ప్రభుత్వ సేవలలో అవినీతిని నివేదించడానికి PMO ఇండియా 9851145045 హాట్‌లైన్‌ను పౌరుల కోసం ప్రారంభించిందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim : ప్రభుత్వ సేవలలో లంచం, జాప్యం, చెడు ప్రవర్తన గురించి పౌరులు ఫిర్యాదు చేయడానికి PMO ఇండియా హాట్‌లైన్ (9851145045) ను ప్రారంభించిందనేది వాదన/దావా.
నిర్ధారణ/Conclusion : ఆ వాదన తప్పు. హాట్‌లైన్ (9851145045) అనేది నేపాల్ కొత్త ప్రభుత్వం ద్వారా ప్రారంభించబడిన చర్య మరియు భారత ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించింది కాదు.
రేటింగ్ /Rating : పూర్తిగా తప్పు
అవినీతిని అరికట్టడానికి పౌరుల కోసం PMO ఇండియా హాట్‌లైన్ (9851145045)ను ప్రారంభించిందని అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు. ఒక X వినియోగదారుడు అటువంటి వాదనను “ఇప్పుడు భారతదేశం అవినీతి మూలాల గురించి నేరుగా నివేదించవచ్చు/ఫిర్యాదు చేయవచ్చు” అనే శీర్షికతో షేర్ చేసారు.
ఆ పోస్ట్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రంతో పాటు “HOTLINE” అని ముద్రించబడిన ఎరుపు రంగు ఫోన్ చిత్రం ఉంది. “ఇప్పుడు మీరు అవినీతిని నేరుగా PMO కి నివేదించవచ్చు/ఫిర్యాదు చేయవచ్చు!” అని పేర్కొంది .
ఈ పోస్ట్ విస్తృతంగా షేర్ చేయబడింది. క్రింద చూడండి.
Now India can report Corruption directly from where the roots begin. pic.twitter.com/qAcoC2J2Pi
— Ravinder Kapur. (@RavinderKapur2) October 10, 2025
ఇతర వినియోగదారులు కూడా ఇలాంటి వాదనలను షేర్ చేసారు , వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
వాస్తవ పరిశీలన
ఈ వాదనను తనిఖీ చేయాలని బృందం నిర్ణయించి పరిశీలించగా, అది తప్పు అని తేలింది. హాట్‌లైన్ 9851145045 అనేది నేపాల్ కొత్త ప్రభుత్వం ద్వారా ప్రారంభించబడిన చర్య, ‘భారత PMO’ది కాదు.భారత PMO కార్యాలయం నుండి అధికారిక ధృవీకరణ లేదా ఈ హాట్‌లైన్ నంబర్ గురించి వాదనలు కాని లేవు.
ఈ వాదన గురించి మరింత తెలుసుకోవడానికి మేము మొదట “PMO ఇండియా హాట్‌లైన్ 9851145045” అనే పదబంధంతో శోధించగా,ఈ హాట్‌లైన్ PMO ఇండియాకు చెందినదని నిర్ధారించే విశ్వసనీయ నివేదికలు ఏ మీడియా సంస్థ నుండి వెలువడలేదని కనుగొన్నము. అధికారిక PM ఇండియా వెబ్సైట్లో శోధించగా, అవినీతి చర్యలను ఫిర్యాదు చేసే హాట్‌లైన్ నంబర్ 9851145045 గురించి ఎటువంటి ప్రస్తావన కనబడలేదు.
హాట్‌లైన్ నంబర్‌తో మరోసారి వెబ్‌సెర్చ్ చేయగా, ఈ హాట్‌లైన్ భారతదేశంకి చెందినది కాదని, నేపాల్ కి చెందినదని మేము తెలుసుకున్నాము.
‘రిపబ్లికా’ నివేదిక ప్రకారం, 9851145045 అనే నంబర్ నేపాల్ ప్రధాన మంత్రి కార్యాలయం మరియు మంత్రుల మండలి (OPMCM) కు చెందినది మరియు ప్రభుత్వ సంస్థలలో దుష్ప్రవర్తన, లంచం లేదా జాప్యాలను నివేదించడానికి/ఫిర్యాదు చేయడానికి నేపాలీ ప్రధాన మంత్రి సుశీలా కర్కి దీనిని ప్రారంభించారు. నివేదికలోని కొంత భాగాన్ని క్రింద చూడండి.
‘నేపాలీ టెలికాం‘ ప్రచురించిన మరో నివేదిక ప్రకారం, హాట్‌లైన్ నంబర్ 9851145045 నేపాల్‌కు చెందినది. “శ్రీమతి సుశీలా కర్కి నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం, ప్రజలను చేరుకోవడానికి మరియు సుపరిపాలనను సాగించే చర్యల్లో భాగంగా, శనివారం, సెప్టెంబర్ 20, 2025న హాట్‌లైన్ నంబర్ 9851145045ను ప్రారంభించారని నివేదిక పేర్కొంది . నివేదికలోని కొంత భాగాన్ని క్రింద చూడండి.
నేపాల్ ప్రధాన మంత్రి కార్యాలయం మరియు మంత్రుల మండలి (OPMCM) అధికారిక వెబ్సైట్ పరిశీలించగా, “హలో గవర్నమెంట్” విభాగం కింద అదే నంబర్ కనిపించింది. వెబ్సైట్ పేజీని కింద చూడవచ్చు.
కాబట్టి,ఆ వాదన తప్పు.
****************************************************
మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
