వాదన/Claim : అమెరికా అధ్యక్షుడు ‘డొనాల్డ్ ట్రంప్’ని UK పర్యటన సమయంలో ఆయనను విండ్సర్ కోటలో “డార్త్ వాడర్” థీమ్ సాంగ్ తో(స్టార్ వార్స్ లోని “ది ఇంపీరియల్ మార్చ్” అని కూడా పిలుస్తారు) స్వాగతం పలికారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. వైరల్ వీడియో క్లిప్ ఎడిట్ చేయబడింది. ట్రంప్ అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ గీతమైన ‘ది స్టార్-స్పాంగిల్డ్ బ్యానర్’కి సెల్యూట్ చేస్తున్నారు,డార్త్ వాడర్ థీమ్ సాంగ్ కి కాదు.

Rating : : తప్పుగా చూపించే ప్రయత్నం.

*******************************************************************************************

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యునైటెడ్ కింగ్‌డమ్ పర్యటన తర్వాత, పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ఆయన స్టార్ వార్స్‌లోని ‘ది ఇంపీరియల్ మార్చ్’ పాటకు సెల్యూట్ చేశారనే వాదనలను షేర్ చేసారు. “డార్త్ వాడర్స్ థీమ్” అని కూడా పిలువబడే ‘ది ఇంపీరియల్ మార్చ్’ పాట, 1980 చిత్రం ‘స్టార్ వార్స్: ది ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్’ కోసం జాన్ విలియమ్స్ స్వరపరిచిన ప్రసిద్ధ సంగీత గానం.ఈ పాట సినిమాలో డార్త్ వాడర్ మరియు గెలాక్టిక్ సామ్రాజ్యాన్ని సూచించడానికి ఒక సంగీత మూలాంశంగా పరిగణించబడుతుంది.

సెప్టెంబర్ 18, 2025న, X యూజర్ ‘UzoAnazodo’ “క్లాసిక్ బ్రిటిష్ హాస్యం”, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను “డెత్ వాడర్” థీమ్ సాంగ్‌తో స్వాగతించారు,అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. క్రింద పోస్ట్‌ను చూడవచ్చు.  

మరొక X వినియోగదారుడు ‘Suzierizzo1’ ఇలాంటి వీడియోనే ఈ విధంగా షేర్ చేసారు:”ఓహ్ మై గాడ్! వాళ్ళు ఏ పాట వినిపిస్తున్నారో మీరు నిజంగా వింటున్నారా మరియు ట్రంప్ వారికి సెల్యూట్ చేస్తున్నారు!”  ఈ పోస్ట్ 633,000 కంటే ఎక్కువ వీక్షణలు మరియు దాదాపు 7,300 లైక్‌లను పొందింది. పోస్ట్‌ను ఇక్కడ చూడవచ్చు.

 

అనేక మంది ఇతర వినియోగదారులు కూడా ఇక్కడ మరియు ఇక్కడ ఇదే దావాను షేర్ చేసారు

FACT CHECK

DigitEYE India బృందం ఈ వాదనను పరిశీలించగా,తప్పుగా చూపించే ప్రయత్నం జరిగిందని తేలింది. ఈ వీడియో ఫుటేజ్‌ను సవరించి, అసలు పాట “స్టార్-స్పాంగిల్డ్ బ్యానర్” ను ఆఫ్ (మ్యూట్) చేసి, దీనిపై “ది ఇంపీరియల్ మార్చ్” పాట ప్లే చేయబడింది.

మొదట మేము ఈ కార్యక్రమం గురించి సమాచారం తెలుకోవడానికి ప్రయత్నించగా, ది న్యూయార్క్ టైమ్స్ మరియు బీబీసీ వార్తా నివేదికలు వంటి అనేక మీడియా సంస్థలు ట్రంప్ సెప్టెంబర్ 16-18, 2025 వరకు UKలో రాష్ట్ర పర్యటనను మరియు కింగ్ చార్లెస్ IIIతో విండ్సర్ కోటలో ఉత్సవ స్వాగతం కూడా ఉందని ధృవీకరించినట్లు కనుగొన్నము.

ఆ తరువాత మేము వాదనలో చూపిన విధంగా పాట ప్లే చేయబడిన వీడియో క్లిప్ యొక్క అసలు ఫుటేజ్ కోసం శోధించగా, 2025 సెప్టెంబర్ 17న జరిగిన ఈ ఈవెంట్‌ను అధికారిక వైట్ హౌస్ యూట్యూబ్ ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేసిన వీడియోని కనుగొన్నము.అసలైన వీడియో ఫుటేజ్‌ను ఇక్కడ చూడండి.

వీడియోలోని 16:44 నిమిషముల దగ్గిర, సంగీతకారులు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జాతీయ గీతం అయిన ‘స్టార్-స్పాంగిల్డ్ బ్యానర్‌’ను ప్లే చేయడం చూడవచ్చు. ట్రంప్,ప్రథమ మహిళ మెలానియా ట్రంప్,కింగ్ చార్లెస్ III మరియు క్వీన్ కెమిల్లా లతో కలిసి గౌరవంగా సెల్యూట్ చేస్తున్నట్లు చూడవచ్చు.

ఈ సంఘటన గురించి యూట్యూబ్‌లో APT వంటి ఇతర మీడియా సంస్థలు షేర్ చేసిన వీడియోను ఇక్కడ చూడవచ్చు. ఒక్కక ‘ఫ్రేమ్’ను నిశితంగా పరిశీలిస్తే,వాదన వీడియోలో ఉన్న దృశ్యాలు అసలైన వీడియో దృశ్యాలతో సరిపోలుతున్నప్పటికీ, వాదన వీడియోలో ఆడియో మార్చబడింది.

కాబట్టి, తప్పుగా చూపించే ప్రయత్నం జరిగింది.


మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు :

అమెరికా సుంకాలు, ప్రధాని మోదీ చైనా పర్యటన నేపథ్యంలో టిక్‌టాక్‌పై నిషేధాన్ని భారత్ రద్దు చేసిందా? వాస్తవ పరిశీలన

నోబెల్ కమిటీ సభ్యుడు ‘అస్లే టోజే’ శాంతి బహుమతి కోసం భారత ప్రధాని మోడీని సమర్ధించారా? వాస్తవ పరిశీలన

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

Exit mobile version