😅😂🤣 pic.twitter.com/v5jzGun0cf
— Gyan Jara Hatke (@GyanJaraHatke) August 30, 2025
క్రింద చూపిన విధంగా సెప్టెంబర్ 2025 మరియు అక్టోబర్ 2025లో కూడా ఇలాంటి వాదనలే చేయబడ్డాయి.
Back to squre one!! pic.twitter.com/5q0fdIEksh
— Chakravarty Sulibele (@astitvam) September 27, 2025
అయితే, వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు ‘మరియా కొరినా మచాడో’కు “వెనిజులా ప్రజలకు ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె అవిశ్రాంత కృషికి మరియు నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యానికి న్యాయమైన మరియు శాంతియుత పరివర్తనను సాధించడానికి ఆమె చేసిన పోరాటానికి” గాను 2025 నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేయడం గమనార్హం.
వాస్తవ పరిశీలన
ఈ వాదనను దర్యాప్తు చేయాలని DigitEYE India బృందం నిర్ణయించి, పరిశీలించగా, ఇది పూర్తిగా అబద్ధమని తేలింది. నామినీల జాబితా బహిరంగంగా అందుబాటులో ఉండదు ఎందుకంటే ఒకసారి సమర్పించిన నామినేషన్లు నార్వేజియన్ నోబెల్ కమిటీ పరిశీలనకు వెళ్తాయి మరియు ఆ రికార్డులు 50 సంవత్సరాల పాటు గోప్యంగా ఉంచబడతాయి.కమిటీకి కూడా దానిని రద్దు చేయడానికి లేదా ఉపసంహరించుకోవడానికి ఎటువంటి అవకాశం ఉండదు.
Details:
ఈ వాదన గురించి మరింత తెలుసుకోవడానికి మేము మొదటగా “నోబెల్ శాంతి బహుమతి జాబితా నుండి నామినీల పేర్లను తొలగించవచ్చా?” అనే పదబంధంతో అంతర్జాలంలో అన్వేషించగా, అధికారిక నోబెల్ శాంతి బహుమతి వెబ్‌సైట్ లో , “నోబెల్ ఫౌండేషన్ నిబంధనల ప్రకారం నామినేషన్లకు సంబంధించిన సమాచారాన్ని, బహిరంగంగా లేదా రహస్యంగా, 50 సంవత్సరాల వరకు వెల్లడించడానికి వీలు లేదని” పేర్కొని ఉండటం గమనించాము.
అంతేకాకుండా, ఈ పరిమితి నామినీలకూ, నామినేట్ చేసేవారికీ, అలాగే బహుమతి ప్రదానానికి సంబంధించిన విచారణలు మరియు అభిప్రాయాలకూ వర్తిస్తుంది. అందువల్ల, కమిటీ స్వయంగా తమకు తాము నామినీలను బహిరంగంగా విడుదల చేయదు లేదా నిర్ధారించదు, అయితే ట్రంప్‌ను శాంతి బహుమతికి నామినేట్ చేసిన కొంతమంది వ్యక్తులు దానిని బహిరంగంగా వెళ్లడి చేయవచ్చు. దీనికి సంబంధించిన కొంత సమాచారం కింద చూడవచ్చు:
దీని తరువాత, నామినేషన్లు సమర్పించిన తరువాత, వాటిని ఉపసంహరించుకోవడానికి, తొలగించడానికి లేదా అనర్హులుగా ప్రకటించడానికి కమిటీకి సంబంధించి ఎటువంటి సమాచారం లేదా నిబంధన మాకు కనిపించలేదు. ఫిబ్రవరి 1 గడువు తర్వాత, కమిటీ జాబితాను సమీక్షిస్తుంది, ఆపై అంచనా/విశ్లేషణ కోసం నామినేషన్ల ప్రక్రియను మూసివేస్తుంది.
అక్టోబర్‌లో, నోబెల్ కమిటీ మెజారిటీ ఓటింగ్ ద్వారా నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలను ఎంపిక చేస్తుంది. ఈ నిర్ణయం తుది నిర్ణయంగా భావించబడుతుంది మరియు దీనిపై అప్పీలు చేయడానికి వీలుండదు.ఈ దశ తర్వాత కమిటీ ఒక అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించడానికి ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవకాశం లేదు. మరింత సమాచారం ఇక్కడ చూడవచ్చు.
నామినేషన్ తొలగింపుకు కమిటీకి అవకాశం లేనప్పటికీ, నామినేటర్లు మాత్రం తమ సొంత సమర్పణలను(నామినీలను) ఉపసంహరించుకోవచ్చు. ఉదాహరణకు, జూన్ 2025లో, ఉక్రేనియన్ ఎంపీ ఒలెక్సాండర్ మెరెజ్కో రష్యా విధానపరమైన(పాలసీ ) ఆందోళనల కారణంగా ట్రంప్ నోబెల్ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.
మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, పాకిస్తాన్ రక్షణ దళాల చీఫ్ అసిమ్ మునీర్ తదితరులు ట్రంప్‌కు మద్దతు ఇచ్చారు. అందువల్ల, అభ్యర్థి నామినేషన్లు వ్యక్తిగత చర్యలు,ఎవరేవరు ఎవరెవరిని నామినేట్ చేసారని తమకు తామే ప్రకటిస్తారు.కమిటీ మాత్రం నామినేషన్ల వివరాలను వెల్లడించకుండా గోప్యంగా ఉంచుతారు. ట్రంప్‌ను నామినేట్ చేసిన అభ్యర్థులను క్రింద చూడవచ్చు.
వాదనలో షేర్ చేసిన చిత్రం విషయానికొస్తే,దాని ప్రామాణికతను తనిఖీ చేయడానికి మేము దానిని ఏఐ డిటెక్టర్ ద్వారా పరిశీలించగా,ఈ చిత్రం 99.9% వరకు ఏఐ లేదా డీప్‌ఫేక్ కంటెంట్ అయ్యే అవకాశం ఉందని ఫలితాలు నిరూపించాయి. ఫలితాలను కింద చూడవచ్చు:
నార్వేజియన్ నోబెల్ కమిటీ నిర్దేశించిన ‘నామినేటర్లు’ శాంతి బహుమతి కోసం అర్హత ఉన్న వ్యక్తిని నామినేట్ చేయవచ్చు మరియు తమ నామినేషన్లను బహిరంగంగా ప్రకటించవచ్చు, కానీ కమిటీ మాత్రం నామినీల పేర్లను మీడియాకు గానీ, అభ్యర్థులకు గానీ ప్రకటించదు.
ఏదైనా నిర్దిష్ట సంవత్సరపు బహుమతి ఎవరికి లభిస్తుందనే దానిపై ముందుగానే వెలువడే ఊహాగానాలలో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయంటే, అది కేవలం అంచనా మాత్రమే కావచ్చు లేదా నామినేషన్ వెనుక ఉన్న వ్యక్తి లేదా వ్యక్తులు వెల్లడించిన సమాచారం కావచ్చు.
అందువల్ల,ఈ వాదన పూర్తిగా అబద్ధం.
******************************************************
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
దక్షిణ కొరియా ఇజ్రాయెల్ పర్యాటకులను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించిందా? వాస్తవ పరిశీలన
