భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొన్న ఒక వీడియో X, Facebook, WhatsApp వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ కాగా, అందులో ఆయన భారతదేశం మూడు రాఫెల్ యుద్ధ విమానాలను పాకిస్తాన్ చేతిలో కోల్పోయిందని అంగీకరించినట్లు వార్తలు వెలువడ్డాయి.

ఇక్కడ కూడా షేర్ చేయబడిన ఈ వీడియో న్యూస్ వీక్ CEO దేవ్ ప్రగాడ్ తో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక భాగం. అయితే ఈ వీడియోలో సైనిక నష్టాలను స్పష్టంగా బహిర్గతం చేయడంపై విస్తృత చర్చ మరియు ఆందోళనను రేకెత్తించింది.

వైరల్ వీడియోలో జైశంకర్ “ఆ రాత్రి పాకిస్తాన్ మాపై భారీగా దాడి చేసింది. రెండు రోజుల క్రితం మనం పాకిస్తాన్ చేతిలో మూడు రాఫెల్ జెట్లను కోల్పోయాము, కాబట్టి వారు దాడి చేయడం చాలా అన్యాయం.ఎలాగైతేనేం వాళ్ళు దాడి చేసారు.” అని మాట్లాడుతున్నట్లు వాదన చేయబడింది.

పాకిస్తాన్‌తో జరిగిన వివాదంలో భారతదేశం యొక్క దుర్బల స్థితిని సూచిస్తూ, సైనిక నష్టాలను దిగ్భ్రాంతికరంగా అంగీకరించినట్లుగా ఈ కోట్ (వైరల్ వీడియోలో ఆయన అన్న మాటలు) విస్తృతంగా ప్రచారం చేయబడుతోంది.

FACT-CHECK

వైరల్ వీడియో క్లిప్‌ను నిశితంగా పరిశీలించిన పిదప, DigitEye India ఫ్యాక్ట్-చెక్ బృందం “మనం రెండు రోజుల క్రితం పాకిస్తాన్ చేతిలో మూడు రాఫెల్ జెట్‌లను కోల్పోయాము” అనే వాక్యం జైశంకర్ అసలు స్వరం, గమనముతో సరిపోలడం లేదని కనుగొన్నారు.

జోడించిన స్వరానికి(Added Audio) మరియు జైశంకర్ సహజ ప్రసంగ విధానానికి మధ్య స్పష్టమైన స్వర/శ్రవణ వైరుధ్యం ఉంది.
ఫ్రేమ్-బై-ఫ్రేమ్ విశ్లేషణ కావించగా, జోడించిన భాగంలో లిప్-సింక్‌లో అసమతుల్యతను వెల్లడిస్తుంది, ఇది డిజిటల్ మానిప్యులేషన్‌ ప్రక్రియని నిర్ధారణ అయింది.

అయితే, వాస్తవ పరిశీలన క్షుణ్ణంగా చేసిన మీదట, ఈ క్లిప్‌ను తారుమారు చేశారని వెల్లడవుతుంది – ఒక కల్పిత ఆడియో లైన్‌ను వాస్తవంగా జరిగిన ఇంటర్వ్యూలో డిజిటల్‌గా చొప్పించారు.

గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో,  జూలై 1, 2024న న్యూస్‌వీక్ ప్రచురించిన పూర్తి నిడివిగల ఇంటర్వ్యూ యొక్క ఒరిజినల్ వీడియోను మేము కనుగొన్నాము.
ఈ ఇంటర్వ్యూలో,  జైశంకర్ న్యూస్‌వీక్ CEO దేవ్ ప్రగాడ్‌తో మాట్లాడుతూ భారతదేశ విదేశాంగ విధానం, చైనాతో వ్యూహాత్మక సవాళ్లు మరియు అమెరికా, పాకిస్తాన్‌లతో సంబంధాలను వివరించారు.

వైరల్ వీడియోలో(43:05 నిమిషాల దగ్గర) జైశంకర్ “పాకిస్తాన్ మాపై భారీగా దాడి చేసింది.మేము త్వరగా స్పందించాము మరియు మరుసటి రోజు ఉదయం, మిస్టర్ రూబియో (సెక్రటరీ ఆఫ్ స్టేట్-యునైటెడ్ స్టేట్స్ ) నాకు ఫోన్ చేసి పాకిస్తానీయులు చర్చలకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.” అని వివరించారు.

రాఫెల్ జెట్ల గురించి లేదా సైనిక నష్టం గురించి ఎటువంటి ప్రస్తావన లేదు.

భారత ప్రభుత్వం అలాంటి ప్రకటన విడుదల చేయలేదని, ఈ పుకార్లలో ఎటువంటి నిజం లేదని పిఐబి ఫ్యాక్ట్ చెక్ యూనిట్ (PIB Fact Check) కూడా నిర్ధారించింది.

వాస్తవమైన(ఒరిజినల్) వీడియోలో కల్పిత ఆడియోని చొప్పించడం, తారుమారు చేయడం లేదా డీప్ ఫేక్ చేసి, ఈ వీడియోలను,  వీక్షకులను తప్పుదారి పట్టించడానికి చూపించబడతాయి.  ఈ వైరల్ వీడియోలో, భారతదేశం యొక్క యుద్ధ సామర్థ్యాన్ని అప్రతిష్టపాలు చేయడానికి మరియు సైనిక ఎదురుదెబ్బలను సూచించడం ద్వారా దౌత్య వైఖరిని తప్పుగా చూపించే ప్రయత్నం జరిగింది. కాబట్టి, ఈ వాదన తప్పు.

(డీప్‌ఫేక్ అనేది ఒక మీడియా ఫైల్,ఉదాహరణకి ఒక చిత్రం, వీడియో లేదా ఆడియో రికార్డింగ్నిని కృత్రిమ మేధస్సు (AI) ఉపయోగించి, మార్చి ఎవరినైనా లేదా దేనినైనా తప్పుగా సూచించే సాంకేతిక సాధనం.)

వాదన/Claim: భారతదేశం పాకిస్తాన్ చేతిలో మూడు రాఫెల్ జెట్లను కోల్పోయిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అంగీకరించారని ఒక వైరల్ వీడియోలో వాదన చేయబడింది.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం.న్యూస్‌వీక్‌తో జరిగిన వాస్తవమైన(ఒరిజినల్) ఇంటర్వ్యూలో కల్పిత/తప్పుడు ఆడియో లైన్ డిజిటల్‌గా చొప్పించబడింది.

రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం —

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

Exit mobile version