వాదన/దావా/CLAIM: X లో పోస్ట్ చేయబడిన ఒక ట్వీట్ ప్రకారం, సమోసాలు మరియు జిలేబీలు త్వరలో సిగరెట్ ప్యాకేజింగ్ మాదిరిగానే ఆరోగ్య హెచ్చరికలను కలిగి ఉంటాయనేది వాదన.

నిర్ధారణ/CONCLUSION: తప్పుడు వాదన. భారతదేశ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, పనిచేసే ప్రదేశాలలో చక్కెర బోర్డులపై నూనె లేదా కొవ్వు శాతం పేర్కొనటం గురించి సలహా/అడ్వైజరీ జారీ చేసింది, అంతేకాని సిగరెట్ ప్యాకేజింగ్ లాంటి హెచ్చరిక లేబుల్‌ గురించి కాదు.

రేటింగ్/RATING: తప్పుడు వాదన–

**********************************************************

జూలై 17, 2025న, ఒక ట్విట్టర్/X యూజర్ సమోసాలు మరియు జిలేబీలు త్వరలో సిగరెట్ ప్యాకెట్లపై ఉన్నటువంటి ఆరోగ్య హెచ్చరికలను కలిగి ఉంటాయని పేర్కొంటూ ఒక చిత్రాన్ని పోస్ట్ చేశాడు.
“ఇది హాస్యాస్పదంగా ఉంది, దీనిపై మీ అభిప్రాయం?” అనే శీర్షికతో కూడిన ట్వీట్,ఈ కొత్త నిబంధన వెనుక భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ హస్తం ఉందని సూచిస్తుంది.

ఆ చిత్రంలో “సమోసాలు మరియు జలేబీలు త్వరలో సిగరెట్ ప్యాకెట్లపై ఉన్నటువంటి ఆరోగ్య హెచ్చరికలను కలిగి ఉంటాయి:నివేదిక” అనే పోస్ట్ ఆన్‌లైన్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది.రిపోర్ట్ పేరును, మూలాన్ని పేర్కొనలేదు. అసలు అటువంటి ఆదేశం నిజంగా జారీ చేయబడిందా లేదా అనే దానిపై గందరగోళం ఏర్పడింది.

ఇలాంటి పోస్ట్‌లను మరి కొన్ని ఇక్కడ చూడవచ్చు:

వాస్తవ పరిశీలన:

DigitEYE India బృందం,ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) మరియు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB)తో సహా అధికారిక ప్రభుత్వ పోర్టల్‌లను క్షుణ్ణంగా పరిశీలించగా, సమోసాలు మరియు జిలేబీలు వంటి భారతీయ స్నాక్స్‌లపై తప్పనిసరి ఆరోగ్య హెచ్చరిక గురించి ఎటువంటి ఆదేశం, నోటిఫికేషన్ లేదా పత్రికా ప్రకటన చేయబడలేదని కనుగొన్నారు.
క్రింద చూపిన విధంగా PIB ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కూడా ఈ వాదన తప్పని నిరూపించింది.

‘ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించే క్రమంలో పని చేసే ప్రదేశాలలో చక్కెర బోర్డులపై నూనె లేదా కొవ్వు శాతం పేర్కొనటం అనేది మొదటి మెట్టు’ అనే డిరెక్టీవ్/సందేశాన్ని, సిగరెట్ ప్యాకెట్లపై ఉండే ‘ఆరోగ్య హెచ్చరిక లేబుల్‌లు’ మాదిరిగానే అంటూ తప్పుగా అర్థం చేసుకోవడం జరిగింది.

పని చేసే ప్రదేశాలలో ఆరోగ్యకరమైన ఆహరం ఎంపిక చేసుకునేందుకు ఉద్దేశించిన ఒక డిరెక్టీవ్/సలహాను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసింది. క్యాంటీన్లు, ఫలహారశాలలు, సమావేశ గదులు మొదలైన వివిధ ప్రదేశాలలో బోర్డులను ప్రదర్శించడం ద్వారా వివిధ ఆహార పదార్థాలలో తెలియని/కనపడని హానికరమైన కొవ్వులు మరియు అదనపు చక్కెర యొక్క వినియోగంపై అవగాహన పెంచడం, ఈ డిరెక్టీవ్/సలహా యొక్క ముఖ్య ఉద్దేశం.

దేశంలో ఊబకాయ సమస్య విపరీతంగా పెరుగుతున్నందున, దానిని ఎదుర్కునే క్రమంలో ఈ ‘షుగర్ బోర్డులు’ రోజువారీ జ్ఞాపికగా ఉపయోగపడతాయని ఈ డిరెక్టీవ్/సలహా జారీ చేయబడింది.

“విక్రేతలు విక్రయించే ఆహార ఉత్పత్తులపై ‘హెచ్చరిక లేబుల్‌’లను నిర్దేశించదు మరియు భారతీయ స్నాక్స్‌ను మాత్రమే ఎంచుకుని లక్ష్యంగా చేయటం లేదు. ఇది భారతదేశంలోని వీధిలో లభించే ఘనమైన ఆహార సంస్కృతిని లక్ష్యంగా చేసుకోదు.” అనిఆరోగ్య మంత్రిత్వ శాఖ అడ్వైజరీ జారీ చేసింది.

దీని గురించి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. లింక్‌ను ఇక్కడ చూడవచ్చు.

 

కాబట్టి ఈ వాదన తప్పు.

 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

Exit mobile version