సుందర్ పిచాయ్ ‘గూగుల్ ఇన్వెస్ట్’ ప్లాట్‌ఫారమ్‌ను బహిరంగంగా ఆమోదించారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ‘గూగుల్ ఇన్వెస్ట్’ అనే ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెట్టాలని భారతీయులను కోరుతున్నట్లు వీడియో చూపిస్తుందనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. సుందర్ పిచాయ్ ‘గూగుల్ ఇన్వెస్ట్’ని ప్రమోట్ చేస్తున్న వీడియో వాయిస్ మరియు విజువల్ మానిప్యులేషన్‌లతో(అవకతవకలతో) AI రూపొందించిన వీడియో.
రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం–
గూగుల్ మరియు ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ అధిక రాబడి ఇచ్చే ‘గూగుల్ ఇన్వెస్ట్’ అనే పెట్టుబడి ప్లాట్‌ఫారమ్‌కు మద్దతు ఇస్తున్నట్లు పేర్కొంటున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వీడియోలో, పిచాయ్ మాట్లాడుతూ, “గూగుల్ ఇన్వెస్ట్ అనేది ఒక ప్లాట్‌ఫారమ్ మాత్రమే కాదు, ఆర్థిక స్వతంత్రం మరియు స్థిరత్వానికి మీ వ్యక్తిగత తాళంచెవి. మా విప్లవాత్మక సాంకేతిక నైపుణ్యతతో, మీరు మీ ఇంటి నుండే సౌకర్యంగా మీ పొదుపులను సులభంగా పెంచుకోవచ్చు. భారతీయ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉండే కొత్త విజయంలో భాగం అవ్వండి. ఒక్కసారి ఆలోచించండి, కేవలం INR 20,000 పెట్టుబడితో మీరు నెలకు INR 180,000 స్థిరమైన ఆదాయాన్ని సంపాదించవచ్చు.. ఆర్ధిక ప్రపంచంలో మీ విశ్వసనీయ భాగస్వామిగా ‘గూగుల్ ఇన్వెస్ట్’ని ఎంచుకోండి..”
ఫేస్‌బుక్‌లో షేర్ చేయబడిన వైరల్ క్లిప్ (ఇప్పుడు తీసివేయబడింది) పిచాయ్ రూ.21,000 పెట్టుబడిపై ఒక నెలలో ₹1.9 లక్షలు సంపాదించగల పథకాన్ని ప్రచారం చేస్తున్నట్లు చూపబడింది.
వీడియోలో జర్నలిస్ట్ పాల్కీ శర్మ ఉపాధ్యాయ వెనక “21,000 రూపాయలు పెట్టుబడి పెట్టండి, మొదటి నెలలో 190,000 రూపాయలు పొందండి” అనే దావాతో ఉన్న బ్యానర్‌ను చూడవచ్చు.
సోషల్ మీడియా వినియోగదారులు పోస్ట్‌ను షేర్ చేసారు: “భారత పౌరులకు మాత్రమే. రిజిస్ట్రేషన్ కోసం పరిమితమైన సీట్స్(seats)!”
వాస్తవ పరిశీలన
Digiteye India బృందం WhatsApp టిప్‌లైన్‌లో వాస్తవాన్ని తనిఖీ చేయమని అభ్యర్థన అందుకోగా, వీడియో మరియు వాదన అసాధారణంగా, వింతగా ఉండటం గమనించాము, మరియు Google CEO అటువంటి పథకాలను ఎప్పుడూ ఆమోదించరు. విజువల్స్ ని మరింత నిశితంగా పరిశీలించగా ఇది AI- రూపొందించిన వీడియో అని తేలింది.
ముందుగా, సుందర్ పిచాయ్ యొక్క విజువల్స్ ని పరిశీలించగా, అవి అక్టోబర్ 24, 2021 యొక్క పాత వీడియో విజువల్స్ అని, అందులో ఆయన వాతావరణ మార్పుల గురించి మాట్లాడుతున్నారు-పెట్టుబడుల గురించి కాదని గమనించాము. వాస్తవానికి ఈ ప్రసంగం అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు అప్‌లోడ్ చేయబడింది మరియు అధికారిక Google బ్లాగ్‌లో “వాతావరణ మార్పు మానవాళికి తదుపరి పెద్ద సవాలు(మూన్‌షాట్).” అనే శీర్షికతో ప్రచురించబడింది.
మరింత పరిశీలనలో పిచాయ్ గడ్డం,మెడ మరియు పెదాల కదలిక అసహజంగా కనిపించడంతో ఇది AI- రూపొందించిన వీడియోగా తెలుస్తుంది.
కాబట్టి, వీడియోలో పేర్కొన్న వాదన/దావా తప్పు.
మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
ఈ వీడియోలో కమలా హారిస్ ‘Xని షట్ డౌన్ చేయాలి’ అన్నారా? వాస్తవ పరిశీలన